ఆధునిక ఇళ్లకు అదిరే లైట్లు | new technology for new generation homes | Sakshi
Sakshi News home page

ఆధునిక ఇళ్లకు అదిరే లైట్లు

Published Sat, Dec 17 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

ఆధునిక ఇళ్లకు అదిరే లైట్లు

ఆధునిక ఇళ్లకు అదిరే లైట్లు

సాక్షి, హైదరాబాద్‌: మార్కెట్లో దొరికే లైట్లు తెచ్చి.. ప్రతి గదిలో పెట్టే రోజులు కావివి. పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక ఇంటి యజమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనలకు తగ్గట్టు, పరిస్థితుల ప్రకారం.. వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా వైర్‌లెస్‌ లైటింగ్‌ ఆటోమేషన్‌ మార్కెట్లో లభిస్తోంది.

ఫ్లాట్‌లో అయినా విల్లాలో అయినా వైర్‌లెస్‌ లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. బంధుమిత్రులు, చూపరులకు ఇట్టే నచ్చే విధంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే ఇందుకు మనం చేయాల్సిందల్లా.. ఎక్కడెక్కడ ఏయే తరహా లైట్లు ఉండాలో చెబితే సరిపోతుంది. లేదా మన ఆలోచనల్ని చెబితే ఆయా సంస్థలే పనిని పూర్తి చేస్తాయి.

ఏసీలు ప్రతి ఇంట్లో సర్వసాధారణమయ్యాయి. రిమోట్‌ కంట్రోల్‌ బదులు మొబైల్‌తో వీటిని నియంత్రించుకోవచ్చు. వీటిని అమర్చిన తర్వాత మనం లోపలికి వెళ్లినా అమెరికాకు వెళ్లినా అరచేతిలో ఉండే మొబైల్‌తో మన ఇంట్లోని లైట్లను వెలిగించొచ్చు, ఆర్పేయవచ్చు కూడా.
నిన్నటిదాకా ఇంటికి హోమ్‌ ఆటోమేషన్‌ చేయాలంటే ప్రత్యేకంగా వైరింగ్‌ చేయాల్సి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో వైర్ల అవసరం లేకుండానే ఇంటిని ఆధునిక లైట్లతో అలంకరించుకోవచ్చు. సన్నివేశాలకు తగ్గట్టు పరిస్థితులకు అనుగుణంగా మనక్కావాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకోవచ్చు.

కొత్త, పాత అనే తేడా లేకుండా ఏ ఇంట్లో అయినా హోమ్‌ ఆటోమేషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రెండు పడక గదుల ఫ్లాట్‌లో కేవలం ఆధునిక లైటింగ్‌ ఏర్పాటుకు రూ.90 వేల వరకు ఖర్చవుతుంది. అదే మూడు పడక గదులు ఫ్లాట్‌ అయితే లక్షన్నర దాకా ఖర్చవుతుంది. వివిధ సంస్థలు, ఆయా ఉత్పత్తులను బట్టి ధరల్లో మార్పులుంటాయని గుర్తుంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement