ఆధునిక ఇళ్లకు సరికొత్త లైట్లు  | Newest Lights For Modern Homes | Sakshi
Sakshi News home page

ఆధునిక ఇళ్లకు సరికొత్త లైట్లు 

Jan 1 2022 4:13 AM | Updated on Jan 1 2022 10:21 AM

Newest Lights For Modern Homes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్కెట్లో దొరికే లైటు తెచ్చి ప్రతి గదిలో పెట్టే రోజులు పోయాయి. పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక ఇంటి యజమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనలకు తగ్గట్టు, పరిస్థితుల ప్రకారం వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా వైర్‌లెస్‌ లైటింగ్‌ ఆటోమేషన్‌ మార్కెట్లో లభిస్తుంది. ఫ్లాట్‌లో అయినా విల్లాలో అయినా వైర్‌లెస్‌ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు.

బంధుమిత్రులు, చూపరులకు నచ్చే విధంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే ఇందుకు మనం చేయాల్సిందల్లా.. ఎక్కడెక్కడ ఏయే తరహా లైట్లు ఉండాలో చెబితే సరిపోతుంది. లేదా మన ఆలోచనల్ని చెబితే ఆయా సంస్థలే పనిని పూర్తి చేస్తాయి. ఏసీలు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. రిమోట్‌ కంట్రోల్‌ బదులు మొబైల్‌తో వీటిని నియంత్రించుకోవచ్చు. వీటిని అమర్చిన తర్వాత మనం ఎక్కడున్నా సరే అరచేతిలో ఉండే మొబైల్‌తో మన ఇంట్లోని లైట్లను వెలిగించుకోవచ్చు,  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement