వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలతొ విఘ్ననాయకుడ్ని కొలిచి తరించాం. ఇపుడు దీపాల పండుగ దీపావళి సంబరాలకు సమయం సమీపిస్తోంది. దీపావళి రోజున పెట్టిన దీపాల పరంపర, కార్తీకమాసం అంతా కొనసాగుతుంది. దీపావళి పండుగలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది.దీపావళి రోజున మట్టి ప్రమిదలనే వాడదాం. తద్వారా దైవశక్తులను ఆకర్షించడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వారమూ అవుతాం.
‘‘దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. అలా దీపావళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం అంటే జ్ఞానం, ఐశ్వర్యం. చీకటి నుంచి వెలుగులోకి, ఐశ్వర్యంలోకి పయనించడమే దీపాల పండుగ ఆంతర్యం.
మట్టి ప్రమిద. నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి ఈ కలయిక ఎంతో మంగళకరం. నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల దీపపు కాంతి, ఆరోగ్యానికి కంటికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలపు చలిగాలు మధ్య మన శరీరానికి ఏంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభించి, పూర్వ జన్మ పాపపుణ్యాలు తొలగి పోతాయి. మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం అంటే అటు ఆరోగ్య లక్ష్మీని ఇటు ఐశ్వర్యలక్ష్మీని ఆహ్వానించి, వారి అనుగ్రహాన్ని పొందడన్నమాట.
దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి.
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మట్టి ప్రమిదలు, దీపాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి దీపాలను వాడటం ద్వారా వృత్తి కళాకారులకు ప్రోత్సాహమిచ్చినవారమవుతాం. అలాగే కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా, ఆకట్టుకునే డిజైన్లతో ట్రెండీ లుక్‌తో అలరిస్తున్నాయి మట్టి దీపాలు. పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment