not use
-
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
బనశంకరి: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మొబైల్ ఫోన్ వాడనని చెప్పారు. సోమవారం మీడియా ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఒకప్పుడు ఆర్నెల్లు మొబైల్ వాడాను. రాత్రి వేళ ఫోన్లు రావడం, నిద్రకు భంగం కలగడంతో పక్కన పెట్టా. ఏ విషయమైనా పీఏలు, గన్‌మెన్ వచ్చి చెబుతారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నా కుమారుడు చెబుతాడు’’ అన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని సిద్దరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌కు సీఎంగా అవకాశమివ్వాలని ఇటీవల ఒక్కళిగ మతగురువు ఒకరు సిద్దరామయ్య సమక్షంలోనే కోరడం తెలిసిందే. -
అధికారిక కార్లు వాడొద్దు
న్యూఢిల్లీ: జి–20 సమావేశాల్లో విందు వేదికను చేరుకోవడానికి అధికారిక కార్లను వాడొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. బుధవారం జరిగిన భేటీలో మంత్రులకు విధినిõÙధాలను వివరించారు. భారత్‌కు వస్తున్న వివిధ దేశాల బృందాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మసలుకోవాలని సూచించారు. ప్రధాన వేదిక భారత మండపం, ఇతర వేదికలను చేరుకోవడానికి షటిల్ సరీ్వసును ఉపయోగించుకోవాలని చెప్పారు. తాము బాధ్యత వహిస్తున్న విదేశీ బృందాలకు సంబంధించి ఆచారవ్యవహారాలను తెలుసుకోవాలని మంత్రులను కోరారు. వారి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకొని.. అందుకు అనుగుణంగా అతిథ్యమివ్వాలని చెప్పారు. జీ–20 సమావేశాలకు సంబంధించి అధీకృత వ్యక్తులు తప్పితే మరెవరూ మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగే రాత్రి విందుకు ఆహా్వనించిన ముఖ్యమంత్రులందరూ సొంత కార్లలో రావాలని, వేదిక వద్ద షటిల్ సరీ్వసును ఉపయోగించుకొని విందు జరిగే ప్రదేశానికి చేరుకోవాలని ఇదివరకే సూచనలు వెళ్లాయి. కేంద్ర మంత్రులందరూ జీ–20 యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇందులో జీ–20 దేశాల భాషలతో పాటు భారతీయ భాషలన్నింటిలోనూ అనువాద సదుపాయం ఉందని ప్రధాని వివరించారు. వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 40 మంది ప్రపంచ నాయకులు సెప్టెంబరు 9, 10వ తేదీల్లో జరిగే జీ–20 సదస్సుకు హాజరవుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌మోహన్ క్వాత్రా మంత్రులకు తెలిపారు. పాటించాల్సిన ప్రొటోకాల్ నిబంధనల గురించి వివరించారు. భారత్, ఇండియా వివాదంపై అ«దీకృత వ్యక్తులు మాత్రమే మాట్లాడాలని ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులకు సూచించారు. చరిత్రలోకి వెళ్లకుండా రాజ్యాంగానికి లోబడి వాస్తవాలను మాట్లాడాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోలి్చన డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు తగురీతిలో సమాధానమివ్వాలని ప్రధాని ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలపై పలు రాజకీయ పారీ్టలు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఉదయనిధి స్టాలిన్, ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికి ప్రియాంక్ ఖర్గేలపై మతవిశ్వాసాలను దెబ్బతీశారనే అభియోగాలపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. -
దీపాలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించేవారు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం శనివారం సూచించింది. దీపాలు, కొవ్వొత్తులు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని పేర్కొంది. ఇలాంటి శానిటైజర్లు మంటలకు అంటుకునే ప్రమాదం ఉందని ప్రెస్ ఇన్ఫర్మేసన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ దాత్వాలియా హెచ్చరించారు. -
అత్యవసరం.. నిరుపయోగం!
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాలిటిలో ప్రతి ఏడాది నీటిఎద్దడి సర్వసాధారణంగా మారింది. పట్టణంలోని 36 వార్డుల్లోనూ ప్రజలు నీటికష్టాలు పడుతూనే ఉన్నారు. ముందస్తుగా పాలకులు చర్యలు తీసుకోవడంలో ప్రతి ఏడాది విఫలమవుతూనే ఉన్నారు. రెండేళ్లుగా మూలకే విద్యుత్ లేని సమయంలో నీటిసరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో కిల్లోస్కర్ కంపెనీ జనరేటర్‌ను కొనుగోలు చేశారు. అప్పటినుంచి దానిని ఉపయోగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. సాంకేతిక సమస్యతో జనరేటర్‌ను వినియోగించడం లేదని చెబుతున్నప్పటికీ పంప్‌హౌస్‌లో వినియోగించే బోర్లు పాతవి కావడంతో సరిపడా సామర్థ్యం లేక మూలనపడినట్లు చెబుతున్నారు. జనరేటర్ వినియోగించక పోవడంతో కాలనీల్లో గత ఏడాది సైతం నీటి కష్టాలు తప్పలేదు. దీనికి తోడు ఈ జనరేటర్లో 100 లీటర్లకు పైగా డీజిల్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డీజిల్ ఉందా లేదా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్తబోర్లతో సమస్యతీరేనా? గతంలో బోర్లు పాతవిగా ఉండటంతో జనరేటర్ స్టార్ట్ చేసేందుకు బోర్ల సామర్థ్యం లేకపోవడంతో ఏళ్లుగా నిరీక్షించాల్సి వచ్చింది. ప్రస్తుతం బల్దియాలో 13వ ఆర్థిక నిధుల నుంచి రూ.92 లక్షలతో 125 హెచ్‌పీల సామర్థ్యం గల 3 బోర్లను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జనరేటర్‌ను పూర్తిస్థాయిలో స్టార్ట్ చేసెందుకు సామర్థ్యం సరిపోతుందని సమాచారం. దీంతో జనరేటర్‌ను సైతం వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదైన రోజువారిగా నీరందేనా? మున్సిపాలిటిలోని 36 వార్డుల్లో లక్ష 75 వేల వరకు జనాభా ఉన్నారు. 12,600లకు పైగా నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సుమారు 8 వేలకు పైగా మురికివాడల్లోనే ఉంటాయి. నీటికోసం ప్రతిరోజు ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితులున్నాయి. గత పదేళ్ల కిందట నీటి సరఫరా చేసినట్లుగానే ఈ ఏడాది నీటి సరఫరా ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీటిఎద్దటి లేకుండా చర్యలు విద్యుత్ లేని సమయంలో నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో సాంకేతిక పరమైన కారణాలతో జనరేటర్ పనిచేయలేదు. కొత్తమోటర్లు కొనుగోలు చేసి బిగించాం. త్వరలో కిర్లోస్కర్ కంపెనీవాళ్లను పిలిపించి జనరేటర్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈఏడాది ఉపయోగంలోకి వస్తుంది. – నవీన్‌కుమార్, మున్సిపల్ ఏఈ నిరుపయోగంగా ఉన్న జనరేటర్ -
నిధులున్నా నిష్ప్రయోజనం
- రూ.70 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను పట్టించుకోని జేఎన్టీయూ అధికారులు జేఎన్టీయూ : కరువు సీమలో కల్పతరువుగా మారిన జేఎన్టీయూ(ఎ)కు రూ.70 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నప్పటికీ వాటిని తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్‌కు అనుబంధంగా అనంతపురంలో ఏర్పాటైన ఇంజనీరింగ్ కళాశాల 2008లో జేన్టీయూ(అనంతపురం) వర్సిటీగా ఏర్పడింది. ఈ సమయంలో 1946 నుంచి 2008 వరకు వచ్చిన కళాశాల ఆదాయం రూ.70 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ మొత్తం పూర్తిగా జేఎన్టీయూ(అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాల స్తిరాస్థి. అయినప్పటికీ ఈ మొత్తాన్ని దక్కించుకోవడానికి అధికారులు ఇంతవరకూ ప్రయత్నాలు చేయలేదు. ఆడిటోరియంపై అదపు భారం అనంతపురంలో జేఎన్టీయూ వర్శిటీ ఏర్పడక ముందు ఈ ఇంజనీరింగ్ కళాశాల కార్యకలాపాలన్నీ జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండేవి. ఏప్రిల్ 2005లో అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో ఆడిటోరియం నిర్మాణానికి రూ.4.5 కోట్లు నిధులు మంజూరు చేశారు. 2006లోగా పనులు పూర్తి చేయాలని అప్పట్లో ఇచ్చిన టెండర్లలో షరతు విధించారు. మొదట ఆర్సీ భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు. ఆధునాతన భవన నిర్మాణానికి అవసరమైన డిజైన్‌ను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. దీని రూపకల్పనలో అంతులేని జాప్యం అనంతరం 2007 నాటికి కొత్త డిజైన్ రూపొందించారు. అప్పటికే భవన నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో అదనపు భారం పడింది. దీంతో అధికారులు ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు. పనులు మధ్యలో ఆగిపోయాయి. ఈ క్రమంలో 2008లో ఈ ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీయూ(అనంతపురం) వర్సిటీగా ఏర్పాటైంది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలను దీని పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి నిధుల సమస్య తలెత్తింది. ఈ పరిస్థితుల్లో ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేయాలని అంచనాలు వేశారు. గతంలో కేటాయించిన రూ.1.87 కోట్లకు అదనంగా మరో రూ.3.19 కోట్లు అవసరమవుతాయని తెలిసి తాత్సారం చేస్తూ వచ్చారు. సకాలంలో పనులు చేపట్టని కారణంగానే అదనపు భారం వచ్చి పడిందని కాగ్ తన నివేదికలో తప్పుబట్టింది. రూ.70 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు తిరిగి ఇవ్వకుండా, ఆడిటోరియానికి నిధులు సకాలంలో విడుదల చేయని కారణంగా మరో రూ.3.19 కోట్లు అదనపు భారం పడింది. ఇప్పటికైనా జేఎన్టీయూ (ఏ) ఉన్నతాధికారులు స్పందించి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకురావడంలో సఫలీకృతులు కావాలని విమర్శకులు సూచిస్తున్నారు. -
ధీమా ఇవ్వని ఫసల్‌బీమా
– దారుణంగా దెబ్బతిన్న పప్పుశనగ - రూపాయి కూడా అందని పరిహారం – ఎంతమంది ప్రీమియం చెల్లించారో చెప్పలేకపోతున్న అధికారులు అనంతపురం అగ్రికల్చర్ : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై).. దేశమంతా ఒకే ప్రీమియం ఒకటే బీమా పథకం.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2016 మే నెలలో ప్రవేశపెట్టాయి. ఫసల్ బీమాతో రైతుల తలరాతలు మారిపోతాయని గొప్పలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలకు మంచి బీమా పథకం వచ్చిందని రైతులు కూడా చాలా ఆనందపడ్డారు. అందులోనూ అనంతపురం జిల్లా లాంటి కరువుపీడత రైతుల బతుకులకు భరోసా లభిస్తుందని ఆశించారు. అయితే ఫసల్‌బీమా కూడా పంటల బీమా, వాతావరణ బీమా పథకాల మాదిరిగానే రైతులను అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తోంది. రబీలో ఫసల్ బీమా.. రబీకి సంబంధించి జిల్లాలో వరి, జొన్న, పప్పుశనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు ఫసల్ బీమా వర్తింపజేశారు. ఖరీఫ్‌లో అయితే రైతు వాటాగా 2 శాతం, రబీ పంటలకైతే 1.5 శాతం ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉంది. ఇందులో రబీకి సంబంధించి వరి హెక్టారుకు రూ.33,750, జొన్నకు రూ.20 వేలు, పప్పుశనగకు రూ.21,250, వేరుశనగకు రూ.45 వేలు, పొద్దుతిరుగుడుకు రూ.25 వేలు బీమా పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇవీ ప్రయోజనాలు.. వర్షాభావ పరిస్థితులతో పాటు అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను, తీవ్ర తుఫాను, టోర్నడోలు, వరదలు, నీట మునగడం, భూమి దిగిపోవడం, అనావృష్టి, వాతావరణం బాగుండకపోవడం, పంటకు తెగుళ్లు, కీటకాలు ఆశించి నష్టం జరిగినా బీమా పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. కోతల తర్వాత పంట తడిచినా పరిహారం వర్తిస్తుందన్నారు. ఇవన్నీ కాకుండా పంటకు వేయడానికి భూములు దుక్కులు చేసుకుని, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్న తర్వాత వర్షాలు లేక విత్తనం వేయలేని పరిస్థితి ఏర్పడినా 25 శాతం వరకు పరిహారం వర్తింపజేయాలనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటితో పాటు బీమా చేసిన రైతు, ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిని కూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గత బీమా పథకాలతో పోల్చితే ఫసల్ బీమాలో రైతులకు అనేక ప్రయోజనాలు కల్పించినట్లు ప్రచారం చేశారు. ప్రీమియం చెల్లించిన రైతుల ఖాతాల్లోకి నేరుగా పరిహారం జమ అవుతుందని చెప్పారు. లోపభూయిష్టం.. ఫసల్ బీమా పథకం అమలులోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా పావలా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఇంత పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు కూడా వెలువడలేదు. పథకం గురించి చెప్పడానికి అటు జిల్లా మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలు కాని, జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ కానీ నోరుమెదపడం లేదు. ఖరీఫ్‌లో నాలుగైదు పంటలకు ఈ పథకం అమలు చేయగా... వేరుశనగ పంటకు వర్తింపజేయకపోవడంతో పెద్దగా ఎవరూ ఈ పథకంలోకి రాలేదు. వేరుశనగ కాకుండా మిగతా పంటలు వేసిన రైతులు ప్రీమియం చెల్లించినట్లు చెబుతున్నా, అధికారుల దగ్గర వివరాలు అందుబాటులో లేవు. ప్రధానంగా రబీలో పప్పుశనగకు వర్తింపజేయడంతో పెద్ద సంఖ్యలో రైతులు ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పప్పుశనగ పంట 80 శాతం మేర దెబ్బతినడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ప్రీమియం కట్టిన రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎంత మంది రైతులు, ఎన్ని హెక్టార్లకు, ఎంత మొత్తంలో ప్రీమియం చెల్లించారు...? అనే వివరాలు జిల్లాలో ఎవరి దగ్గరా లేకపోవడం విశేషం. దీనిపై లీడ్‌బ్యాంకు మేనేజర్ జయశంకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ప్రస్తుతం తన వద్ద వివరాలు లేవనీ, వివరాలు కోరుతూ బీమా కంపెనీ వారికి రెండురోజుల క్రితం మెయిల్ పంపామన్నారు. అక్కడి వివరాలు అందగానే ఎంత మంది ప్రీమియం చెల్లించారో వెల్లడిస్తామని తెలిపారు. -
భవనానికి "విశ్రాంతి"
అనంతపురం అగ్రికల్చర్ : రైతుల కోసం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్మించిన ‘రైతు విశ్రాంతి భవనం’ ప్రస్తుతం ఎందుకూ కొరవడకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 13ఏళ్లుగా భవనం విశ్రాంతి తీసుకుంటూనే ఉంది. అందులో ఒక్కరోజు కూడా రైతులు విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు. భవనాన్ని 15ఏళ్ల క్రితం దాదాపు రూ.10లక్షలు వెచ్చించి అధికారులు నిర్మించారు. నిర్మించిన తర్వాత రెండేళ్లు అడపాదడపా వాడారు. ఆపై సమైఖ్యాంధ్ర ఉద్యమం సమయంలో స్పెషల్ పార్టీ పోలీసులకు.. ఇతర కార్యక్రమాలకు వాడుకున్నారు. నాటి నుంచి నేటి దాకా తిరిగి ఆ భవనాన్ని రైతుల కోసం ఉపయోగించుకోలేదు. ప్రస్తుత మార్కెట్ కమిటీ పాలక వర్గం, అధికారులతో పాటు ముందున్న వారు కూడా నిర్లక్ష్యం చేయడంతో లక్షలు వెచ్చించి కట్టించిన విశ్రాంతి భవనం క్రమంగా పాడవుతోంది. విశ్రాంతి భవనం ఉందనే విషయం కూడా తెలియనంతగా పర్యవేక్షణ కొరవడటంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో శిథిలావస్థకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. కొన్నింటికి వాకిళ్లు, కిటికీలు కూడా పగులగొట్టారు. బాత్రూంలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక కొళాయిలు విరిగిపోయాయి. విశ్రాంతి భవనంలోపల, పరిసర ప్రాంతాల్లో మద్యం సీసాలు, ఇతరత్రా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. శని, ఆదివారం రోజుల్లో గొర్రెలు, మేకలు, పశువుల సంతలు జరగడం, ఇక రోజు వారీ పండ్ల మార్కెట్ నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు వస్తూ ఎండ, వాన, చలికి ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. -
జాడ లేని పిట్ట
సందర్భం : నేడు పోస్టల్ దినోత్సవం కొత్తచెరువు : ఇంటి ముందు కూర్చున్న ముసలి తల్లిదండ్రులకు దూరంగా ఉన్న కొడుకు యోగక్షేమాలు మోసుకొచ్చిన, బంధువులు, స్నేహితులు మధ్య దూరాల దారాన్ని తెంచేసి వారి అనుబంధాన్ని పటిష్టం చేసిన, ప్రేయసి, ప్రియుడి విరహాన్ని అక్షరరూపంలో ఆవిష్కరించిన ఉత్తరాలు నేడు కనుమరుగవుతున్నాయి. సమాచార రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని ఆప్తబంధువు క్రమంగా అందరికీ దూరమవుతోంది. ఒకప్పుడు తొంబై ఆమడల దూరాన్ని కూడా సునాయాసంగా అధిగమించగలిగిన ఆ తోకలేని పిట్ట.. నేడు సెల్ఫోన్లు, కంప్యూటర్ రాకతో ఉనికి కోల్పోయింది. నేటి తరం ఫేస్బుక్, వ్యాట్సప్లలో క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉత్తరాలని మరచిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాలు రాసే వారులేక పోస్టల్ డబ్బాలు తుప్పుపట్టి దర్శనం ఇస్తున్నాయి. ఆదివారం పోస్టల్ దినోత్సవ కార్యక్రమం నిర్వంచుకునేందుకు తపాలా సిబ్బంది సిద్ధమయ్యారు.