
బనశంకరి: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మొబైల్ ఫోన్ వాడనని చెప్పారు. సోమవారం మీడియా ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఒకప్పుడు ఆర్నెల్లు మొబైల్ వాడాను. రాత్రి వేళ ఫోన్లు రావడం, నిద్రకు భంగం కలగడంతో పక్కన పెట్టా. ఏ విషయమైనా పీఏలు, గన్‌మెన్ వచ్చి చెబుతారు.
సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నా కుమారుడు చెబుతాడు’’ అన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని సిద్దరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌కు సీఎంగా అవకాశమివ్వాలని ఇటీవల ఒక్కళిగ మతగురువు ఒకరు సిద్దరామయ్య సమక్షంలోనే కోరడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment