Karnataka Chief Minister
-
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
బనశంకరి: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను మొబైల్ ఫోన్ వాడనని చెప్పారు. సోమవారం మీడియా ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఒకప్పుడు ఆర్నెల్లు మొబైల్ వాడాను. రాత్రి వేళ ఫోన్లు రావడం, నిద్రకు భంగం కలగడంతో పక్కన పెట్టా. ఏ విషయమైనా పీఏలు, గన్‌మెన్ వచ్చి చెబుతారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నా కుమారుడు చెబుతాడు’’ అన్నారు. నాయకత్వ మార్పుపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని సిద్దరామయ్య అన్నారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్‌కు సీఎంగా అవకాశమివ్వాలని ఇటీవల ఒక్కళిగ మతగురువు ఒకరు సిద్దరామయ్య సమక్షంలోనే కోరడం తెలిసిందే. -
5 గ్యారంటీలకు ఏటా రూ.60 వేల కోట్లు
బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు ప్రతిఏటా రూ.60,000 కోట్ల నిధులు అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే నెల 7న తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మొత్తం రూ.3,35,000 కోట్లు ఉంటుందన్నారు. నూతన ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక తొలి బడ్జెట్ కేవలం రూ.21.3 కోట్లు మాత్రమేనని చెప్పారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన ఐదు గ్యారంటీలు ఏమిటంటే.. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఒక్కో ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.2,000 చొప్పున సాయం. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ. 18–25 ఏళ్ల గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి ప్రతినెలా రూ.3,000, డిప్లొమా నిరుద్యోగికి రూ.1,500 చొప్పున సాయం. ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. -
కర్ణాటక సీఎంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: సూర్జేవాలా
సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో అధికార బీజేపీకి షాకిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ తరఫున సీఎం ఎవరు? అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కర్ణాటక సీఎం రేసులో మాజీ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పరిశీలకుడు రణ్‌దీప్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. నేడో, రేపో నిర్ణయం తీసుకుంటాం. మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేస్తాం. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం తేదీ కూడా తప్పు. దీనిపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Delibrations are currently underway by party president Mallikarjun Kharge. Whenever Congress makes a decision we will inform you. In the next 48-72 hours, we will have a new cabinet in Karnataka: Randeep Surjewala, Karnataka in-charge, Congress pic.twitter.com/fas1Bpu3J3 — ANI (@ANI) May 17, 2023 ఇదిలా ఉండగా.. కర్ణాటకలో సిద్దరామయ్య అనుచరులు, మద్దతుదారులు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అంటూ నినాదాలు చేస్తున్నారు. సిద్దరామయ్య పోస్టర్లకు పాలాభిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Supporters of Congress leader Siddaramaiah pour milk on his poster and chant slogans for him outside his residence in Bengaluru, even as the suspense over #KarnatakaCMRace continues. pic.twitter.com/HQG0gzsb1G — ANI (@ANI) May 17, 2023 ఇది కూడా చదవండి: ముహూర్తం ఫిక్స్.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే? -
కర్ణాటక సీఎం ఎంపికపై అధిష్టానం చర్చలు..
కర్ణాటక సీఎం ఎంపికపై అధిష్టానం చర్చలు.. -
కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారు..
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారైంది. మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అదే విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. కాగా కర్ణాటకలో హంగ్ తప్పదనుకున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఏకంగా 136 స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల కంటే 55 స్థానాలు ఎక్కువగా విజయం సాధించింది. 43 శాతం ఓట్ షేర్ రాబట్టింది. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 65 సీట్లకే పరిమితమైంది. 14 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్టం కూడా బీజేపీ చేజారింది. ఇక జేడీఎస్ కేవలం 19 సీట్లతో కుదేలైంది. చదవండి: కర్ణాటక సీఎం రేసు.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు సీఎల్పీ భేటీ బెంగుళూరులో సీఎల్పీ సమావేశమైంది. షంగ్రిల్లా హోటల్‌కు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు పార్టీ హైకమాండ్ దూతలను పంపింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుశీల్ కుమార్ షిండే, దీపక్ బబారియా, జితేంద్ర సింగ్ అల్వార్‌లను కర్ణాటక సీఎల్పీ సమావేశ పరిశీలకులుగా నియమించింది. సీఎల్పీ నేతల ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్న షిండే బృందం.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంది. అధిష్టానమే సీఎంను ప్రకటించాలని తీర్మానంలో నిర్ణయించారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా బెంగళూరులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇళ్ల వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ఇంటి ముందు ‘కర్ణాటక తదుపరి సీఎం’ అంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఇటు డీకే శివకుమార్ ఇంటి ముందు ‘కర్ణాటక కొత్త ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు’ అంటూ ఆయన మద్దతుదారులు పోస్టర్లు అంటించారు. ఇరు నేతల మద్దతుదారుల తమ నేతను సీఎం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 137కు చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. చదవండి: సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ -
ఓపికపట్టండి! క్యాబినేట్ విస్తరణపై ఉత్కంఠ
బెంగళూరు: కేబినేట్ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ విషయమై కేంద్రంలోని బీజేపీతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఐతే కేబినేట్లో ఎవరిని చేర్చుకోవాలనే దానిపై బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు. సీనియర్లకు అవకాశం ఇస్తారా? ఇవ్వరా? అని మీడియా ప్రశ్నించగా... రాజకీయ పరిస్థితుల కారణంగా ఆలస్యమవుతుందే తప్ప ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు కొత్తమంది మంత్రులు పలు ఆరోపణలతో ఆయా మంత్రిత్వ శాఖలకు రాజీనామా చేశారు. మళ్లీ వాళ్లని చేర్చకుంటారా అని పలు ప్రశ్నలను సీఎం బొమ్మైపై సంధించింది మీడియా. దీనికి బొమ్మే స్పందనగా.. ఆశావాహులందరూ ప్రయత్నిస్తారు, కానీ చివరకు హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని కరాఖండిగా చెప్పరు. అందువల్ల అందరూ మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఓపికతో చూడాల్సిందేనని సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయానికి తాజా ముఖాలకు చోటు కల్పించే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగకపోవడంతో సీఎం బొమ్మైపై గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నవాటిని భర్తీ చేయడం లేదా కొన్నింటిని తొలగించడం ద్వారా కొత్తవారికి అవకాశం ఇచ్చే నివేదికలు వచ్చినప్పటికీ... ఎలాంటి కార్యరూపం దాల్చే లేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పలువురు నాయకులు ఇది చాలా ఆలస్యం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ) -
కర్ణాటక సీఎం బొమ్మైకి పదవీ గండం.. మార్పు తప్పదా?
బెంగళూరు: కర్ణాటకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత.. మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండబోతోందని బీజేపీలో చర్చ మొదలైంది. ఆగస్టు 15వ తేదీలోపు సీఎం బసవరాజ్ బొమ్మై స్థానంలో మరొకరిని కూర్చోబొట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్పులపై మాట్లాడిన వారిలో బీజేపీ లీడర్ బసనగౌడ పాటిల్ సైతం ఉన్నారు. ఆయన గతంలో బీఎస్ యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రి చేయనున్నారని అంచనా వేశారు. ఏడాది తర్వాత ఆయన అంచనాలే నిజమయ్యాయి. పాటిల్ తాజాగా మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీకి మేలు చేసే నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. ఆయన మాటలను బీ సురేశ్ గౌడ ఏకీభవించారు. దీంతో బొమ్మైకి వీడ్కోలు పలకక తప్పదనే సంకేతాలిచ్చారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ ఈ వాదనలను తోసిపుచ్చారు. బసవరాజ్ బొమ్మై తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. దక్షిణ కన్నడ జిల్లీలో బీజేపీ యూత్ వింగ్ నేత హత్య తర్వాత బొమ్మైకి మరిన్ని చిక్కులు వచ్చాయి. సొంత ప్రజలను కాపాడుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు.. సీఎం కానీ, రాష్ట్ర అధ్యక్షుడిని కానీ తొలగించే ఆలోచన లేదని, వారి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక. బొమ్మై కీలుబొమ్మగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయగా.. మీకు ప్రధాని మోదీ, అమిత్ షాలు చెప్పారా? అంటూ సమాధానమిచ్చారు అశోక. 2018లో జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధించలేకపోయింది. అయితే.. ఏడాది తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కూలదోసి బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు 2021, జూలైలో బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2023, మేలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? -
కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదం
బెంగళూరు: పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ఖాతాబుక్ సీఈఓ రవీష్ నరేశ్ చేసిన ఆవేదనా భరిత ట్వీట్ కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ(బెంగళూరు)లో అసౌకర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని ఆహ్వానించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. అద్భుతమైన మౌలిక వసతులతో పాటు సామాజికంగానూ మెరుగైన పరిస్థితులు హైదరాబాద్ సొంతమని తెలిపారు. రాకపోకలకు ఈజీగా ఉండేలా ఎయిర్‌పోర్టు కూడా హైదరాబాద్ సొంతమని కూడా కేటీఆర్ తెలిపారు. ఇక తమ ప్రభుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిపదికగా సాగుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదమన్నారు సీఎం బవసరాజ్ బొమ్మై. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరు తరలివచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తుంటారని అన్నారు. స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగళూరేనని గుర్తు చేశారు. మూడేళ్లుగా రాష్ట్రం ఎంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందని అన్నారు. మరోవైపు, కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్‌పై స్పందించింది. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసని, ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్క వారి పళ్లెంలో పడిన ఈగ గురించి మాట్లాడడం సహజమని ఎద్దేవా చేసింది. ఉనికి కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి విషయంలో బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదమని పేర్కొంది. -
మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు: రాజమౌళి
సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం గర్వంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్ జీవితంలో నెరవేరాయి. పునీత్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. ‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్‌చరణ్, తారక్ (ఎన్టీఆర్)లో పునీత్‌ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్‌కుమార్. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్ఆర్ ఆర్’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారికి, ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి, ప్రకాశ్‌రాజ్‌కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్‌చరణ్), నా భీముడు (ఎన్టీఆర్) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమా చూడాలి’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి . ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్’ అనే అక్షరానికి ఎంతో పవర్ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్‌కుమార్, హిందీలో రాజ్‌కపూర్.... ఇలా ‘ఆర్’కు ఎంతో పవర్ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్’లు కలసి వస్తున్నారు’’ అన్నారు. -
కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్(బురఖా) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు సోమవారం హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. వారితో ప్రిన్సిపాల్ మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వు గురించి వివరించారు. హిజాబ్ తొలగించేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్ రగడపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యూనిఫామ్ నిబంధనలు పాటించాలని విద్యాసంస్థలను కోరారు. హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ మాట్లాడుతూ.. హిజాబ్ ధరించిన వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. రోడ్లపై నిరసనకు దిగితే పాఠాలు కోల్పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. రోడ్లపై బైఠాయించడం భారతీయ సంస్కృతి కాదన్నారు. హిజాబ్ ధరించినవారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అలాంటి వారిని సాధారణ తరగతుల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ చిక్కబళ్లాపూర్, బాగల్కోట్, బెళగావి, హసన్, మండ్య తదితర ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు కాషాయం కండువాలు ధరించి, కాలేజీలకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ బెళగావి, మండ్యాలో విద్యార్థినులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిజాబ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. చిక్కమగళూరులో కొందరు విద్యార్థులు నీలి రంగు కండువాలు ధరించి, కాలేజీకి చేరుకున్నారు. జైభీమ్ అంటూ నినదించారు. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. -
ఏ పదవీ శాశ్వతం కాదు
హవేరి: ఏ పదవీ శాశ్వతం కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. హవేరి జిల్లాలోని సొంత నియోజకవర్గమైన షిగగావ్లో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పదవులు, హోదాలతో సహా ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదన్నారు. జీవితమూ అంతేనన్నారు. ‘ఎంత కాలం ఉంటామో.. ఏ హోదాలో ఉంటామో ఎవరికీ తెలియదు. పదవులు, హోదాలు శాశ్వతం కాదు. ఈ వాస్తవం అనుక్షణం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అవతలి వారికి నేను సీఎంను కావొచ్చు. కాని షిగగావ్కు వస్తే మీ బసవరాజ బొమ్మైని మాత్రమే. బసవరాజ అనే పేరు శాశ్వతం. పదవులు కాదు’ అని బొమ్మై వ్యాఖ్యానించారు. దాంతో బొమ్మై ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారనే ఊహాగానాలు కొన్నివర్గాల నుంచి మొదలయ్యాయి. బొమ్మై మోకాలి సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళతారని వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నేపథ్యంలో సీఎంను మారుస్తారనే ఊహాగానాలు కొన్నివర్గాల్లో వినపడుతున్నాయి. -
కర్ణాటక హోం మంత్రిగా జ్ఞానేంద్ర
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కొత్త కేబినెట్లో మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను మొదటిసారిగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. గత యడియూరప్ప ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను తిరిగి అవే శాఖలను అప్పగించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీఎం బొమ్మై తన వద్దే ఉంచుకున్నారు. దీంతోపాటు, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, బెంగళూరు అభివృద్ధి, కేటాయించని ఇతర శాఖలు కూడా ఆయన వద్దే ఉన్నాయి. బెంగళూరు నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరగనున్నందున ‘బెంగళూరు డెవలప్మెంట్’ శాఖను నగరానికి చెందిన సీనియర్ మంత్రికి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, పోటీదారులు ఎక్కువ కావడం వల్లే సీఎం ఎవరికీ ఈ పోస్టును కేటాయించలేదని భావిస్తున్నారు. కాగా, శాఖల కేటాయింపుపై ఆనంద్ సింగ్, ఎంటీ బీ నాగరాజ్ బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. కాగా, వీరిద్దరూ గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును వీడి, బీజేపీ సర్కారు ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. కర్ణాటక సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన కేబినెట్లోని 29 మందికి మంత్రిత్వ శాఖలు కేటాయించారు. గత యడియూరప్ప కేబినెట్లోని 23 మందితోపాటు కొత్తగా ఆరుగురికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా కీలకమైన హోం శాఖను కొత్తగా కేబినెట్లోకి తీసుకున్న అరగా జ్ఞానేంద్రకు కట్టబెట్టారు. మొదటిసారిగా కేబినెట్లో చోటు దక్కిన జ్ఞానేంద్రకు ఈ విధంగా జాక్‌పాట్ తగిలింది. అదేవిధంగా, ముఖ్యమైన విద్యుత్ శాఖతోపాటు కన్నడ, సాంస్కతిక శాఖను వి.సునీల్‌కుమార్‌కు కేటాయించారు. పాత వారిలో 17 మందికి గత శాఖలనే కొనసాగించగా, వీరిలో 8 మంది కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో సహకరించిన వారే కావడం గమనార్హం. అరగా జ్ఞానేంద్ర, సునీల్ కుమార్ సహా కొత్తగా చేర్చుకున్న వారికి, బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయి. మిగతా నలుగురిలో.. కె.ఎస్. ఈశ్వరప్పకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలు, ఆర్–అశోకకు రెవెన్యూ, కోటా శ్రీనివాస పూజారికి సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, బీసీ నగేశ్‌కు ప్రాథమిక, సెకండరీ విద్య దక్కాయి. -
యడ్డి వారసుడెవరో? బీజేపీ చేతిలో ఆ 8 మంది పేర్లు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప స్థానంలో బలమైన మరోనేతను నియమించడం బీజేపీకి సవాలుగా మారింది. కన్నడనాట బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడియూరప్ప (78)ను తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని గత కొంతకాలంగా జోరుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సోమవారంతో యడ్డి సీఎం పదవిని చేపట్టి రెండేళ్లు అవుతుంది. యడ్డి స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన, ప్రజాదరణ కలిగిన నేతను వెతికిపట్టుకోవడం ఇప్పుడు బీజేపీకి కత్తిమీద సాములా మారింది. దక్షిణాదిలో తమకు అత్యంత కీలకమైన కర్ణాటకలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది. కొత్త సీఎంగా మొత్తం ఎనిమిది మంది పేర్లను బీజేపీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యడ్డి వారసుడిగా లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలనేదే అధిష్టానం ఉద్దేశంగా కనపడుతోంది. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 16 శాతానికి పైగానే ఉంటారు. ఎప్పటినుంచో కమలదళానికి గట్టి మద్దతుదారులు. ఢిల్లీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో పంచమశీల లింగాయత్‌లు నలుగురు ఉన్నారు. విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్, ధార్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్, గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మయ్‌లు ఈ నలుగురు. బసన్నగౌడ పాటిల్ ఆర్ఎస్ఎస్లో బలమైన మూలాలున్న వ్యక్తి. ఉత్తర కర్ణాటకలో పేరున్న నాయకుడు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు అదనపు అర్హత అవుతుందని భావిస్తున్నారు. పంచమశీల లింగాయత్‌లను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. అరవింద్ బెల్లాద్ ఇంజనీరింగ్ చదివారు. వ్యాపారవేత్త కూడా. క్లీన్ఇమేజ్ ఉంది. బాగల్కోట్ జిల్లాలోని బిల్గి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగేష్ నిరానీకి చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. హోంమంత్రి అమిత్‌కు సన్నిహితుడిగా చెబుతారు. యడ్డీ తన వారసుడిగా హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్ పేరును సిఫారసు చేసే చాన్సుంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే (బ్రాహ్మణ సామాజికవర్గం), సి.టి.రవి (ఒక్కళిగ)లు రేసులో ఉన్న ఇతర ప్రముఖులు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కతీల్‌కు చెందిన లీకైన ఆడియో సంభాషణను బట్టి చూస్తే ప్రహ్లాద్ జోషి రేసులో అందరికంటే ముందున్నట్లు కనపడుతోంది. నన్నెవరూ సంప్రదించలేదు: ప్రహ్లాద్ హుబ్బళి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపడతారనే వార్తలపై ఆయన శనివారం స్పందించారు. ‘ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయంపై నాతో ఏమీ మాట్లాడలేదు. అయినా, సీఎంగా యడియూరప్ప రాజీనామా చేస్తారనే అంశాలను ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం ప్రసారమాధ్యమాలు(మీడియా) మాత్రమే ఈ అంశాన్ని చర్చిస్తున్నాయి. కొత్త సీఎంగా నన్ను ఎంపికచేస్తారనే విషయాన్ని ఎవరూ నాతో ఇంతవరకూ ప్రస్తావించలేదు’ అని మీడియాతో అన్నారు. అత్యంత ముఖ్యాంశాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలదే తుది నిర్ణయమని చెప్పారు. -
ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్
సాక్షి, బెంగళూరు: గత నెల 26వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఎట్టకేలకు మంగళవారం కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజులపాటు సాగిన తిరుగుబాటు పర్వం తరువాత కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును సాగనంపి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కడం తెలిసిందే. అనేక కసరత్తుల అనంతరం 17 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం మంగళవారం ఏర్పాటయింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయివాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. నాటి ముఖ్యమంత్రి, నేటి మంత్రి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వీరశైవ–లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎక్కువ పదవులు దక్కాయి. 2008లో కర్ణాటక సీఎంగా పనిచేసిన జగదీశ్ శెట్టర్ ఈసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్లీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. మాజీ డిప్యూటీ సీఎంలు కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక కేబినెట్లో ఉన్నారు. మరో 16 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 17 జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. -
విషం కాంగ్రెస్ కాదు..సిద్దూతో గొడవ లేదు!
న్యూఢిల్లీ: గరళకంఠుడిలా సంకీర్ణ ప్రభుత్వ హాలాహలం మింగుతున్నానంటూ ఇటీవల కన్నీళ్లతో ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. బుధవారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇండియాటుడే వార్తాచానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. తన గత వ్యాఖ్యల్లో విషం అన్నది కాంగ్రెస్‌నో, లేక సంకీర్ణ ప్రభుత్వాన్నో ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేక ఒక సామాజిక వర్గం వారు విషం కక్కుతున్నారని ఆయన అన్నారు. గతంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచిన కొన్ని టీవీ చానెళ్ల విలేకరులు.. సీఎం అయ్యాక మాత్రం తానెన్ని మంచి పనులు చేయాలని చూస్తున్నా వాటిలో తప్పులనే వెదుకుతూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గం వారే ఇదంతా చేయిస్తున్నారని తెలిసి తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మిమ్మల్ని బహిరంగంగానే తీవ్రంగా విమర్శిస్తున్నందుకే ఆ రోజు అలా మాట్లాడారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదనీ, సిద్దరామయ్య తనకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారని కుమారస్వామి పేర్కొన్నారు. సిద్దరామయ్యే కాకుండా స్థానిక నేతలు సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతుగానే ఉందనీ, నిర్ణయాల్లో కూడా స్వేచ్ఛను ఇచ్చిందని స్పష్టం చేశారు. కుమారస్వామివన్నీ డ్రామాలేనని బీజేపీ అంటుండటాన్ని ప్రస్తావించగా, వారి నుంచి మంచిమాటలు వస్తాయని తాను ఎప్పుడూ ఆశించలేదన్నారు. లోపల ఎంతో బాధ ఉంటేగానీ మనుషులకు కన్నీళ్లు రావనీ, అది అర్థం చేసుకోకుండా తనను విమర్శించేవారికి భావోద్వేగాలు, మానవీయత అంటే ఏంటో తెలిసుండకపోవచ్చని కుమారస్వామి పేర్కొన్నారు. సహజంగానే తనలో భావోద్వేగాలు అధికమన్నారు. అధికారుల బదిలీల్లో కాంగ్రెస్ ఒత్తిడేమీ లేదనీ, ఒకవేళ ఉన్నా అలాంటివన్నీ తనకు చిన్నచిన్న విషయాలే తప్ప కన్నీళ్లు పెట్టుకునేంత పెద్దవి కావని చెప్పారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లూ నడపడమే జేడీఎస్, కాంగ్రెస్‌ల ఉమ్మడి లక్ష్యమనీ, 2019 సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పెద్ద సమస్యే కాదని కుమారస్వామి తేల్చి చెప్పారు. -
‘పరీక్ష’లో విఫలమైన ప్రధాన మంత్రులు..!
కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు కూడా కొనసాగకుండానే శాసనసభలో బలపరీక్షకు ముందే రాజీనామా చేసిన బీఎస్ యడ్యూరప్ప మాదిరిగానే దేశంలో పదవి నుంచి వైదొలిగిన ప్రధానులు ఉన్నారు. లోక్‌సభలో అతి పెద్ద పార్టీ నేతగా ప్రధాని పదవి చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి 1996 మే చివరి వారంలో విశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే రాజీనామా చేశారు. మెజారిటీ నిరూపణకు అప్పటి రాష్ట్రపతి రెండు వారాలు గడువిచ్చినా అవసరమైన 272 మంది సభ్యుల మద్దతు కూడగట్టలేకపోయారు. విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాక వాజ్‌పేయి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. బీజేపీకి తగినన్ని సీట్లు రాలేదంటే మాతృభూమికి తక్కువ సేవ చేసినట్లు కాదని అన్నారు. ప్రసంగం చివరిలో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మొరార్జీ దేశాయి అలాగే.. 1977 మార్చి 24న జనతాపార్టీ తరఫున తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన మొరార్జీ దేశాయి రెండేళ్లు గడిచాక పార్టీలో చీలిక కారణంగా పదవి కోల్పోయారు. ఆ పార్టీ నుంచి ఎంపీలు భారీ సంఖ్యలో రాజీనామా చేసి చరణ్‌సింగ్ నాయకత్వాన ఏర్పడిన జనతాపార్టీ–ఎస్‌లో చేరిపోయారు. ఫలితంగా మెజారిటీ నిరూపించుకోవడం అసాధ్యమని భావించిన మొరార్జీ దేశాయ్ అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తికాకుండానే 1979 జులై 12న రాజీనామా చేశారు. -
బాహుబలి 2 చూశాక సీఎం సంచలన నిర్ణయం
భారీమొత్తంలో డబ్బులు వెచ్చించి మరీ బాహుబలి 2 సినిమాను చూసి వచ్చిన తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని మల్టిప్లెక్సెస్, సినిమా హాలులో ఒక్కో వ్యక్తి నుంచి తీసుకునే టిక్కెట్ గరిష్ట ధరలు 200 రూపాయలకు మించకూడదని మంగళవారం నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన వెలువరిచింది. అన్ని భాషల్లోని సినిమాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిబంధనలు మల్టిప్లెక్సెస్ ల్లో గోల్డ్ క్లాస్ స్క్రీన్, గోల్డ్ క్లాస్ సీట్లకు వర్తించవని తెలిసింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్ మూవీ హాల్స్ ను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ నిర్ణయం వెలువరచడానికి ఒక్క రోజు ముందే సిద్ధరామయ్య వేల రూపాయలకు పైగా వెచ్చించి తన కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి-2 సినిమా చూశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది. మార్చి 15న తన బడ్జెట్ స్పీచ్ లో సిద్ధరామయ్య సినిమా టిక్కెట్ రేట్ల నియంత్రణపై నిర్ణయాన్ని ప్రకటించారు. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ మూవీలను ఆదుకోవడానికి అడ్మిషన్ ఫీజులను నిర్ణయించడం అవసరమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇప్పటికే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. నాన్-కన్నడ మూవీలకు ప్రజలు ఎక్కువగా వెచ్చిస్తున్నారని, భారీ మొత్తంలో వసూలు చేస్తున్న టిక్కెట్ ధరలతో వారు త్వరగా తమ పెట్టుబడులను రికవరీ చేసుకుంటున్నారని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సా.రా గోవింద్ తెలిపారు. భారీగా వచ్చే ఒక్క మూవీతో 40 కన్నడ మూవీలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. -
కొత్తగా 13 మంది మంత్రుల ప్రమాణం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు. తన కేబినెట్ నుంచి 14 మంత్రులను తొలగించిన సిద్ధరామయ్య కొత్తగా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్ ఆర్ వలా కొంత్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో 9 మంది కేబినెట్ మంత్రులు, మరో నలుగురు సహాయ మంత్రులు ఉన్నారు. కేబినెట్ మంత్రులు: కే తిమ్మప్ప, కేకే రమేష్ కుమార్, బసవరాజ రాయరెడ్డి, మేటిహుల్లప్ప యమనప్ప, తన్వీర్ సేఠ్, ఎస్ఎస్ మల్లికార్జున, ఎంఆర్ సీతారామ్, సంతోష్ ఎస్ లాడ్, రమేష్ లక్ష్మణ రావు సహాయ మంత్రులు: ప్రియాంక్ ఎం ఖర్గే, ఈశ్వర్ కండ్రె, ప్రమోద్, రుద్రప్ప మనప్ప -
సిద్ధూ సీటుకు ఎసరు?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటు కిందకు నీళ్లు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. తన పీఠం కదలం ఖాయమని ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది. గత కొద్ది వారాలుగా ప్రతిఒక్కరితో తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని, పూర్తి కాలం పదవిలో కొనసాగుతానని సిద్ధరామయ్య చెబుతున్నారు. తన మంత్రులతో కూడా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. పరిస్థితి ఆయనకు అర్థమైనట్టు కనబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరుస వివాదాలతో సతమవుతున్న సిద్ధూను సాగనంపేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా తన కుమారుడి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.అంతకుముందు లక్షల ఖరీదు చేసే వాచీని ధరించి వివాదంలో చిక్కుకున్నారు. 32 నెలల పాలనలో తన విమానయాన ప్రయాణాలకు రూ.20,11,34,971 ఖర్చు చేసి సిద్దూ విమర్శలు పాలయ్యారు. సిద్ధరామయ్య వారసుడెవరన్న దానిపై కర్ణాటక రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. సిద్ధూకు ఉద్వాసన పలికితే సీఎం ఛాన్స్ దక్కే అవకాశముందంటూ ఇద్దరు పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ముందజలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. హస్తినలో ఆయన ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గతవారం ఢిల్లీలో అధినేత్రి సోనియా గాంధీ దర్శనం చేసుకున్న ఆయన పనిలో పనిగా తన కోరికను 'మేడమ్' చెవిన వేశారట. అయితే దళిత నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడితే ఎలా ఉంటుందని కూడా హస్తిన పెద్దలు ఆలోచన చేస్తున్నారు. దళితుడిని సీఎం చేయాలనుకుంటే కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. పరమేశ్వర కూడా గతవారం ఢిల్లీలో సోనియమ్మను కలిశారు. వక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఎం కృష్ణకు వయోభారం మైనస్ గా మారింది. ఈ నెల 23న 'మేడమ్'ను కలవాలని సిద్ధరామయ్య అనుకున్నా ఆమె కుదరదని చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. సిద్ధూ స్థానంలో మల్లిఖార్జున ఖర్గేను సీఎంను చేస్తే బాగుంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఖర్గే అవసరం బెంగళూరు కంటే ఢిల్లీకే ఎక్కువ ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మే 15 -20 మధ్య కర్ణాటక సీఎంను మార్చడం ఖాయమని సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. పదవీ గండం నుంచి సిద్ధరామయ్య బయటపడతారో, లేదో చూడాలి. -
జనం బాధ జనాలది.. నాయకులేమో ఇలా..!
బాగల్కోట్: ప్రజలు కరువు, నీటి ఎద్దడితో అల్లాడిపోతుంటే.. నాయకులకు, అధికారులకు మాత్రం వారి బాధలు, సమస్యలు పట్టడం లేదు. పర్యటనల పేరుతో నీటిని వృథా చేస్తూ ప్రజలకు మరిన్ని కష్టాలు పెడుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క అలమటిస్తుంటే.. ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రి ఎక్నాథ్ ఖడ్సే హెలికాప్టర్ దిగేందుకు ఏకంగా 10 వేల లీటర్ల నీటిని వృథా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రకే చెందిన మరో మంత్రి పంకజా ముండే కరువు ప్రాంత పర్యటనకు వెళ్లి సెల్ఫీ దిగారు. మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పర్యటన వివాదాస్పదమైంది. ఉత్తర కర్ణాటకలోని కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధరామయ్య వెళ్లారు. సీఎం వెళ్లడానికి ముందు అధికారులు అత్యుత్సాహంతో భారీగా నీటిని వృథా చేశారు. సీఎం పర్యటించే మార్గంలో రోడ్లపై దుమ్ము లేస్తుందనే ఉద్దేశ్యంతో ట్యాంకర్లతో నీటిని తెప్పించి రోడ్లపై చల్లించారు. ఈ సంఘటనపై ప్రతిపక్ష బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రజలు కరువుతో అలమటించిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్ర మంత్రులు విహారయాత్రకు యూరప్ వెళ్తున్నారని మండిపడ్డారు. నీటిని వృథా చేసిన విషయంపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సీఎం వాచీ కథ సుఖాంతం!
గత వారం పది రోజులుగా మీడియాతో పాటు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేస్తున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య వాచీ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. తన వాచీని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన సీఎం.. దాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ హబ్లాట్ వాచీ ధర రూ. 70 లక్షలు కావడం, ముఖ్యమంత్రికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై మీడియాలో బోలెడు కథనాలు వెల్లువెత్తాయి. తనకు ఓ ఎన్నారై మిత్రుడు ఈ వాచీని బహుమతిగా అందించాడని సీఎం సిద్దు చెప్పినా.. దాన్ని దొంగిలించిన వాచీ అని విపక్షాలు ఆరోపించాయి. చివరకు ఈ వ్యవహారం రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండటంతో.. విపక్షాలు సర్కారును కడిగి పారేశాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా బీజేపీ నేతలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు దాన్ని వదిలించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి.. ఆ వాచీని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు.