CM name will be announced by Mallikarjun Kharge after due deliberations, says Randeep Surjewala - Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎం ఎంపికపై మరో ట్విస్ట్‌.. సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు

Published Wed, May 17 2023 3:22 PM | Last Updated on Wed, May 17 2023 3:30 PM

Randeep Surjewala Key Comments On Karnataka CM Selection - Sakshi

సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో అధికార బీజేపీకి షాకిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌ తరఫున సీఎం ఎవరు? అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కర్ణాటక సీఎం రేసులో మాజీ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ రేసులో​ ఉన్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పరిశీలకుడు రణ్‌దీప్‌ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. నేడో, రేపో నిర్ణయం తీసుకుంటాం. మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేస్తాం. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం తేదీ కూడా తప్పు. దీనిపై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. కర్ణాటకలో సిద్దరామయ్య అనుచరులు, మద్దతుదారులు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అంటూ నినాదాలు చేస్తున్నారు. సిద్దరామయ్య పోస్టర్లకు పాలాభిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇది కూడా చదవండి: ముహూర్తం ఫిక్స్‌.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement