బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు ప్రతిఏటా రూ.60,000 కోట్ల నిధులు అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే నెల 7న తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మొత్తం రూ.3,35,000 కోట్లు ఉంటుందన్నారు. నూతన ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక తొలి బడ్జెట్ కేవలం రూ.21.3 కోట్లు మాత్రమేనని చెప్పారు.
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన ఐదు గ్యారంటీలు ఏమిటంటే.. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఒక్కో ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.2,000 చొప్పున సాయం. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ. 18–25 ఏళ్ల గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి ప్రతినెలా రూ.3,000, డిప్లొమా నిరుద్యోగికి రూ.1,500 చొప్పున సాయం. ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం.
Comments
Please login to add a commentAdd a comment