MLAs Meet
-
బీఆర్ఎస్లో ‘భేటీ’ల కలకలం!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం అవుతుండటం కల కలం రేపుతోంది. కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో అధికారం చేపట్టిన నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 24న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి మాణిక్‌రావు తదిత రులు సీఎం రేవంత్‌ను కలిశారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా రెండు రోజుల కింద సీఎంతో భేటీ అయ్యారు. తాజాగా ప్రకాశ్‌గౌడ్ కూడా కలిశారు. గతంలో టీడీపీ నుంచి వెళ్లిన నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహి తుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు గతంలో టీడీపీలో పనిచేసినవారే కావడంతో ఈ భేటీలకు ప్రాధా న్యత ఏర్పడింది. గతంలో టీడీపీలో పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్, ఇతర పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో రేవంత్‌రెడ్డి సన్నిహితులు మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయనే అంచనాల నేపథ్యంలో.. ఆలోగా చేరికల వ్యూహాన్ని అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన బీఆర్ఎస్ పెద్దలు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఇతర కీలక నేతల కదలికలపై కన్నేసినట్టు సమాచారం. -
సీఎంతో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), మాణిక్‌రావు (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక) జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న ప్రొటోకాల్, పోలీసు ఎస్కార్ట్, వ్యక్తిగత భద్రత తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. మీడియాలోనూ వీరి భేటీ వైరల్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలు స్పందించారు. తమ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కొనసాగేలా చూడాలని సీఎంను కోరినట్లు కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. గతంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రేవంత్‌తో కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు మాణిక్‌రావు తెలిపారు. తాము ముఖ్యమంత్రిని కలవడంపై విపరీతార్థాలు తీయొద్దని, ప్రధాన మంత్రి మోదీని రేవంత్‌రెడ్డి ఎలా అభివృద్ధి పనుల కోసం కలిశారో తాము కూడా అదే విధంగా కలిసినట్లు మహిపాల్‌రెడ్డి వివరించారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాగా వీరు బుధవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎంతో భేటీపై వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలావుండగా తమ భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్‌రెడ్డిని కూడా కలిశారు. -
చేవెళ్లపై బీఆర్ఎస్ దృష్టి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎంపీ స్థానాలు చేజారకుండా కాపాడుకోవడంతోపాటు మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించాలని యోచిస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, అరికెపూడి గాందీలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో సమావేశం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. చేవెళ్ల ఎంపీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పొందిన ఓట్ల కంటే 1.85 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు తక్కువగా వచ్చాయి. పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో కొద్దిగా శ్రమిస్తే మళ్లీ చేవెళ్లలో బీఆర్ఎస్ జెండా ఎగరేయొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించడంతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థి ఖరారు, ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. మండలాలవారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, జనవరి మూడు నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. మళ్లీ టికెట్ నాకే: ఎంపీ రంజిత్‌రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకే మళ్లీ టికెట్ ఇచ్చేందుకు పార్టీ అంగీకరించిందని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రచారానికి ఇప్పటికే గ్రీన్సిగ్నల్కూడా ఇచి్చనట్టు సోమవారం మీడియా ముఖంగా ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. జనవరి 3వ తేదీ నుంచి ఎంపీ సెగ్మెంట్ పరి«ధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తానని చెప్పారు. అసలు వీళ్లు మంత్రులేనా? కర్ణాటక మంత్రి కరువు వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ కోసం ఏటా కరువు పరిస్థితులు ఏర్పడాలని రైతులు కోరుకుంటారని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద పాటిల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. ‘అసలు వీళ్లు మంత్రులేనా.. రైతులపై ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో తమకు ప్రభుత్వం సానుభూతితో అండగా ఉండాలని మాత్రమే రైతులు కోరుకుంటారు’.. అని కేటీ రామారావు వ్యాఖ్యానించారు. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
5 గ్యారంటీలకు ఏటా రూ.60 వేల కోట్లు
బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు ప్రతిఏటా రూ.60,000 కోట్ల నిధులు అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే నెల 7న తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మొత్తం రూ.3,35,000 కోట్లు ఉంటుందన్నారు. నూతన ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక తొలి బడ్జెట్ కేవలం రూ.21.3 కోట్లు మాత్రమేనని చెప్పారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన ఐదు గ్యారంటీలు ఏమిటంటే.. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఒక్కో ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.2,000 చొప్పున సాయం. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ. 18–25 ఏళ్ల గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి ప్రతినెలా రూ.3,000, డిప్లొమా నిరుద్యోగికి రూ.1,500 చొప్పున సాయం. ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. -
బీఆర్ఎస్లో ముసలం.. కేసీఆర్‌కు కొత్త టెన్షన్?
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో నేతల మధ్య సమన్వయం కొరవడుతోందనే చర్చ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనపడుతోందని చెబుతున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, జిల్లా పార్టీ ఎమ్మెల్యేల నడుమ నెలకొన్న విభేదాలు రచ్చకెక్కగా, మరికొన్ని చోట్ల కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆత్మీయ సమ్మేళనాలకు కేసీఆర్ ఆదేశం బీఆర్ఎస్ను వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేసేలా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి.. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో అన్ని నియోజకవర్గాల్లో ‘ఆత్మీయ సమ్మేళనాలు’నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది ఆశించిన స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనాల సమన్వయ బాధ్యతలు సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు చొరవ తీసుకోవాలన్నా.. క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలని కేసీఆర్ గత రెండేళ్లుగా పదే పదే నొక్కి చెప్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో క్షేత్ర స్థాయి కేడర్, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు ఫలితాన్ని ఇవ్వడంతో ఈ తరహా భేటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత ఆదేశించారు. గతనెల 15న తెలంగాణ భవన్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యవర్గ సంయుక్త భేటీలో కూడా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారంలోగా ఆత్మీయ సమ్మేళనాలు మండలాలు, పట్టణ ప్రాంతాల్లో డివిజన్ల వారీగా నిర్వహించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడావుడి చేశారు. అయితే ఒకటీ అరా నియోజకవర్గాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సమ్మేళనాలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి, అందుకు సంబంధించిన నివేదికలు పంపాలని కేసీఆర్ ఆదేశించారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా చాలాచోట్ల ఇది ముందుకు సాగలేదు. వంద మంది ఓటర్లకు ఓ ఇన్చార్జి ఎక్కడ? వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చారి్జలను నియమించడంతో పాటు నియోజకవర్గాల వారీగా వారి వివరాలను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సిందిగా కేసీఆర్ నెలరోజుల క్రితం పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున రెండు వేల నుంచి మూడు వేల మంది ఇ¯న్చార్జిలు అవసరమవుతారని అంచనా వేశారు. వంద మంది ఓటర్లకు ఇన్‌చారి్జలుగా వ్యవహరించే వారి వివరాలను ఫోన్¯ నంబర్లతో సహా నవంబర్ నెలాఖరులోగా తెలంగాణ భవ¯న్కు పంపించాలని ఆదేశించినా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశాల నిర్వహణకు కూడా మంత్రులు చొరవ చూపాల్సి ఉండగా, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ వంటి కొన్ని జిల్లాల్లోనే ఈ తరహా సమావేశాలు జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పెరిగిపోతున్న గ్యాప్ తమ నియోజకవర్గాల్లో మంత్రులు పెత్తనం చెలాయించడాన్ని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలు సొంతంగా నిర్వహించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు మంత్రులు జిల్లా అధికార యంత్రాంగంపై పట్టు సాధిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో జరిగే కార్యకలాపాలకు సంబంధించి తమ అనుమతి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఏర్పడుతోంది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని చూపుతూ కొందరు మంత్రులు తమపై పెత్తనం చేస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఈ తరహా విభేదాలు కొనసాగుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
Munugodu: కసరత్తు పెంచిన టీఆర్ఎస్.. 88 మంది ఎమ్మెల్యేలు ఇక్కడే
సాక్షి, నల్లగొండ : మునుగోడులో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ భారీ వ్యూహం అనుసరించబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 88 ఎమ్మెల్యేలకు మునుగోడులో బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో శనివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో రెండు ఊర్లకు ఒకరు చొప్పున 88 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి ఆ జాబితాను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి త్వరలోనే అందజేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి వెళ్లే ప్రతి ఎమ్మెల్యే తన వెంట 15 మంది కరడుకట్టిన పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకొని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలతో మమేకమై పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు 17న జాతీయ సమైక్యతా దినం నిర్వహణతోపాటు వజ్రోత్సవ కార్యక్రమాల తర్వాత వారంతా పూర్తిస్థాయిలో మకాం వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ తమకే పరిస్థితి అనుకూలంగా ఉందని పేర్కొన్న సీఎం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో గెలిచి తీరాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో... రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కొంత మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మునుగోడు నియోజకవర్గంలోనూ 3 వేల మందికి ప్రయోజనం కలుగనుంది. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో దళితబందు 100 కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మరో 500 కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మునుగోడులో 600 దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. పోడు భూములపైనా కదలిక వచ్చింది. ప్రతి జిల్లాలో మంత్రుల నేతృత్వంలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్ మండలంలో పోడు భూముల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఎన్డీయేకు గుడ్‌బై చెప్పే యోచనలో బిహార్ సీఎం నితీష్
-
మాకు పూర్తి బలం ఉంది: అన్నాడీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే బలనిరూపణ అంశాన్ని కనుమరుగు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చెన్నైలో నేడు ఎమ్మెల్యేలందరితో భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 12న నిర్వహించబోయే జనరల్ కౌన్సిల్ మీటింగ్ కోసమే అని చెబుతున్నప్పటికీ.. సంఖ్యా బలం చూపించుకునేందుకే ఈ ఎమ్మెల్యేల సమావేశం విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. "ఎమ్మెల్యేల సమావేశానికి 111 మంది హాజరయ్యారు. అనారోగ్యంతో ఉన్న ఓ ఎమ్మెల్యే హాజరుకాలేకపోయారు. మరికొందరు ఫోన్ ద్వారా మద్ధతు తెలిపారు. మా కూటమిలో ముగ్గురి మద్ధతు కూడా మాకే ఉంది. అందులో స్పీకర్ ధన్ పాల్ కూడా ఉన్నారు. ఈ లెక్కన్న మా పార్టీకి పూర్తి బలం ఉంది'' అని అన్నాడీఎంకే కీలక నేత, మంత్రి డీ జయకుమార్ సమావేశం అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అంతేకాదు మరో గ్రూప్ నుంచి కూడా 9 మంది మద్ధతు మాకే ఉందని, వారు ఫోన్ లో సంప్రదింపులు చేపట్టారని ఆయన అన్నారు. అయితే వాళ్లు దినకరన్ మద్ధతుదారులా? లేక ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లా? అన్నది మాత్రం జయకుమార్ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే సమావేశానికి శశికళ-దికనరన్ వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. తాము హాజరుకాబోమని నిన్ననే ఆ వర్గ నేత తంగ తమిళసెల్వన్ స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి కూడా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సెల్వన్ స్పీకర్ ను ప్రశ్నిస్తున్నారు. వర్నర్ విద్యాసాగర్ ను కలసి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంటున్నామని తెలియజేయటం ద్వారా ఆ 19 మంది పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ధన్ పాల్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే.