సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం అవుతుండటం కల కలం రేపుతోంది. కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో అధికారం చేపట్టిన నేపథ్యంలో విపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 24న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి మాణిక్‌రావు తదిత రులు సీఎం రేవంత్‌ను కలిశారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా రెండు రోజుల కింద సీఎంతో భేటీ అయ్యారు. తాజాగా ప్రకాశ్‌గౌడ్ కూడా కలిశారు.
గతంలో టీడీపీ నుంచి వెళ్లిన నేపథ్యంలో..
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహి తుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు గతంలో టీడీపీలో పనిచేసినవారే కావడంతో ఈ భేటీలకు ప్రాధా న్యత ఏర్పడింది. గతంలో టీడీపీలో పనిచేసి ప్రస్తుతం బీఆర్‌ఎస్, ఇతర పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో రేవంత్‌రెడ్డి సన్నిహితులు మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయనే అంచనాల నేపథ్యంలో.. ఆలోగా చేరికల వ్యూహాన్ని అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్ పెద్దలు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఇతర కీలక నేతల కదలికలపై కన్నేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment