five schemes
-
5 గ్యారంటీలకు ఏటా రూ.60 వేల కోట్లు
బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకు ప్రతిఏటా రూ.60,000 కోట్ల నిధులు అవసరమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. వచ్చే నెల 7న తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మొత్తం రూ.3,35,000 కోట్లు ఉంటుందన్నారు. నూతన ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్ణాటక తొలి బడ్జెట్ కేవలం రూ.21.3 కోట్లు మాత్రమేనని చెప్పారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచి్చన ఐదు గ్యారంటీలు ఏమిటంటే.. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఒక్కో ఇంట్లో ఒక మహిళకు నెలకు రూ.2,000 చొప్పున సాయం. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ. 18–25 ఏళ్ల గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి ప్రతినెలా రూ.3,000, డిప్లొమా నిరుద్యోగికి రూ.1,500 చొప్పున సాయం. ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. -
పళనిస్వామి ఐదు సంతకాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామి పరిపాలనలో తన ముద్ర వేసేందుకు శ్రీకారం చుట్టారు. అనూహ్యంగా సీఎం పదవిలోకి వచ్చి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అసెంబ్లీలో బలం నిరూపించుకున్న ఆయన పాలనపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఫైళ్లపై సోమవారం ఆయన సంతకాలు చేశారు. 'అమ్మ' ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆమె బాటలోనే తాను పయనిస్తున్నానని పళనిస్వామి చెప్పారు. ఐదు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు తెలిపారు. కరువు ప్రాంత రైతుల కోసం నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే ప్రజలందరికీ పరిశుద్ధ తాగునీరు పంపిణీ చేస్తామన్నారు. సీఎం సంతకాలు చేసిన ఫైళ్లు.. 1. నిరుద్యోగులకు భృతి రెట్టింపు 2. ప్రసూతి సాయం రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంపు 3. ఉద్యోగాలు చేసే లక్ష మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు 4. రూ. 85 కోట్లతో మత్స్యకారులకు 5 వేల గృహాల నిర్మాణం 5. మరో 500 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత