భారత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా పండగలు విరాజిల్లుతున్నాయి. దూరంగా ఉన్న వారిని అక్కున చేర్చుతూ.. ఎన్నో అనురాగాలను, ఆప్యాయతలను పంచి పెడుతాయి ఈ పండగలు. అన్ని పండగల్లో దీపావళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుంగా ప్రపంచంలోనే ఎక్కువమంది జరుపుకునే పండగ దీపావళి.
దీపావళి పేరు వినగానే అందరికీ గుర్తోచ్చేది దీపాల కాంతుల్లో వెలిగే జిగేలులు. ఆకాశమంతా విరజిల్లే సంబరాలు.. ఇంతటి వైభవంగా జరుపుకునే ఈ పండగలో మెయిన్ అట్రాక్షన్ మహిళలు. భక్తి, శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించడం ఈ పండడ ప్రత్యేక. అయితే అలాంటి మగువల అందాలకు మరింత వన్నే చేకూర్చేవి వారి అలంకరణ. ఈ అలంకరణలో మందుగా గుర్తొచ్చేవి ఆభరణాలు. జ్యువెల్లరీ లో ముఖ్యంగా బంగారం, వెండి, డైమండ్,ముత్యాలు వగైరా. వీటితో పాటు ఈ మధ్య కాలంలో థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఇవి కూడా పాతబడిపోయాయి. ప్రతీసారి ఇవే ధరించడం మహిళలకు కాసింత రోటీన్‌గా అనిపిస్తోంది. అయితే ప్రతి పండక్కి ఒకింత కొత్తగా, మరింత నూతనంగా అలంకరించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే ఈ సారి వీటికి భిన్నంగా మట్టితో తయారు చేసినవి ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారు. నగరానికి చెందిన కృష్ణలత గత కొంత కాలంగా వీటి పైనే దృష్టి పెట్టింది. మట్టితో ఒకటి కాదు రెండు ఏకంగా వందల రకాల వస్తువులను తయారు చేస్తుంది.
అభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్, బొమ్మలు, గృహాలంకరణ వస్తువులతో పాటు ఏ పండగకైనా ఉపయోగించే వస్తు సామాగ్రిని ఇలా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. తన స్వహస్తాలతో తయారైన ఈ ఆభరణాలను చూసి ముచ్చటపడటమే కాక, ధరించి ఆహా అనాల్సిందే. పండగలకు ఉపయోగించే ప్రతి వస్తువులలో సాధారణంగా ప్లాస్టిక్ వినియోగం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ పెనుభూతంగా తయారవుతూ మానవ మనుగడకు తీవ్ర ప్రమాదంగీ తయారవుతోంది. దీంతో ప్లాస్టిక్‌ను తగ్గించి పర్యావరణానికి మేలు జరిగేలా మట్టితో తయారు చేసిన వస్తువులను ఈ ప్రత్యేక పండగలో ఉపయోగిద్దాం. చెడుపై మంచి గెలిచినా విజయానికి దీపావళి జరుపుకుంటారన తెలిసిందే. అలాగే ప్రస్తతం ప్రపంచంలో చెడుగా వ్యాప్తి చెందుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ మనం కూడా ఓ మంచి పనికి శ్రీకారం చుడుదాం.
పరిచయం...
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కృష్ణలతకు మట్టితో వివిధ వస్తువులు తయారు చేయడం అలవాటు. అనంతరం అమెరికా నుంచి నగరానికి వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా మళ్లీ మట్టితో అభరణాలు, తయారు చేయడం ప్రారంభించారు. తాను ఏం చేసిన పర్యావరణానికి హానీ కలగకుండ ఉండాలి. అంతేగాక కొత్తగానూ, అందరూ మెచ్చేలా ఉండాలని భావించారు. కేవలం తన అభిరుచితోనే ప్రారంభించిన ఈ పనిని 2014లో ఊర్వి పేరుతో ఓ బ్రాండ్‌ను స్థాపించి మట్టితో అనేక వస్తువులను తయారు చేసి బిజెనెస్ ప్రారంభించారు. మట్టి మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అనేక పదార్ధాలతో తయారు చేసే వస్తువులు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.
తయారీ విధానం...
అభణానికి కావల్సినంత మట్టిని తీసుకొని మొదట దానిని ఎండబెట్టాలి. ఆ తరువాత మట్టిని 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. అప్పుడు అది స్టోన్‌లా మారుతుంది. దానిని మనకు కావల్సిన కలర్స్ వేసుకొని నచ్చిన డిజైన్‌లో జ్యువెల్లరీ తయరు చేసుకోవచ్చు.
ఏంటీ ప్రత్యేకత
- మట్టితో తయారు చేయడం.
- ఎలాంటి రసాయనాలను వాడకపోవడం
- ఫ్యాషన్‌కు తగ్గట్టుగా తయారు చేయడం
- పూర్తిగా పర్యావరణ హితమైనవి, కాలుష్యానికి ఆమడ దూరం
- వెండి,బంగారం వంటి అభరణాలతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం
దీపావళికి ప్రత్యేకంగా
నూతన వెరైటీలతో జ‍్యువెల్లరీ(నగలు, చెవి కమ్మలు) తయారీ. అదే విధంగా దీపావళికి ప్రతేక ఆకర్షణ ప్రమిదలు. సాధారణంగా వీటిని మట్టితోనే తయారు చేస్తారు. ఈ మట్టిలో సైతం అనేక ఆకృతులలో అంటే గణేష్ ప్రమిదలు, నెమలి ఆకార ప్రమిదలు, ఏనుగు ప్రమిదలు వంటివి చేస్తోంది. వీటితోపాటు గుమ్మానికి వేలాడదీసే ప్రమిదలు. ఆవు పేడ (కవ్ డంగ్)తో తయారు చేస్తుంది. అంతేగాక పండక్కి వచ్చే అతిథుల కోసం వాయినంగా ఇచ్చే కుంకుమ భరణిని మట్టితో తయారు చేయడం. తులసి కోట వంటివి ఈ దీపావళికి ప్రత్యేకం.
ధరలు..
కృష్ణలత తయారు చేసిన ప్రతి వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక్క దానికి ఒక్కో ధర ఉంటుంది. అధిక ధరలకు కాకుండా తయారీకి అయిన ఖర్చుతో కలిపి అందరికి అందుబాటులో ఉండే ధరకు వీటిని మనం కొనవచ్చు. ఆవు పేడ ప్రమిదలు- రూ.140 నుంచి రూ. 240....డిజైనర్ ప్రమిదలు-రూ. 320.... నగలు- రూ.450 నుంచి మొదలు... చెవి కమ్మలు రూ. 120 నుంచి ప్రారంభం. సో ఇంవేందుకు అలస్యం వెంటనే కొనేయండి. వీటిని మీ సొంతం చేసుకోవాలంటే అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో లాగిన్ అవ్వండి. లేదా నేరుగా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment