వ్యక్తిగత బేషజాలకు పోవద్దు
వ్యక్తిగత బేషజాలకు పోవద్దు
Published Sat, Mar 4 2017 10:13 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
బాబా సూక్తులను ఆచరించండి
శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు చలం
తెలుగు రాష్ట్రాల పదాధికారుల సమావేశం ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్ : వ్యక్తిగత బేషజాలకు పోయి సంస్థ లక్ష్యాన్ని దిగజార్చవద్దని, బాబా చెప్పిన ప్రేమ, సేవ మార్గాలతో ప్రతి పల్లెలోను శ్రీసత్యసాయి నామ స్మరణతో ఆధ్యాత్మిక సేవా, విద్యా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి కృషి చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఎస్‌జీ చలం అన్నారు. బొమ్మూరులోని శ్రీసత్యసాయి గురుకులంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల శ్రీసత్యసాయి సేవాసంస్థల పదాధికారుల రెండురోజుల సమావేశానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీసత్యసాయి అవతార వైభవాన్ని, సమాజ సేవా కార్యక్రమాలను మరింత చైతన్యవంతంగా నిర్వహించడానికి 2025 సంవత్సరం బాబా శతజయంతి ఉత్సవం నాటికి కార్యచరణను రూపొందించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పుట్టపర్తి యాత్రల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, భజన మండళ్లు, సేవా సమితిలు పెంచడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యా, సేవ, ఆధ్యాత్మికం, యువత, వేదపఠనం విభాగాలను విభజించి బృంద చర్చగోష్టిలు నిర్వహించారు. శ్రీసత్యసాయి సేవా సంస్థల ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మణరావు, సర్వోత్తముడు, వివిధ విభాగాల కోఆరి్డనేటర్లు డాక్టర్ కృష్ణకుమార్, ఎన్.ఉషారాణి, ఎంఎస్ ప్రకాశరావు, అడబాల వెంకటేశ్వరరావు, సిహెచ్.త్రిమూర్తులు, బులుసు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యయన మండలి సభ్యుడు జంధ్యాల సుమన్‌బాబు, జిల్లా అధ్యక్షుడు బిక్కిన సీతారాంబాబు, శ్రీసత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యామ్‌సుందర్ తదితరులు హాజరయ్యారు.
Advertisement
Advertisement