satyasai
-
సత్యసాయి జిల్లాకు సీఎం వైఎస్ జగన్
-
పుట్టపర్తిలో నేడు సత్యసాయి గిరిప్రదక్షిణ
అనంతపురం: సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద సత్యసాయి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించనున్నారు. గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ఆర్వీజే పెట్రోల్ బంక్, చింతతోపులు మీదుగా పట్టణంలో ప్రవేశించి మంగళహారతితో ముగుస్తుంది. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
వ్యక్తిగత బేషజాలకు పోవద్దు
బాబా సూక్తులను ఆచరించండి శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు చలం తెలుగు రాష్ట్రాల పదాధికారుల సమావేశం ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్ : వ్యక్తిగత బేషజాలకు పోయి సంస్థ లక్ష్యాన్ని దిగజార్చవద్దని, బాబా చెప్పిన ప్రేమ, సేవ మార్గాలతో ప్రతి పల్లెలోను శ్రీసత్యసాయి నామ స్మరణతో ఆధ్యాత్మిక సేవా, విద్యా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి కృషి చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఎస్జీ చలం అన్నారు. బొమ్మూరులోని శ్రీసత్యసాయి గురుకులంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల శ్రీసత్యసాయి సేవాసంస్థల పదాధికారుల రెండురోజుల సమావేశానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీసత్యసాయి అవతార వైభవాన్ని, సమాజ సేవా కార్యక్రమాలను మరింత చైతన్యవంతంగా నిర్వహించడానికి 2025 సంవత్సరం బాబా శతజయంతి ఉత్సవం నాటికి కార్యచరణను రూపొందించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పుట్టపర్తి యాత్రల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, భజన మండళ్లు, సేవా సమితిలు పెంచడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యా, సేవ, ఆధ్యాత్మికం, యువత, వేదపఠనం విభాగాలను విభజించి బృంద చర్చగోష్టిలు నిర్వహించారు. శ్రీసత్యసాయి సేవా సంస్థల ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షులు ఆర్.లక్ష్మణరావు, సర్వోత్తముడు, వివిధ విభాగాల కోఆరి్డనేటర్లు డాక్టర్ కృష్ణకుమార్, ఎన్.ఉషారాణి, ఎంఎస్ ప్రకాశరావు, అడబాల వెంకటేశ్వరరావు, సిహెచ్.త్రిమూర్తులు, బులుసు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యయన మండలి సభ్యుడు జంధ్యాల సుమన్‌బాబు, జిల్లా అధ్యక్షుడు బిక్కిన సీతారాంబాబు, శ్రీసత్యసాయి గురుకులం కరస్పాండెంట్ శ్యామ్‌సుందర్ తదితరులు హాజరయ్యారు. -
సత్యసాయి అంతరంగికుడు మృతి
సత్యసాయి అంతరంగికుడు, గతంలో సత్యసాయి ట్రస్ట్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన సత్యసాయి భక్తుడు చిరంజీవిరావు(85) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. సత్యసాయిపై ఉన్న భక్తిభావనతో దాదాపు నాలుగు దశాబ్దాల పైబడి ప్రశాంతి నిలయంలో ఉంటూ తన వంతు సేవలను అందించారు. ట్రస్ట్ అప్పజెప్పిన కార్యక్రమాలను చాకచక్యంతో నిర్వర్తిస్తూ బాబా అభిమానాన్ని చూరగొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, సంకల్పం మేరకు ప్రశాంతి నిలయంలోనే తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, భక్తులు ఆయన అంత్యక్రియలను చిత్రావతిలో నిర్వహించారు. ఆయన మృతిపై సత్యసాయి ట్రస్ట్ వర్గాలు సంతాపం తెలిపాయి. -
బాబా చూపిన మార్గంలో ప్రపంచ యువత
- ప్రశాంతి నిలయంలో సత్యసాయి ప్రపంచ - యువజనోత్సవాలు ప్రారంభం సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రపంచవ్యాప్తంగా 69 దేశాలలో సత్యసాయి యువజన విభాగం సేవాకార్యక్రమాలు చూస్తుంటే బాబా చూపిన మార్గంలో ప్రపంచ యువత నడుస్తున్నట్లు స్పష్టమవుతుందని కేంద్ర ఇంధన, బొగ్గు గనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంగళవారం ప్రారంభమైన సత్యసాయి ప్రపంచ యువజనోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, భక్తులనుద్దేశించి మాట్లాడారు. తాను ఈ స్థితికి చేరడానికి బాబా చూపిన మార్గమే కారణమన్నారు. తొలి రోజు ఉత్సవాల్లో సత్యసాయి యూత్ కోఆర్డినేటర్ శివేంద్ర, సత్యసాయి సేవాసమితి అధ్యక్షుడు నిమీశ్, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు రత్నాకర్, కార్యదర్శి ప్రసాదరావు, మాజీ డీజీపీ హెచ్‌జే దొర తదితరులు పాల్గొన్నారు. -
సత్యసాయి మృతిపై సీబీఐ విచారణ
సమీప బంధువు గణపతిరాజు డిమాండ్ సత్యసాయిది హైటెక్ మర్డర్ ఏపీ సీఎం, పీఎంకి లేఖలు సాక్షి, హైదరాబాద్: సత్యసాయి బాబా(పుట్టపర్తి సాయిబాబా) మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని బాబా సమీప బంధువు ఎం.గణపతిరాజు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి మార్చి 29న మృతి చెందితే, ఏప్రిల్ 24న ఆరాధన దినోత్సవాలు జరపటం ఏమిటని ప్రశ్నించారు. సత్యసాయిబాబాది సహజ మరణం కాదని, వెల్ ప్లాన్డ్ హైటెక్ మర్డర్ అని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని అన్నారు. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రధాని మోదీకి లేఖలు రాశామని తెలిపారు. బాబా మృతి సంఘటనలోని దోషులకు అదృశ్యశక్తుల అండదండలు ఉన్నాయని, బాబాకు సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులు తరలించాయని ఆరోపించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాలని కోరిన తనపై రెండుసార్లు దాడులు జరిగాయని గుర్తు చేశారు. సత్యసాయి మృతికి సంబంధించి ఆధారాలు కొన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు. సమావేశంలో రవి, న్యాయవాది సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.