Cube Highways Trust secures Rs 1030 crore funding - Sakshi
Sakshi News home page

క్యూబ్‌ హైవేస్‌ ట్రస్ట్‌కు రూ. 1,030 కోట్ల నిధులు!

Published Sat, Jul 1 2023 7:53 AM | Last Updated on Sat, Jul 1 2023 10:51 AM

Cube Highways Trust Rs 1030 crore funds - Sakshi

న్యూఢిల్లీ: క్యూబ్‌ హైవేస్‌ ట్రస్ట్‌ (క్యూబ్‌ ఇన్విట్‌) తాజాగా ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) నుంచి రూ. 1,030 కోట్ల మేర నిధులు సమీకరించింది. దీర్ఘకాలిక లిస్టెడ్‌ నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ వివరించింది. క్యూబ్‌ హైవేస్‌ ట్రస్ట్‌కి చెందిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో రహదారి అసెట్స్‌ ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 1,424 కిలోమీటర్ల విస్తీర్ణంలో 18 టోల్, యాన్యుటీ ప్రాజెక్టులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement