Highways
-
సురక్షితం ఏఐ రాస్తే
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా, మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐఎన్ఏఐ కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐరాస్తే) ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -సాక్షి, హైదరాబాద్ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90 శాతం ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్‌గా గుర్తిస్తారు. అయితే, వరుసగా మూడేళ్లపాటు అదేచోట ప్రమాదాలు జరిగి పది మందికంటే ఎక్కువ చనిపోతే, ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పనే చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించేందుకు మూడేళ్లు ఆగాల్సిన పనిలేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది. మూడు రహదారులపై అధ్యయనం.. ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు టీఎస్ఆర్టీసీకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5,606 ఎఫ్ఐఆర్లు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ఏడీఏఎస్ హెచ్చరికలు, బ్లాక్ స్పాట్లపై నిర్వహించిన భద్రతా ఆడిట్ట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐ రాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్‌ల్లో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు నివేదికలు సమర్పించారు. బారియర్స్‌తో సరిదిద్దవచ్చు.. కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్‌బోర్డులు, టీ–ఇంటర్ సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటివరకు మూడు గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వనించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. – పృథ్వీ, ఐ–రాస్తే ఆపరేషన్స్ మేనేజర్ 600 మందికి ఏబీసీలో శిక్షణ ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ)లో శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్ముకశీ్మర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. – గోవింద్ కృష్ణన్, ఐ–రాస్తే ప్రోగ్రామ్ మేనేజర్, ట్రిపుల్ హైదరాబాద్ -
పల్లెకు చలో.. రద్దీగా రహదారులు..
-
మితిమీరిన వేగంతోనే ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘స్పీడ్ థ్రిల్స్..బట్ కిల్స్..’(వేగం ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ చంపేస్తుంది) అని పోలీసులు చెబుతున్నా, రహదారులపై అక్కడక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. కొందరు వాహనదారులు చెవికెక్కించుకోవడం లేదు. విశా లమైన రోడ్లపై యమస్పీడ్‌గా దూసుకెళుతున్నారు. అంతే వేగంగా ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలకు కారణాలు విశ్లేíÙస్తే.. మితిమీరిన వేగంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడవుతోంది. రోడ్డు ప్ర మాదాలు నియంత్రించేందుకు, ప్రమాదాలకు మూలకారణాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం అధికారులు 2023లో రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాలు విశ్లేíÙంచారు. రహదారులు, ఓఆర్ఆర్పై మొత్తం 9,749 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఇందులో 5,817 రోడ్డు ప్రమాదాలు వాహనదారుల మితిమీరిన వేగం కారణంగానే సంభవించినట్టు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో 120 రోడ్డు ప్రమాదా లు జరిగాయి. అత్యంత నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో 3,532 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలకు అసలు కారణాలు గుర్తించడం ద్వారా వాటిని నివారించేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. 3,532 నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో యాక్సిడెంట్లు⇒ 2023లో జరిగిన ప్రమాదాలను విశ్లేషించిన పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం ⇒ ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టే యోచన -
గుడ్‌న్యూస్.. 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేదు
ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఉన్న వాహనాలు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫీజు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ణయం, వసూళ్లు) నిబంధనలు- 2008ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. కొత్త నిబంధనలు మంగళవారం నుండి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం.. జీఎన్ఎస్ఎస్ వాహనాలు 20 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ప్రయాణిస్తాయో అంత దూరంపై మాత్రమే ఇప్పుడు రుసుము వసూలు చేస్తారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వాహనాల కోసం ప్రత్యేకమైన లేన్‌ను కేటాయిస్తారు. ఇతర వాహనాలు ఈ లేన్‌లోకి ప్రవేశించినట్లయితే రెండు రెట్ల రుసుమును చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా?ఎంపిక చేసిన జాతీయ రహదారులలో ఫాస్ట్‌ట్యాగ్‌తో పాటు జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని పైలట్ ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో హైవే మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌హెచ్-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని ఎన్‌హెచ్-709లోని పానిపట్-హిసార్ సెక్షన్లో జీఎన్ఎస్ఎస్ ఆధారిత వినియోగదారు రుసుము వసూలు వ్యవస్థకు సంబంధించి పైలట్ అధ్యయనం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. -
‘హిట్ అండ్ రన్’కు అంత కఠిన శిక్ష సబబేనా?
న్యాయ శిక్షాస్మృతుల్లో ఇటీవల కేంద్రం గణనీయమైన మార్పులతో కొత్త చట్టాలను తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్(IPC)కి ప్రత్యామ్నాయంగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు ట్రక్ డ్రైవర్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. హిట్ అండ్ రన్లకు మరీ అంత శిక్ష సబబేనా? అనే చర్చ సోషల్ మీడియాలోనూ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ‘హిట్ అండ్ రన్’ గణాంకాలు ఆందోళన కలిగించే అంశమేనని కొందరు గణాంకాలతో చెబుతున్నారు. హిట్ అండ్ రన్.. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఎక్కడైనా పరిమితికి మించిన వేగంతో టూ వీలర్, కార్లు, ట్రక్కులు రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రమాదానికి కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతే అది హిట్ అండ్ రన్ అవుతుంది. అలా పరారు కావటాన్ని మన గత చట్టం.. ఇప్పుడు కొత్త చట్టం కూడా నేరపూరిత చర్యగా పేర్కొంటోంది. అయితే.. భారతీయ న్యాయం సంహిత ప్రకారం.. హింట్ అండ్ రన్, ప్రమాదకర డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరిత చర్యల కిందకు వస్తాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 104లో రెండు నిబంధనలు ఉన్నాయి. మొదటి నిబంధన.. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక ప్రాణం పోవడానికి కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైటు శిక్ష ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇక రెండో నిబంధన: రోడు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదంటే స్థానిక మెజిస్ట్రేట్‌కు సమాచారం అందించాలి. అలా ఇవ్వకుండా.. ఘటన స్థలం నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, దాంతో పాటు రూ. 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంత ఆందోళనకరంగా ఉంది కాబట్టే.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో మొత్తంగా 2022 ఏడాది కాలంలో అధికారంగా 67,387 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఆ ప్రమాదాల్లో 30,486 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 12,250 ప్రమాదాల నమోదయ్యాయి. మహారాష్ట్ర (8768), ఉత్తరప్రదేశ్ (7585), రాజస్థాన్ ( 5618) వంటి పెద్ద రాష్ట్రాల్లో హిట్ అండ్ రన్ ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే.. హిట్ అండ్ రన్ ప్రమాదాలకు మధ్య భారతం కేంద్ర బిందువుగా ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ (2099), ఆంధ్రప్రదేశ్(1560) హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో లెక్కలు ఉన్నాయి కాబట్టే.. కఠిన శిక్షల అమలును సమర్థిస్తున్నవాళ్లు లేకపోలేదు. అభ్యంతరాలు అందుకే.. భారతీయ శిక్షాస్మృతి (IPC)లో హిట్ అండ్ రన్ కేసులు సెక్షన్ 304 ఏ కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే గరిష్టంగా రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. అయితే మాములు రోడ్డు ప్రమాదాల కంటే హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో విచారణలు పూర్తై శిక్షలు పక్కాగా అమలవుతున్నాయి. 2022లో విచారణ పూర్తిన హిట్ అండ్ రన్ కేసుల రేటు 47.9గా నమోదైంది. అయితే ఇతర రోడ్డు ప్రమాదాల్లో ఈ రేటు కేవలం 21.8 శాతం మాత్రమే నమోదు కావటం గమనార్హం. కానీ, కొత్త చట్టం ప్రకారం హిట్ అండ రన్ కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తుండడంపై ట్రక్కులు, లారీ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారురు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వెల్లడించారు. దీంతో.. ట్రక్కు డ్రైవర్లు తాత్కాలికంగా శాంతించి సమ్మె విరమించారు. -
ప్రమాదాలకు బ్లాక్‘స్పాట్’
సాక్షి, అమరావతి: వాహనాల్లో హైవేలపై రివ్వున దూసుకుపోవడం సరదాగానే ఉంటుంది కానీ, అదే హైవేలపై బ్లాక్స్పాట్లు (ప్రమాదకర ప్రదేశాలు) యమపాశాలుగా మారుతున్నాయి. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు హైవే బ్లాక్ స్పాట్ల వద్ద సంభవిస్తున్నాయి. దేశంలో హైవేలపై ఐదేళ్లలో బ్లాక్ స్పాట్ల వద్ద ఏకంగా 39,944 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 18,476 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం దేశంలో 5,803 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నివేదికలో వెల్లడించింది. బ్లాక్ స్పాట్లను సరిచేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొంది. బ్లాక్ స్పాట్లను సరిదిద్దేందుకు ప్రాధాన్యం జాతీయ రహదారులపై బ్లాక్స్పాట్ల ప్రమాదాలను నివారించేందుకు ఎన్హెచ్ఏఐ కార్యాచరణను వేగవంతం చేసింది. గుర్తించిన బ్లాక్ స్పాట్లను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన చర్యలు చేపడుతోంది. అందుకోసం పోలీసులు, రవాణా శాఖల సమన్వయంతో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో జాతీయ రహదారుల విస్తరణ, రోడ్లకు మరమ్మతులు, ప్రమాదకర మలుపుల సమీపంలో చెట్ల తొలగింపు, సైన్‌బోర్డుల ఏర్పాటు తదితర చర్యలు వేగవంతం చేస్తోంది. ఆ ప్రమాదాల్లో హైవే పెట్రోలింగ్‌ను కూడా పెంచింది. గత ఐదేళ్లలో దేశంలో మొత్తం 3,972 బ్లాక్ స్పాట్లను సరిచేశారు. బ్లాక్ స్పాట్ అంటే.. భారతీయ రోడ్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా జాతీయ రహదారి 500 మీటర్ల పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జరిగి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానిని బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు. మొదటి స్థానంలో తమిళనాడు బ్లాక్ స్పాట్లు, రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్యలో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న 748 బ్లాక్ స్పాట్ల వద్ద 6,230 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 2,144 మంది దుర్మరణం చెందారు. 701 బ్లాక్ స్పాట్లతో రెండోస్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో 3,572 రోడ్డు ప్రమాదాల్లో 1,990 మంది ప్రాణాలు కోల్పోయారు. 551 బ్లాక్ స్పాట్లతో మూడోస్థానంలో ఉన్న కర్ణాటకలో 4,110 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 1,694 మంది మృతి చెందారు. ఆ జాబితాలో తెలంగాణ నాలుగోస్థానంలో, ఆంధ్రప్రదేశ్ ఐదోస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 485 బ్లాక్ స్పాట్లలో సంభవించిన 3,965 రోడ్డు ప్రమాదాల్లో 1,672 మంది దుర్మరణం చెందారు. ఏపీలోని 466 బ్లాక్ స్పాట్లలో 2,202 రోడ్డు ప్రమాదాల్లో 1,273 మంది ప్రాణాలు విడిచారు. -
పైసలు... తీసుకెళ్లాలంటే పరేషాన్!
వీరేందర్ హయత్‌నగర్‌లో కిరాణా స్టోర్ నిర్వహిస్తున్నాడు. దసరా సీజన్ కావడంతో దుకాణంలోకి సరుకులు తెచ్చేందుకు రెండ్రోజుల క్రితం మార్కెట్‌కు బయలుదేరాడు. చింతలకుంట సమీపంలో రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. అతని వెంట ఉన్న రూ.2.30 లక్షల నగదును సీజ్ చేశారు. కిరాణా దుకాణం నిర్వాహకుడినని, సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు చెప్పినా ఫలితం లేక పోయింది. దుకాణంలో రోజువారీ సేల్స్ తాలూకు డబ్బులు కావడంతో సంబంధిత పత్రాలు లేవు.దీంతో నగదును వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. దీనిపై క్షేత్రస్థాయి లో అవగాహన లేకపోవడంతో చాలామంది నగదును తీసుకెళ్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం విధించిన రూ.50 వేల గరిష్ట పరిమితి నిబంధన వల్ల సామాన్యులు పలు సందర్భాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ చిల్లర వర్తకంలో నగదు లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్లోనూ నగదు లావాదేవీలు పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు దుకాణా దారులు చాలాచోట్ల రసీదులు ఇవ్వడం లేదు. హోల్‌సేల్ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుకు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. డిజిటల్ లావాదేవీలు మేలు: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది. చిల్లర వ్యాపారులు పలు అవసరాలకు నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. అంతేగాకుండా సరుకుల కొనుగోలుకు జనాలు సైతం నగదు తీసుకెళ్తుంటారు. ఇవేగాకుండా వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు. వీటికి లిఖిత పూర్వక ఆధారాలేమీ ఉండవు. చేబదులు రూపంలో తీసుకునే మొత్తానికి ఎలాంటి రసీదు ఉండదు. మరోవైపు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు, కాలేజీ ఫీజులు చెల్లించే వాళ్లు తమ వెంట రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా ఇలాంటివే ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో నగదును తీసుకెళాల్సి ఉంటే సరైన ఆధారాలను వెంట ఉంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సమీప బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం మంచిదని అంటున్నారు. -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కు రూ. 1,030 కోట్ల నిధులు!
న్యూఢిల్లీ: క్యూబ్ హైవేస్ ట్రస్ట్ (క్యూబ్ ఇన్విట్) తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) నుంచి రూ. 1,030 కోట్ల మేర నిధులు సమీకరించింది. దీర్ఘకాలిక లిస్టెడ్ నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు సంస్థ వివరించింది. క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌కి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో రహదారి అసెట్స్ ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 1,424 కిలోమీటర్ల విస్తీర్ణంలో 18 టోల్, యాన్యుటీ ప్రాజెక్టులు ఉన్నాయి. -
అభివృద్ధికి ‘రోడ్’మ్యాప్‌లు
ఎటైనా వెళ్లాలంటే.. బండి తీశామా, రోడ్డెక్కామా అంతే. వేరే పట్టణానికో, రాష్ట్రానికో వెళ్లాలంటే.. కారులోనో, బస్సులోనో హైవే ఎక్కాల్సిందే. కొన్ని హైవేలు అయితే వందలు, వేల కిలోమీటర్ల మేర సాగుతూనే ఉంటాయి. మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎంత పొడవున రోడ్లు ఉన్నాయో తెలుసా? మన దేశంలో ఉన్న రోడ్ల లెక్క ఏమిటో తెలుసా? దీనిపై తాజాగా ‘విజువల్ క్యాపిటలిస్ట్’సంస్థ ఓ అధ్యయనం చేయించి ‘రోడ్ల’లెక్కలు తేల్చింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ మొత్తంగా కోట్ల కిలోమీటర్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద హైవేల నుంచి గ్రామీణ రోడ్ల దాకా.. మొత్తం రహదారుల పొడవు సుమారు 2.1 కోట్ల కిలోమీటర్లపైనే. చంద్రుడికి, భూమికి మధ్య దూరం సుమారు 3 లక్షల కిలోమీటర్లు. ఈ లెక్కన భూమ్మీద రోడ్ల పొడవు.. 35 సార్లు చంద్రుడి వద్దకు వెళ్లి వచ్చినంత అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 200కుపైగా దేశాలు ఉంటే.. మొత్తం రోడ్ల విస్తీర్ణంలో ఒక్క అమెరికాలోనే 14 శాతానికిపైగా ఉండటం గమనార్హం. విజువల్ క్యాపిటలిస్ట్ సంస్థ కోరిన మేరకు పైథాన్ మ్యాప్స్ సంస్థ ఈ అధ్యయనం చేసింది. ‘గ్లోబల్ రోడ్స్ ఇన్వెంటరీ ప్రాజెక్ట్ (జీఆర్‌ఐపీ)’లోని రోడ్ల డేటాను సేకరించి.. వివిధ దేశాలు, ప్రాంతాల వారీగా క్రోడీకరించింది. ఏ దేశంలో.. ఎంత పొడవుతో.. ప్రపంచవ్యాప్తంగా 222 దేశాల్లో కలిపి మొత్తం రోడ్ల విస్తీర్ణం 2,16,00,760 కిలోమీటర్లు. ఇందులో 30 లక్షల కిలోమీటర్లకుపైగా పొడవైన రోడ్లతో యూఎస్ఏ టాప్‌లో నిలిచింది. 17 లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో చైనా, పది లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లతో భారత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోని మొత్తం రహదారుల విస్తీర్ణంలో కేవలం ఈ మూడు దేశాల్లోనే 25 శాతానికిపైగా ఉండటం గమనార్హం. ఇక ఆండోరా, జీబ్రాల్టర్, వాలిస్ అండ్ ఫ్యుచురా ఐలాండ్స్, లీచెన్‌స్టీన్, పలౌ, అమెరికన్ సమోవా, ఫ్రెంచ్ సదరన్–అంటార్కిటిక్ ఐలాండ్స్, బెర్ముడా, క్రిస్మస్ ఐలాండ్స్, నార్ఫ్లోక్ ఐలాండ్ తదితర దేశాల్లో రోడ్ల విస్తీర్ణం 30 కిలోమీటర్లలోపే కావడం విశేషం. రోడ్ల విస్తీర్ణంలో మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 27వ (1,83,317 కి.మీ), పాకిస్తాన్ 38వ (1,06,183 కి.మీ), శ్రీలంక 43వ (96,023 కి.మీ) స్థానాల్లో ఉన్నాయి. హైవేలలో చైనా.. స్థానిక రోడ్లలో అర్జెంటీనా.. ♦ భారీ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు వంటి వాటిని పరిశీలిస్తే.. ప్రపంచంలో చైనా (6,83,248 కి.మీ) టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో అమెరికా (3,66,800), మెక్సికో (1,05,822), జపాన్ (94,451), కెనడా (91,173), బ్రెజిల్ (86,772), ఫ్రాన్స్ (74,956), ఇండియా (69,748), అర్జెంటినా (69,188), ఆ్రస్టేలియా (69,138) నిలిచాయి. ♦ మధ్య స్థాయి హైవేల పొడవులో.. ప్రపంచంలో అమెరికా (8,98,873 కి.మీ) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా (5,12,386 కి.మీ), ఇండియా (4,13,790 కి.మీ), చైనా (3,06,176 కి.మీ), బ్రెజిల్ (2,23,662 కి.మీ), మెక్సికో (1,81,088కి.మీ), ఫ్రాన్స్ (1,14,433కి.మీ) తదితర దేశాలు నిలిచాయి. ♦ జిల్లా, మండల స్థాయి రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే.. అర్జెంటీనా (534,876 కి.మీ) ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో ఇండియా (526,130 కి.మీ), ఆ్రస్టేలియా (426,346 కి.మీ), చైనా (373,831 కి.మీ), ఇండోనేషియా (334,164 కి.మీ), కొలంబియా (309,725 కి.మీ), బ్రెజిల్ (283,933 కి.మీ) తదితర దేశాలు ఉన్నాయి. ♦ పూర్తిగా స్థానిక, గ్రామీణ స్థాయి రోడ్లు అమెరికా (17,89,534 కి.మీ), చైనా (3,46,742 కి.మీ), జర్మనీ (3,01,853 కి.మీ) ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి రోడ్లు ఉంటే ఏమిటి? విజువల్ క్యాపిటలిస్ట్ విశ్లేషణ ప్రకారం.. ఎక్స్‌ప్రెస్ వేలు, భారీ హైవేలు అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, పట్టణీకరణకు సంకేతాలు. ఎక్కువ ఖర్చు పెట్టగల దేశాలు మాత్రమే వీటిని నిర్మించగలుగుతాయి. ♦ మధ్యస్థాయి హైవేలు అభివృద్ధి చెందుతున్న, పట్టణీకరణ పెరుగుతున్న ప్రాంతాలకు సూచికలు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని నిర్మిస్తున్నాయి. ♦ జిల్లా, మండల, స్థానిక రోడ్లు.. స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తాయి. ♦మొత్తంగా రహదారుల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం సుస్థిర అభివృద్ధికి సూచిక అని.. మౌలిక సదుపాయాల వల్ల అభివృద్ధి వేగం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. -
భారతదేశంలో రాబోయే టాప్ 10 ఎక్స్‌ప్రెస్‌వేలు
-
హైవేలపై సీసీ ఫుటేజ్: రాత్రి వేళ కష్టమే.. స్పీడ్ కూడా సమస్యే!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రైతు శ్రీశైలం హైవే సమీపంలోని తన పొలానికి నీళ్లు పెడదామని అర్ధరాత్రి 1.30 గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో హైవే మీద వెనక నుంచి 130–140 కి.మీ వేగంతో వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీ కొట్టింది. దూరంగా ఎగిరిపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఢీకొట్టిన వాహనం డ్రైవర్ హైవేలోనే ముందుకు వెళితే సీసీటీవీ కెమెరాలో రికార్డై పోలీసులకు దొరికిపోతానని ఊహించాడు. కడ్తాల్ టోల్గేట్ లైన్లో కాకుండా సర్వీస్ రోడ్డు గుండా పరారయ్యాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే సీసీటీవీ కెమెరా ఉన్నా.. అది పని చేయకపోవటంతో కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. సీసీటీవీ కెమెరాల పరిస్థితికి ఆమన్‌గల్ ఘటన అద్దం పడుతుంది. కేసు దర్యాప్తులో కీలకంగా నిలిచే కెమెరాలు పని చేయకపోవటం, పని చేసినా రాత్రి సమయాల్లో రికార్డయ్యే ఆధునిక కెమెరాలు కాకపోవటంతో హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తులో పోలీసులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాత్రివేళ కష్టమే.. స్పీడ్ కూడా సమస్యే.. హైవేలలో ఉదయం పూట జరిగే రోడ్డు ప్రమాదాలు ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న సీసీటీవీ కెమెరాల్లో బాగానే రికార్డవుతున్నాయి. అయితే రాత్రి పూట జరిగే ప్రమాదాలు మాత్రం సరిగా రికార్డు కావటం లేదు. వాహనాల లైట్ల కాంతి ఎక్కువగా ఉండటం, వీధి లైట్ల వెలుతురూ కెమెరాల మీద పడుతుండటంతో రాత్రివేళ దృశ్యాలు సరిగా రికార్డు కావటం లేదని శంషాబాద్ జోన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే జాతీయ రహదారులలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవటంతో వాహనాలు 100–130 కి.మీ వేగంతో దూసుకెళ్తుంటాయి. అంత స్పీడ్‌లో వెళ్లే వాహనాల నంబర్లను ఏఎన్పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు గుర్తించలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. నిధుల్లేవు.. నిర్వహణ లేదు.. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిర్వ హణ కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక వ్యవస్థా లేదు. అందువల్ల ప్రత్యేకంగా నిధుల కేటాయింపూ లేదు. హైవేలతో పాటు నగరాలు, పట్టణాల్లోని రోడ్లపై వీటిని ఏర్పాటు చేస్తున్న పోలీసు శాఖ కూడా సొంత నిధులు వినియోగించడం లేదు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సంస్థలు, ఇతర సంఘాలు, సంస్థలు ఇచ్చే నిధులతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన కెమెరాలు 10 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో 40% పనిచేయడం లేదని వెల్లడైంది. కెమెరాల ఏర్పాటే కష్టసాధ్యంగా ఉన్న పరిస్థితుల్లో, ఏర్పాటైన కెమెరాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటోంది. సీసీటీవీ ఫుటేజీలే ప్రధాన ఆధారం.. ప్రధాన నగరాల్లో జరిగే రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నాచింగ్‌లు, దాడులు, హత్యోదంతాలు ఇతర త్రా కేసుల్లో నేరస్తులను చాలావరకు.. ఆయా ఘటనలకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల రికార్డింగుల ఆధారంగానే పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో కెమెరాలు పనిచేయనప్పుడు మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆధునిక కెమెరాలైతేనే బెటర్.. రాష్ట్రంలో ప్రస్తుతం బుల్లెట్, ఏఎన్పీఆర్ కెమెరాలున్నాయి. ఆధునిక ఫీచర్లు తక్కువగా ఉండే ఏఎన్పీఆర్ కెమెరాల్లో 10– 20మీటర్లకు మించి జూమ్ చేయలేం. అదే ఫేస్ రికగ్నిషన్, పాన్ టిల్ట్ జూమ్ (పీటీజెడ్)వంటి ఆధునిక కెమెరాలు అయితే 1కి.మీ. దూరం వరకూ జూమ్ చేయవచ్చు. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఉంటాయి. వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి, నంబరు ప్లేట్లను రీడింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గ్రామాల్లో రీసైక్లింగ్ రోడ్లు.. సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన ఏపీ సర్కారు.. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించే విధంగానూ రీసైక్లింగ్ యూనిట్లను సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది. పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల)లో ప్లాసిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు. గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు. రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా.. ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎస్‌వై (గ్రామీణ సడక్ యోజన) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని సిమెంట్ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్ నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్ధాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు. అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్ ప్రాసెస్ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
హైవే హిప్పోసిస్.. ప్రయాణం మాటున ప్రమాదం!
అప్రయత్నంగా మెదడు విశ్రాంతిలోకి వెళ్లడమే హైవే హిప్పోసిస్.. ప్రొఫెషనల్ డ్రైవర్ల కంటే సాధారణ వ్యక్తులపైనే ఈ ప్రభావం ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తేనే ఈ తరహా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చిన నిపుణులు చెబుతున్నారు.. ఏమిటీ హైవే హిప్పోసిస్.. సాక్షి, అమరావతి: నాలుగు లేదా ఆరు వరుసల హైవేలు.. మధ్యలో డివైడర్లు ఉండటంతో ముందునుంచి వాహనాలకు ఆస్కారమేలేదు.. ఎక్కడోగానీ మలుపులు లేకుండా నల్లత్రాచులా రోడ్లు.. మరోవైపు, ఆధునిక ఫీచర్లతో కార్లు.. ఏసీతో చుట్టూ చల్లదనం.. ఆడియో సిస్టం నుంచి మంద్రంగా సంగీతం.. దీంతో వేగంగా దూసుకుపోయే కార్లు.. ఇంకేముంది.. పెద్దగా శ్రమలేకుండానే ప్రయాణించవచ్చని అనుకుంటాం. కానీ, ఈ అత్యంత సౌకర్యవంతమైన డ్రైవింగ్ వెనుక ఓ పెనుముప్పు కూడా పొంచి ఉంది. అదే హైవే హిప్పోసిస్ స్థితి. ఇటీవల జాతీయ రహదారులపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలకు ప్రధాన కారణమిదే. తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ స్థితికి గురికాకుండా ఉండగలమని నిపుణులు సూచిస్తున్నారు. ఏమిటీ హైవే హిప్పోసిస్.. సాధారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కనురెప్పలు మూతపడి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. దీనికి హైవే హిప్పోసిస్ కాస్త భిన్నమైంది. పైన చెప్పుకున్నట్లు విశాలమైన హైవేలపై డ్రైవింగ్ సులభంగా మారింది. ఎదురుగా వాహనాలు రావు.. చాలా దూరం వరకు మలుపులు ఉండవు.. దీంతో కొంతదూరం వెళ్లిన తరువాత డ్రైవింగ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే డ్రైవర్ మెదడుకు పెద్దగా పనిఉండదు. ఫలితంగా మెదడు మెల్లగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆటోమేటిక్ వాహనాలైతే గేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి డ్రైవర్ మెదడుకు ఇంకా ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. ఈ స్థితిలో డ్రైవర్ నిద్రపోరు. కళ్లు తెరిచే ఉంటారు. స్టీరింగ్‌పై పట్టు ఉంటుంది. కానీ, పెద్దగా పనిలేకపోవడంతో డ్రైవర్ మెదడు మాత్రం నెమ్మదిగా విశ్రాంతిలోకి జారుకుంటుంది. ఈ స్థితినే హైవే హిప్పోసిస్ అంటారు. సాధారణంగా హైవేపై రెండు నుంచి మూడు గంటలు ప్రయాణం చేసిన తరువాత ఈ స్థితి ఏర్పడవచ్చు. అది కూడా రోజూ సాధారణంగా నిద్రించే సమయంలో ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ స్థితి ఆవహిస్తుంది. అంటే రాత్రి 10గంటల తరువాత నుంచి తెల్లవారుజాము మధ్యగానీ.. మ.2 గంటల నుంచి 4 గంటల మధ్య హైవేపై ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేటప్పుడు హైవే హిప్పోసిస్ స్థితి ఏర్పడుతుంది. ఇది 5–15 నిముషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో డ్రైవర్‌కు వాహనంపై నియంత్రణ ఉండదు. ఎదురుగా ఏదైనా వాహనాన్ని నిలిపి ఉంచితే చివరి నిముషం వరకు గుర్తించలేక ఢీకొడతారు. ఇలాగే ఎక్కువుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అలాగే, హైవేపై మలుపు వస్తే డ్రైవర్లు చివరి క్షణం వరకు గుర్తించలేరు. కారు రోడ్డు నుంచి పక్కకు వెళ్లిగానీ లేదా డివైడర్‌ను ఢీకొట్టి గానీ పల్టీలు కొడుతుంది. హైవేపై ఏదైనా ఫ్లైఓవర్గానీ, బ్రిడ్జ్గానీ వస్తే గుర్తించలేక రెయిలింగ్‌ను ఢీకొడతారు. హైవేపై జంక్షన్ల వద్ద రోడ్డుకు అడ్డంగా ఏదైనా వాహనంగానీ వ్యక్తులుగానీ వచ్చినా సరే గుర్తించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రొఫెషనల్ డ్రైవర్ల కంటే కూడా సాధారణ వ్యక్తులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువుగా ఈ స్థితికి గురవుతారు. 60 శాతం ప్రమాదాలకు ఇదే కారణం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం హైవే హిప్పోసిస్ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో కూడా హైవే హిప్పోసిస్ కారణంగానే 60 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిçÜ్తున్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నివేదిక తెలిపింది. కోల్‌కత–ఢిల్లీ జాతీయ రహదారిపై సంభవించిన రోడ్డు ప్రమాదాలపై ఎన్హెచ్ఏఐ చేసిన అధ్యయన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.12 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిల్లో 1.53 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా 3.84 లక్షల మంది గాయపడ్డారు. తగిన జాగ్రత్తలు పాటిస్తేనే.. హైవే హిప్పోసిస్కు గురికాకుండా ఉండేందుకు డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మన రోజువారి పనితీరుకు అనుగుణంగా మన మెదడు అలవాటు పడి ఉంటుంది. రోజూ సాధారణంగా నిద్రకు అలవాటైన సమయంలో డ్రైవింగ్ చేయకుండా చూసుకోవాలి. తప్పనిసరైతే మాత్రం నిపుణుల సూచనలు పాటించాలి. అవి ఏమిటంటే.. - సాధారణంగా రెండు గంటల డ్రైవింగ్ తరువాత హైవే హిప్పోసిస్ ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి 90 నిమిషాల డ్రైవింగ్ తరువాత డ్రైవర్ బ్రేక్ తీసుకోవాలి. కిందకు దిగి అటూ ఇటూ నడవాలి. ఎవరికైనా ఫోన్ చెయ్యొచ్చు. కాసేపు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడొచ్చు. దాంతో మెదడు మళ్లీ చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. తర్వాత మళ్లీ డ్రైవింగ్ మొదలుపెట్టొచ్చు. - గంటసేపు డ్రైవింగ్ తరువాత డ్రైవర్ తనకు తాను కాస్త అసౌకర్యం కలిగించుకోవాలి. కారులో ఏసీని ఆఫ్ చేయలి. దాంతో చెమటలు పడతాయి. కారు అద్దాలు కిందకు దించితే బయట నుంచి వేగంగా గాలి లోపలకి వచ్చి కాస్త చికాకు పెడుతుంది. దాంతో డ్రైవర్ సుఖవంతమైన స్థితి నుంచి బయటకు వచ్చి అసౌకర్యానికి గురవుతారు. దాంతో మెదడు మళ్లీ చురుగ్గా పనిచేస్తుంది. - డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ మిర్రర్, రియర్ మిర్రర్‌ను మాటి మాటికి చూస్తుండాలి. దాంతో కనుగుడ్లు అటూ ఇటూ తిరుగుతుండటంతో మెదడు చురుకుదనం సంతరించుకుంటుంది. - ప్రస్తుతం అధునాతన స్లీప్ మోనిటరింగ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కార్లు, వాహనాల్లో వాటిని ఏర్పాటుచేసుకోవాలి. స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ఫోన్లలోనూ ఇవి వస్తున్నాయి. ఇవి సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ శరీరంలో కాసేపు కదలికలు లేకపోతే వెంటనే బీప్ శబ్దంతో అప్రమత్తం చేస్తాయి. దాంతో హైవే హిప్పోసిస్ స్థితి నుంచి వెంటనే బయటకు రావచ్చు. - రోడ్డుపై దృష్టి సారించలేకపోతున్నామని గుర్తించగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాహనాన్ని నిలిపివేయాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, సురక్షిత దాబాలు, అనివార్యమైతే పెట్రోల్ బంకుల సమీపంలో వాహనాన్ని నిలిపి కాసేపు కునుకు తీయాలి. అనంతరం నిద్రలేస్తే మెదడు మళ్లీ చురుగ్గా పనిచేస్తుంది. -
‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత
సాక్షి, అమరావతి: ‘లైనే కదా అని దాటితే.. జరిమానా మోత మోగుతుంది..’ అంటోంది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ). హైవేలపై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. హైవేలతోపాటు రాష్ట్ర ప్రధాన రహదారులపై కూడా ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మార్కింగ్ లైన్లు దాటి వాహనాలు ప్రయాణిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. 2022లో హైవేలపై భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించడంతో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో 8,200 మంది దుర్మరణం చెందారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రధానంగా భారీ వాహనాలు మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణిస్తుండటం ప్రమాదాలకు దారితీస్తోందని గుర్తించారు. మార్కింగ్ లైన్లు దాటి ప్రయాణించే వాహనాలపై ఎన్హెచ్ఏఐ భారీ జరిమానాలను ఖరారుచేసింది. భారీ వాహనాలు కచ్చితంగా హైవేలపై ఎడమలైన్‌లోనే ప్రయాణించాలి. ముందు నెమ్మదిగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయాల్సి వస్తే తప్ప లైన్ దాటడానికి వీల్లేదు. అలా ఓవర్టేక్ చేసిన వెంటనే మళ్లీ ఎడమవైపు లైన్లోకి వచ్చేయాలి. అలాకాకుండా ఒక 200 మీటర్లకు మించి ఎడమవైపు లైన్‌ను దాటి ప్రయాంచే భారీ వాహనాలపై తొలిసారి రూ.500 జరిమానా విధిస్తారు. అదే వాహనం తరువాత లైన్ క్రాస్‌చేస్తే ప్రతిసారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తారు. నిబంధనలు పాటించాలి భారీ వాహనాలు కచ్చితంగా నిబంధనలను పాటించేలా హైవే పెట్రోలింగ్ అధికారులు కన్నేసి ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించిన వాహనాలతోపాటు హైవేలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల పుటేజీలను తరచూ పరిశీలించి నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధిస్తారు. రాష్ట్ర రహదారులపైన కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని కేంద్ర రవాణాశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందుకుగాను రాష్ట్ర ప్రధాన రహదారులపై వాహనచోదకులకు మార్గనిర్దేశం చేసేలా సైన్ బోర్డులు, లైన్ మార్కింగులు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త జరిమానాల విధానం అమలు చేయాలని చెప్పింది. ఈ లోపు రాష్ట్ర ప్రధాన రహదారులపై సైన్ బోర్డులు, లైన్ మార్కింగ్‌లు పూర్తిచేయాలని సూచించింది. -
స్మార్ట్ హైవేలుగా మన జాతీయ రహదారులు.. ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ!
సాక్షి, అమరావతి: మన జాతీయ రహదారులు త్వరలో స్మార్ట్ హైవేలుగా రూపాంతరం చెందనున్నాయి. దేశంలో జాతీయ రహదారుల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) లైన్లు వేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. రూ.6వేల కోట్లతో 25వేల కి.మీ. మేర ఓఎఫ్సీ లైన్ల ఏర్పాటుకు భారీ ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ‘గతి శక్తి ప్రాజెక్టు’ కింద ఈ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్)తో కలసి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) స్మార్ట్ హైవేలు/డిజిటల్ హైవేల ప్రాజెక్ట్ కార్యాచరణకు ఉపక్రమించింది. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ముంబై–ఢిల్లీ, హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారులలో 2వేల కి.మీ.మేర ఓఎఫ్సీ లైన్ల పనులు చేపట్టనుంది. ఇందుకోసం రూ.500కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచింది. అనంతరం చెన్నై–విజయవాడ, ముంబై–అహ్మదాబాద్ జాతీయ రహదారుల్లో 5వేల కి.మీ. మేర పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. బహుళ ప్రయోజనకరంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు ఇవీ... ► బహుళ ప్రయోజనకరంగా స్మార్ట్ హైవేల ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 2050నాటికి విస్తృతం కానున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ► దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ రహదారుల వెంబడి నిరంతరాయంగా 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగాన్ని విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుంది. ► 5జీ సేవల కోసం ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఓఎఫ్సీ లైన్లు వేసేందుకు వివిధ అనుమతులు పొందేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. అందుకే జాతీయ రహదారుల వెంబడి కేంద్ర ప్రభుత్వమే డార్క్ ఫైబర్ కనెక్టివిటీని ఏర్పరచడానికి ఓఎఫ్సీ లైన్లు వేయాలని నిర్ణయించింది. ► హైవేల వెంబడి అవసరమైన చోట్ల ఓఎఫ్సీ లైన్లను నిర్ణీత ఫీజు చెల్లించి ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు వాడుకునేందుకు ట్రాయ్ సమ్మతిస్తుంది. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ఓఎఫ్సీ లైన్లను ఉపయోగించేందుకు వీలుగా ఏర్పాటుచేస్తారు. ► దేశవ్యాప్తంగా త్వరలో టోల్ గేట్లను ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. టోల్ గేట్లు లేకుండా 5జీ నెట్వర్క్ సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఓ వాహనం జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే శాటిలైట్ ఆధారిత పరిజ్ఞానంతో ఆటోమేటిగ్గా టోల్ ఫీజు వసూలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రహదారుల వెంబడి 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికి కూడా ఓఎఫ్సీ లైన్లు ఉపయోగపడతాయి. ► జాతీయ రహదారులపై భద్రత, నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కూడా ఈ ఓఎఫ్సీ లైన్లు ఉపకరిస్తాయి. ► రహదారి భద్రతా చర్యల్లో భాగంగా జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ రాడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఓఎ‹సీ లైన్లు ద్వారానే స్పీడ్ రాడార్లు పనిచేస్తాయి. ► జాతీయ రహదారుల వెంబడి దశలవారీగా స్మార్ట్ హైవే లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఓఎఫ్సీ లైన్లు దోహదపడతాయి. -
‘లైట్’ తీస్కోవద్దు.. హెడ్ లైట్లు, వెనక లైట్లు వేసుకోని వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట రహదారులు రక్తమోడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా హైవేలపై ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కనీసం పలువురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఉదయం పూట మంచు కురిసే వేళలో సరైన జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడంతోనే తెల్లవారుజామున ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఉదంతంలోనూ పొగమంచే ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే చలికాలం మొదలైంది. మరో రెండు మూడు నెలల పాటు చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటే దట్టమైన పొగ మంచు కూడా కమ్ముకొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైవేలపై వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లైట్ ఆర్పితే అంతే సంగతులు.. ►దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్న సమయంలో వాహనాలను నడిపేటప్పుడు కచ్చితంగా హెడ్లైట్లు వెలుగుతూనే ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. ►ప్రధాన రహదారులపై డివైడర్ల వల్ల ఎదురెదురు వాహనాలు ఢీకొనే అవకాశం తక్కువగానే ఉండొచ్చు. కానీ సరైన వెలుతురు లేకపోవడం వల్ల డివైడర్లే మృత్యు ఘంటికలు మోగించే ప్రమాదం ఉంది. పొగమంచు కమ్ముకొని ఉన్నప్పుడు లైట్లు ఆర్పినా, కాంతి తక్కువగా ఉన్నా డివైడర్లను గుర్తించడం కష్టమవుతోంది. ►సాధారణంగా హైవేలపై కార్లు, ఇతర వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల వరకు 50 నుంచి 60 కి.మీ వేగం మించకుండా వాహనాలను నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. వెనక లైట్లూ వెలగాలి.. ►రోడ్డు పక్కన బండి నిలిపి ఉంచినప్పుడు హెడ్ లైట్లతో పాటు, వెనుక లైట్లు కూడా వెలుగుతూ ఉండాలి. దీనివల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిలిపి ఉంచిన వాహనం ఉనికిని ఈజీగా గుర్తించేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో ప్రమాదాలను నివారించవచ్చు. ►వాహనం చుట్టూ రేడియం టేప్ తప్పనిసరి. దీనివల్ల మంచు కురిసే సమయంలోనూ వాహనం ఉనికి తెలుస్తుంది. చాలా వరకు వాహనదారులు ఈ చిన్న నిబంధనను పాటించకపోవడంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయాలు శ్రేయస్కరం.. చలికాలంలో పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మంచు కారణంగా ఎదుటి వాహనాలు కనిపించక వాహనాలు ఢీకొట్టుకోవటం, రోడ్డు సరిగా కనిపించక వాహనాలు దారితప్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు వాహనదారులకు పలు సూచనలు చేశారు. రాత్రి 10.30 లోపు, ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే ప్రయాణించాలన్నారు. రెండేళ్ల కాలంలో 50 మంది మృత్యువాత.. గత రెండేళ్లలో శీతాకాలంలో రోడ్డు ప్రమాదాల డేటాను ఆయన విశ్లేషించారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల వెంబడి కుటుంబ సబ్యులతో వాహనాల్లో ప్రయాణించడం ఇబ్బందికర విషయమన్నారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేయాల్సి వస్తే.. సొంత డ్రైవింగ్ కాకుండా నైపుణ్యం ఉన్న డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లడం ఉత్తమం. అది కూడా డ్రైవర్‌కు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలని సూచించారు. ‘బే’లలోనే పార్కింగ్.. ట్రక్లు, ఇతరత్రా పెద్ద వాహనదారులు శీతాకాలంలో ఓఆర్ఆర్, హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపకూడదు. రాత్రి సమయంలో విశ్రాంతి కోసం తప్పనిసరి పరిస్థితులలో వాహనాలను నిలపాల్సి వస్తే... రోడ్డు నుంచి పూర్తిగా ఎడమ వైపు తీసుకొని వాహనాలను పార్కింగ్ చేయాలి. ఓఆర్ఆర్, హైవేలపై కేటాయించిన పార్కింగ్ బే, లైన్లలోనే ఆయా వాహనాలను నిలిపివేయాలి. లేకపోతే పొంగమంచుతో ప్రయాణిస్తున్న చిన్న వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంది. నిద్ర మత్తు వీడాలి.. ► తెల్లవారుజామున జరిగే ప్రమాదాల్లో డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండడం కూడా మరో కారణం. సాధ్యమైంత వరకు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు వానాలను నడపకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే డ్రైవర్ పూర్తిగా ఆరోగ్యంగా ఎలాంటి నిద్రమత్తు లేకుండా ఉండాలి. ► రెప్పపాటు క్షణంలోనే ప్రమాదాలు జరుగుతాయి. ఒకవైపు మంచు కురుస్తుండగా, మరోవైపు నిద్రమత్తుతో బండి నడిపితే రోడ్డు ప్రమాదాలకు మరింత ఊతమిచ్చినట్లవుతుందని డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ హెచ్చరించారు. -
టోల్ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..!
చౌటుప్పల్ రూరల్, బీబీనగర్: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్–వరంగల్ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు -
ఎలక్ట్రిక్ హైవేలు కమింగ్ సూన్: కేంద్రం భారీ కసరత్తు
న్యూఢిల్లీ: సౌరశక్తిని వినియోగించుకుని భారీ ట్రక్కులు, బస్సుల చార్జింగ్కు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశీయంగా విద్యుత్‌తోనే నడిచే విధంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉపరితలంపై ఉన్న విద్యుత్ లైన్స్‌తో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలకు కూడా చార్జింగ్ కోసం విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దే రోడ్లను ఎలక్ట్రిక్ హైవేగా పరిగణిస్తారు. మరోవైపు, టోల్ ప్లాజాల్లో కూడా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. మౌలిక సదుపాయాలను పటిష్టంగా అభివృద్ధి చేస్తే ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని, కొత్త వ్యాపారాలు.. ఉద్యోగాల కల్పనకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. భారత లాజిస్టిక్స్, రోప్‌వేలు, కేబుల్ కార్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. అలాగే, చౌకైన, విశ్వసనీయమైన ఎలక్ట్రోలైజర్లు, హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా కంపెనీ సహకారం అందించాలని ఆయన కోరారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లకు మించి రాబడులు లభించేలా ఇన్విట్ వంటి వినూత్న పథకాలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వాడకాన్ని బట్టే టోల్ ఫీజు.. టోల్ ప్లాజా రద్దీని తగ్గించేలా నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. అలాగే, టోల్ రహదారులపై ప్రయాణించినంత దూరానికి మాత్రమే వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వివరించారు. టోల్ బూత్‌ల దగ్గర వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా, అలాగే రహదారిని ఉపయోగించినంత దూరానికే చెల్లింపులు జరిగేలా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ కెమెరాల టెక్నాలజీ ఉపయోగపడగలదని మంత్రి పేర్కొన్నారు. 2018-19లో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల నిరీక్షణ సయమం సగటున 8 నిమిషాలుగా ఉండగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టాక 2021-22లో ఇది 47 సెకన్లకు తగ్గిందని గడ్కరీ చెప్పారు. నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గినప్పటికీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్దిష్ట సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే జాతీయ రహదారుల పైనా, ప్రస్తుతం ఉన్న 4 పైగా లేన్ల హైవేలపైనా అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (ఏటీఎంఎస్) ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2024నాటికి జాతీయ రహదారులపై 15వేల కి.మీ. మేర ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ సిస్టంను(ఐటీఎస్) అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. -
2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ
Nitin Gadkari Said We All Must Be Aligned to Be Carbon Neutral Country by 2070: ఇటీవల COP-26 శిఖరాగ్ర సమావేశంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నిబద్ధతకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అంతేకాదు 2070 నాటికి ఎటువంటి ఉద్గారాలు లేని లేదా కార్బన్-న్యూట్రల్ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ కృషి చేయాలన్నారు. ఐసీసీకి చెందిన ఏజీఎం అండ్ వార్షిక సెషన్లో భారత్ @ 75 ''ఎంపవరింగ్ ఇండియా: టుమారో ఫర్ టుమారో''పై మంత్రి ప్రసంగిస్తూ, అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు డిజిటలైజేషన్‌ను వంటి వాటితో దేశంలో సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రయాణంలో మన ప్రభుత్వం రేపటిని నిర్మించే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్న మలుపులో మేము నిలబడి ఉన్నాం. ఇది మన నేటి కంటే చాలా శక్తివంతమైనది. ఆత్మనిర్భర్ ఈ వాతావరణాన్ని తట్టుకోగలదు." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వం గ్రీన్ హైవే మిషన్ కింద జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకం గొప్ప సరికొత్త మార్పిడిగా అభివర్ణించారు. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పెట్టుబడుల ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఈ మేరకు కారిడార్‌లో లాజిస్టిక్స్ పార్కులు, స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ పార్కులను నిర్మించడంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టవచ్చని అన్నారు. అంతేకాక భారతమాల ఫేజ్ 1, 2 కింద 65,000 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. భారత్‌మాల ఫేజ్-1 కింద సుమారు 35,000 కి.మీ హైవేలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉందని, మొత్తం మూలధన వ్యయం ₹. 10 లక్షల కోట్లు అని వెల్లడించారు. పైగా 20 వేల కి.మీ.లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయన్నారు. అయితే 2025 నాటి కల్లా 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందంటూ గడ్కరీ చెప్పుకొచ్చారు. -
ఎలక్ట్రిక్ వెహికిల్స్ క్రేజ్,కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
న్యూఢిల్లీ:జాతీయ రహదారుల వెంట ఎలక్ట్రిక్ వాహనాలకు సౌలభ్యత కలిగించడానికి చార్జింగ్ మౌలిక వ్యవస్థను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని వివరించారు. ఒక వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోవిడ్–19 నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న ఆటోమొబైల్ పరిశ్రమ, క్రమంగా రికవరీ చెందుతుండడం తనకు సంతోషం కలిగిస్తోందని తెలిపారు. భారత్ జీడీపీ వ్యవస్థలో ఆటో రంగం వాటా 7.1 శాతం అని ఆయన పేర్కొంటూ, తయారీ జీడీపీ విషయంలో 49 శాతం వాటా కలిగి ఉందని తెలిపారు. వార్షిక టర్నోవర్ రూ.7.5 లక్షల కోట్లుకాగా, ఎగుమతుల విలువ రూ.3.5 లక్షల కోట్లని వివరించారు. జూలై 2021లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు నెలవారీగా 229 శాతం పెరిగి 13,345 యూనిట్లకు చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. వార్షికంగా చూస్తే 836 శాతం పురోగతి ఉందని వివరించారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన అంశమని పేర్కొన్నారు. రవాణా రంగం విషయంలో పర్యావరణ పరిరక్షణ విధానాలకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. చదవండి: ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ బైక్.. ధర రూ.40 వేలు మాత్రమే -
హైవేల పక్కనే టౌన్‌షిప్‌లు : నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు.రూ .2.5 లక్షల కోట్ల విలువైన టన్నెల్స్‌ను నిర్మించాలని తమ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని మంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాల నిధులను ఈ ఏడాది 34 శాతం పెంచిందనీ, రూ. 5.54 లక్షల కోట్లు మేర పెంచినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరగడం కరోనా మహమ్మారి సమయంలో ఉపాధిని సృష్టించడానికి సహాయపడుతుందని గడ్కరీ పేర్కొన్నారు. -
కేంద్రం కొత్త పథకం.. రియల్టీలో జోష్..
న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యం తో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. -
అతి వేగానికి బ్రేకులు..
సాక్షి, అమరావతి: జాతీయ రహదారులపై అతి వేగంతో దూసుకెళ్లే వాహనాలకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. నిర్దేశించిన వేగ పరిమితిని దాటితే భారీ జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణా, పోలీస్ శాఖలు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం హైవేలపై టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఎంత వేగంతో వాహనం ప్రయాణిస్తుందో తెలుసుకోనున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని పోలీసులు రహదారి భద్రత కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రహదారి భద్రత నిధి నుంచి రూ.6 కోట్లతో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను కొనుగోలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం పోలీస్ శాఖ నుంచి ఓ అధికారిని నామినేట్ చేయాలని కోరింది. హైవేలపై నిర్దేశించిన వేగానికి అనుగుణంగానే ఇకపై వాహనాలను నడపాల్సి ఉంటుంది. ఇప్పటివరకు హైవేలపై గంటకు 80 కి.మీ. వేగంతో కార్లు వెళ్లేందుకు అనుమతి ఉండగా, దాన్ని 100 కి.మీ.కు. ద్విచక్ర వాహనాలకు 60 కి.మీ. నుంచి 80 కి.మీ.కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. బస్సులు, లారీలు కూడా గంటకు 80 కి.మీ. వేగంలోపే ప్రయాణించాల్సి ఉంటుంది. హైవేలపై ఆటోలు ప్రయాణించడానికి వీల్లేదు. అయినా కొన్నిచోట్ల ఆటోలు హైవేలపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ల ద్వారా వేగ నిర్ధారణ హైవేలపై వాహనాలు ఎంత వేగంతో వెళుతున్నాయో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు అంచనా వేస్తాయి. ఒక టోల్‌ప్లాజా నుంచి మరో టోల్‌ప్లాజాకు ఎంత సమయంలో చేరుతున్నాయో శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. దీన్నిబట్టి అతివేగానికి భారీ జరిమానాలు విధించనున్నారు. తొలుత ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా), ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్) మధ్య ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకే.. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని దీనిపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో జాతీయ రహదారులపై 38 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ–విశాఖ (ఎన్‌హెచ్–16), విజయవాడ–హైదరాబాద్ (ఎన్‌హెచ్–65) మధ్య హైవేలపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అంచనా. గతేడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు మొత్తం 17,910 జరిగితే 7,059 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో విజయవాడ–విశాఖ మధ్య 6,843 రోడ్డు ప్రమాదాల్లో 1,866 మంది, విజయవాడ–హైదరాబాద్ మధ్య 4,589 రోడ్డు ప్రమాదాల్లో 1,235 మంది మృతి చెందారు. అతివేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమంటున్న రవాణా శాఖ ఇక వేగ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టనుంది. స్పీడ్ గన్లు, టోల్‌ప్లాజాల్లో బ్రీత్ అనలైజర్లతో తనిఖీలు చేసి వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. చదవండి: పట్టణాలకు కొత్తరూపు మారుమూల పల్లెలకు బడిబస్సులు -
హైదరాబాద్ రాకపోకలకు ‘హైవే’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కురిసిన భారీ వర్షం హైవే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగించింది. వివిధ జాతీయ రహదారులపై నగరానికి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ హైవేలపై పలుచోట్ల వరద ప్రవహిస్తుండటంతో హైదరాబాద్ చేరుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కొన్ని చోట్ల వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగరంలోకి వచ్చేలా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉంటూ వెళ్లిన పరిస్థితి కనబడింది. ఎక్కడెక్కడ ఎలా అంటే... ►జాతీయ రహదారి 44 (బెంగళూరు హైవే) అరాంఘర్–శంషాబాద్ మార్గం గగన్ పహాడ్‌లోని అప్పా చెరువు కట్ట తెగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలైతే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గగన్ పహాడ్ అండర్‌పాస్ రహదారి సగం వరకు కొట్టుకుపోయిందన్న సమాచారంతో.. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ►వరంగల్ హైవేలోని ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాచకొండ పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను ఘట్కేసర్ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్‌వైపు మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను నాగోల్, బండ్లగూడ మీదుగా ఓఆర్ఆర్ ద్వారా ఘట్‌కేసర్‌వైపు మళ్లించారు. ►నాగపూర్ హైవే మార్గంలోనూ వాహన రాకపోకలకు తిప్పలు తప్పలేదు. భారీ వర్షంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద పనులు జరుగుతున్న అండర్‌పాస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనాలను తూప్రాన్, నాచారం, గజ్వేల్, ములుగు, కిష్టాపూర్ మీదుగా మేడ్చల్ చెక్‌పోస్టుకు మళ్లించారు. తిరుగు ప్రయాణంలోనే అదే మార్గంలో వాహనాలను అనుమతించారు. ►అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెడ్డికుంట చెరువు తెగి.. విజయవాడ హైవే మార్గంలోని ఇమామ్‌గూడ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడ మరమ్మతులు చేసి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూశారు. ►శ్రీశైలం హైవేలోనూ రహదారులపై వరద నీరు ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నింపాదిగా కలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిగిలిన జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ వరద వల్ల వెతలు తప్పలేవు. రాజధానిలోనూ తిప్పలు... భారీ వర్షం వల్ల హైదరాబాద్ రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ఫ్లైఓవర్ ఎక్కకుండా సెవెన్ టూంబ్స్ రోడ్డు మీదుగా వెళ్లాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలు షేక్‌పేట, సెన్సార్ వల్లీ, ఫిల్మ్‌నగర్, బీవీబీ జంక్షన్ , బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 మీదుగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు, మలక్‌పేట ఆర్యూబీ పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలను అనుమతించకపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
129 దాబాలకు అనుమతి
సాక్షి, అమరావతి: అత్యవసర వస్తువుల సరఫరాకు వాహనాలను అనుమతిస్తుండటంతో రహదారుల్లో వారికి ఆహార ఇబ్బందులు తలెత్తకుండా పరిమిత సంఖ్యలో దాబాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 129 దాబాలను ప్రారంభించడానికి అనుమతిచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఇవి కేవలం రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసమేనని, సాధారణ జనాన్ని అనుమతించడానికి వీలులేదన్నారు. ఈ దాబాల్లో పరిశుభ్రత, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వీటిని పర్యవేక్షించే బాధ్యతను ఆయా జిల్లాల జీఎంలకు అప్పచెప్పినట్లు రజత్‌భార్గవ తెలిపారు. అనుమతులు ఇలా... ► అత్యవసర సేవలు, నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలకు.. ► పండ్లు, కూరగాయలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు... ► నిరంతరాయంగా పనిచేయాల్సిన పరిశ్రమలకు ముడి సరుకు తరలించేందుకు... ► లాక్డౌన్ సమయంలో ఫార్మా, ఆహార శుద్ధి రంగాలకు చెందిన పరిశ్రమలు పనిచేయడానికి అనుమతించడంతో వాటికి సంబంధించిన వాహనాలకు. -
ఎన్డీఎంసీ రోడ్ల నిర్వహణపై పరిశీలన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మున్సి పల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పరిధిలోని రహదారుల మెరుగైన నిర్వహణ, అభివృద్ధి విధానా లను పరిశీలించడానికి జీహెచ్ఎంసీ ఇంజనీర్ల బృందం శనివారం ఇక్కడ పర్యటిం చింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి అర వింద్‌కుమార్ ఆదేశాల మేరకు ఎన్డీఎంసీ ఇంజనీర్లతో తెలం గాణ భవన్ ఆర్సీ గౌరవ్ ఉప్పల్, జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సమావేశ మయ్యారు. ఇక్కడి తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో రహదారుల నాణ్యత, మరమ్మతులకు స్పందించే విధి విధా నాలను ఎన్డీఎంసీ ఇంజనీర్లు వివరించారు.ఎన్డీఎంసీ పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బం ది రహదారుల నిర్వహణకు వాడే సామగ్రి, వాహనాల వివరాలు, సబ్‌వేల ఏర్పాటు, వాహనాల వేగం తగ్గించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు. నిల్వ నీటిని తొలగించే విధానం, రోడ్ కటింగ్‌లో పాటించే నిబంధనలు, కాలనీ రోడ్ల నిర్వహణ, ప్రతి ఇంటి ముందు రోడ్లకు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, బస్ షెల్టర్లు, సమాచార చిహ్నాల ఏర్పాటు, నీటిపారుదల వ్యవస్థ, కమ్యూ నికేషన్ వైరింగ్ గురించి జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు వివరించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు ఆర్.శ్రీధర్, మొహమ్మద్ జియా ఉద్దీన్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు ఆర్.శం కర్ లాల్, టి.రవీంద్రనాథ్, పి.అనిల్ రాజ్ పాల్గొన్నారు. కాగా, ఎన్డీఎంసీ నుంచి చీఫ్ ఇంజనీర్ సంజయ్ గుప్తా, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్‌పీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేఎమ్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆర్కే శర్మ పాల్గొన్నారు. -
గ్రేటర్ రోడ్లు ప్రైవేటుకు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని పేరెన్నికగన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చేపట్టనున్నాయి. భారీ ఫ్లైఓవర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులతోసహా వివిధ ఇంజనీరింగ్ పనుల్లో పేరుగాంచిన సంస్థలు ఇకపై నగర రోడ్ల నిర్వహణ పనులు చేయనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 9వేల కిలోమీటర్లకు పైగా రోడ్లుండగా, ప్రధాన మార్గాల్లో దాదాపు 3 వేల కిలోమీటర్లు ఉన్నాయి. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్, తదితర పనుల కోసం జీహెచ్ఎంసీ ఏటా రూ. 500– 600 కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ రోడ్లు ఎప్పుడూ గుంతల మయమే. అధ్వానపు రోడ్లతో ప్రజలకు అవస్థలేకాకుండా, సామాజిక మాధ్యమాల్లో నిత్యం ప్రభుత్వంపై విమర్శలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకివ్వాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. విధివిధానాలు రూపొందించేందుకు జీహెచ్ఎంసీలోని ముగ్గురు చీఫ్ ఇంజనీర్లతోపాటు, పబ్లిక్‌హెల్త్ మాజీ ఈఎన్సీని కమిటీ సభ్యులుగా నియమించారు. దీనికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ముందుగా పేరెన్నికగన్న పలు కంపెనీలతో కమిటీ సమావేశం నిర్వహించింది. వందలు, వేల కోట్ల భారీ ప్రాజెక్టులు చేసే పెద్ద కంపెనీలు రోడ్ల నిర్వహణకు ఒప్పుకుంటాయా అనే అనుమానాలున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించేందుకు అంగీకరించాయి. ఆయా సంస్థలు రోడ్లను పరిశీలించాక, మరోమారు జరిగే సమావేశంలో టెండర్లలో పొందుపరిచే అంశాలు, నిబంధనలు, నిర్వహణ వ్యయం తదితర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. అది పూర్తయ్యాక టెండర్లను ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ప్రీబిడ్ సమావేశాలు పూర్తిచేసి టెండర్లలో అర్హత పొందే కంపెనీకి రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. సాఫీ ప్రయాణమే లక్ష్యం.. రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సిమెంట్ కాంక్రీట్ వేస్తారా లేక బీటీనా అన్న విషయంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలపాటు రోడ్లు సవ్యంగా, ప్రయాణానికి సాఫీగా ఉండేలా నిర్వహించడం నిర్వహణ చేపట్టే సంస్థ పని. వర్షాలు తదితర కారణాల వల్ల పెద్ద గుంతలు ఏర్పడ్డా, ఇతరత్రా దెబ్బతిన్నా, 24 నుంచి 48 గంటల్లో మరమ్మతులు పూర్తిచేయాలి. వివిధ సంస్థల అవసరాల కనుగుణంగా రోడ్ కటింగ్‌లకు అనుమతులిచ్చే అధికారం, ఆ తర్వాత త్వరితంగా తిరిగి పూడ్చటం వంటివాటిపై కాంట్రాక్టు సంస్థకే అధికారం ఉంటుంది. తొలిదశలో 687 కి.మీ.లు తొలిదశలో జోన్ల వారీగా ఎక్కువ వాహనరద్దీ ఉండే ప్రధాన మార్గాలను గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 687.43 కి.మీ.ల రద్దీ రోడ్లు ఉన్నాయి. జోన్ల వారీగా రోడ్ల నిర్వహణ కోసం యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఏఎంసీ) పేరిట వీటికి టెండర్లు ఆహ్వానించనున్నారు. -
సామాన్యుల నుంచే ‘టోల్’ తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రహదారులపై టోల్ ట్యాక్స్ వసూళ్ల నుంచి మినహాయింపు పొందిన వీఐపీలు, వీవీఐపీల వివరాలు అందజేయాలని ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు వసూలు చేయొద్దంటూ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది డి.విద్యాసాగర్, ఇతరులు దాఖలు చేసిన పిల్‌ను శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వీవీఐపీల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని, సామాన్యుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని పిటిషనర్ న్యాయవాది శశికిరణ్ పేర్కొన్నారు. ఎవరెవరికి మినహాయింపు ఇచ్చారో పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. విచారణను ధర్మాసనం నాలుగు వారాలు వాయిదా వేసింది. -
ట్రాఫిక్.. ట్రాక్‌లో పడేనా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తగ్గట్లు రహదారులు పెరగకపోవడం, చాలాచోట్ల రోడ్లపై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడంతో నగరవాసికి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలపై అధ్యయనం కోసం ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు బెంగళూరుకు పంపనున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ మంచి ఫలితాలిస్తూ ట్రాఫిక్ పోలీసులకు వరంగా మారిన ‘బీ–ట్రాక్’ (బెంగళూరు ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్)ను సిటీలో అమలు చేస్తే ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఈ క్రమంలో నగరంలోని రద్దీ ప్రాంతాలపై ఓ లుక్కేద్దామా.. -
రహదారుల రక్తదాహం
సాక్షి, హైదరాబాద్: రహదారులు రక్తమోడుతున్నాయి.. రోడ్డుమీద రయ్యిమని దూసుకుపోతున్న వాహనాలు క్షణాల్లో ప్రమాదాల తలుపు తడుతున్నాయి. ఇష్టానుసారంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు కారణమవుతూ నేరుగా ప్రయాణికులను యమపురికి చేరుస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు రోడ్డు భద్రతా అధికారులు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ఏటా నాలుగు లక్షలకుపైగా ప్రమాదాలు జరుగుతుండగా, 1.6 లక్షల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది గాయాల పాలవుతున్నారు. వేలాదిమంది వికలాంగులుగా మిగులుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణలో సాలీనా దాదాపు ఆరువేల మంది ప్రజలు మరణిస్తున్నారు. జనవరి 1 నుంచి మే 16 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా రోజుకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా అందులో దాదాపు 17 మంది మరణిస్తున్నారు, 64 మంది గాయపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది రోజుకు మరణించిన వారి సంఖ్య సగటున 18 ఉండటం గమనార్హం. వేగం తొలికారణం గత పదేళ్లుగా వాహనరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. దీనికితోడు చక్కటి రోడ్లు, జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో రోడ్డు మీద వ్యక్తిగత వాహనాలు కూడా తక్కువగా ఉండేవి. నేడు హైదరాబాద్‌లోనే కాక జిల్లా ల్లోనూ వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. పెరిగిన వాహన సామర్థ్యం కూడా ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. 2000 నుంచి 5000 సీసీల వరకు సామర్థ్యమున్న కార్లు రోడ్ల మీదకు వస్తునాయి. ఇక బస్సుల్లోనూ అంతే. వాహనాల వేగం కనీసం 100 నుంచి 120 కి.మీ.ల స్పీడుకు తగ్గకుండా వెళ్తున్నారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు గురైతే.. ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. దీనికితోడు ఫిట్‌నెస్‌లేని రవాణా వాహనాలు రోడ్ల మీద తిరగడం కూడా ప్రమాదాలకు మరో ప్రధాన కారణం. కొండగట్టు ప్రమాదంలో ఏకంగా 64 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అప్పటికే ఆ బస్సు 13 లక్షల కిలోమీటర్లు తిరిగి ఫిట్నెస్ లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ప్రైవేటు ట్రావెల్స్ స్పీడ్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీళ్లు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఆత్రుతతో 120 నుంచి 150 కి.మీ.ల స్పీడుతో బస్సులను నడుపుతున్నారు. 2013లో డ్రైవర్ అతివేగానికి పాలమూరులో బస్సు కల్వర్టును ఢీకొట్టినప్పుడు కూడా 40 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఏటేటా రోడ్డు ప్రమాద మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతేడాది మొత్తం 6,603 మంది వివిధ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా 2019లో మే 17వ తేదీవరకు 2,403 మంది విగతజీవులుగా మారారు. ఈ ఏడాది ముగిసేందుకు మరో ఏడునెలల సమయం ఉంది. ఈ లెక్కన గతేడాది కంటే అధిక ప్రమాదాలు నమోదయ్యే అవకాశం ఉందని రోడ్ సేఫ్టీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా.. ప్రమాదాలు.. తాజాగా తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై రోడ్‌సేఫ్టీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు, కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీమ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి– కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో జనవరి 1 నుంచి మే 17 వరకు చోటు చేసుకున్న వివిధ రోడ్డు ప్రమాదాలు జాబితా సిద్ధమైంది. మరణించినవారి, క్షతగాత్రుల వివరాలు కూడా పొందుపరిచారు. 263 ప్రమాదాలు, 274 మంది మరణాలతో సైబరాబాద్ రాష్ట్రంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతంగా నమోదవ్వగా, అతి తక్కువగా 28 ప్రమాదాలు, 28 మంది మరణాలు కుమ్రంభీం జిల్లాలో నమోదయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. మే 16వ తేదీనే తెలంగాణలో 72 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 16 మంది మరణించారు. 59 మంది గాయపడ్డారు. -
రహదారికి దారేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వీటి మరమ్మతులపై అధ్యయనం చేసిన రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ.. ఉమ్మడి జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఆర్అండ్బీ ఉన్నతాధికారులు నష్టాన్ని అంచనా వేశారు. ఈ మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 5 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటికి తక్షణమే మరమ్మతులు అవసరమని భావించి.. అంచనాలను రూపొందించారు. దాదాపు రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. 5 వేల కిలోమీటర్లు.. వాస్తవానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిధిలో దాదాపుగా 26,935 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వీటిలో జాతీయ (2,690 కిలోమీటర్లు), రాష్ట్ర (3,152), మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (12,079) అదర్ డిస్ట్రిక్ట్ రోడ్లు (9,014) ఉన్నాయి. ఇందులో దాదాపు 5,000 కిలోమీటర్లకుపైగా రోడ్లకు తక్షణమే మరమ్మతులు అవసరం. మరమ్మతుల కోసం గత నెలలో దాదాపు రూ.300 కోట్లు మేర అంచనాలను రూపొందించి పంపినా, ఇంతవరకూ ఆమోదం పొందలేదు. దీంతో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు గతుకుల రోడ్లపై నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లోని వివిధ రహదారులకు చాలా చోట్ల ప్యాచ్‌వర్కులు అత్యవసరం. గుంతలు, గతుకులతో చాలా చోట్ల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీటికి సరైన సమయంలో మరమ్మతులు నిర్వహించకపోతే.. పరిస్థితి మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఇంకొన్ని రోజులు వేచి చూసి.. ప్రభుత్వం నుంచి అప్పటికీ ఆమోదం రాకపోతే అత్యవసర నిధుల నుంచి కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. మరీ ఇబ్బందికరంగా ఉన్న చోట అత్యవసర నిధులు కేటాయించి మరమ్మతులు మొదలుపెడతామని చెబుతున్నారు. -
యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులపై మంగళవారం ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల నష్టంపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రూ.800 కోట్ల పనులు మంజూరు ‘కేంద్ర రహదారుల నిధి నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 668.48 కిలోమీటర్ల నిడివిగల 53 రహదారుల పనులకు కేంద్రం రూ.800 కోట్ల నిధులను మంజూరు చేసింది. సీఎం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఈ నిధులు విడుదలయ్యేలా కృషి చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఖరారు చేయండి. 24 నెలల్లోగా వీటిని వినియోగించకపోతే.. నిధులు వెనక్కి వెళతాయి’అని మంత్రి అన్నారు. భారీ వర్షాలకు వంతెనలు తెగిపోయినపుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసే బ్రెయిలీ బ్రిడ్జీలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమవుతాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం వీటిని సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే రాష్ట్రంలో ఆలనాపాలనా లేని పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోన్న ఎన్జీవోలను తనిఖీలు చేసి వారంలోగా నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. దీనికోసం ఉన్నతస్థాయి అధికారి నేతృత్వంలో కమిటీని వేయాలని సూచించారు. ఎన్జీవోల్లో అధికారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ జగదీశ్వర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
అప్పుతోనే ‘డబుల్’ నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడింది. ఈ ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు అవసరముండగా.. తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,500 కోట్లే కేటాయిం చింది. గతేడాది రూ.500 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని ఈసారి మూడు రెట్లకు పెంచింది. రాష్ట్రవ్యా ప్తంగా 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు 9,522 ఇళ్లను పూర్తిచేసింది. 1,68,981 ఇళ్లు ఇంకా వివిధ స్థాయిలో ఉన్నాయి. హడ్కో నుంచి పెద్ద ఎత్తున రుణం తీసుకుని దాన్ని దశలవారీగా ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రూ.1,143 కోట్లు మంజూరైనట్టు తాజా బడ్జెట్లో పేర్కొంది. పీఎంఏవై పట్టణ ఇళ్లకు రూ.766.50 కోట్లు, గ్రామీణ ఇళ్లకు రూ.376.60 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గృహనిర్మాణ శాఖకు కేటాయింపులు..(కోట్లలో..) నిర్వహణ పద్దు: రూ.652.05 ప్రగతి పద్దు: రూ.2,143.10 మొత్తం: రూ.2,795.15 రోడ్లకు రూ.5,363 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, వంతెనల నిర్మాణానికి దాదాపు రూ.12 వేల కోట్ల విలువైన పనులను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. అయితే తాజా బడ్జెట్లో మాత్రం రోడ్లు, భవనాల శాఖకు రూ.5,363 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు కింద కేటాయించింది రూ.3,501 కోట్లు మాత్రమే. ఇది ఇంచుమించు గతేడాది బడ్జెట్ కేటాయింపులంతే ఉండటం విశేషం. పనుల్లో ఆశించిన వేగం లేకపోవటం వల్లనే నిధుల కేటాయింపు పెరగటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా రహదారులకు రూ.810 కోట్లు, గజ్వేల్, ఇతర అనుసంధాన రహదారుల ప్రాంత అభివృద్ధి అథారిటీకి రూ.80 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రోడ్లకు రూ.460 కోట్లు, రేడియల్ రోడ్లకు రూ.80 కోట్లు కేటాయించారు. కొత్త కలెక్టర్ భవనాలకు రూ.500 కోట్లు, ఎమ్మెల్యే భవనాలకు రూ.30 కోట్లు, కళాభారతి నిర్మాణం కోసం రూ.40 కోట్లు కేటాయించారు. సచివాలయ భవనం సంగతేంటి?: సికింద్రాబాద్ బైసన్‌పోలో మైదానంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ అంశాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ బడ్జెట్లో దీనికి నామ మాత్రంగా రూ.5 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.15 కోట్లు కేటాయించినా ఖర్చు కాలేదు. -
యాదాద్రి–వరంగల్ హైవేకు మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అనుసరిస్తున్న తీరుపై రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్–యాదాద్రి మధ్య నాలుగు వరసల రహదారి నిర్మాణం పూర్తి కాగా, ఇప్పుడు యాదాద్రి–వరంగల్ మధ్య నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవటంతో అది బాగా దెబ్బతింది. కీలకమైన రహదారి కావటంతో దీనిపై నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. రోడ్డు గుంత లమయం కావటంతో వాహనాల వేగం తగ్గిపోవటమే కాక ప్రమాదాలూ జరుగుతు న్నాయి. గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఆర్టీసీ బస్సులో ఉప్పల్ నుంచి వరంగల్ వరకు గతంలో రెండున్నర గంటల్లో వెళ్లగా ఇప్పుడు మూడున్నర గంటలకుపైగా సమయం పడుతోంది. బస్సులు కూడా దెబ్బతింటున్నాయి. దీన్ని ఆర్టీసీ తీవ్రంగా పరిగణించినట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ రోడ్డును ఎన్హెచ్ఏఐకి అప్పగించేప్పుడు మంచి కండిషన్లోనే ఉందంటూ జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి వివరణ ఇచ్చారు. ‘సాక్షి’ కథనంతో కదలిక..: రోడ్డు బాగా పాడైన చిత్రాలతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల బుధవారం ఎన్హెచ్ఏఐ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధు లను కూడా సమావేశానికి పిలిచారు. నిర్మాణ ఒప్పందంలో.. పాత రోడ్డు నిర్వహణ అంశం ఉన్నా దాన్ని పట్టించుకోకపోవటం సరికాదన్నారు.దీనిపై నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేస్తానని అధికారులకు చెప్పారు. ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తే విషయాన్ని ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. దీనిపై ఎన్హెచ్ఏఐ తెలంగాణ సీజీఎంతో మంత్రి ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. -
మృత్యు గంటలు మధ్యాహ్నం 3–6
సాక్షి, తెలంగాణ డెస్క్: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మధ్యాహ్నం పూటే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి. 2016లో దేశంలోమొత్తం 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. అందులో 85,834(18 శాతం) ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటలలోపే జరిగాయని కేంద్ర రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 2005–2016 మధ్య కాలంలో సుమారు 15,50,098 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది. 2016లో ప్రతి రోజు 1,317 ప్రమాదాలు(ప్రతి గంటకు 55) నమోదయ్యాయని, మొత్తం ప్రమాదాల్లో 1,50,785 మంది ప్రాణాలు కోల్పోయారని(ప్రతి గంటకు 17 మంది లేదా ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం), 4,94,624 మంది క్షతగాత్రులు అయ్యారని పేర్కొంది. ఈ మరణాల్లో 25 శాతం లేదా 38,076 మంది 25 నుంచి 35 ఏళ్ల వయసు మధ్యవారేనని తెలిపింది. మధ్యాహ్నం తర్వాత ఎక్కువ ప్రమాదాలు జరిగేది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్యనే అని ఈ నివేదిక వెల్లడించింది. 2016లో 6 నుంచి 9 మధ్యలో 84,555 ప్రమాదాలు నమోదయ్యాయని చెప్పింది. 2016లో దేశంలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 35 శాతం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరిగినవే. డ్రైవర్ తప్పిదాల వల్లే.. రోడ్డు ప్రమాదాలకు అతి ప్రధాన కారణం డ్రైవర్ తప్పిదాలే. 2016లో నమోదైన మొత్తం ప్రమాదాల్లో 84 శాతం లేదా 4,03,598 ప్రమాదాలకు కారణం ఇదే. మొత్తం మరణాల్లో 80 శాతం లేదా 1,21,126 మరణాలు డ్రైవర్ తప్పిదం వల్లే సంభవించాయి. డ్రైవర్ తప్పిదాల్లో మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం. మొత్తం 4,03,598 ప్రమాదాల్లో 66 శాతం లేదా 2,68,341 ప్రమాదాలు ఓవర్ స్పీడ్ వల్లే జరిగాయి. దీని వల్ల 73,896 మంది లేదా 61 శాతం ప్రాణాలు కోల్పోయారు. 2016లో నమోదైన మొత్తం ప్రమాదాల్లో 34 శాతం లేదా 1,62,280 ప్రమాదాలు టూవీలర్స్ వల్లే జరిగాయి. అంటే ప్రతి గంటకు 19 ద్విచక్ర వాహన ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 52,500 మంది(రోజుకు 144 మంది.. గంటకు ఆరుగురు) ప్రాణాలు కోల్పోయారు. -
హైవేలపై హైటెక్ రైతు బజార్లు
శ్రీకారం చుట్టిన మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో పాతూరు గ్రామం.. గ్రామం మీదుగా రాజీవ్ జాతీయ రహదారి.. కొన్నేళ్లుగా అనేక మంది రైతులు, తాము పండించిన కూరగాయలు రహదారిపై విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆ రహదారి గుండా సిద్దిపేట, కరీంనగర్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే వందలాది మంది ప్రజలు అక్కడ కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. తాజా కూరగాయలు కావడంతో క్రమక్రమంగా విక్రయాలు పెరిగాయి. వినియోగదారుల తాకిడి ఎక్కువైంది. కానీ కనీస వసతుల్లేక.. ఎండనక, వాననక కూరగాయలు విక్రయించడం రైతులకు కష్టంగా మారింది. ఆ మార్గంలోనే నిత్యం తన జిల్లాకు వెళ్లొచ్చే మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు.. రైతుల కష్టాలు కళ్లారా చూశారు. వెంటనే రహదారిపై పాతూరు వద్ద హైటెక్ రైతు బజారుకు తెరలేపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రూ. కోటికిపైగా ఖర్చు చేసి అన్ని వసతులతో రైతు బజారు ఏర్పాటు చేసి జూలై 26న ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై కూరగాయలు విక్రయించే కేంద్రాలుంటే గుర్తించాలని, అవసరమైన చోట్ల హైటెక్ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండెకరాల్లో.. 100 స్టాళ్లతో.. పాతూరు హైటెక్ రైతు బజారును రెండెకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఆధునిక విద్యుత్ లైట్లు, సులభ్ కాంప్లెక్స్, క్యాంటీన్, రూ.15 లక్షలతో మంచినీటి సౌకర్యం కల్పించారు. అంతేకాదు.. వినియోగదారుల కోసం కారు పార్కింగ్, పిల్లలు ఆడుకోడానికి పార్కునూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ రైతుల కోసం దాదాపు 100 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పాతూరు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, మత్రాజపల్లి, పాములపర్తి, లింగరాజపల్లి గ్రామాల రైతులు అక్కడ కూరగాయలు విక్రయిస్తున్నారు. అప్పటికప్పుడే చేలల్లో కోసి కూరగాయలు విక్రయిస్తుండటంతో వినియోగదారుల తాకిడి పెరిగింది. రోజూ 1,000 మందికి పైగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. నెల రోజుల్లో రూ.కోటి వ్యాపారం మార్కెట్ విశేషాలను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పీఎస్ అశోక్‌రెడ్డి ఫేస్బుక్ ద్వారా తెలియజేయడంతో ఒక్క రోజులోనే 30 వేల లైకులొచ్చాయి. దేశవిదేశాల్లోని తెలంగాణ పౌరులు మంత్రి కృషిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారని అశోక్ చెబుతున్నారు. ప్రస్తుత రైతు బజార్ల స్థానంలో ఇలాంటి హైటెక్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. రైతు బజారు మొదలై నెల రోజులయిందని, దాదాపు రూ. కోటి వ్యాపారం జరిగిందని అంచనా వేశారు. ఆధునిక హంగులతో.. రాజీవ్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా రైతులు తాజా కూరగాయలు అమ్ముతున్నారు. కానీ కనీస వసతులు లేక వారంతా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన మంత్రి హరీశ్‌రావు.. ఆధునిక హంగులతో రైతు బజారు ఏర్పాటు చేశారు. దీంతో వినియోగదారుల తాకిడి మరింత పెరిగింది. సౌకర్యంగా ఉండటంతో రైతులూ మంచి వ్యాపారం చేసుకుంటున్నారు. -బి.వి.రాహుల్, కార్యదర్శి, పాతూరు రైతు బజారు -
రాష్ట్ర రహదారులు డీనోటిఫై!
కొత్త మద్యం పాలసీపై ప్రతిపాదనలు సిద్ధం - సుప్రీం తీర్పు ప్రభావాన్ని తప్పించుకొనేలా మార్పులు - పాత మద్యం పాలసీకే ఏపీ ఎక్సైజ్ పాలసీలోని అంశాల జోడింపు - లైసెన్స్ ఫీజు మూడు శ్లాబులకు కుదింపు - గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దుకాణాలకు ఫీజు పెరిగే అవకాశం - గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యథాతథం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. పాత మద్యం పాలసీకే కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయడంతోపాటు.. ఏపీ ఎక్సైజ్ పాలసీలోని పలు అంశాలను జోడించి నూతన పాలసీని సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు జాతీయ రహదారులకే పరిమితమయ్యేలా చేసేందుకు.. రాష్ట్రస్థాయి రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా (ఎండీఆర్) డీనోటిఫై చేయాలని, పాత పాలసీ ప్రకారమే (100 మీటర్ల దూరంలోపు) దుకాణం లైసెన్స్‌లు కేటాయించాలని కొత్త పాలసీలో ప్రతిపాదించనున్నారు. ఇక పాత పాలసీలో 6 శ్లాబులుగా ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజును ఈ సారి మూడు శ్లాబులకు కుదించాలని నిర్ణయించారు. ఇందులో తొలి రెండు శ్లాబుల పరిధిలోకి వచ్చే గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణాలకు లైసెన్స్ ఫీజు పెంచాలని... చివరి శ్లాబ్ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాద్‌లోని దుకాణాలకు రూ.1.4 కోట్లు ఉన్న ఫీజును యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇక ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయింపు, రెండు సంవత్సరాల లీజు కాలం వంటి నిబంధనలను కూడా ఉన్నది ఉన్నట్లుగా కొనసాగించనున్నారు. సుప్రీం తీర్పుతో జాప్యం రాష్ట్రంలో పాత ఎక్సైజ్ పాలసీ సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీకి ఇప్పటికే తుది రూపు రావాల్సింది. కానీ జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు ఉండవద్దన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు ఉండగా.. ఇందులో 1,184 మద్యం దుకాణాలు సుప్రీంకోర్టు నిబంధన పరిధిలోకి వస్తున్నాయి. అధిక లైసెన్సు ఫీజు కారణంగా మరో 72 దుకాణాల లైసెన్స్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంటే మిగిలేవి 960 దుకాణాలు మాత్రమే. అదే జరిగితే ఎక్సైజ్ రాబడి అమాంతం పడిపోతుంది. దీంతో సుప్రీంతీర్పుకు అనుగుణంగా పాలసీ రూపొందించాలా? లేక డీనోటిఫై సిఫారసును ప్రతిపాదించాలా? అన్నదానిపై ఎక్సైజ్ అధికారులు కొంతకాలం తర్జనభర్జన పడ్డారు. అయితే ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఆ పాలసీలో అక్కడి రాష్ట్ర రహదారులను ఎండీఆర్ (మెయిన్ డిస్టిక్ రోడ్స్)గా పునః సమీక్షించారు. దీంతో తెలంగాణలోనూ రాష్ట్ర రహదారులను డీనోటిఫై చేసుకొని.. పాత పాలసీ ప్రకారం ప్రధాన రోడ్డుకు 100 మీటర్ల దూరంలోపు దుకాణం నిర్వహించరాదన్న నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో సుప్రీం నిబంధనల పరిధి నుంచి 562 మద్యం దుకాణాలు బయటపడతాయి. ఇక జాతీయ రహదారుల పక్కన ఉన్న దుకాణాలను కూడా జిల్లా ప్రధాన రోడ్డు వైపునకు మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా సమీక్ష దశలోనే ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలిస్తున్నారు. అవసరమైన మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. -
100 మోడల్ జంక్షన్లు
థర్డ్‌రాక్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నివేదికల మేరకు సుచిత్ర, ఐడీపీఎస్ జంక్షన్ల అభివృద్ధికి టెండర్ ప్రక్రియ జరుగుతోంది. థర్డ్‌రాక్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నివేదికల మేరకు సుచిత్ర, ఐడీపీఎస్ జంక్షన్ల అభివృద్ధికి టెండర్ ప్రక్రియ జరుగుతోంది. లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ నివేదిక అనుగుణంగా సిటీ కాలేజీ జంక్షన్ టెండర్ పూర్తయింది. సిటీబ్యూరో: సిటీలోని ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిపై దృష్టి సారించిన అధికారులు.. ఇందులో పాదచారుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో నాలుగు రకాల జంక్షన్లు ఉన్నాయి. వీటిలో నాలుగు కంటే ఎక్కువ రహదారులు వచ్చి కలిసే జంక్షన్లు, నాలుగు రోడ్ల కూడళ్లు, చౌరస్తాలు, మూడు రోడ్లతో కూడిన ‘టి’, ‘వై’ జంక్షన్లు. ఇలా ప్రతి జంక్షన్‌లోనూ పాదచారులు రోడ్డు దాటేందుకు కచ్చితంగా ప్రత్యేక మార్కింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. రెడ్ సిగ్నల్ పడే వరకు చౌరస్తాలో వేచి ఉండేందుకు రోడ్డు పక్కన సౌకర్యవంతమైన ప్లాట్‌ఫామ్స్ నిర్మించాలని నిర్ణయించారు. జంక్షన్లలో సైతం పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి విరుగుడుగా రెయిలింగ్స్ ఏర్పాటు చేస్తారు. జంక్షన్ స్థాయిని బట్టి అన్ని రోడ్లలో ఎడమ వైపు ఫుట్‌పాత్‌ను అనుసరించి కనిష్టంగా 100 మీటర్ల నుంచి గరిష్టంగా 200 మీటర్ల వరకు రెయిలింగ్స్ నిర్మిస్తారు. రోడ్ క్రాసింగ్ మార్కింగ్స్ ఉన్న ప్రాంతంలో వీటికి ఓపెనింగ్ ఇస్తారు. ఫలితంగా పాదచారులు ఆ ప్రాంతంలో మాత్రమే రహదారిని దాటేందుకు అవకాశం ఉంటుంది. అంధులు రోడ్డు దాటే సమయంలో ఆ విషయం వాహనదారులకు స్పష్టంగా తెలిసేలా ‘హూటర్లు’ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక శబ్దం చేసే ఈ హూటర్ సదరు పాదచారుడు రోడ్డు దాటే వరకు మోగుతూనే ఉంటుంది. ఫ్రీగా ‘ఫ్రీ లెఫ్ట్’... సిటీ వ్యాప్తంగా మోడల్ జంక్షన్ల అమలుకు దాదాపు ప్రతి జంక్షన్‌లోనూ ‘ఫ్రీ లెఫ్ట్’ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఏదైనా జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు నేరుగా వెళ్లేందుకు ఆగుతున్న వాహనాల కారణంగా.. ఎడమ వైపు వెళ్లే వాహనాలూ ఆగిపోవాల్సి వస్తోంది. దీనికోసం ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ‘ఫ్రీ లెఫ్ట్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే కొన్ని జంక్షన్ల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో ఈ విధానం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. మోడల్ జంక్షన్ల ఏర్పాటులో భాగంగా ‘ఫ్రీ లెఫ్ట్’కు అనుగుణంగా జంక్షన్ల విస్తరణకు భూసేకరణ చేయాలని భావిస్తున్నారు. పీక్, నాన్–పీక్ అవర్స్‌ల్లో వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్, రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌కు మధ్యలో 100 మీటర్ల పరిధిలో నిలిచిపోతున్న వాహనాలు పరిపాటిగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్ అధికారులు అనేక జంక్షన్లను మూసేశారు. ఉప్పల్, హబ్సిగూడ, కేసీపీ తదితర ఈ కోవలోకే వస్తాయి. ఆయా జంక్షన్ల నుంచి నేరుగా వెళ్లాల్సిన వాహనాలను ఎడమ వైపు కొద్దిదూరం మళ్లిస్తున్నారు. అక్కడ యూటర్న్ ఇవ్వడం ద్వారా వాహనం మళ్లీ జంక్షన్ వద్దకు చేరుకొని ఎడమ వైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. సిటీలోని అనేక ప్రాంతాల్లో ఈ యూటరŠన్స్ ఇరుకుగా ఉండడంతో బస్సులతో పాటు కొన్ని పెద్ద వాహనాలకూ ఇబ్బందిగా మారింది. దీంతో ‘టర్న్’ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘యూటరŠన్స్’ను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
మందస్తు డీల్.. రోడ్లు మారాయి
హైవేపై ముందుగానే తెరిచారు జమ్మలమడుగు: సుప్రీంకోర్టు జాతీయ రహదారులకు 500 మీటర్ల, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యంషాపులను ఏర్పాటు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైవేలపై ఉన్న మద్యం షాపులను ఇళ్ల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ జమ్మలమడుగులో అలాంటివేమీ చోటుచేసుకోలేదు. కారణం రాష్ట్ర హైవేలను జిల్లా రహదారులుగా మార్చుతామని పాలకుల నుంచి ముందే సమాచారం అధికారపార్టీ నాయకులకు రావడమే. జాతీయ రహదారి అయిన ముద్దనూరు రోడ్డును వదిలి తాడిపత్రి రహదారి వైపు బ్రాందీషాపులను వారంకిందటి నుంచే మార్చుకునే ప్రయత్నాలు చేశారు. అందులోభాగంగా ఒకటో తేదీనుంచే పట్టణంలో తాడిపత్రి రోడ్డులో మూడు బ్రాందీషాపులు తెరుచుకున్నాయి. అయితే రాష్ట్ర హైవేలను జిల్లా రహదారులుగా ప్రభుత్వం జీఓను మంగళవారం విడుదల చేసింది. విషయం ముందుగానే తెలియడంతోనే సంజామల మోటు నుంచి మోరగుడి మోటు వరకు మొత్తం బ్రాందీషాపులు ఇప్పటికే వెలిశాయి. సాక్షి ప్రతినిధి, కడప: మద్యం సిండికేట్లతో ప్రభుత్వ పెద్దలకు కుదిరిన ముందస్తు డీల్‌తో జిల్లాలోని 1,130.906 కిలోమీటర్ల స్టేట్‌హైవే రోడ్డును ప్రభుత్వం జిల్లా మేజర్ రోడ్లుగా మార్చింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 90శాతం మద్యం దుకాణాలకు సుప్రీంకోర్టు తీర్పు దెబ్బతప్పింది. రోడ్లు మనవే తోసేయ్ అనేలా వ్యాపారులు యథాతథంగా ప్రస్తుత స్టేట్‌హైవే రోడ్లకు ఆనుకుని ఉన్న భవనాల కోసం వేట ప్రారంభించారు. సిండికేట్లదే పెత్తనం జిల్లాలో 255 మద్యం దుకాణాలతో పాటు, గత ఏడాది ఉన్న 19 బార్ అండ్ రెస్టారెంట్లకు అదనంగా 11 బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటుచేయడానికి ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ సంఖ్య మేరకు దుకాణాలు, బార్ల ఏర్పాటుకు అవసరమైన లైసెన్సుల మంజూరుకు ఎక్సైజ్ శాఖ అధికారిక ప్రక్రియ పూర్తి చేసింది. రోడ్డుప్రమాదాలను కట్టడి చేయడం కోసం హైవేలను ఆనుకుని 500 మీటర్ల దూరం తర్వాతే మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయనీ, ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు మన జిల్లాలోని మద్యం సిండికేట్లు కూడా ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తెచ్చాయి. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడానికి ఆమ్యామ్యాలు సమర్పించుకున్నాయి. ఈ ముందస్తు సెటిల్మెంట్ల కారణంగా గత నెల 28, 29 వ తేదీలకే స్టేట్‌హైవేలన్నీ జిల్లా మేజర్ రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. అయితే జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయించి ప్రజల నుంచి వ్యతిరేకత తెప్పించి హైవేలను జిల్లా రోడ్లుగా మార్చే ఎత్తుగడ వేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ వ్యూహం అమలు చేసి ప్రజల ఆందోళనలు దృష్టిలోఉంచుకుని రోడ్లస్థాయి తగ్గించినట్లు కథ నడపించారు. సినిమాకు ఈ తరహా ముగింపు ఉంటుందని ముందే తెలిసిన కొందరు సిండికేట్ పెద్దలు సుమారు 100 మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తీసుకోవడానికి ఎగబడకుండా ఎదురుచూశారు. మంగళవారం రాత్రి రాష్ట్ర హైవేలను జిల్లా మేజర్ రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమ దుకాణాలు తెరిచేందు కు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్లే ఇబ్బందులు జిల్లాలో కర్నూలు– చిత్తూరు, కడప– బాలుపల్లి, రాయచోటి– అంగళ్లు, కొండాపురం–బద్వేలు మధ్య సుమారు 500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిని ఆనుకుని దగ్గర్లో ఏర్పాటైన మద్యం దుకాణాలు చాలా తక్కువ ఉన్నాయి. బార్లయితే కడప, రాజంపేటలో రెండు మాత్రమే ఉన్నాయి. జాతీయ రహదారులు వెళ్లే ప్రతిచోట రింగ్‌రోడ్డు లేదా బైపాస్ రోడ్లు ఉండటంతో అత్యధిక మద్యం దుకాణాలు స్టేట్‌హైవేలను ఆనుకునే ఉన్నాయి. ఈ ప్రకారం జిల్లాలో 1,130.906 కిలోమీటర్ల స్టేట్‌హైవే రోడ్డు ఉండగా, 55.437 కిలోమీటర్లు మాత్రమే జిల్లా మేజర్ రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్టేట్‌హైవేలన్నీ జిల్లా మేజర్రోడ్లుగా మారుతున్నాయి. దీంతో ఇప్పటికే హైవేలను ఆనుకుని మద్యం వ్యాపారం చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. దువ్వూరు, ఖాజీపేట, మైదుకూరు, కోడూరు, బద్వేలు, రాజంపేటల్లో మాత్రం చాలాతక్కువ మద్యం దుకాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వీటిని కూడా ప్రస్తుత స్టేట్హైవేల్లో సర్దుబాటు చేయడానికి అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండే అవకాశం లేదు. ఈ కారణంగా మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రజల్లో సాగుతున్న ఆందోళనలు తగ్గిపోయి మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఏర్పడింది. -
హైవే మందు బంద్
► సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ► రాష్ట్రంలో 3,515, బెంగళూరులో 852 బార్లు, షాపుల మూత ► సిటీలో ప్రధాన రోడ్లు, కూడళ్లలోని పానశాలలకు తాళాలు ► మందుబాబుల్లో టెన్షన్ హైవేల పక్కనే ఉన్న మద్యం అంగళ్లు, బార్ల వల్ల డ్రైవర్లు మత్తులో జోగుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు ఊపందుకుంది. ఫలితంగా రాష్ట్రంలోను, ఐటీ సిటీలోనూ తీర్పు పరిధిలోకొచ్చే పానశాలలను మూసివేస్తున్నారు. ఎప్పుడూ తెరిచి ఉండే తమ ఆస్థాన మందు అంగడికి తాళాలు పడేసరికి మందుప్రియులు కొత్త షాపులను వెతుక్కుంటూ వెళ్తున్నారు. కొన్నిచోట్ల షాపుల్లో రద్దీల వల్ల గొడవలూ జరుగుతున్నాయి. ఏదేమైనా సుప్రీం తీర్పు అమలు వల్ల విలువైన ప్రాణాలకు భరోసా దక్కుతుంది. సాక్షి, బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పక్కనే ఉన్న మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ పరిణామం సామాజిక వేత్తలకు సంతోషం తీసువస్తే ప్రభుత్వంతో పాటు మందు బాబులకు కొంత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. రోడ్డు ప్రమాదాలకు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలూ కారణమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర, జాతీయ రహదార్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను, బార్లను, పబ్‌లను తక్షణం మూసివేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆ మద్యం దుకాణాలకు తెరపడింది. కన్నడనాట 6,572 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 19,578 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల పొడవునా ఉన్న 3,515 మద్యం దుకాణాలు జులై 1 నుంచి మూతపడ్డాయి. శనివారం నుంచి అబ్కారీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ తెరిచి ఉన్న మందు దుకాణాల మూసివేతను ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,500 మద్యం దుకాణాలను మూసివేయగా కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను వేరే ప్రాంతానికి తరలించారు. బెంగళూరులో హడావుడి బెంగళూరు నగరంలో 94.89 కిలోమీటర్ల మేర ఆరు జాతీయ రహదారులు వెళుతున్నాయి. దీంతో బెంగళూరులో మొత్తం 852 బార్లు, మద్యం దుకాణాలకు తాళాలు వేశారు. దీంతో నగరంలో మిగతా మద్యం దుకాణాల్లో రద్దీ మరింత పెరిగింది. రహదారులపై మద్యం దుకాణాలు మూతపడడంతో మిగిలిన చోట్లకు మందుబాబులు పరుగులు తీసున్నారు. మిగతా చోట్ల మద్యం అంగళ్లకు క్యూలు కడుతుండగా, రద్దీ పెరిగి ఘర్షణలూ జరుగుతున్నాయి. అక్రమాలకు ఆరంభం మూత పడిన మద్యం షాపుల్లో ఇప్పటికీ 14.06 లక్షల బాక్స్‌ల మద్యం నిల్వలు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ పరిశీలనలో తేలింది. దీంతో దొడ్డిదారిన ఆ సరుకును అమ్ముకుంటున్నట్లు సమాచారం. మద్యం దుకాణ యజమానులు ఆ మద్యాన్ని మిగతా వైన్‌షాపులకు పంపిస్తున్నారు. కొందరు మద్యం దుకాణం పక్కనే పేరుకు ఒక టీ కొట్టు తెరిచి అందులో మద్యాన్ని అమ్ముతున్న ఫిర్యాదులూ ఎక్సైజ్ శాఖకు అందుతున్నాయి. ఎంఆర్పీ కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తున్నారు. -
ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం
ఛండీగఢ్: ఇక హైవేలపై ఉండే దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం అందుబాటులో రానుంది. ఆయా ప్రదేశాల్లో లిక్కర్ అమ్మకాలకు అనుమతినిస్తూ పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. సోమవారం ఛండీగఢ్‌లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పంజాబ్ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల కిందటే సుప్రీం కోర్టు.. జాతీయ రహదారులు, ఇతర హైవేలపై మద్యం అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా పంజాబ్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏమరకు అమలవుతుందో వేచిచూడాలి. రైతుల రుణాలు మాఫీ ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన రైతులకు హామీ ఇచ్చిన విధంగా పంజాబ్ సర్కార్ రుణమాఫీ ప్రకటించింది. రాష్ట్రంలోని 8.75 లక్షల మంది చిన్నకారు, మధ్యతరహా రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం అమరీందర్‌సింగ్ కేబినెట్ భేటీలో ప్రకటించారు. -
నగరంలో హోరువాన
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో శనివారం రాత్రి పలు చోట్ల హోరున వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, కోఠి, తార్నాక, సికింద్రాబాద్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో వీకెండ్ కాలక్షేపం కోసం బయటకు వచ్చిన నగరవాసులు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం కలిగింది. ఉరుములు, మెరుపులు, గాలి కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. -
రైతన్న కన్నెర్ర
► జాతీయ, రాష్ట్ర రహదారులపై రాస్తారోకో ► నాలుగు గంటలసేపు ఆందోళన ► కనీవినీ ఎరుగని రీతిలో మిర్చి ధర పతనం ► రూ.1500–2000 మధ్యే క్వింటా మిర్చి ► వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారని రైతుల ఆగ్రహం దారుణంగా దిగజారిన ధరలతో కడుపు మండిన రైతన్న కన్నెర్ర చేశాడు. కనీవినీ ఎరుగని రీతిలో క్వింటా మిర్చి కేవలం రూ.1500–2000 మధ్యే ధర పలుకుతుండటంపై మండిపడ్డాడు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ధరలు పతనం చేశారని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. స్వేదం చిందించి రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండిస్తే ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకుండా దగా చేస్తోందని ఆందోళన చెందారు. ప్రస్తుతం ఉన్న మిర్చి ధరతో కోత కూలి ఖర్చు కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే తీరా పంట అమ్ముకునే సమయానికి ధర లేకుండా చేస్తే తమ బతుకులు ఏం కావాలని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 రాయితీ పథకం ద్వారా వ్యాపారులు మిర్చి కొనుగోలు చేయడం లేదన్నారు. కేవలం కమీషన్ వ్యాపారుల కుట్ర కారణంగానే ధరలు దిగజారాయని ధ్వజమెత్తారు. సాక్షి, అమరావతి బ్యూరో : సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని కమీషన్ ఏజెంట్లు, నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్న యార్డు పాలక వర్గం, ధరలు పతనమైనా పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పోరుబాట పట్టారు. తీవ్ర ఆగ్రహంతో చిలకలూరిపేట జాతీయ రహదారి, నరసరావుపేట మార్గంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైతుల ఆందోళన కొనసాగింది. నాటు రకం మిర్చిని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని తెలిపారు. పది రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. తేజ (హైబ్రిడ్) రకాలు సైతం కేవలం క్వింటాలు రూ.2500–3000కు అడుగుతున్నారని వాపోయారు. సాధారణ రకాలు క్వింటా రూ.1500కు మించి అడగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకటించాక ధరలు మరింత పతనమయ్యాయని చెప్పారు. మార్కెట్ యార్డులో కొనుగోళ్లు మందగించాయన్నారు. యార్డు బయటే నిల్వలు... రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన వందలాది లారీల సరుకును మార్కెట్ బయటనే అధికారులు దించివేశారు. ఆ సరుకును కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పినా వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జేసీ–2 ముంగా వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డుకు చేరుకొని తాను మార్కెట్ యార్డులోనే ఉంటానని, మార్కెట్ యార్డు కార్యాలయంలోకి రావాలని రైతులను కోరారు. శాంతించిన రైతులు కార్యాలయానికి చేరుకొని, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పలువురు రైతులు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావును నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకంపై విధివిధానాలు ఏవీ? కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ప్రకటించినప్పటికీ దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. అదే సమయంలో అసలు ఈ స్కీమ్‌ను ఎలా అమలు చేస్తారో స్పష్టత లేక రైతులు ఇబ్బంది పడ్డారు. దీనికి రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చే బోనస్ క్వింటాకు రూ.1500 ఇస్తారా.. లేదా హ్యాండ్లింగ్ చార్జీలు రూ.1250 కలిపి ఇస్తారా అని రైతులు ప్రశ్నించారు. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికార వర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం మిర్చికి క్వింటాలు రూ.5 వేలు మాత్రమే రైతుకు వర్తిస్తుందని తెలిపారు. హ్యాండ్లింగ్ చార్జీలు రైతులకు రావని, అది కేవలం మార్క్‌ఫెడ్ అధికారులకు కొనుగోలు నిర్వహణ వ్యయంగా వెళుతుందని పేర్కొన్నారు. ఉదయం ఓ ధర.. సాయంత్రం మరో ధర.. గుంటూరు మిర్చి యార్డులో వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు కుమ్మక్కు కావడం వల్ల ధరలు పతనమవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. బిడ్డింగ్ తర్వాత మచ్చు తీసుకొనేందుకు వ్యాపారులు ఎప్పుడు వస్తారోనని తిండీతిప్పలు లేకుండా ఇక్కడే నిరీక్షించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఉదయం శాంపిల్స్ తీశాక వ్యాపారులు ఓ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. సాయంత్రం సరుకు తరలించే సమయానికి అదే వ్యాపారి ఉదయం ధరకు కొనడం వీలుకాదని, ధర తగ్గించి అడుగుతుండటంతో అమ్ముకోవాలో, ఉంచుకోవాలో తెలియడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మేమెలా బతకాలి? నేను వారం రోజుల ముందు 273 రకం మిర్చిని తీసుకొచ్చాను. మొన్నటి వరకు క్వింటాలు రూ.4500 ఉన్న మిర్చి ప్రస్తుతం రూ.2 వేలు కూడా అడగటం లేదు. నాటు కాయలు అంటే కొనబోమంటున్నారు. రాయితీ పత్రాలు లేకుండా కొనుగోలు చేస్తామంటున్నారు. రైతులు ఎలా బతకాలి. – శ్రీనివాసులరెడ్డి, పెద్ద అరవీడు, ప్రకాశం జిల్లా. వారం రోజులుగా పడిగాపులు వారం రోజులుగా గుంటూరు మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నా. వ్యాపారులు సరుకు కొనటం లేదు. తేజ రకం కాయలు మూడు రోజుల కిందట రూ.5 వేలకు అడిగారు. సరుకు మిర్చి యార్డు బయటే ఉంది. మచ్చు తీసేందుకు వ్యాపారులు ఎప్పుడు వస్తారోనని టిఫిన్ కూడా చేయకుండా ఎదురు చూశా. తీరా వ్యాపారులు మచ్చు తీశాక క్వింటా రూ.3 వేలకు అడుగుతున్నారు. – షేక్ జాన్, పెదకూరపాడు -
రాష్ట్రానికి రెండు ఎకనమిక్ కారిడార్లు
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కొత్తగా రెండు ఎకనమిక్ కారిడార్ రహదారులు మంజూరయ్యాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. నార్కెట్‌పల్లి–నల్లగొండ–తిప్పర్తి–మిర్యాలగూడ–కొండ్రపోలు– పొందుగల మధ్య 98 కి.మీ. మేర, జడ్చర్ల– దామగ్నాపూర్–కర్ణాటక సరిహద్దు వరకు 109 కి.మీ. మేర రెండు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు ఆయన రహదారులపై సమీక్షించారు. జూన్ 1వ తేదీ తర్వాత రోడ్లపై గుంతలు కనిపిస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు ఎకనమిక్ కారిడార్లపై అధికారులతో చర్చించారు. సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల విలువైన పనులతో కూడిన వార్షిక ప్రణాళికకు అదనంగా ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ కూడళ్లలో నిర్మించే మూడు ఎలివేటెడ్ కారిడార్లు జతయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా రూ.5,900 కోట్ల విలువైన పనులు రాష్ట్రానికి సాధించినట్టు వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ఇబ్బందులు అధిగమించేలా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎం ఆదేశించినట్టుగా రహదారులపై గుంతలు లేకుండా మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల భవనాల నిర్మాణాన్ని వేగిరం చేసి సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఈఎన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి, సీఈలు చంద్రశేఖరరెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జాతీయ రహదారులకు డీపీఆర్‌లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా మంజూరైన జాతీయ రహదారులకు డీపీఆర్‌లు రూపొందించేందుకు టెండర్ల అనుమతులు, కొత్త రహదారులకు డీపీఆర్ కోసం అనుమతులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖకు జాబితా అందించనుంది. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి సోమవారం జాబితా తీసుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. 2017–18 సంవత్సరానికి గాను ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.4,470 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఈ జాబితా రూపొందించారు. ఇందులో వరంగల్–ఖమ్మం సెక్షన్, ఘట్ కేసర్ ఆరు వరుసల రోడ్డు, ఆరాంఘర్–శంషాబాద్ రోడ్డు విస్తరణ, ఎల్బీనగర్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు, హైదరాబాద్–శ్రీశైలం రోడ్డు మెరుగుపరిచే పనులు ఉన్నాయి. ఇక కొత్త రహదారుల డీపీఆర్‌లకు సంబంధించి... బోధన్– బాసర–భైంసా, మెదక్–ఎల్లారెడ్డి– బాన్సువాడ–రుద్రూర్, భద్రాచలం– అశ్వారావుపేట, చౌటుప్పల్–షాద్‌నగర్, మెదక్ –ఎల్కతుర్తి, తాండూరు– కొడంగల్–మహబూబ్‌నగర్, జహీరాబాద్–బీదర్ లైన్లు, కొత్త రహదారుల నిర్మాణం కోసం... హైదరాబాద్–నర్సాపూర్–మెదక్, జహీరాబాద్–బీదర్, సిరిసిల్ల–కామారెడ్డి, సిద్దిపేట–ఎల్కతుర్తి, బాసర–భైంసా, బైపాస్‌ల కోసం జడ్చర్ల, మహబూబ్‌నగర్, మెదక్ బైపాస్‌లు, రహదారి భద్రత చర్యలు, మియాపూర్–బీహెచ్ఈఎల్, పుణె–హైదరాబాద్, హైదరాబాద్–శ్రీశైలం రోడ్లు ఉన్నాయి. -
నెత్తుటి చరిత్రకు ముగింపు
దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులని చెప్పుకునే జాతీయ రహదారులకు సమీపంలో బార్లు, రెస్టరెంట్లు ఉండటానికి వీల్లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టంగా చెప్పిన తీరు ఆ సమస్య తీవ్రతను చాటింది. నిరుడు విడుదల చేసిన 2015 నాటి రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం రహదారుల్లో జాతీయ రహదారుల వాటా 1.5 శాతం మాత్రమే. కానీ 28 శాతం ప్రమాదాలకు, 33 శాతం మరణాలకు జాతీయ రహదారులే కారణమవుతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా, వేగంగా నడపటం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 2015లో రోడ్డు ప్రమా దాలు రెండున్నర శాతం పెరిగాయి. దాదాపు అయిదున్నర లక్షల రోడ్డు ప్రమా దాల్లో లక్షా 42 వేల మంది మరణిస్తే అందులో మద్యం సేవించడం పర్య వసానంగా జరిగిన ప్రమాదాలే ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వతంగా వికలాంగులవుతున్నవారు మరిన్ని లక్షలమంది ఉంటున్నారు. ఈ ప్రమాదాల కారణంగా లక్షలాది కుటుంబాలు ఆసరా కరువై చెప్పనలవికాని ఇబ్బం దులు పడుతున్నాయి. వీధిన పడుతున్నాయి. నాలుగు వరసలు, ఆరు వరసలుగా విస్తరించి కళ్లు చెదిరే స్థాయిలో కనబడే ఈ జాతీయ రహదారుల వెంబడే అనేక చోట్ల బార్లు, రెస్టరెంట్లు ధాబాలు కొలువుతీరుతున్నాయి. వచ్చే పోయే వాహ నాల్లోని డ్రైవర్లు వాటి దగ్గర ఆగి కావలసినంత కిక్కు ఎక్కించుకుని వెళ్తున్నారు. పర్యవసానంగా ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఏటా రూ. 60,000 కోట్లు నష్టపోతున్నామని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడి స్తున్నాయి. నిజానికి ఈ సమస్యపై ప్రభుత్వాలు తమంత తామే దృష్టిసారించి ఉండాలి. ఎందుకంటే సమస్య ఏర్పడినప్పుడు ప్రజలు ముందుగా ప్రభుత్వాలకు చెప్పు కుంటారు. తప్పక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తారు. వారు అడిగినా అడగక పోయినా విస్తృతమైన యంత్రాంగం ఉన్న ప్రభుత్వాలకు ఆ సమస్య గురించి తెలియాలి. దాన్ని తీర్చడానికి అమలు చేయాల్సిన విధానాన్ని రూపొందించాలి. కానీ మన దేశంలో జరుగుతున్నది వేరు. సమస్యకు ఎంతకీ పరిష్కారం లభించక పోవడం, అది సాధ్యమవుతుందన్న నమ్మకం కొరవడటం పర్యవసానంగా న్యాయ స్థానాలను ఆశ్రయించక తప్పనిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పుడు జాతీయ రహ దారుల పొడవునా మద్యం దుకాణాలనూ, బార్లనూ, రెస్టరెంట్లనూ మూసేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కూడా ఆ విధంగా వచ్చిందే. పంజాబ్‌కు చెందిన హర్మాన్ సిద్ధూ పదేళ్లక్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్రమంలో అత్యవసర చికిత్స కోసం వచ్చే అధిక శాతంమంది రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నవారేనని అతను గ్రహించాడు. ఎంతో పరిశోధన తర్వాత వీటిని ఆపడానికి ప్రభుత్వాల పరంగా చర్యలేమీ ఉండటం లేదని తెలుసుకున్నాడు. ఆ తర్వాత న్యాయస్థానం తలుపుతట్టాడు. అతని పిటిషన్‌పై 2014 మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిస్తూ జాతీయ రహదారి సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని చెప్పడం... దానిపై అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం పర్యవసానంగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి. జాతీయ రహదారులపై మద్యం విక్రయాలు ఎంత విచ్చలవిడిగా సాగుతున్నాయో హర్మాన్ సేకరించిన సమాచారమే చెబుతుంది. పానిపట్–జలంధర్ మధ్య ఉన్న 290 కిలోమీటర్ల రహదారిపై 185 చోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయని సిద్ధూ కోర్టుకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలు, బార్లలో 57 శాతం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల సమీపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ఏ రాష్రమూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ కేసు విచారణ సందర్భంగా, ఆ తర్వాత సడలింపులు ఇవ్వాలంటూ కోరిన సమయంలోనూ సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాదనలు వింత గొలుపుతాయి. మద్యం దుకాణాలు, బార్లు వగైరాలవల్ల తమకు వేల కోట్ల ఆదాయం వస్తున్నదని, వాటిపై లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారని ప్రభు త్వాలు లెక్కలు చెప్పాయి. ఈ నిషేధం వల్ల రూ. 50,000 కోట్ల ఆదాయం కోల్పోతామని, 10 లక్షలమంది ఉపాధి దెబ్బతింటుందని వివరించాయి. కానీ ప్రమాదాల కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో, ఎన్ని కుటుంబాలు అధోగతిపాలవుతున్నాయో... ఇందువల్ల ఎన్ని వేల కోట్లు నష్టపోవలసి వస్తున్నదో విస్మరించాయి. నిరుడు డిసెంబర్లో వెలువరించిన తీర్పులో జాతీయ రహదా రులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం విక్రయాలు ఉండరాదన్న ఆదేశాలకు వక్ర భాష్యం చెప్పుకుని ఆ తీర్పు చిల్లర మద్యం దుకాణాలకు మాత్రమే వర్తిస్తుందన్నవారికి తాజా ఆదేశాలు మరింత స్పష్టతనిచ్చాయి. జాతీయ రహ దారులపై ఉండే బార్లు, పబ్‌లు, రెస్టరెంట్లూ, ధాబాలకు సైతం తమ ఉత్తర్వులు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 20,000 వరకూ జనాభా ఉండే ప్రాంతాల్లో మద్యం విక్రయ జోన్ పరిధిని 500 మీటర్లనుంచి 220 మీటర్లకు తగ్గించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల వల్లనే అంతా సర వుతుందని భావించకూడదు. ఈ నిషేధంతో అక్రమ విక్రయాల జోరు పెరు గుతుంది. కొత్త కొత్త మాఫియా ముఠాలు పుట్టుకొస్తాయి. వీటిని అరికట్టాలంటే జాతీయ రహదారులపై ముమ్మరంగా తనిఖీలు జరిపే ప్రత్యేక బృందాలను ఏర్పరచవలసి ఉంటుంది. అవి పనిచేస్తున్న తీరుపై గట్టి పర్యవేక్షణ తప్పనిసరి. తాగి వాహనం నడిపినట్టు తేలితే లైసెన్స్ రద్దు చేయడంవంటి చర్యలు తీసు కోవాల్సి ఉంటుంది. మోటారు వాహనాల చట్టాన్ని కఠినం చేస్తూ కేంద్రం ఎటూ సవరణలు తీసుకురాబోతోంది. తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారకు లైన పక్షంలో అలాంటివారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, పదేళ్లవరకూ కఠిన శిక్ష పడేలా చూడటం వాటిలో కొన్ని. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరేలా చూడటం, ప్రజల ప్రాణాలకు పూచీ పడటం ప్రభుత్వాల కర్తవ్యం. -
‘హైవే మద్యం’పై నిషేధం
నేటి నుంచే అమల్లోకి - 500 మీటర్ల లోపున్న దుకాణాలు మూసేయాలన్న సుప్రీం కోర్టు - తెలంగాణలో సెప్టెంబర్ 30, ఏపీలో జూన్ 30 వరకు గడువు - సిక్కిం, హిమాచల్, మేఘాలయలకు మినహాయింపు - తీర్పు సమీక్షించాలన్న లిక్కర్ అసోసియేషన్ వినతి తిరస్కరణ - బిహార్‌లో మద్యం నిల్వల ఖాళీకి మే 31 తుది గడువు న్యూఢిల్లీ: జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 15, 2016కు ముందు లైసెన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలురాష్ట్రాలకు) వారికి మాత్రం కొంత గడువిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం.. మద్యం దుకాణాలతోపాటు బార్లు, పబ్బులు, రెస్టారెంట్లను ఏప్రిల్1 నుంచి మూసేయాలని స్పష్టం చేసింది. ఘోరమైన రోడ్డు ప్రమాదాలకు హైవేల పక్కన మద్యం అందుబాటులో ఉండటమే కారణమని అభిప్రాయపడింది. అయితే.. సిక్కిం, మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్‌లకు ‘500 మీటర్ల’ నిబంధననుంచి మినహాయింపునిచ్చింది. ఈ రాష్ట్రాల్లో హైవేలకు 220 మీటర్ల దూరంలో మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ఈ ధర్మాసనం ఆదేశించింది. మార్చి 31 తర్వాత హైవేలకు ఆనుకుని ఉన్న మద్యం అమ్మకాల కేంద్రాల లైసెన్సులను కొనసాగించకూడదని పేర్కొంది. డిసెంబర్ 15, 2016కు ముందు లైసెన్సులు పొందిన కేంద్రాలకు తెలంగాణలో సెప్టెంబర్ 30 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 30 వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. కోర్టు తీర్పును సమీక్షించాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ, పంజాబ్, తెలంగాణ మద్యం అమ్మకందారుల అసోసియేషన్ల వినతినీ, 500 మీటర్ల నిబంధన నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలన్న అటార్నీ జనరల్ రోహత్గీ వినతిని కోర్టుతోసిపుచ్చింది. మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా ఏటా 1.42 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న పిల్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్‌పై స్టే ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల్లో పూర్తిగా మద్యపానం నిషేధించాలన్న ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హిమాలయ పర్వతాల్లో పవిత్రమైన చార్ధామ్ యాత్ర జరిగే మూడు జిల్లాల్లో (రుద్రప్రయాగ్, చమోలీ, ఉత్తరకాశీ) మద్యం అమ్మకాలను 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా నిషేధించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ప్రాంతాల్లో యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నట్లు ఆధారాలున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గురుద్వారాల వద్ద పొగాకు అమ్మకాలపైనా నియంత్రణ విధించాలంది. మద్యం అమ్మకాల విషయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. బిహార్‌లో మద్యం తయారీ సంస్థలకున్న స్టాక్ (నిల్వలు)ను మే 31 లోగా ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు (జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ల ధర్మాసనం) ఆదేశించింది. బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నందున.. తయారీ, నిల్వలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. -
అమరావతికి ఆభరణాల్లా రోడ్లు
ఏడు రహదారులకు సీఎం శంకుస్థాపన మంగళగిరి: రాజధాని అమరావతికి మకుటాయమానంగా నిలవనున్న సప్త రహదారులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడు రహదారులతో అమరావతి రూపురేఖలు మారతాయన్నారు. ఒక్కో రోడ్డు అమరావతి నగరానికి వడ్డాణం, నెక్లెస్, డైమండ్‌లా ఉంటాయన్నారు. అమరావతికి అనుసంధానంగా నిర్మించనున్న ఏడు రోడ్లకు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం గ్రామంలో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరం గసభలో మాట్లాడుతూ.. అమరావతిని కలుపుతూ తూర్పు పడమర దిశలలో మూడు రోడ్లు, ఉత్తర, దక్షిణాలను కలుపు తూ నాలుగురోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజధానికి ఉండవల్లి, పెనుమాక, నిడ మర్రు గ్రామాలకు చెందిన రైతులు సహరించకపోవడం బాధాకరమన్నారు. ఏడాదిలో దేవాన్ష్ ఆడుకునేలా చేస్తా.. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపార్థసారథి మాట్లాడుతూ విజయవాడలో కానీ రాజధానిలో కానీ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ ఆడుకునేందుకు అవకాశం లేదని, ఏడాదిలో రహదారులు, పార్కులు పూర్తిచేసి దేవాన్ష్ ఆడుకునేలా చేస్తానని అన్నారు. -
హైవే.. నోవే!
► జాతీయ, రాష్ట్ర రహదారులకు దూరంగా మద్యం షాపులు ► ఏ మద్యం షాపైనా 500 మీటర్ల దూరంలో ఉండాల్సిందే ► మద్యం షాపులపై కొరడాఝుళిపించిన సుప్రీంకోర్టు ► మార్కాపురం ప్రాంతంలో144 షాపులకు ముప్పు ► ఆందోళనలో మద్యం వ్యాపారులు మార్కాపురం: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సుప్రీంకోర్టు మద్యం షాపులపై కొరడా ఝుళిపించింది. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పును ఈ నెల 31వ తేదీలోపు అమలు చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించటంతో ఒక్కసారిగా మద్యం షాపుల యజమానుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో మాత్రమే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, గిద్దలూరు, దర్శి, పొదిలిలో ఎక్సైజ్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 169 వైన్‌షాపులు నడుస్తున్నాయి. సమీపించిన గడువు: సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం రోడ్డుకు దగ్గరలో ఉన్న (సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం) 144 షాపులను జనవాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల యజమానులతో మాట్లాడుతున్నారు. షాపులను అత్యవసరంగా తొలగించాలని ఆదేశించడంతో వ్యాపారులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రతి మండల కేంద్రం రాష్ట్ర, లేదా జాతీయ రహదారికి అనుబంధంగా ఉంది. ఇప్పటి వరకూ ఎక్సైజ్ అధికారులు గుడికి, బడికి 100 మీటర్ల దూరం ఉంటే చాలనే నిబంధన ప్రకారం 2015లో మద్యం షాపులకు లైసెన్స్‌లు ఇచ్చారు. తాజా నిబంధనలతో పరిస్థితి తారుమారైంది. మార్కాపురం పట్టణంలో 13, దర్శిలో 7, తాళ్లూరులో 4, రాజంపల్లిలో 1, పొదిలిలో 6, దొనకొండలో 3, దోర్నాలలో 3, కంభంలో 5 మద్యం షాపులను రాష్ట్ర రహదారికి దూరంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 31లోపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. 2015లో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఏటా ప్రభుత్వానికి షాపు ఆధారంగా రూ.30 నుంచి రూ.45 లక్షల వరకు లైసెన్స్ ఫీజు కింద చెల్లిస్తున్నారు. మార్కాపురం సూపరింటెండెంట్ పరిధిలో ఏటా 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒంగోలు సర్కిల్ నుంచి సుమారు 54 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం తిరునాళ్ల సీజన్. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తే మద్యం షాపులన్నీ ఊరికి దూరంగా ఉంటాయి. తిరునాళ్లకు మద్యం తాగేందుకు శివారు ప్రాంతాలకు ఎవరొస్తారని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. దోర్నాల, మార్కాపురం, పెద్దారవీడు, త్రిపురాంతకం, కంభం, పొదిలి, దర్శి, కనిగిరి పట్టణాల మీదుగా పలు రాష్ట్ర, జాతీయ రహదారులున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పట్టణంలో ఉన్న షాపులను కూడా ఊరి బయటకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం తీర్పు పాటించాల్సిందే: ఈ నెల 31వ తేదీలోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణాలు తొలగిస్తాం. ఇక నుంచి వ్యాపారులు సుమారు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా యజమానులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఆర్.హనుమంతురావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మార్కాపురం. -
‘కిక్కు’పై వీడని సస్పెన్స్!
జాతీయ, రాష్ట్ర రహదారులపై 140 వైన్ షాపులు.. తరలించేందుకు ఈనెల ఆఖరుతో గడువు సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న 140 మద్యం దుకాణాలు, బార్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆయా రహదారులకు ఆనుకొని 500 మీటర్ల లోపల ఉన్న దుకాణాలను మార్చి నెలాఖరులోగా రహదారులకు దూరంగా మరోచోటకు తరలించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద స్పందించిన ఆబ్కారీశాఖ.. ఈ ఏడాది సెప్టెంబరు వరకు లైసెన్సు గడువు ముగియనున్నందున ఆయా దుకాణాలను అప్పటివరకు యధాస్థానంలో కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఈ నెలలో వచ్చే అవకాశాలున్నాయి. కాగా ఆయా దుకాణాలు ప్రధాన రహదారులు, అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాలే కావడంతో ఏకంగా 140 దుకాణాలను తొలగించే అవకాశం ఉంది. దీంతో మిగతా దుకాణాల యజమానులు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగించడం, సమయపాలన పాటించకపోయే ప్రమాదం కూడా ఉందని ఆబ్కారీశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకొని ఉన్న కల్లు దుకాణాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుండడంతో కల్లు సొసైటీల సభ్యులు కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా దిల్సుఖ్నగర్– ఎస్.ఆర్.నగర్ రూట్లో అధికంగా మద్యం దుకాణాలు, బార్లు ఈ జాబితాలో ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. గత నెలలో చీప్ లిక్కర్ సేల్స్ అదుర్స్ సిటీని గుడంబా రహిత నగరంగా తీర్చిదిద్దడంలో నగర ఆబ్కారీశాఖ విజయం సాధించడంతో ఇప్పుడు అల్పాదాయ వర్గాలు, దినసరి కూలీలు చీప్ లిక్కర్‌పై మక్కువ చూపుతున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. దీంతో చీప్‌లిక్కర్ సేల్స్ బాగా పెరిగాయి. ప్రధానంగా గుడంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌లో ఫిబ్రవరిలో ఏకంగా 273 శాతం అమ్మకాల్లో వృద్ధి నమోదవడం గమనార్హం. ఇక మలక్‌పేట్‌లో 61 శాతం, నారాయణగూడలో 48 శాతం, గోల్కొండలో 45 శాతం, చార్మినార్ ప్రాంతంలో 36 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదవడం విశేషం. మద్యం చీర్స్ ఇక్కడే అత్యధికం.. చీప్‌లిక్కర్ స్థాయిలో కాకపోయినా రూ.700 లోపు (ఫుల్ బాటిల్) ధర ఉన్న మద్యం అమ్మకాలు కూడా నగరంలో ఫిబ్రవరి నెలలో అధికంగా జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణ మద్యంలో ధూల్‌పేట్‌లో 27 శాతం, జూబ్లీహిల్స్‌లో 24 శాతం, ముషీరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 5శాతం, చార్మినార్‌లో 11 శాతం, గోల్కొండలో 17 శాతం మేర అమ్మకాలు పెరగడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. నగరంలో 2016 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు: రూ.1621 కోట్లు 2017లో మద్యం అమ్మకాలు: రూ.1756 కోట్లు బీర్ల అమ్మకాల్లో వృద్ధి: 0.1 శాతం మద్యం అమ్మకాల్లో వృద్ధి: 9 శాతం -
సర్కారు వారి పాట పది లక్షల కోట్లు
-
సర్కారు వారి పాట పది లక్షల కోట్లు
విశాఖ సీఐఐ సదస్సులో ఒప్పందాలు ♦ అందులో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే ♦ కేంద్ర పథకమైన గ్రామీణ విద్యుదీకరణకూ ఒప్పందం ♦ టెండర్లు ఖరారైన జెన్కో సోలార్ కేంద్రంపై మళ్లీ ఎంవోయూ ♦ అమరావతి అభివృద్ధి పనులు కూడా సదస్సు ఖాతాలోనే ♦ జాతీయ రహదారులు, రింగురోడ్లపై కూడా ఒప్పందాలు ♦ సదస్సులో కంటికి కనిపించని విదేశీ కంపెనీలు ♦ కన్నెత్తయినా చూడని అంబానీ, అదానీ సంస్థలు ♦ సామర్థ్యం లేని సంస్థలతోనూ రూ.కోట్లకు ఒప్పందాలు ♦ సంతకాలకు నిరాకరించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో 665 ఒప్పందాలు జరిగాయని, వీటి విలువ రూ.10,54,590 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 22,34,096 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే ఈ ఒప్పందాల్లో సింహభాగం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే జరగడం, ఈ ఏడాది సదస్సులో విదేశీ సంస్థలేవీ కనిపించకపోవడం, ఒప్పందాలు చేసుకున్న ప్రైవేటు సంస్థలేవీ పెద్దవి కాకపోవడంతో ఒప్పందాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రిఫైనరీలో, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామని పదేళ్లుగా చెబుతున్న కేంద్రప్రభుత్వ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీలతో ఈ ఏడాది భారీ ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పదేళ్లుగా పెట్టుబడులు పెట్టని సంస్థలు ఈ ఏడాది ఎలా పెడతాయని పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఇప్పటికే టెండర్లు ఖారైన ఏపీ జెన్కో సోలార్ విద్యుత్ కేంద్రానికి కొత్తగా ఎంవోయూ చేసుకున్నట్లు చూపించారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన రెండు రింగు రోడ్లను కూడా ఒప్పందాల్లో చూపించడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని కూడా ఎంవోయూల్లో చూపించడంతో రూ.లక్షల కోట్ల ఒప్పందాల్లో నిజమైనవి ఎన్ని అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 91 ఎంవోయూలు చేసుకున్న పరిశ్రమల శాఖ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆ శాఖ కార్యదర్శి సాల్మన్ అలోఖ్యా రాజ్ తిరస్కరించడం సదస్సు జరిగిన, జరిపిన తీరుకు అద్దం పడుతోంది. సదస్సుకు ముందే ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్ళి పలు కంపెనీలను సదస్సుకు ఆహ్వానించినా స్పందన కనిపించలేదు. దీంతో ప్రతిష్ట దెబ్బతింటోందని గుర్తించిన ప్రభుత్వం తన సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రుల చేత ఒత్తిడి తెప్పించి, వారి శాఖల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నట్టు ఒప్పందాలు చేసుకుందని తెలుస్తోంది. ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, ఆర్ఈసీ... ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు ఇందులో భాగమేనని సమాచారం. రాష్ట్రానికి ఇప్పటికే వివిధ పథకాల కింద ఇచ్చామని కేంద్రం చెబుతున్న రూ.రెండు లక్షల కోట్లనూ ఈ ఒప్పందాల్లో కలిపేశారు. ఇలాంటి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి పనికి వస్తాయే తప్ప రాష్ట్రాభివృద్ధికి ఏ మాత్రం ఉపయోగపడవని పారిశ్రామిక వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులను కూడా ఎంవోయూల్లో చూపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా ఈ ఒప్పందాల్లో కలిపేసి ఉంటే ఇంకా భారీగా కనిపించి ఉండేదని ఎద్దేవా చేస్తున్నారు. గత ఏడాదీ ఇదే ఆర్భాటం.. ఫలితం శూన్యం... గత ఏడాది నిర్వహించిన సదస్సులో కూడా 331 సంస్థలతో ఎంవోయూలు కుదిరాయని, రూ. 4.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఆర్భాటంగా ప్రకటించింది. ఏడాది గడిచినా ఒక్క ఒప్పందమూ వాస్తవరూపం దాల్చలేదు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో 228 కంపెనీలు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమా రాలేదని, ఏ ఒక్కరికీ ఉపాధి లభించలేదని ప్రభుత్వమే సమాచార హక్కు చట్టం ద్వారా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందించిన వివరాల్లో పేర్కొంది. కేవలం రూ.5,980 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు గణతంత్ర దినోత్సవంనాడు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.రెండు లక్షల కోట్లకు పైనే వచ్చేశాయని పదే పదే చెప్పడమే కాకుండా తాజాగా విశాఖ సదస్సులో కూడా ప్రకటించారు. గత ఏడాది సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆదానీ, అంబానీ, చైనా, జపాన్ కంపెనీల నుంచి కనీసం ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. ఈ ఏడాది సదస్సులో ఆ కంపెనీల జాడ కానరాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వాస్తవాలను దాచిపెట్టి రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. విదేశీ పర్యటనలు, పారిశ్రామిక సదస్సుల పేరిట రూ.కోట్లు వెచ్చిస్తూనే ఉంది. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులనే కొత్తగా వచ్చినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తోంది. సామర్థ్యంలేని సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని అరచేతిలో స్వర్గం చూపిస్తోంది. పాత వాటికే కొత్త రంగు విశాఖ సదస్సులో జరిగిన ఎంవోయూల జాబితాలో సింహభాగం ఇంధన, మౌలిక వసతుల పెట్టుబడులనే చేర్చారు. వీటిల్లో చాలావరకూ ఇప్పటికే ఉన్నాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధం లేనివి. ఇంకొన్ని పట్టుమని వందమందికి కూడా ఉపాధి చూపలేని పరిశ్రమలు కావడం గమనార్హం. ► అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఏపీజెన్కో 500 మెగావాట్లతో సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు ఏడాది కిందటే పిలిచారు. అప్పట్లో టెండర్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీటిని రద్దు చేసి, మళ్ళీ గత నెల ఖరారు చేశారు. దీన్ని కొత్తగా తీసుకొచ్చినట్టు పేర్కొంటూ సదస్సులో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ► గ్రామీణ విద్యుదీకరణ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. గడచిన రెండేళ్ళుగా ఇది అన్ని రాష్ట్రాల్లోనూ నడుస్తోంది. తాజాగా మళ్ళీ ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్, ఈపీడీసీఎల్ మధ్య ఒప్పందం చేసుకున్నారు. వాస్తవానికి ఈఈఎస్ఎల్ పెట్టుబడి ఇందులో ఉన్నప్పటికీ, ప్రతీ పైసా విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలే చెల్లించాలి. ఇది పెట్టుబడి ఎలా అవుతుందో సర్కారుకే తెలియాలి. ► కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ గత పదేళ్ళుగా రాష్ట్రంలో రిఫైనరీలు, పెట్రో కెమికల్ కాంప్లెక్సులు ఏర్పాటు చేస్తామని చెబుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటివరకూ ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. తాజాగా కాకినాడలో రిఫైనరీ, కాంప్లెక్స్ పెడతామని ఎంవోయూ చేసుకుంది. గత ఏడాది విశాఖపట్టణంలో రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ లేకపోవడం గమనార్హం. హా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఎంవోయూలు చేసుకున్నారు. వాస్తవానికి ఆ కంపెనీలు ఏమేర ఉత్పత్తి చేస్తాయి? వాటిని ఎలా వాడుకుంటారు? అనే విషయాలను ఏపీఈఆర్సీ పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ఇవేవీ లేకుండానే ఊరు పేరు లేని కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. ► గన్నవరం రన్‌వే విస్తరణ, కొత్త టర్మినల్‌కు సంబంధించిన శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు గత నెలలోనే జరిగాయి. దీన్ని కూడా కొత్త ఎంవోయూగా చూపించి, దీని ద్వారా రూ.780 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ► రాష్ట్రవ్యాప్తంగా మినీ థియేటర్లను ఏర్పాటు చేస్తామని ఒక కంపెనీ ముందుకొచ్చింది. జిల్లాకు రూ.25 కోట్లు వెచ్చి స్తామని తెలిపింది. ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు, తాము ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలమని, ఎంవోయూ అయిన తర్వాత ప్రతీ జిల్లాలోనూ వేరెవరి ద్వారానైనా పెట్టు బడులు తెస్తామని తెలిపారు. ఈ సంస్థ కూడా ఎంవోయూల జాబితాలో ఉంది. ► విజయవాడలో చిన్న తరహా త్రీడీ ప్రింటింగ్ కంపెనీ రూ.కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ఎంవోయూ సందర్భంగా ప్రభుత్వం చెప్పడం గమనార్హం. సంతకాలకు నిరాకరించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి పరిశ్రమల శాఖ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆ శాఖ కార్యదర్శి సాల్మన్ అలోఖ్యా రాజ్ తిరస్కరించడం పరిశ్రమల వర్గాలను విస్మయ పరిచింది. విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సులో పరిశ్రమల శాఖ 91 ఎంవోయూలు చేసుకుంది. ప్రతీశాఖలోనూ ప్రభుత్వం తరపున ఆ శాఖ కార్యదర్శులే సంతకాలు పెట్టారు. ఇదే విధంగా సాల్మన్‌ను కూడా సంతకాలు పెట్టాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. ఎంవోయూలన్నీ కేపీఎంజీ ఎంపిక చేసినవే కావడం, వీటికి ఎంతమాత్రం విశ్వసనీయత లేదని ఆయన గుర్తించడం వల్లే సంతకాలు చేసేందుకు వెనుకాడినట్టు సమాచారం. కార్యదర్శి ఇష్టపడకపోవడంతో పరిశ్రమలశాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రాతో ఎంవోయూలపై సంతకాలు చేయించారు. ఈ విషయమై సాల్మన్‌రాజును ‘సాక్షి’ వివరణ కోరగా... ఎంవోయూలపై మిశ్రా సంతకాలు పెడతారని, తనతో పనేమిటని అనడం గమనార్హం. ఎక్కడబడితే అక్కడే ఎంవోయూలు! పెట్టుబడుల ఒప్పందం చేసుకునే సంస్థల ఆర్థిక పరిస్థితిని ముందుగా గమనించాలి. వాటి విశ్వసనీయతను గుర్తించిన తర్వాత ఎంవోయూలకు సిద్ధపడాలి. కానీ ఈ తరహా కసరత్తు జరిగినట్టు ఎక్కడా కన్పించలేదు. అసలు ఎంవోయూలు చేసుకునే పరిశ్రమలను భారత పరిశ్రమల సమాఖ్య, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ తీసుకురావడం గమనార్హం. సీఐఐ పిలిచింది కాబట్టే తాము వచ్చామని సోలార్ ఎనర్జీలో ఎంవోయూ చేసుకున్న ఓ పారిశ్రామిక వేత్త అన్నారు. నిజానికి రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం కూడా ఈ సంస్థకు లేదు. మరోవైపు ఎంవోయూలు జరిగిన తీరు చాలా విడ్డూరంగా ఉంది. హాల్లో... నేలపై... ఆరుబయట.... ఇలా ఎక్కడబడితే అక్కడే ఎంవోయూలు చేసుకున్నారు. అధికారులు వాటిని పూర్తిగా పరిశీలించిన పాపాన కూడా పోలేదు. వెయిటింగ్ హాల్లో కొన్ని సంస్థలకు చెందిన ఎంవోయూ పత్రాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సోలార్ కార్పొరేషన్, నెడ్‌క్యాప్ అధికారులు వాటిని కుదుర్చుకున్నట్టే భావించి సంతకాలు పెట్టి మమ అన్పించారు. -
అప్పు చేసైనా రోడ్లేస్తాం: తుమ్మల
మా హయాంలోనే పూర్తి చేస్తాం మంజూరు చేసిన రోడ్లపై మంత్రి వ్యాఖ్యలు హైదరాబాద్: అనుమతులిచ్చిన రోడ్లను తమ హయాంలోనే, రెండున్నరేళ్లలోనే పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. నిధుల విషయంలో ఆందోళన అవసరం లేదని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం చెప్పారని, ఎంతైనా ఇస్తామన్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారులుగా (ఎన్‌హెచ్) అభివృద్ధి చేసేవన్నీ టోల్ రోడ్లేనని, వాటి విషయంలో ఆందోళనే అవసరం లేదని వివరించారు. మరీ అవసరమైతే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులెలా వచ్చాయో.. అలాగే రోడ్లకూ తీసుకొస్తామని, అప్పు చేసైనా రోడ్లను వేస్తామని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జి’లు అంశంపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 21 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు వేశామని, అందులో రూ. 13,360 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో వేసిన రోడ్లు తొందరగా దెబ్బతిన్నాయని, అందుకే రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్ ప్రమాణాలతో వేసేందుకు చర్యలు చేపట్టడం వల్ల మొదటి ఏడాది ఆలస్యమైందన్నారు. పక్క రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్రంలో రోడ్లు వేయాలన్నదే తమ ఆలోచనని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేస్తామని మంత్రి వివరించారు. రూ.100 కోట్లతో హైదరాబాద్ ఎన్‌హెచ్‌ల అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర మంత్రి గడ్కరీ సుముఖంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించారని, ఇంకా రూ. 2,500 కోట్ల రోడ్లకు ప్రతిపాదనలను పంపిస్తామన్నారు. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లోని ఎన్హెచ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రైపోర్టు అధ్యయనాన్ని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించామని.. ఇప్పటివరకు భువనగిరి, జహీరాబాద్, జడ్చర్లను పోర్టుల కోసం గుర్తించారని తెలిపారు. ఇంకా ఒకటీ రెండు ప్రాంతాలు ఉంటాయని, తుది నివేదిక రాగానే చర్యలు చేపడతామని చెప్పారు. గోదావరిపై అన్ని బిడ్జిలను జల రవాణకు అనుగుణంగా నిర్మిస్తున్నామని, భద్రాచలం నుంచి మహారాష్ట్రకు జల రవాణాపై కేంద్రం ఆసక్తిగా ఉందన్నారు. బీటీ వేసిన పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బీ రోడ్లుగా మార్చుతామని, మండల కేంద్రాల నుంచి కొత్త జిల్లాలకు భవిష్యత్తులో నాలుగు లేన్ల రోడ్లు వేస్తామన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో మాత్రం డబుల్ రోడ్లను వేస్తామని మంత్రి వివరించారు. -
హైవేలపై మద్యం దుకాణాలు మూసేయండి
ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం ► లైసెన్స్ లను మార్చి 31 తర్వాత రెన్యువల్ చేయొద్దు ► దీన్ని ఆదాయ మార్గంగా చూడొద్దు ► సాధారణ ప్రజల ప్రాణాలను పరిగణనలోకి తీసుకోవాలి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం దుకాణా లను మూసేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసే వరకు మాత్రమే ఈ దుకాణాలను నిర్వహించుకోవచ్చంది. వచ్చే ఏడాది మార్చి 31 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి లైసెన్స్ లను రెన్యువల్ చేయరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి లిక్కర్ విక్రయాలను సూచించే బ్యానర్లన్నంటినీ తొలగించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడుతుండడంపై ఇటీవల సుప్రీం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిం దే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదా రులపై ఉన్న అన్ని మద్యం దుకాణాల్ని మూసివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం విక్రయాలు జరగ కుండా చూసేలా ఎక్సైజ్ చట్టాలను సవరించాలంటూ దాఖలైన పలు వినతుల నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. హైవేల సమీపంలో లిక్కర్ షాపులకు అనుమతి ఇవ్వాలని, ఇందుకోసం నిబంధనలు సడలించాలన్న పంజాబ్ ప్రభుత్వం వైఖరిని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టింది. మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికుందని గుర్తు చేస్తూ.. సాధారణ ప్రజల మేలుకోసం చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. అదే సమయంలో వివిధ రాష్ట్రాలు సైతం రోడ్ల వెంబడి ఉన్న లిక్కర్ షాపుల్ని తొలగించడంలో నిర్లక్ష్యం చూపడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం తాగి వాహనాలు నడపడం పెరిగిపోతున్నదని, దీని ఫలితంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్ల వెంబడి లిక్కర్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఒక ఆదాయ మార్గంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు చూడరాదని హితవు పలికింది. ఈ విషయంలో కేంద్రం సైతం నిర్మాణాత్మకంగా వ్యవహరించక పోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. -
మద్యం అమ్మకాలపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: రహదారుల పక్కన మద్యం షాపుల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న షాపుల లైసెన్సులను రెన్యువుల్ చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది. జాతీయ, రాష్ట్రాల హైవేలకు మద్యం షాపులు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది. హైవేల పక్కన మద్యం అమ్మకాల వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మద్యం షాపులను మూసివేయించాలని పేర్కొంది. -
రోడ్లన్నీ ఛిన్నాభిన్నం
- రాష్ట్రంలో 1,500 కిలోమీటర్లకుపైగా దెబ్బతిన్న రహదారులు - దెబ్బతిన్న వంద కల్వర్టులు, వంతెనలు - 200 ప్రాంతాల్లో భారీగా కోత.. 43 చోట్ల గండ్లు - నష్టం ప్రాథమిక అంచనా రూ.500 కోట్లకుపైనే! సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో రోడ్లు కోతకు గురికాగా.. పలు చోట్ల కల్వర్టులు, వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల పొడవునా ఆనవాళ్లు కూడా లేనంతగా పాడైపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖ ఆధీనంలోని 1,000 కిలోమీటర్లకుపైగా రహదారులు, పంచాయతీ రాజ్ శాఖ అధీనంలోని 582 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని... మొత్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నా.. భారీ వరద వస్తే బలహీనంగా ఉన్న చోట రోడ్లు నిలిచే పరిస్థితి లేదు. భారీగా దెబ్బతిన్న కల్వర్టులు రాష్ట్రవ్యాప్తంగా 100 కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. 200 చోట్ల వంతెనలు, కల్వర్టు గోడలు దెబ్బతిన్నాయి. 71 ప్రాంతాల్లో రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులు బాగా దెబ్బతిని గుంతలు పడ్డాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నష్టం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 248 కి లోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 43 చోట్ల రోడ్లకు గండ్లుపడ్డాయి. కొత్త వంతెనలు, కల్వర్టుల నిర్మాణం కోసం వాహనాలను దారి మళ్లింపునకు నిర్మించిన తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లా ఖన్సాన్పల్లి-ఖదీరాబాద్ రోడ్డు, కావెలి-కోహిర్-తుర్మామిడి రోడ్డుపై ఉన్న వంతెనలు కిలోమీటరు మేర ధ్వంసమయ్యాయి. కొడకల్-జగదేవ్‌పూర్ మార్గంలో రోడ్డు కొట్టుకుపోయింది. తాత్కాలిక మరమ్మతులకు రూ.50 కోట్లు రోడ్లు దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో.. యుద్ధప్రాతిపాదికన తాత్కాలిక మరమ్మతులు పూర్తిచేసి, రాకపోకలను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దీంతో రోడ్లు భవనాల శాఖ దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టింది. కాగా రహదారులకు జరిగిన నష్టంపై రోడ్లు భవనాల శాఖ మధ్యంతర నివేదికను సిద్ధం చేస్తోంది. బాగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులు కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ అధికారులు సేకరించిన ప్రాథమిక వివరాల మేరకు తొమ్మిది జిల్లాల్లో 582 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.21.63కోట్లు అవసరమని, శాశ్వత మరమ్మతుల కోసం మరో రూ.126.03 కోట్లు కావాలంటూ అధికారులు నివేదిక సమర్పించారు. మొత్తంగా రూ.147.66కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. అత్యవసర కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాయి. ప్రజల నుంచి వచ్చే ఫోన్లకు 24 గంటల పాటు అందుబాటులో ఉండటంతో పాటు.. అందుకు అనుగుణంగా స్పందించే యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్‌ల వద్ద అధికారులు సిద్ధంగా ఉంచారు. సచివాలయంలో 040-23454088, జీహెచ్ఎంసీలో 21111111, విద్యుత్ శాఖలో 1912100, 7382072104, 7382072106, 9490619846, నీటిపారుదల శాఖలో 040-23390794 నంబర్లకు ఫోన్లు చేయాలని తెలిపారు. -
ప్రగతిపథంలో కామారెడ్డి
కామారెడ్డి : గతంలో కామారెడ్డి ప్రాంతాన్ని కోడూరు అని పిలిచేవారు. కాలక్రమంలో కామారెడ్డిగా మారింది. మూడు జిల్లాల కూడలి ప్రాంతం కావడంతో రోజురోజుకు అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఆశ్రయమిచ్చింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందినవారే కాకుండా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలూ స్థిరపడ్డారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు తమదైన ముద్రవేశాయి. ఆర్థికంగా ఎదిగాయి. విద్యాసుగంధాలు.. కామారెడ్డి విద్యారంగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉంది. 1964లో ప్రజల భాగస్వామ్యంతో కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 264 ఎకరాల వైశాల్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ఈ కళాశాల తరువాతి కాలంలో ప్రభుత్వపరమైంది. ఈ కళాశాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులున్నాయి. బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఏ రూరల్ ఇండస్ట్రీ వంటి కోర్సులతో కాలేజీ రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ప్రత్యేక కోర్సులు చదివిన వేలాది మంది ఈ ప్రాంతవాసులు దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. కాలేజీలో పీజీ కోర్సులు కూడా ఉన్నాయి. గతంలో ఇదే కళాశాలలో బీఎస్సీ డెయిరీ కోర్సుగా ఉండి, తరువాత బీటెక్ డెయిరీగా రూపాంతరం చెందింది. ఈ కోర్సు ఉన్న ఏకైక కళాశాల ఇదే.. ఇక్కడ డెయిరీ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కావాల్సిన వనరులు కూడా ఉన్నాయి. డెయిరీ కాలేజీలో ఎంటెక్ డెయిరీ ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీఈడీ, డీఈడీ, వృత్తి విద్యా కోర్సులను బోధించే ప్రైవేట్ కళాశాలలెన్నో ఉన్నాయి. కామారెడ్డికి పది కిలోమీటర్ల దూరాన తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ సౌత్ క్యాంపస్ ఉంది. వ్యాపారంలో అగ్రగామి కామారెడ్డి పట్టణం వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా మారింది. ముఖ్యంగా బెల్లం వ్యాపారానికి కామారెడ్డి గంజ్ పెట్టింది పేరు. ఇక్కడ ఏటా వేలాది టన్నుల బెల్లం వ్యాపారం సాగేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లంపై విధించిన ఆంక్షలతో వ్యాపారం కొంత దెబ్బతిన్నప్పటికీ.. వ్యాపారం కొనసాగుతోంది. అలాగే మెడికల్ వ్యాపారంలో కామారెడ్డి తెలంగాణలోనే నంబర్‌వన్‌గా ఉంది. 80కి పైగా హోల్‌సెల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయిక్కడ. ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లోని 20కి పైగా జిల్లాలు, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా మందులు సరఫరా అవుతున్నాయి. వస్త్ర వ్యాపారంలో కూడా కామారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్లోలాగే భారీ షాపింగ్‌మాల్స్ ఉన్నాయి. జిల్లావాసులే కాకుండా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందినవారూ ఇక్కడికి వచ్చి దుస్తులు కొనుగోలు చేస్తుంటారు. గతంలో రైస్‌మిల్ దందాలో కూడా కామారెడ్డి అగ్రభాగాన ఉండేది. రైస్‌మిల్లర్లు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. వ్యవసాయం తరువాత ఎక్కువ కుటుంబాలు ఆధారపడి జీవించే బీడీ పరిశ్రమకు కామారెడ్డి గుండెకాయలా ఉంది. ఇక్కడ ప్రముఖ బీడీ కంపెనీల ప్రధాన కార్యాలయాలున్నాయి. స్థానికంగానూ ప్రముఖ బీడీ కంపెనీలున్నాయి. నిత్యం కోట్ల బీడీల ఉత్పత్తి జరిగి కామారెడ్డి నుంచి ఐదారు జిల్లాలే కాక పొరుగున ఉన్న మహారాష్ట్రకు భారీ ఎత్తున బీడీలు సరఫరా అవుతున్నాయి. నూనె దందాలోనూ ఇక్కడి వ్యాపారులు ముందున్నారు. కామారెడ్డి నుంచి పదికిపైగా జిల్లాలకు పెద్ద ఎత్తున నూనె రవాణా అవుతోంది. బంగారం వ్యాపారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. 60కిపైగా ఉన్న బంగారం దుకాణాల్లో భారీ ఎత్తున బంగారం విక్రయాలు సాగుతుంటాయి. ఆధ్యాత్మిక శోభ పట్టణంలో పురాతన కిష్టమ్మ గుడి, వేణుగోపాలస్వామి దేవాలయం, విఠలేశ్వరాలయాలున్నాయి. అయ్యప్ప ఆలయం, గంజ్ ధర్మశాలలో హనుమాన్ ఆలయం, విద్యానగర్‌లో సాయిబాబా ఆలయం, సిరిసిల్ల రోడ్డులో కన్యకాపరమేశ్వరి ఆలయం, హౌసింగుబోర్డులో సంకష్టహర మహా గణపతి, శారదామాత ఆలయాలు.. ఇలా ఎన్నో ఆలయాలతో కామారెడ్డి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. వినాయక చవితి ఉత్సవాలు హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ ఘనంగా జరుగుతాయి. వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర రెండు రోజుల పాటు సాగుతుంది. శ్రీరామ నవమి ఉత్సవాలు, దసరా వేడుకలు వైభవంగా సాగుతాయి. దసరా రోజున లేజర్ షో నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజున ఎడ్ల బండ్లతో పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కామారెడ్డి ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం వల్ల పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ప్రార్థన మందిరాలున్నాయి. క్రిస్టియన్ల సంఖ్య కూడా ఎక్కువే.. పట్టణంలో జైన దేవాలయం కూడా ఉంది. సాహిత్య రంగంలో.. సాహిత్య కార్యక్రమాలకు కామారెడ్డి కేంద్రబిందువుగా ఉంటోంది. ఇక్కడి కవులు, రచయితలు, కళాకారులు రాష్ట్రంలోనే పేరుపొందారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నిన్నటి తెలంగాణ ఉద్యమం దాకా.. కామారెడ్డి ప్రాంతం పోరాటాల్లోనూ ముందువరుసలో నిలిచింది. కామారెడ్డిలో దాదాపు వంద మంది కవులు, రచయితలు ఉన్నారు. ఆదర్శ కళా సమితి, హితసాహితి, జాతీయ సాహిత్య పరిషత్, సాహితీ మిత్ర, స్ఫూర్తి సాహితి, అభిలేఖిని రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం.. ఇలాæ ఎన్నో సాహితీ సంస్థలు కొనసాగుతున్నాయి. జాతీయ నేతల స్ఫూర్తి... ఇక్కడ జాతీయ భావం ఎక్కువగా కనిపిస్తుంది. జాతీయ నాయకుల పేరిట కాలనీలు, రోడ్లు ఉన్నాయి. అలాగే పలు కూడళ్లలో జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ కూడలి వద్ద ఇందిరాగాంధీ విగ్రహం, వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్న రోడ్లలో సుభాష్‌చంద్రబోస్, జయప్రకాశ్ నారాయణ్, గంజ్‌రోడ్ కూడలి వద్ద పొట్టి శ్రీరాములు, రైల్వే కమాన్ దగ్గర అంబేద్కర్, కమాన్‌కు ఇటువైపున ఆచార్య జయశంకర్, నిజాంసాగర్ కూడలి వద్ద ఒక వైపున రాజీవ్‌గాంధీ, మరోవైపు తెలంగాణ తల్లి, తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య, మున్సిపాలిటీ వద్ద మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయిపూలే దంపతుల విగ్రహాలు, ఎన్టీఆర్, వివేకానంద, ఫణిహారం రంగాచారి, జన్మభూమి రోడ్ చౌరస్తా వద్ద సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాలున్నాయి. గంజ్‌కు గాంధీ గంజ్ అన్న పేరుంది. ఇక్కడ గాంధీ విగ్రహం కనిపిస్తుంది. అడ్లూర్ రోడ్డులో ఆచార్య జయశంకర్ కాలనీ అవతరించింది. అక్కడ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
హైవేపై వాహనాల రద్దీ
చౌటుప్పల్: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు వాహనాలు బారులు దీరాయి. హైవేపై రోజుకు సరాసరి 16వేల వాహనాలు ప్రయాణిస్తుండగా, శనివారం మరో 4వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం టోల్ చెల్లించేందుకు 9గేట్లను, హైదరాబాద్ వైపు 7గేట్లను తెరిచారు. ఆదివారం హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. టోల్ ఫీజు మినహాయింపనే ప్రచారంతో.. పుష్కరాలకు వెళ్లే వాహనాలకు టోల్ ఫీజును మినహాయిస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు టోల్ చెల్లించేందుకు నిరాకరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని టోల్ చెల్లించాలని టోల్‌ప్లాజా సిబ్బందిచెప్పడంతో పలువురు వాగ్వాదానికి దిగారు. టోల్ ఫీజును వసూలు చేయొద్దని ఎలాంటి ఆదేశాలు లేవని జీఎంఆర్ అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
రహదారులకు డిసెంబర్‌కల్లా అనుమతులు
కేంద్ర మంత్రులు గడ్కారీ, తోమర్లతో తుమ్మల భేటీ సీఆర్ఎఫ్ కింద రూ.400 కోట్లు ఇస్తామన్న గడ్కారీ న్యూఢిల్లీ: తెలంగాణలో 1,951 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులకు సంబంధించిన అనుమతులను డిసెంబర్ కల్లా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కలసి జాతీయ రహదారులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సమర్పించారు. నివేదికను పరిశీలించి డిసెంబర్ కల్లా అనుమతులిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తుమ్మల చెప్పారు. గతంలో రాష్ట్రానికి సెంట్రల్ కోడ్స్ ఫండ్స్ పథకం కింద నిధులు కూడా తక్కువగా విడుదలైన విషయాన్ని గడ్కారీ దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా సీఆర్ఎఫ్ పథకం కింద రూ.800 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని వివరించారు. దీనికి గడ్కారీ స్పందిస్తూ రూ.400 కోట్లు అందిస్తామని తెలిపినట్లు తుమ్మల చెప్పారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి పెండింగ్‌లో ఉన్న రూ.1,350 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. తుమ్మల వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగాపాలాచారి, రామచంద్రు తెజావత్, ఎంపీలు వినోద్, ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ తదితరులు ఉన్నారు. ఆ మూడు జిల్లాలను కలపండి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తుమ్మల సమావేశమై గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కింద కేవలం ఖమ్మం జిల్లాను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని, రెండో దశలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్‌లను జోడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 3 జిల్లాల్లో రూ.1,590 కోట్లతో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇచ్చేందుకు రూపొందించిన నివేదికను కేంద్రానికి సమర్పించామన్నారు. త్వరలో కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను ఆమోదిస్తామని తోమర్ చెప్పినట్లు తుమ్మల తెలిపారు. -
ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం పట్టదా!
మచిలీపట్నం : రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ నిర్మించే ఔటర్ రింగ్‌రోడ్డును పాలకులు పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి అవసరమైన రూ. 19,700 కోట్లను ఇచ్చేందుకు ఓకే చెప్పింది. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ నిర్మించే ఈ రింగ్‌రోడ్డుపై రెండు జిల్లాలకు చెందిన ఎంపీలు దృష్టిసారించకపోవడంతో నిర్మాణం తీవ్ర జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారుచేసేందుకు గతంలో సింగిల్ టెండరు దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆ టెండరును రద్దు చేశారు. మళ్లీ సర్వే పనుల కోసం టెండర్లు పిలవగా మళ్లీ సింగిల్ టెండరే వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి. అసోసియేట్స్ సంస్థ ఈ టెండరును దాఖలు చేసినట్లు జాతీయ రహదారుల విభాగం అధికారులు చెబుతున్నారు. రెండోసారి సింగిల్ టెండరు దాఖలైన నేపథ్యంలో ఈ టెండరును ఈ నెలాఖరు నాటికి ఖరారు చేసే అవకాశం ఉంది. సర్వే పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన అనంతరం 11 నెలల వ్యవధిలో నివేదిక తయారుచేసి ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రం విడిపోకముందు వీజీటీఎం ఉడా మాస్టర్ ప్లాన్‌ను ఆర్.వి. అసోసియేట్స్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం అమరావతి మాస్టర్ ప్లాన్‌లోని 1.2 కిలోమీటర్ల వేలాడే వంతెనకు ఈ సంస్థ నమూనా రూపొందించినట్లు సమాచారం. పాలకులు రాజధాని నిర్మాణంపైనే దృష్టిసారిస్తున్నారని, ఏడాదిన్నర నుంచి రింగ్‌రోడ్డు ఊసే ఎత్తడం లేదనే వాదన వినబడుతోంది. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తే దానివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రాథమిక అంచనా ఇలా అమరావతి రాజధాని చుట్టూ తొలుత 180 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే ఆమోదించింది. గత ఏడాది డిసెంబరులో విజయవాడ వచ్చిన జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ద్వారా ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని ప్రకటన చేయించారు. అనంతరం ఈ రోడ్డును 180 కిలోమీటర్లకు బదులుగా 210 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. 500 అడుగుల వెడల్పున భూసేకరణ చేయాలని నిర్ణయించారు. సుమారు 7,500 ఎకరాల భూమి అవసరం కాగా భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎనిమిది లేన్లుగా ఈ రహదారిని నిర్మించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా రెండు సర్వీసు రోడ్లు వస్తాయి. ఎనిమిది లైన్ల రహదారిపై కార్లు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేస్తారు. ఈ రహదారిని ఎక్స్‌ప్రెస్ వేగా పిలుస్తారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై కొల్లిపర-పెదఓగిరాల మధ్య ఒక వంతెన, చెవిటికల్లు-అమరావతి మధ్య మరో వంతెన నిర్మించాలని ప్రాథమిక అంచనాగా ఉన్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు అంటున్నారు. ఈ వంతెనల నిర్మాణం పైనే ఔటర్‌రింగ్ రోడ్డు నమూనా ఆధారపడి ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. భూసమీకరణా.. భూసేకరణా! ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి 7,500 ఎకరాల మేర భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భూసేకరణ లేక భూసమీకరణ చేస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. భూసమీకరణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు జాతీయ రహదారుల విభాగం అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయే రైతులకు భూసమీకరణ నిబంధనల ప్రకారం ప్రభుత్వం సేకరించే అటవీ భూముల్లో భూమిని కేటాయించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
‘రోడ్ సైడ్’ టై
సిటీబ్యూరో/నల్లకుంట: సువిశాల జాతీయ రహదారుల పైనే కాదు... అంతంతమాత్రంగా ఉండే నగర రోడ్ల పైనా భారీ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఫలితంగా తమ ప్రమేయం, నిర్లక్ష్యం లేకుండానే పాదచారులు అశువులు బాస్తున్నారు. శుక్రవారం విద్యానగర్‌లో స్కూలు వ్యాన్ బీభత్సంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఈ కోవకు చెందినదే. ఇలాంటి ఘటనలకు అటు డ్రైవర్లు, ఇటు వాహనాల ఫిట్నెస్ లోపాలే ప్రధాన కారణంగా తేలుతోంది. ‘ఖాళీ’ సమయాల్లోనే... నగరంలో ఈ తరహా ప్రమాదాలన్నీ ‘నాన్-పీక్ అవర్స్’గా పిలిచే రద్దీ లేని వేళల్లోనే చోటు చేసుకుంటున్నాయి. రహదారులు పక్కాగా లేకపోయినా... ఆ సమయాల్లో రోడ్లపై రద్దీ తక్కువగా ఉండటంతో వాహన చోదకులు దూసుకుపోతున్నారు. తాము నడుపుతున్న వాహనం ఫిట్నెస్, తమ సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా హఠాత్తుగా అదుపు తప్పుతున్న వాహనాలు రహదారులపై ఉన్న వారి ప్రాణాలు తోడేస్తున్నాయి. ప్రైవేట్ వాహనాలే కాదు... సుశిక్షుతులైన డ్రైవర్లుగా పరిగణించే వ్యక్తులు నడిపే ఆర్టీసీ బస్సులూ ఈ కోవలోకి చేరుతున్నాయి. ఈనెల 21న తెల్లవారుజామున ఉప్పల్-రామాంతపూర్ ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య విధుల్లో ఉన్న కార్మికురాలు కొమరమ్మను ఆర్టీసీ బస్సు బలిగొంది. శుక్రవారం నాటి మెటాడోర్ ప్రమాదమూ ఉదయం 6-7 గంటల మధ్యే జరిగింది. డ్రైవర్ల ‘ఉల్లంఘనలూ’ తోడవుతున్నాయి ఈ తరహా ప్రమాదాలకు డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేయడమూ ఓ కారణంగా కనిపిస్తోంది. సిటీలోని అనేక ప్రాంతాల్లో... ప్రధానంగా కీలక రహదారులపై, కూడళ్ల వద్ద వేగాన్ని నియంత్రించుకోవాల్సిన డ్రైవర్లు దాన్ని బేఖాతరు చేస్తూ దూసుకుపోతున్నారు. దీంతో హఠాత్తుగా కనిపించే, ఎదురు వచ్చే పాదచారులను తప్పించలేక వారి ఉసురు తీస్తున్నారు. ఇంకొందరు ప్రైవేట్ డ్రైవర్లు ఏకంగా సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రాణాలు బలిగొంటున్నారు. జనవరి 9న సూరారం రాజీవ్ గృహకల్పలో రెండేళ్ల చిన్నారి ధనుష్‌ను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండటమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం గమనార్హం. ‘కాల పరిమితి’ నామ్‌కే వాస్తేనే... రహదారులపై సంచరించే వాహనాలకు మోటారు వాహనాల చట్టం కాల పరిమితిని విధించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నిత్యం ఫిట్నెస్ పరీక్షలు చేస్తూ.. సామర్థ్యంతో ఉన్న వాటినే అనుమతించాల్సిన బాధ్యత ఆర్టీఏపై ఉంది. ఈ నిబంధనలు పక్కాగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. విద్యానగర్‌లో వ్యక్తి ప్రాణం తీసిన మెటాడోర్ వ్యాన్ సైతం 1980లలో రోడ్డు ఎక్కింది. అప్పటి నుంచి నిర్విరామంగా ‘పని’ చేస్తూనే ఉండటంతో ఫిట్నెస్ కోల్పోయి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. గత నెల 27న నగరంలోని మూడు ప్రాంతాల్లో భారీ వాహనాలు ‘అదుపు తప్పాయి’. ఉప్పల్, రాజేంద్రనగర్‌లలో లారీలు, బంజారాహిల్స్ ప్రాంతంలో బస్సు దూసుకు వచ్చేయడంతో ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. అనేక మంది క్షతగాత్రులుగా మారడంతో పాటు కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మూడు ఉదంతాల్లో డ్రైవర్లలో ‘ఫిట్నెస్’ లోపమే కారణమని తెలుస్తోంది. ‘రవాణా’ పట్టదా? ఫిట్నెస్ సరిగా లేని వాహనాల్లో పాఠశాలల విద్యార్థులను తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు ఉన్నాయి. లక్కీ కేఫ్ చౌరస్తా వద్ద బ్రేక్‌లు ఫెయిలై... ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకున్న వాహనాన్ని రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన బి.లక్ష్మణ్ నిర్వహిస్తున్నారు. తార్నాకలోని సెయింట్ యాన్స్ పాఠశాలకు నిత్యంవిద్యార్థులను చేరవేస్తుంటాడు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు కచ్చితంగా పసుపు రంగులో ఉండాలి. ఆ పాఠశాల పేరు, ఫోన్ నంబర్లు వాహనంపై రాసి ఉంచాలి. ఇవేవీ లేకుండానే ఈ వాహనం దూసుకుపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. -
రాజన్న రహదారులకు మహర్దశ
జాతీయ రహదారులుగా గుర్తింపు ఎంపీ వినోద్‌కుమార్ వెల్లడి వేములవాడ : ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారుల అనుసంధానంలో వేములవాడ రాజన్నను చేర్చినట్లు ఎంపీ వినోద్‌కుమార్ ప్రకటించారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వై-జంక్షన్ లాగా వేములవాడ చుట్టూ ఉన్న రహదారులు జాతీయ హోదాకు మారనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా రోడ్ల నిర్వహణ సక్రమంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే జగిత్యాల, కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు, వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా సూర్యపేట వరకు, వేములవాడ నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు జాతీయ రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దీంతో వేములవాడ రాజన్న భక్తులకు సులువుగా వేములవాడకు చేరుకునే మార్గాలు సుగమం అయ్యాయని అన్నారు. ఇంతేగాకుండా వేములవాడ రాజన్న క్షేత్రం అభివృద్ధి కోసం అథారిటీ కమిటి ఏర్పాటు చేశామని, త్వరలోనే అభివృద్ధి పనులకు మోక్షం లభిస్తోందన్నారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్, సెస్ డెరైక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, కౌన్సిలర్లు కూరగాయల శ్రీనివాస్, నిమ్మశెట్టి విజయ్, కుమ్మరి శ్రీనివాస్, ముద్రకోల వెంకటేశ్, నాయకులు నామాల లక్ష్మిరాజం, రాపెల్లి శ్రీధర్, శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
రహదారులకు రాజయోగం
♦ దాదాపు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు ♦ బడ్జెట్లో రోడ్లు, హైవేలకు రూ. 55,000 కోట్లు ♦ ఎన్హెచ్ఏఐ బాండ్ల ద్వారా రూ. 15,000 కోట్లు ♦ గ్రామీణ సడక్ యోజనకు రూ. 19,000 కోట్లు ♦ పథకంలో రాష్ట్రాల వాటా మరో రూ. 8,000 కోట్లు ♦ మొత్తం రూ. 97 వేల కోట్లతో రోడ్లకు మహర్దశ ♦ 2019 నాటికే అన్ని గ్రామాలకూ రోడ్ల అనుసంధానం ♦ వచ్చే ఏడాదిలో 10 వేల కి.మీ. హైవేల నిర్మాణం ♦ నేషనల్ హైవేలుగా 50 వేల కిలోమీటర్ల రాష్ట్ర హైవేలు ♦ రోడ్డు ప్రయాణంలో ప్రయివేటు రంగానికి అవకాశం ♦ వాహనాలపై 1 నుంచి 4 శాతం వరకూ ఇన్ఫ్రా సెస్సు న్యూఢిల్లీ: మౌలిక వసతుల రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. 2016-17 బడ్జెట్లో 2.21 లక్షల కోట్ల నిధులను అందుకోసం కేటాయించింది. ఇందులో దాదాపు లక్ష కోట్ల రూపాయలను కేవలం రహదారుల నిర్మాణం కోసమే వెచ్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) సహా దేశంలో రహదారుల రంగానికి రూ. 97 వేల కోట్లు కేటాయించారు. జాతీయ రహదారులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ.. రోడ్లు, హైవేలకు భారీగా రూ. 55,000 కోట్లు ఇచ్చారు. దీనికి అదనంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బాండ్ల రూపంలో రూ. 15,000 కోట్లు సమీకరించి ఖర్చు చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఇక పీఎంజీఎస్‌వై కోసం మరో రూ. 19,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. సడక్ యోజన నిధులకు రాష్ట్రాల వాటా రూ. 8,000 కోట్లు కలుస్తుందని చెప్పారు. మొత్తం కలిపి రూ. 97,000 కోట్లతో దేశంలో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించారు. 2019 నాటికి అన్ని గ్రామాలకూ రోడ్లు... ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని మునుపెన్నడూ లేని విధంగా తాము అమలు చేస్తున్నట్లు జైట్లీ చెప్పారు. గతంలో నిధుల కేటాయింపులు స్వల్పంగా ఉండటం వల్ల ఈ పథకం దెబ్బతిన్నదన్నారు. 2012-13లో ఈ పథకానికి రూ. 8,885 కోట్లు, 2013-14లో రూ. 9,805 కోట్లు మాత్రమే కేటాయించారని.. తాము గత రెండేళ్లలో గణనీయంగా నిధులు పెంచామని తెలిపారు. తాజా బడ్జెట్లో ఈ పథకం కింద.. కేంద్రం కేటాయించిన రూ. 19,000 కోట్ల నిధులకు రాష్ట్రాల వాటా కలిపి మొత్తం రూ. 27,000 కోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యయం చేయటం జరుగుతుందన్నారు. దేశంలో మిగిలి వున్న 65 వేల అర్హమైన గ్రామాలనూ ఈ పథకం కింద 2021 నాటికి 2.23 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని 2019 నాటికే పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు జైట్లీ తెలిపారు. అలాగే.. 2011-14 మధ్య సగటున రోజుకు 73.5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగితే అది ప్రస్తుతం 100 కిలోమీటర్లకు పెరిగిందని.. దీనిని మరింతగా పెంచుతామని చెప్పారు. ఇక.. దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల రాష్ట్ర హైవేలను వచ్చే ఏడాదిలో జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నిలిచిపోయివున్న రూ. లక్ష కోట్లకు పైగా రోడ్డు ప్రాజెక్టుల్లో 85 శాతం ప్రాజెక్టులను మొదలు పెట్టటం, వచ్చే ఏడాది 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు. రోడ్డు రవాణాలో ప్రయివేటుకు అవకాశం... అలాగే.. రహదారుల రంగం అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్న ‘పర్మిట్ రాజ్’ (అనుమతుల విధానం)ను తొలగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం.. రహదారులపై ప్రయాణ రవాణాను మరింత సమర్థవంతంగా చేయాల్సి ఉందని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రయాణ విభాగంలో ప్రయివేటు సంస్థలకు రోడ్డు రవాణా తలుపులు తెరిచేందుకు మోటారు వాహనాల చట్టానికి అవసరమైన సవరణలు చేపడతామని చెప్పారు. కార్లు, వాహనాలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు... భారతీయ నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్న జైట్లీ.. అదనపు వనరులను సృష్టించటం కోసం చిన్న పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై ఒక శాతం చొప్పున, నిర్దిష్ట సామర్థ్యం గల డీజిల్ కార్లపై 2.5 శాతం, అధిక ఇంజన్ సామర్థ్యం గల వాహనాలు, ఎస్‌యూవీలపై 4 శాతం చొప్పున మౌలికసదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) సెస్సు వేయనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. -
గాల్లో ప్రాణాలు..
జిల్లాలో నెత్తురోడుతున్న జాతీయ రహదారులు {పమాదస్థలాలకు సకాలంలో చేరుకోలేకపోతున్న 108 సిబ్బంది దిక్కులేక రోడ్లపైనే {పాణాలు విడుస్తున్న క్షతగాత్రులు నిద్రావస్థలో అధికార యంత్రాంగం జిల్లాలోని ఐదు జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. వీటిపై సగటున రోజుకు మూడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాథమిక వైద్యం (108 అంబులెన్స్ సేవలు) సకాలంలో అందకపోవడంతో క్షతగాత్రుల్లో దాదాపు 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, జిల్లా సరిహద్దులు, అటవీ పరిధిలోని పల్లెల మీదుగా వెళ్లే జాతీయ రహ దారులపై చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో బాధితులకు వైద్యసాయం అందడం పెద్ద ప్రహసనంగా మారింది. ఈ నేపథ్యంలో గడచిన మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు.. మృతులపై కథనం.. ‘ గతేడాది హైదరాబాద్‌కు చెందిన రాజేష్ కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. కోడూరు - రేణిగుంట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కారులోని ఐదుగురు మృత్యువాత పడ్డారు. అరగంట పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. సకాలంలో అంబులెన్స్ వచ్చినా, ట్రామా కేర్‌కు తీసుకెళ్లినా వారు బతికేవారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు’’ ‘‘ తమిళనాడు రాష్ట్రం తూత్తుకొడి జిల్లా మెంజనాపురానికి చెందిన సెల్వరాజ్‌కు కుమారుడు తివాకర్(36) బెంళూరులోని భార్య, ఇద్దరు కుమారులతో తిరుమల దర్శనం కోసం వస్తున్నారు. వీరి వాహనాన్ని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి సమీపంలోని మొరవపల్లి వద్ద లారీ ఢీకొంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారికి సకాలంలో వైద్యం అందించి ఉంటే ప్రాణాలు దక్కేవి’’ సకాలంలో అందని సేవలు.. జిల్లాలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే 108 వాహనాలు రాకపోవడం, దగ్గరలోని ఆస్పత్రులకు తీసుకె ళ్లినా సరైన చికిత్స అందించకపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల ఎలాంటి సమస్య ఉన్నా.. పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తుండడంతో వైద్యసాయం ఆలస్యమౌతోంది. వేలూరు సీఎంసీ, తిరుపతి స్విమ్స్ ఆస్పత్రులే దిక్కు.. జిల్లాలో ఎక్కువ ప్రాంతాల నుంచి తమిళనాడులోని వేలూరు సీఎంసీ, తిరుపతి స్విమ్స్లకు రెఫర్ కేసులు ఎక్కువగా వెళ్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలూరు, తిరుపతి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇంత దూరం ప్రయాణించే లోపు క్షతగాత్రులు బతికుండడం కష్టమే. గత మూడేళ్లలో తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీ ఆస్పత్రులకెళ్తూ మార్గ మధ్యంలో 25 మంది దాకా మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల బారిన పడిన వారికి ప్రథమ చికిత్స సకాలంలో అందడం లేదు. 108 అంబులెన్స్‌లు తగిన సంఖ్యలో లేకపోవడం, ఉన్నా నిరుపయోగంగా ఉండడం, ఘటనా స్థలం దూరం కావడంతో ఆలస్యంగా వెళ్లడం.. తదితర కారణాల వల్ల క్షతగాత్రుల పరిస్థితి అరణ్యరోదనగా మారుతోంది. వైద్యం అందక కొందరు బాధితుల ప్రాణాలు రోడ్లపైనే గాల్లో కలసిపోతున్నాయి. ఈ సమస్యలకు తోడు జిల్లాలోని ఐదు జాతీయ రహదారులు వెళ్లే చాలా మండలాలకు అంబులెన్స్ సదుపాయం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి: జిల్లాలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మూడేళ్లలో 60 కిపైగా మేజర్ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 140 మంది మృతి చెందగా, 270 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో వైద్య చికిత్స పోవడం వల్ల చనిపోయిన వారే వీరిలో అధికంగా ఉండడం గమనార్హం. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిలో బంగారుపాళ్యం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని నంగిళి వరకు జాతీయ రహదారి, రేణిగుంట నుంచి నగరి దాకా, చిత్తూరు నుంచి తిరుపతి, ములకల చెరువు నుంచి కుప్పం వెళ్లే మార్గాల్లో జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు అధికంగా ఇక్కడే.. బంగారుపాళ్యం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ సరిహద్దులోని నంగిళి వరకు తిరుపతి నుంచి చెన్నై మార్గం, రేణిగుంట, పూతలపట్టు-తిరుపతి, మదనపల్లె-ములకలచెరువు, బాకారాపేట ఘాట్ తదితర ప్రాంతాల్లో కూడా అధికంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చాలా వరకు మేజర్ రోడ్డు ప్రమాదాలే.. మూడేళ్ల క్రిత ం కేటిల్‌ఫామ్ వద్ద కంటైనర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. గతేడాది గండ్రాజుపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓల్వోబస్సు దగ్ధమవడంతో పదిమందికి పైగా కాలిబూడిదయ్యారు. భూతల బండ మలుపులో కారు అదుపు తప్పి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అలాగే పత్తికొండ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. కేటిల్‌ఫామ్ వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. నాగమంగళం వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకుని నలుగురు మృతి చెందారు. గతేడాది రాష్ట్ర సరిహద్దులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందా రు. ఇక రేణిగుంట, పూతలపట్టు, నగిరి, నాగలాపురం, ములకలచెరువు, పీలేరు ప్రాంతాల్లోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ మూడేళ్లలో ఇవే మేజర్ సంఘటనలు, ఇక మైనర్ సంఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. -
మరణ మృదంగం
రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది వృత్యువాత ఒకే ఘటనలో 12 మందిని కబలించిన మృత్యువు మరోఘటనలో ఓ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలు తీసిన లారీ మరో ముగ్గురికి మృత్యువై ఎదురొచ్చిన‘టాటా సఫారీ’ డివైడర్‌ను ఢీ కొని మరో ఇద్దరు టీనేజర్లు... అన్ని ఘటనల్లోనూ అతి వేగమే ప్రమాదానికి కారణం బెంగళూరు: రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. శుక్రవారం ఒక్కరోజే నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆప్తులను కోల్పోయిన సంబంధికుల ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు.... ధార్మిక కార్యక్రమం నుంచి తిరిగి వస్తూ... బెంగళూరు నుంచి హొసపేటకు ఉక్కు కడ్డీల లోడుతో వెళుతున్న లారీ (యూపీ-81,ఏఎఫ్-5415) చిత్రదుర్గ శివారు ప్రాంతాలకు శుక్రవారం తెల్లవారుజాము 3 గంటలకు చేరుకుంది. ఆసమయంలో వేగంగా వెలుతున్న లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టాట్ఏస్ను ఢీ కొని దాని పై ఒరిగిపోయింది. దీంతో టాటాఏస్ డ్రైవర్ కుమార్ (35)తో సహా వాహనంలోని 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొల్లప్ప(68), మంజణ్ణ(61), గంగమ్మ(60), దుర్గప్ప(51), తిప్పేస్వామి(45), నాగణ్ణ(45), గంగణ్ణ(43), గంగాధర్(42), మంజునాథ్(40), టాటా ఏస్ డ్రైవర్ కుమార్(35), సుదీప్(17), చేతన్(10)లు ఉన్నారు. వీరంతా కూడగహళ్లి గ్రామానికి చెందిన వారు. గురువారం రాత్రి టాటా ఏస్ వాహనంలో సంఘటన జరిగిన చోటుకు దగ్గరగా ఉన్న చిక్కగూండనహళ్లిలో ఉన్న పాం డురంగ దేవస్థానానికి గురువారం రాత్రి వెళ్లారు. అక్కడ భజన ముగిసిన వెంటనే సొంతఊరైన కూడగహళ్లికి వెళ్లే సమయంలో మృత్యురూపంలో వచ్చిన లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక తురువనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్‌మార్టం తర్వాత సంబంధీకులకు అందజేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.... రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన జయకీర్తి ఇంద్ర, (55), వాజ్యశీల అలియాస్ వాగేశ్వరి (50) దంపతులు కుమారుడు ప్రశాంత్ (31)తో కలిసి బెంగళూరు నుంచి మూడబిదరి పట్టణానికి ఆల్టోకారులో వెళుతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని చెన్నపట్టణ శివారుల్లో బండిహళ్లి వద్ద ఢీ కొట్టింది. ఆ వేగానికి కారు నుజ్జునుజ్జు కాగా, వాహనంలోని ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషయం తెలిసిన వెంటనే చెన్నపట్టణ గ్రామీణ పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తును ప్రారంభించారు. బైక్‌ను టాటా సఫారీ ఢీ కొన్న ఘటనలో గదగ్ జిల్లా శిరహట్టిలో ఉంటున్న అజీత్ (35) తన బంధువులైన మల్లేశప్ప (55), ఫక్కీరప్ప (45)తో కలసి బైక్‌పై సొంత గ్రామమైన హళ్యాలకు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం శిరహట్టి తాలూకా చిక్కసవణూరుకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న టాటా సఫారీ ఢొకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురూ కిందికి పడ్డారు. ఘటనలో వీరి తలలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను దగ్గరల్లోని ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే వీరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న శిరహట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని... చిక్కబళాపుర జిల్లా బాగేపల్లి పట్టణానికి చెందిన ముఫ్తియార్ బేగ్ (18), అతీఫ్ (20) బైక్‌పై వెళ్తుండగా పట్టణంలోని న్యాయస్థానం వద్దకుఅదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొన్నారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
జిల్లాలో భారీ వాన
యలమంచిలి, అనకాపల్లిలో 3 సెంటీమీటర్లుగా నమోదు రోడ్లపై నీరుచేరి ట్రాఫిక్ అంతరాయం చెరువులను తలపించిన రహదారులు నక్కపల్లి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శని వారం కుండపోతగా వర్షం పడింది. యలమంచిలి, అనకాపల్లిలో 3 సెంటీమీటర్లుగా నమోదయింది. మన్యమంతటా ముసురుపట్టిన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా పడిన వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఈదురు గాలులు వీచాయి. కోటవురట్లలో వందలాది ఎకరాల్లో చెరకు తోటలు నేలకొరిగాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌రాయవరం, కోటవురట్ల, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, ఏజెన్సీలోని పాడేరు, అరకు, చింతపల్లి, తదితరమండలాల్లో భారీ వర్షం పడింది. పెద్ద ఎత్తున నీరు చేరడంతో తాండవ, వరాహా, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయరహదారిపై చినదొడ్డిగల్లు జంక్షన్లో బారీగా వర్షపునీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడ్డురోడు ్డనుంచి రేవుపోలవరం వెళ్లే రోడ్డులోనూ నీరు నిలిచిపోయింది. న ర్సీపట్నం-తుని, అడ్డురోడ్డు-నర్సీపట్నం రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో రాకపోకలకు వాహన చోదకులు ఇబ్బం దులు పడ్డారు. నక్కపల్లిలో ఎంపీడీవో కార్యాలయం, ఏరియా ఆస్పత్రి, పంచాయతీ కార్యాలయం స్త్రీశక్తి భవనం తది తర ప్రభుత్వకార్యాలయాల ప్రాంగణా ల్లో నీరు నిలిచిపోయింది.యలమంచిలి లో ఎంపీడీవో కార్యాలయం వీథి, కోర్టుపేట, ఫైర్ఆఫీస్ కాలనీ, ఏఎస్‌ఆర్‌కాలనీ, రామ్‌నగర్, పెదపల్లి రోడ్లపై వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్ధులు వర్షంలో తడిచివెళ్లడం కనిపించింది. శనివారం పడిన వర్షం రైతులకు మేలు చేకూరుస్తుందని అన్నదాతుల ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరి, చెరకు, తమలపాకు, అరటి, కొబ్బరి,మామిడి పంటలకు ఉపయోగపడుతుందని అంటున్నారు. -
బహిరంగ కిక్కు..!
జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఓ మద్యం దుకాణం ఓపెన్ బార్‌ను తలపించే విధంగా ఉంటుంది. కర్నూలు నాల్గో పట్టణ పోలీసు స్టేషన్ పక్కనే రెండు మద్యం దుకాణాలున్నాయి. దుకాణాలకు ముందు తడికలు అడ్డం కట్టి బహిరంగంగానే మద్యం తాపిస్తున్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని లాడ్జి దగ్గర మద్యం దుకాణం ఉంది. ఆ దుకాణం నుంచి లాడ్జిలో పనిచేసే బాయ్స్ భారీ మొత్తంలో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. అర్ధరాత్రి వేళ కూడా ఇక్కడ మద్యం దొరుకుతుంది. - రోడ్లపైనే మందుకొట్టుడు - బార్లను తలపిస్తున్న మద్యం దుకాణాలు - నిబంధనలు బేఖాతర్ - ఆరుబయటే గ్లాసుల మోత - చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు కర్నూలు: జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండకూడదన్న నిబంధన ఉంది. కర్నూలు నగరంలోనే చెన్నమ్మ సర్కిల్ వద్ద రెండు దుకాణాలు, కృష్ణానగర్ ఐటీసీకి ఎదురుగా రెండు దుకాణాలు జాతీయ రహదారికి ఆనుకొని ఏర్పాటుచేశారు. సాయంత్రం అయితే చాలు. పెద్ద సంఖ్యలో మందు బాబులు ఆయా దుకాణాల వద్ద గుమికూడుతున్నారు. సర్వీసు రోడ్లను సైతం ఆక్రమించి వాహనాలు పార్క్ చేసి బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు. నగరంలోని పలు మద్యం దుకాణాల వద్ద మద్య సేవనం ఆరుబయటే జరుగుతోంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఇలాంటివి జిల్లాలో అనేకం ఉన్నాయి. జిల్లాలో 175ప్రైవేట్ దుకాణాలు, 19 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ దుకాణదారులు ప్రభుత్వానికి రూ.2 లక్షలు చెల్లించి పర్మిట్ రూముకు అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే 30కిపైగా దుకాణాల్లో ఇప్పటి వరకు పర్మిట్ రూములకు అనుమతి తీసుకోకుండానే మద్యం తాపిస్తున్నారు. ఐదు వేలలోపు జనాభా ఉన్న దుకాణాలకు పర్మిట్ రూము అవసరం లేదన్న నిబంధనను అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ అధికారులు మామూళ్లు దండుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా నిబంధనల మేరకే సుంకేసుల, చిన్నటేకూరు గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. జోరుగా లూజు విక్రయాలు.. వైన్‌షాపుల్లో లూజు విక్రయాలు నిషేధం. అలాగే దుకాణం ఎదుట మద్యం తాగడం కూడా నిబంధనలకు విరుద్ధమే అనుమతి గదుల్లో మాత్రమే మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఈ నిబంధనలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మద్యం దుకాణాల ఎదుటనే గుంపులుగా గుమికూడి మద్యం సేవిస్తున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. వైన్ షాపుల ముందు చికెన్ పకోడి బండ్లు, మటన్ కడ్డీలు (చీకులు), చేపలు తదితర తిను బండారాలను ఏర్పాటు చేసి బహిరంగంగానే మద్యం సేవిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మీతో మీ ఎస్పీకి ఫిర్యాదుల వెల్లువ: ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే మీతో మీ ఎస్పీ కార్యక్రమానికి బహిరంగ మద్యపానం విషయంపై భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి వారం జిల్లా నలుమూలల నుంచి కనీసం 3,4 ఫిర్యాదులు బహిరంగ మద్యపానం, నాటుసారా వ్యాపారం పైనే ఫిర్యాదులు వస్తున్నాయి. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం తప్ప పరిష్కరించిన దాఖలాలు కనిపించడం లేదు. మద్యం దుకాణాల ముందు నడుచుకుంటూ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని స్వయంగా మహిళలే ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. పోలీసు బాసు గట్టిగా ఆదేశించినపుడు మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నుంచి నెలవారి మామూళ్లు పంచుతున్నందునే అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైన్‌షాపుల ముందు రోడ్లపైన మద్యం తాగనివ్వకుండా ఎక్సైజ్‌శాఖ నియంత్రించాల్సి ఉంది. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుకాణం వద్ద ఓపెన్ బార్‌ను తలపించే విధంగా మద్యపానం సేవిస్తున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూసే వారు కూడా కరువయ్యారు. క్షేత్రస్థాయి అధికారుల్లో చిత్తశుద్ధి లేనపుడు ఉన్నతాధికారులు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అవి అమలు కావు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన విషయంలోనూ పోలీసు బాసు కిందిస్థాయి అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరించినా, సమావేశాల్లో గట్టిగా ఆదేశించినా ఫలితం కనిపించడం లేదు. -
రాచమార్గాల్లో రక్షణ అడ్డంకులు!
- ఎలివేటెడ్ కారిడార్లకు 250 ఎకరాలు అవసరం - రక్షణశాఖ పరిధిలో 75 ఎకరాలు - భూసేకరణపై దృష్టి సారించిన సర్కార్ - ఆకాశమార్గాలపై తుది దశకు చేరిన అధ్యయనం - త్వరలో సమగ్ర నివేదిక సాక్షి, సిటీబ్యూరో: ఆకాశ మార్గాలపై అధ్యయనం తుది దశకు చేరుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు జిల్లా కేంద్రాలకు మధ్య దూరభారాన్ని తగ్గించే లక్ష్యంతో మూడు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్యారడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వరకు, బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్ ఔటర్ రింగురోడ్డు వరకు, ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ఘట్కేసర్ ఔటర్ రింగురోడ్డు మార్గాల్లో ఆకాశ రహదారులను నిర్మిస్తారు. ప్యారడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాలను ఆర్వీ అసోసియేట్స్ అధ్యయనం చేస్తుండగా, ఉప్పల్- ఘట్కేసర్ మార్గాన్ని తాజాగా వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. ఈ మూడు మార్గాల్లో సదరు కన్సెల్టెన్సీలు సమగ్రమైన నివేదికలు అందజేయవలసి ఉంది. అయితే గత ఏప్రిల్‌లోనే అధ్యయనం ప్రారంభించిన ఆర్వీ అసోసియేట్స్ ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల్లో త్వరలో తుది నివేదికను అందజేసే పనిలో ఉంది. ఆ సంస్థ అధ్యయనం మేరకు ఈ రెండు మార్గాల్లో రోడ్ల విస్తరణకు 250 ఎకరాల భూమి అవసరం. 20 కిలోమీటర్ల వరకు నిర్మించనున్న శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో 150 ఎకరాలు, 18 కిలోమీటర్ల నర్సాపూర్ ఎలివేటెడ్ మార్గంలో 100 ఎకరాలు సేకరించవలసి ఉంది. శామీర్‌పేట్ మార్గంలో 75 ఎకరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ రక్షణశాఖ పరిధిలో ఉన్న మరో 75 ఎకరాల భూసేకరణ ఇబ్బందిగా మారింది. రక్షణశాఖ నుంచి అనుమతి లభిస్తే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలదు. కేంద్రానికి లేఖ రాసిన సర్కార్ బాలానగర్-నర్సాపూర్ మార్గంలో భూ సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మార్గంలోని వంద ఎకరాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రెవిన్యూ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు జాతీయ రహదారుల సంస్థ దృష్టి సారించింది. శామీర్‌పేట్ మార్గంలో సేకరించవలసిన 75 ఎకరాల రక్షణ శాఖ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లభించలేదు. ‘ప్రభుత్వం మరింత గట్టిగా చొరవ తీసుకొని కేంద్రంతో సంప్రదింపులు జరిపితే తప్ప ఈ మార్గంలో భూ సేకరణ సాధ్యం కాదు. అదంతా ఒక కొలిక్కి వ స్తే తప్ప పనులు ప్రారంభం కాబోవు.’ అని నేషనల్ హైవేస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఆరు లైన్ల ఫ్లైఓవర్... సుమారు రూ.1600 కోట్లతో నిర్మించతలపెట్టిన శామీర్‌పేట్ ఎలివేటెడ్ మార్గంలో రోడ్డు మార్గాన్ని 4 లైన్లకు విస్తరిస్తారు. ఆకాశమార్గంలో 6 లైన్ల రహదారులు నిర్మిస్తారు. దీంతో ఎక్కడా వాహనాల రద్దీ లేకుండా సాగిపోతాయి. బాలానగర్-నర్సా పూర్, ఉప్పల్ - ఘట్కేసర్ మార్గాల్లోనూ 10 నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ మార్గాలు నిర్మితమవుతాయి. దీనివల్ల వాహనాల ఫ్రీ ఫ్లో సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లో ప్రతి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్‌హెచ్-202 మార్గంలో ఉన్న ఉప్పల్- ఘట్కేసర్ మార్గంలో వాహనాల రద్దీ నరకప్రాయంగా మారింది. వరంగల్ నుంచి ఘట్కేసర్ వరకు కేవలం గంటన్నర వ్యవధిలో చేరుకొంటే అక్కడి నుంచి ఉప్పల్ రింగురోడ్డుకు వచ్చేందుకే మరో గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఉప్పల్-ఘట్‌కేసర్‌పై తాజా అధ్యయనం ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనం ఆర్వీ అసోసియేట్స్ చేపట్టగా ఉప్పల్- ఘట్కేసర్ మార్గం ప్రాజెక్టును వాడియా టెక్నాలజీస్‌కు అప్పగించారు. 20 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే నిర్మించే అవకాశం ఉంది. -
రాత్రి తొమ్మిది దాటితే...యమగండం!
- నగరంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు - ప్రాణాలు కోల్పోతున్న వేలాదిమంది జనం - రాత్రి తొమ్మిది తర్వాతే ప్రమాదాల సంఖ్య అధికం - నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో రిపోర్టులో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఏదో ఒకచోట రహదారులు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. ఏటికేడు ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నా...చర్యలు చేపడుతున్నా ఫలితం శూన్యం. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన 2014 గణాంకాల ప్రకారం నగరంలో 2013 కంటే రోడ్డు ప్రమాదాలు పెరిగాయని స్పష్టమైంది. 2013లో 2439 రోడ్డు ప్రమాదాలు జరిగితే, 2014లో ఆ సంఖ్య 2908కు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. మొత్తమ్మీద ఏడాదిలో 19.2 శాతం పెరుగుదల నమోదైంది. చెన్నైలో 9,465 ప్రమాదాలు, ఢిల్లీలో 7,191 ప్రమాదాలు, బెంగళూరులో 5215 ప్రమాదాలు, భోపాల్‌లో 4,807 ప్రమాదాలు, కోల్‌కతాలో 4789 ప్రమాదాలు, నాసిక్‌లో 3367 ప్రమాదాలు, జైపూర్‌లో 3,085 ప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర నగరాలతో పొల్చుకుంటే హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా... 2013 కంటే సంఖ్య పెరగడం ఆందోళనకర అంశం. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 361 మంది పురుషులు, 50 మంది మహిళలు మృత్యువాతపడ్డారు. 2,561 మంది క్షతగాత్రులయ్యారు. ఇక ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాతే అధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో వాహనాల నియంత్రణ కొరవడడం...ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని, 2013లో రాత్రి తొమ్మిది నుంచి 12 గంటల మధ్యలో 634 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని రిపోర్టు వెల్లడించింది. పాదచారుల క్రాసింగ్ వద్దే ఎక్కువగా... నగరంలో ఎక్కువగా పాదచారులు రోడ్డు దాటుతున్న సమయాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థల సమీపంలో 26 మంది పురుషులు చనిపోతే, ఒక మహిళ దుర్మరణం చెందింది. నివాస ప్రాంతాలకు సమీపంలో 41 మంది పురుషులు మరణిస్తే, ఎనిమిది మంది యువతులు మృతి చెందారు. ప్రార్థన స్థలాల వద్ద ఏడుగురు పురుషులు దుర్మరణం చెందితే, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. సినిమా హాల్ల సమీపంలో ఆరుగురు పురుషులు, ఫ్యాక్టరీ, ఠమొదటిపేజీ తరువాయి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇద్దరు పురుషులు మృతి చెందారు. పెడిస్ట్రియల్ క్రాసింగ్ వద్ద అత్యధికంగా 48 మంది మగవాళ్లు చనిపోతే, ఎనిమిది మంది మహిళలు దుర్మరణం చెందారు. ఇతర ప్రాంతాల్లో 231 మంది పురుషులు, 32 మంది మహిళలు అసువులు బాశారు. కాగా, కోల్‌కతాలో అత్యధికంగా 214 మంది, చెన్నైలో 206 మంది, ఢిల్లీలో 137 మంది, ముంబైలో 131 మంది, విశాఖపట్టణంలో 123 మంది, భోపాల్‌లో 82, విజయవాడలో 75 మంది, రాంచీలో 62 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానం తొమ్మిదిలో 56 మందితో హైదరాబాద్ ఉంది. ‘ఢీ’సెంబరే... నూతన ఏడాదికి స్వాగతం పలికే డిసెంబర్ మాసంలోనే మన సిటీలో అత్యధికంగా 515 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో 235 మంది, జనవరి, మార్చినెలల్లో 233 మంది, జూలైలో 228 మంది, సెప్టెంబర్‌లో 226 మంది, జూన్‌లో 218 మంది, ఏప్రిల్‌లో 215 మంది, నవంబర్‌లో 213, ఆగస్టులో 199, మేలో 198, ఫిబ్రవరిలో 195 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే డిసెంబర్ నెలను పరిశీలిస్తే చెన్నైలో అత్యధికంగా 825 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఢిల్లీలో 601 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 515 రోడ్డు ప్రమాదాలతో మూడో స్థానంలో హైదరాబాద్ ఉంది. అదుపు తప్పుతున్న అనుభవం... రోడ్డు ప్రమాదాలు అనగానే సాధారణంగా బైక్‌లపై రయ్...మంటూ దూసుకెళ్లే యువకులే గుర్తుకొస్తారు. అయితే తాజాగా ఎన్సీఆర్బీ నివేదికను చూస్తే...మన నగర రహదారులపై 30 నుంచి 45 సంవత్సరాలున్నవారే ఎక్కువగా ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఈ వయసు గల పురుషులు 503 మంది, 93 మంది మహిళలు దుర్మరణం చెందారు. 45 నుంచి 60 ఏళ్ల వయస్సుగలవారు 596, 18 నుంచి 30 ఏళ్ల వయసు గలవారు 554 మంది మృతిచెందారు. 60 సంవత్సరాలు దాటినవారు 253 మంది, 14 ఏళ్లలోపు పిల్లలు 57 మంది ఉన్నారు. ఫుట్‌పాత్‌లు పడగొట్డడం వల్లే... మనవాళ్లు రోడ్ల అందాలకే ప్రియార్టీ ఇస్తున్నారు. విస్తరణ సమయంలో ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఉన్న ఫుట్‌పాత్‌లను పడగొడుతున్నారు. పాదచారుల కోసం ఎటువంటి వ్యవస్థ లేదు. కొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నగరంలో కనిపిస్తున్నా వాటిని ఎవరూ ఉపయోగించడం లేదు.పాదచారుల రక్షణ చూడకపోతే ప్రమాదాలు జరుగుతాయి. రాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్ చేస్తున్న వారు కరెక్ట్‌గానే నడిపినా...ఎక్కడ క్రాస్ చేయాలో తెలియని పాదచారులు అడ్డు రావడంతో ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయి. - కాంతిమతి కన్నన్, రైట్ టూ వాక్ ఫౌండేషన్ నివారణ చర్యలు తీసుకుంటున్నాం ట్రాఫిక్ పోలీసు శాఖ వంతుగా రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ చేపడుతున్నాం. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారికి జరిమానాలు విధిస్తున్నాం. ట్రాఫిక్‌పై అవగాహన కలిగించే దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవడంతో పాటు వాహనచోదకుల్లో అవగాహన పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటాం. - జితేందర్, అదనపు సీపీ, హైదరాబాద్ ట్రాఫిక్ -
నెత్తు‘రోడ్డు’తున్నాయ్...!
రాష్ట్రంలో రోజూ 55 ప్రమాదాలు..47 మరణాలు గతేడాది 20,078 ప్రమాదాల్లో 16,696 మంది బలి మృతుల్లో యువత, పురుషులే అధికం వ్యక్తిగత వాహనాల వాడకంతోనే ఎక్కువ ప్రమాదాలు దేశవ్యాప్త ప్రమాదాల్లో పదో స్థానంలో తెలంగాణ నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల్లో వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం ప్రమాదాల రూపంలో ప్రయాణికులను బలితీసుకుంటున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)-2014 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సరాసరిన రోజుకు 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా వాటిలో 47 మంది మృత్యువాతపడుతున్నారు. ప్రమాదాల నమోదులో రాష్ట్రం దేశంలో పదో స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోంది. మొదటి ఐదు స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది మొత్తం 20,078 ప్రమాదాలలో 16,696 మంది మృత్యువాతపడ్డారు. విద్య, ఉద్యోగం ఇతర అవసరాల నేపథ్యంలో నిత్యం రహదారులపై సంచరించే వారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాద మృతుల్లో యుక్త, మధ్య వయసు వారి సంఖ్యే ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఎన్సీఆర్బీ విశ్లేషణ ప్రకారం రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 16,696 మంది మరణించగా వీరిలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయస్కులు 10,048 మంది ఉన్నట్లు తేలింది. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించే వారి కంటే వ్యక్తిగత వాహనాలు వాడే వారే ఎక్కువగా చనిపోతున్నారు. స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్న నేపథ్యంలో మృతుల్లో పురుషుల సంఖ్య 8,240గా, స్త్రీలు 1,808గా ఉంది. కుటుంబ పోషణ భారాన్ని మోసేది ఎక్కువగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే కావడంతో ఈ ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు యజమానుల్ని కోల్పోయి ఆర్థికంగానూ చితికిపోతున్నాయి. డ్రైవింగ్ రాకపోయినా, లెసైన్సు లేకపోయినా తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కారణంగా రహదారులపైకి వాహనాలతో దూసుకువస్తున్న మైనర్లూ ప్రమాదాలబారిన పడి అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన 18 ఏళ్లలోపు వయస్కులు 1,266 మంది ఉండటం దీనికి నిదర్శనం. డిసెంబర్లోనే అత్యధికం: శీతాకాలం కావడంతో పొగమంచు వల్ల రాష్ట్రంలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం డిసెంబర్లోనే చోటు చేసుకున్నాయి. దాదాపు పదో వంతుకుపైగా... అంటే 2,171 యాక్సిడెంట్స్ ఈ నెల్లోనే జరిగాయి. ఏడాది మొత్తమ్మీద అతి తక్కువగా సెప్టెంబర్‌లో 1,455 ప్రమాదాలు నమోదయ్యాయి. ఏడాది మొత్తమ్మీద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యనే సంభవించినట్లు ఎన్సీఆర్బీ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో అత్యధికంగా 3,484 ప్రమాదాలు జరిగాయి. ‘యాక్సిడెంట్ ప్రోన్ టైమ్’గా భావించే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య అతితక్కువగా 1,585 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అగ్నిప్రమాదాలూ వందల మందిని పొట్టనపెట్టుకుంటున్నాయి. గతేడాది 638 అగ్నిప్రమాదాలు జరగ్గా వాటిలో 624 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. వంటింట్లో జరుగుతున్న ప్రమాదాలే దీనికి కారణమనే భావన ఉంది. మొత్తం మృతుల్లో 285 మంది పురుషులుకాగా 339 మంది స్త్రీలు ఉన్నారు. -
భారత్-శ్రీలంక అనుసంధానం
రూ. 22,000 కోట్లతో ప్రాజెక్టు... ♦ రహదారులు, నౌకా రంగాల్లో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ♦ రూ. 6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు వ్యూహ రచన ♦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటన న్యూఢిల్లీ : రహదారులు, నౌకా రంగాల్లో ప్రభుత్వం 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ కీలక రంగాల్లో భారీగా రూ.6 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు. ఇందులో భారత్-శ్రీలంకలను కలుపుతూ రూ.20,000 కోట్ల ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి నిధులను అందించడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసిందని వెల్లడించారు. హైవేలు- పరికరాలకు సంబంధించి ఇక్కడ గురువారం జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదేళ్లలో రహదారుల రంగంలో రూ.5 లక్షల కోట్ల ప్రాజెక్టులను, నౌకా రంగంలో లక్ష కోట్ల ప్రాజెక్టులను చేపట్టాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు దేశంలో 50 లక్షల మంది యువతికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. గత ఏడాది నుంచి హైవేలు, షిప్పింగ్ రంగాలు పురోగతి దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. భారత్- శ్రీలంక అనుసంధాన ప్రాజెక్టుపై... ఇతర దేశాలతో రవాణా సదుపాయాలను పెంపొందించుకోడానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో ఈ దిశలో ముందడుగు వేసిన ప్రభుత్వం, శ్రీలంకతోనూ రవాణా సదుపాయాలను మెరుగుపరచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు 22 కిలోమీటర్ల మేర క్యారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధమవుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ ‘ఫెర్రీ’ సేవల ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొంటూ, సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కేంద్రం ప్రణాళిక అని వివరించారు. వంతెనకి అలాగే నీటి అంతర్భాగ సొరంగం కలయికగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉంటుందని వివరించారు. నౌకా రవాణాకు ఎటువంటి విఘాతం కలగకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని తెలిపారు. నిధుల సమస్య కాదు..: ఫైనాన్సింగ్ అనేది రహదారుల మంత్రిత్వశాఖలో అసలు సమస్యే కాదని గడ్కారీ అన్నారు. 112 ప్రాజెక్టులను పూర్తిచేసి, విదేశీ బీమా, పెన్షన్ ఫండ్స్‌లకు అమ్మడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు దీనికితోడు 0.50 శాతం వడ్డీకి రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి పలు విదేశీ ఫండ్లు సిద్ధంగా ఉన్నట్లు సైతం ఆయన తెలిపారు. మంత్రిత్వశాఖకు రూ. 42,000 కోట్ల బడ్జెటరీ కేటాయింపులు ఉన్నాయని పేర్కొంటూ, పన్ను మినహాయింపు బాండ్ల ద్వారా రూ.70,000 కోట్లు సమీకరణకు సైతం మంత్రిత్వశాఖకు వీలుందని వివరించారు. అలాగే వార్షిక టోల్ వసూళ్లు రూ.7,000 నుంచి రూ.8,000 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా 15 ఏళ్ల ఆదాయం రూ.1,20,000 కోట్లని అన్నారు. హైవేస్ ఎక్విప్మెంట్ తయారీపై ఇలా... ఈ విభాగం అభివృద్ధిని మంత్రి ప్రస్తావిస్తూ, వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ మేళవింపు ఇందుకు దోహదపడతాయని తెలిపారు. ఆయా అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షకు, తగిన సిఫారసుల అమలుకు ఎనిమిది రోజుల్లో ఒక మండలిని తన మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నదీ జల రవాణాపై బిల్లు... దేశ వ్యాప్తంగా 101 నదులను ‘జల మార్గాలుగా’ మార్చడానికి ఉద్ధే శించిన బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు గడ్కారీ చెప్పారు. దేశాభివృద్ధిలో ఇదొక కీలక అంశమన్నారు. మయన్మార్, థాయ్తోనూ త్వరలో ఒప్పందాలు... బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో రవాణా సదుపాయాల మెరుగుకు చేసుకున్న ఒప్పందం తరహాలోనే ఈ ఏడాది చివరకు మయన్మార్, థాయ్‌లాండ్‌లతో కూడా భారత్ కీలక మోటార్ ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. మోటార్ వెహికల్ ఒప్పందం (ఎంవీఏ) కింద బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మధ్య జరుగుతున్న 8 బిలియన్ డాలర్ల రోడ్డు అనుసంధాన ప్రాజెక్టు రానున్న రెండేళ్లలో పూర్తవుతుందని గడ్కారీ వివరించారు. -
'50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం'
న్యూఢిల్లీ: హైవేలు, షిప్పింగ్ రంగాల్లో సుమారు 50 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నామని వెల్లడించారు. హైవేస్ ఎక్విస్ మెంట్ సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే ఐదేళ్లలో రహదారుల కోసం రూ. 5 లక్షల కోట్లు, నౌకాయానం కోసం రూ. లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపడతామన్నారు. దీంతో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య సంధానం కోసం రూ. 22 వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయం చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
జిల్లాకు అమృత్ కలశం
విజయనగరం కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత) పథకానికి జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేశారు. లక్ష పైన జనాభా ఉండే నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలోని 31 నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, మన జిల్లాలో విజయనగరం పట్టణాన్ని ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం అమలైతే అధికస్థాయిలో నిధులు విడుదలవుతాయి. విజయనగరం పట్టణం చాలా రంగాల్లో వెనుకబడి ఉంది. ఈ పథకంతో వివిధ కార్యక్రమాలకు నిధులు విడుదలై పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. గతంలో ప్రారంభమై నిలిచిపోయిన పలు అభివృద్ధి పథకాలను ఈ పథకం కింద పునఃప్రారంభించి పూర్తి చేస్తారు. మురికి వాడలకు మహర్దశ జిల్లా కేంద్రంలో 2.75లక్షల జనాభా ఉన్నారు. విజయనగరంలో 72 గుర్తించిన మురికి వాడలున్నాయి. మరో ఎనిమిది గుర్తించని మురికి వాడలున్నాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి స్థానికంగా ఉంటున్న వారు ఏటా పెరుగుతున్నారు. వీరికి సరిపడా సౌకర్యాలు మాత్రం పెరగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో పలు అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో పట్టణంలోని మురికి వాడల్లో ఉన్న ప్రజలు ఏటా వైద్యం కోసం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అమృత పథకం వల్ల మురికివాడల్లో సౌకర్యాలు మెరుగవుతాయి. వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపడతారు. పారిశుధ్యానికి అధిక నిధులు వెచ్చిస్తారు. రహదారులు... పట్టణంలోని రహదారులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పథకం కింద రహదారులను అభివృద్ధి చేస్తారు. పట్టణం పరిధి విస్తరించనుండడంతో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్లు నిర్మిస్తారు. పార్కులు, ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు. తాగునీరు.. జిల్లా కేంద్రంలో ఉన్న జనాభాకు అవసరమైన తాగునీరు లభించడం లేదు. ప్రతి మనిషికీ 20 లీటర్ల తాగునీరు కావాలంటే ఒక్క విజయనగరం పట్టణంలోని ప్రజలకే దాదాపు 34 ఎంఎల్డీల తాగునీరు అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం కేవలం 16 ఎంఎల్డీల తాగునీరు మాత్రమే లభ్యమవుతోంది. ముషిడిపల్లి, నెల్లిమర్ల, రామతీర్థం ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం తాగునీరు సరఫరా అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పైపుల ద్వారా నీరు తీసుకోవాలంటే గోతులు తవ్వుకునే పరిస్థితి ఉంది. మురుగు కాలువల్లో ఉన్న పైపులు తుప్పిపట్టి పోతున్నాయి. వాటి ద్వారా సరఫరా అయ్యే తాగునీటినే ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్నారు. కొత్త పథకం ద్వారా తాగునీరు పుష్కలంగా లభిస్తుంది. -
జర భద్రం
ప్రయాణం చేయాలంటే గుండెల్లో దడ తప్పదు. ఎప్పడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తరచూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న అనంతపురం, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పెనువిషాదం. అధిక లోడు, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీంతో బయట ప్రాంతాలకు ప్రయాణించాలంటే జనం జంకుతున్నారు. - ప్రమాదాలకు నిలయంగా రహదారులు - యాక్సిడెంట్లకు కారణం మానవ తప్పిదాలే.. - మూడేళ్లలో జిల్లాలో 50 దాకా ప్రమాదాలు - వందమంది దాకా మృతి, 250 మందికి గాయాలు పలమనేరు: నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు జిల్లాలో మామూలైంది. ఆటోలు, కార్లు, బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న సందర్భంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్ల కాలంలో జిల్లాలో 50 వరకు మేజర్ రోడ్డు ప్రమాదాలు జర గగా వంద మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. 250 మంది దాకా గాయపడ్డారు. ఇందుకు ప్రధాన కారణం మానవ తప్పిదాలే. రహదారి సూచనలు, జాగ్రత్తలు పాటించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక కండీషన్ లేని వాహ నాలు కూడా కారణమవుతున్నాయి. చెన్నై-బెంగుళూరు రహదారిలో.. బంగారుపాళ్యం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ వరకు చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారి ప్రమాదాలతో రక్తమోడుతోంది. విస్తరణ పనులు ఆలస్యమవడం, భారీగా పెరిగిపోతున్న వాహనాల సంఖ్యే ఈ ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇక చిత్తూరు-తిరుపతి, తిరుపతి-చెన్నై, తిరుపతి-కడప మార్గాల్లో కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్లలో పెరిగిన ప్రమాదాలు రెండేళ్ల క్రిత ం కేటిల్‌ఫామ్ వద్ద కంటైనర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పదిమంది మృతిచెందారు. గతేడాది గండ్రాజుపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓల్వో బస్సు దగ్ధమవడంతో పదిమందికి పైగా కాలిబూడిదయ్యారు. పత్తికొండ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. కేటిల్‌ఫామ్ వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. నాగమంగళం వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొనగా నలుగురు మృతిచెందారు. మూడు రోజుల క్రితం రేణిగుంట వద్ద, రెండ్రోజుల క్రితం నాగలాపురం మండలంలో భారీ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మలుపుల వద్ద సూచిక బోర్డులేవీ ? ప్రధాన మార్గాల్లోని మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగం కూడా ప్రాణాలను హరిస్తోంది. కండీషన్‌లేని వాహ నాలు, డ్రైవర్ల నిర్లక్ష్యం.. జిల్లాలోని ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వరకు కండీషన్ లేనివే. ఆర్టీసీలోనే కాలం చెల్లిన వాహనాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక పాఠశాలలు, కళాశాలలు తెరిస్తే బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు నిత్యం ప్రమాదాలతో సహవాసం చేయాల్సిందే. డ్రైవర్ల నిద్రలేమి కూడా ప్రమాదాలకు కారణంగా మారుతోంది. -
జాతీయ రహదారులపై మద్యం షాపులు వద్దు
హెల్మెట్‌ధారణ తప్పనిసరి 15 రోజుల్లో కాలువ గట్లపై ఆక్రమణలు తొలగించండి 108 వాహనం వచ్చే సమయాన్ని తగ్గించాలి రోడ్డు భద్రతా సమావేశంలో కలెక్టర్ కీలక నిర్ణయాలు విజయవాడ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లాలోని జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను కొనసాగించరాదని ఎక్సైజ్ అధికారులను కోరుతూ జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం తీర్మానించింది. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లాస్థాయి రహదారి భద్రతా సమావేశం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని ముఖ్య అధికారుల బృందం ఎట్టి పరిస్థితిలోనూ జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు మూసి వేయించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. కీలక నిర్ణయాలివే.. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ టోల్గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్ల ద్వారా డ్రైవర్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదం సంభవించిన సందర్భంలో 108 వాహనం ప్రమాద స్థలాన్ని చేరుకునే సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని, తద్వారా మరణాలను తగ్గించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ ధారణ తప్పనిసరని ఆదేశించారు. నీటిపారుదల శాఖ కాలువలు, కరకట్టలపై ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. సంబంధిత వ్యక్తులకు ముందుగా నోటీసులు జారీచేసి 15 రోజుల వ్యవధిలో వాటిని తొలగించాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతకు సంబంధించి 18 అంశాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి పంపించామన్నారు. వాహనాదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు అతిక్రమించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్నట్లు సీపీ చెప్పారు. జాతీయ రహదారుల సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. నగరంలో 62 ముఖ్య కూడళ్లను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉప రవాణా కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆటో, స్కూలు బస్సులు నడిపే డ్రైవర్లకు ఈ నెల, వచ్చే నెలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్‌కుమార్, అడిషనల్ ఎస్పీ సాగర్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శేషుకుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రామకృష్ణ, రవాణా అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధిలో పోర్టులు, రహదారులకు భాగస్వామ్యం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పోర్టులు, రహదారుల వాటా 2 శాతం ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా, రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం పేర్కొన్నారు. రహదారుల రంగం పురోభివృద్ధికి చర్యలుసహా దేశంలోని 12 ప్రధాన పోర్టుల సామర్థ్యం, మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. కామరాజార్ పోర్ట్ (గతంలో ఎన్నూర్) ద్వారా కార్ల ఎగుమతి, దిగుమతులకు కామరాజార్ పోర్ట్ లిమిటెడ్- టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం- పత్రాల మార్పిడి సందర్భంగా గడ్కరీ విలేకరులతోమాట్లాడారు. వెబ్సైట్ ఆవిష్కరణ...: కాగా షిప్పింగ్‌కు సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను గడ్కారీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. షిప్పింగ్, పోర్టుల అభివృద్ధికి నిపుణుల నుంచి వినూత్న సూచనలు, సలహాలను ఆహ్వానించడం ఈ వెబ్సైట్ ప్రధాన లక్ష్యం. -
రహదారులకు రూ. 42 వేల కోట్లు
- విజయవాడ - రాంచీ రహదారికి కేటాయింపులు - పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ పన్నులో రూ. 4వరకు రోడ్డు సెస్! న్యూఢిల్లీ: మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్న రంగాల్లో ఒకటైన రహదారుల అభివృద్ధికి ఈ బడ్జెట్లో సముచిత నిధులు లభించాయి. గత బడ్జెట్ కేటాయింపుల కన్నా 48% అధికంగా.. రూ. 42,913 కోట్లను ఈ రంగానికి కేటాయించారు. ‘మన అభివృద్ధి లక్ష్యాలకు సరితూగే స్థాయిలో మన మౌలిక వసతులు లేవు. రహదారుల అభివృద్ధికి గత బడ్జెట్ కేటాయింపుల(రూ. 28,881 కోట్లు) కన్నా రూ. 14, 031 కోట్లను అధికంగా కేటాయించాం. స్థూల బడ్జెటరీ మద్దతులో భాగంగా రైల్వేలకు అదనంగా రూ. 10,050 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, జార్ఖండ్‌లోని రాంచీల మధ్య రహదారి అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేటాయింపులు జరిపారు. స్వర్ణ చతుర్భుజి పథకంలో భాగమైన రహదారుల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆరు లేన్ల రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద పలు మార్గాల్లో రెండు లేన్ల నిర్మాణం, జాతీయ రహదారుల అభివృద్ధి, ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం మొదలైనవాటికి కూడా కేటాయింపులు జరిపారు. రోడ్లు, రైళ్లు, సాగునీటి ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం పన్ను రహిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ గురించి ఆలోచిస్తున్నామని జైట్లీ వెల్లడించారు. పెట్రోలు, డీజిల్‌లపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పన్నులో లీటరుకు రూ. 4 వరకు రోడ్డు సెస్‌గా మార్చాలన్న ప్రతిపాదన ఉందని జైట్లీ తెలిపారు. దీనివల్ల ఈ రంగానికి అదనంగా రూ. 40 వేల కోట్లు సమకూరుతాయన్నారు. సరిహద్దుల్లో రహదారుల కోసం భారీ కేటాయింపులు లడఖ్‌లోని కారాకోరం పాయింట్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఫిష్ పాయింట్ వరకు గల 4,056 కి.మీ. ఇండో-చైనా సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణానికి 2015-16కు గాను రూ. 300 కోట్లను కేటాయించారు. గతేడాది కేటాయించిన మొత్తం(రూ. 156,47 కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు గల 3,323 కి.మీ. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణం కోసం రూ. 320 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం రూ. 300 కోట్లు కేటాయించగా రూ. 165.22 కోట్లను వినియోగించారు. ఇండో-భూటాన్ సరిహద్దులో రోడ్ల నిర్మాణం కోసం రూ. 50 కోట్లు(గతేడాది కేవలం రూ. లక్ష) కేటాయించారు. 1,643 కి.మీ. ఇండో- మయన్మార్ సరిహద్దు వెంట రహదారుల నిర్మాణం కోసం రూ. 20 కోట్లను(గతేడాది రూ. 11.12 కోట్లు) సమకూర్చనున్నారు. -
గమనమే గండమైతే ఎలా?
ప్రతి సంఘటనా ఓ అనుభవాన్ని మిగులుస్తుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే వివేకం కొరవడితే.. జరిగే విషాదానికి విధి కాక మానవ ప్పిదాలే ప్రధాన కారణాలు అవుతాయి. రహదారుల్నీ, వాహనాల్నీ సురక్షిత ప్రయాణానికి అనువుగా తీర్చి దిద్దకపోతే, వాహన చోదకుల్లో అప్రమత్తత కొరవడి, అలక్ష్యం హెచ్చితే.. ప్రయాణమే ఓ గండమవుతుంది. గమ్యం చేరడం ప్రశ్నార్థకమవుతుంది. రహదారులు రక్తంతో తడుస్తాయి. మృత్యువు విందారగించే వేదికలవుతాయి. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుకు జరిగిన ఘోర ప్రమాదం నేర్పే పాఠం, చేసే హెచ్చరిక ఇదే. మన జిల్లాలోనూ రోడ్లు, వంతెనల పరంగా అధ్వానస్థితి, అలక్ష్యం ఉన్నాయి. అవి తొలగినప్పుడే ప్రమాదాలకు అవకాశం, ప్రాణాలకు ముప్పు తప్పుతాయి. అమలాపురం టౌన్ : జిల్లాలోని ప్రమాదకర మలుపులు, రోడ్లు మార్జిన్లు, రక్షణ గోడలు లేని శిథిల వంతెలనపై గత అయిదేళ్లలో చిన్న, పెద్ద ప్రమాదాలు దాదాపు 180 జరిగాయి. వీటిలో 54 మంది మృత్యువాత పడగా 70 మంది తీవ్రంగా, 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. పి.గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం నుంచి చాకలిపాలెం, గన్నవరం నుం చి గంటి వరకూ ప్రధాన పంట కాల్వ వెంబడి ఉన్న రోడ్లు అస్తవ్యస్తమైన మార్జిన్లతో ప్రమాదాలకు చిరునామాగా మారాయి. ఆ రోడ్లలో గత అయిదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల కిందట గంటి పెదపూడి వద్ద అప్రోచ్ రోడ్డు సరిగా లేని వంతెన పైకి వెళుతున్న స్కూలు బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు విద్యార్థులు విగతజీవులయ్యారు. ప్రాణాలు పోతున్నా పట్టని అలక్ష్యం జిల్లాలో అనేక చోట్ల శిథిల వంతెనలు, రోడ్డు మార్జిన్లు, మలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ముఖ్యంగా ఆర్ అండ్ బి వారు సమస్య తీవ్రతను గుర్తించటంలో విఫలమవుతున్నారు. పి.గన్నవరం మండలంలో 22 కిలోమీటర్ల మేర కాల్వ వెంబడి ఉన్న రోడ్లో ఎన్ని ప్రమాదాలు జరిగినా అలాంటి అవకాశమున్న చోట రక్షణ గోడలు ఏర్పాటు చేసే చర్యలు శూన్యం. ఐ.పోలవరం మండలం కొమరిగిరి వద్ద 216 జాతీయ రహదారిలో ఓ మలుపులో గత మూడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోయారు. అక్కడ ప్రమాదకరమైన మలుపని హెచ్చరిస్తూ కొట్టొచ్చినట్టు కనబడేలా బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. అధ్యయనం అవసరం.. జిల్లాలో ప్రమాదభరితంగా ఉన్న కాల్వలు, డ్రెయిన్లపై ఉన్న వంతెనలపై అధ్యయనం జరగాలి. వాటి స్థానే కొత్త వంతెనల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలి. లేదా తక్షణ మరమ్మతులు చేపట్టాలి. ప్రమాదకర మలుపులున్న చోట మలుపు లేకుండా చేయడానికి అవసరమైతే భూమిని సేకరించి రోడ్డును విస్తరించాలి. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి వద్ద ‘ఎస్’ ఆకారంలోని మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి చోట స్థలం సేకరించి, రోడ్డు తిన్నగా ఉండేలా చేయాలి. మార్జిన్లు అధ్వానంగా ఉన్న చోట రోడ్డు వెడల్పు పెంచి, మార్జిన్లను రోడ్డు ఎత్తుకు పెంచాలి. ఇలా చేస్తే ప్రమాదాల నిరోధానికి ఆస్కారముంటుంది. మృత్యువు పొంచే తావులు మచ్చుకు కొన్ని.. రంపచోడవరం నుంచి కాకవాడకు వెళ్లే రెండు అత్యంత ప్రమాదకర మలుపుల్లో వాహనం ఏ మాత్రం అజాగ్రతగా వెళ్లినా అంచునే ఉన్న లోయలో పడుతుంది. 216 జాతీయ రహదారిలో ముమ్మిడివరం మండలం నడవపల్లి వద్ద డ్రెయిన్‌పై ఉన్న కల్వర్టు ఎలాంటి రక్షణా లేక ప్రమాదాలకు కారణమవుతోంది. పిఠాపురంలో ఏలేరు కాల్వ వద్ద రోడ్డుకు ఎలాంటి రెయిలింగ్ లేదు. ఇక్కడ ప్రయాణం ప్రమాదం అంచునే అన్నట్టుంటుంది. ఆదమరుపుగా ఉన్నా పది అడుగుల లోతున ఉన్న కాల్వలో పడడం ఖాయం. గొల్లప్రోలులో కాల్వపై వంతెన ప్రమాదకరస్థితిలో ఉన్నా ఎలాంటి హెచ్చరిక బోర్డూ లేక తరచూ ప్రమాదాలు జరగుతుంటాయి. -
భూసేకరణ పూర్తి చేసిస్తే సిద్ధమే
తెలంగాణలో జాతీయరహదారులపై హైవేల సంస్థ చైర్మన్ ఆర్పీ సింగ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూసేకరణను పూర్తి చేసి ఉంటే హైవేల నిర్మాణానికి అభ్యంతరం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. పీపీపీ విధానం అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో శుక్రవారం సచివాలయంలో ఆర్పీ సింగ్ భేటీ అయ్యారు. ఈ విష యమై రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయిన నేపథ్యంలో కేంద్ర ఉపరి తల రవాణా శాఖ మంత్రి గడ్కారీ ఆదేశాల మేరకు ఆర్పీసింగ్ సీఎస్‌ను కలిశారు. ప్రతి పాదిత జాతీయ రహదారులు.. 1. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్సువాడ-బోధన్ 2.హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు వయా మొయినాబాద్-చేవెళ్ల- మన్నెగూడ- పరిగి -కొడంగల్ మీదుగా కర్నాటక సరిహద్దు వరకు, 3. కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర్ల 4. నిర్మల్-జగిత్యాల వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్ 5. అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట 6. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు హైవే పనులు చేపట్టాలని సీఎస్ కోరారు.