గాల్లో ప్రాణాలు.. | road accidents in national highways | Sakshi
Sakshi News home page

గాల్లో ప్రాణాలు..

Published Mon, Feb 22 2016 1:51 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

గాల్లో ప్రాణాలు.. - Sakshi

గాల్లో ప్రాణాలు..

జిల్లాలో నెత్తురోడుతున్న  జాతీయ రహదారులు
{పమాదస్థలాలకు సకాలంలో చేరుకోలేకపోతున్న 108 సిబ్బంది
దిక్కులేక రోడ్లపైనే {పాణాలు విడుస్తున్న క్షతగాత్రులు
నిద్రావస్థలో అధికార యంత్రాంగం

 
జిల్లాలోని ఐదు జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. వీటిపై సగటున రోజుకు మూడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాథమిక వైద్యం (108 అంబులెన్స్ సేవలు) సకాలంలో అందకపోవడంతో క్షతగాత్రుల్లో దాదాపు 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, జిల్లా సరిహద్దులు, అటవీ పరిధిలోని పల్లెల మీదుగా వెళ్లే జాతీయ రహ దారులపై చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో బాధితులకు వైద్యసాయం అందడం పెద్ద ప్రహసనంగా మారింది. ఈ నేపథ్యంలో గడచిన మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు.. మృతులపై కథనం..
 
 
‘ గతేడాది హైదరాబాద్‌కు చెందిన రాజేష్ కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. కోడూరు - రేణిగుంట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో కారులోని ఐదుగురు మృత్యువాత పడ్డారు. అరగంట పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. సకాలంలో అంబులెన్స్ వచ్చినా, ట్రామా కేర్‌కు తీసుకెళ్లినా వారు బతికేవారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు’’
 
‘‘ తమిళనాడు రాష్ట్రం తూత్తుకొడి జిల్లా  మెంజనాపురానికి చెందిన సెల్వరాజ్‌కు కుమారుడు తివాకర్(36) బెంళూరులోని భార్య, ఇద్దరు కుమారులతో  తిరుమల దర్శనం కోసం   వస్తున్నారు. వీరి వాహనాన్ని పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి సమీపంలోని మొరవపల్లి వద్ద లారీ ఢీకొంది.  ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారికి సకాలంలో వైద్యం అందించి ఉంటే ప్రాణాలు దక్కేవి’’  
 
సకాలంలో అందని సేవలు..
జిల్లాలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే 108 వాహనాలు రాకపోవడం, దగ్గరలోని ఆస్పత్రులకు తీసుకె ళ్లినా సరైన చికిత్స అందించకపోవడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల ఎలాంటి సమస్య ఉన్నా.. పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తుండడంతో వైద్యసాయం ఆలస్యమౌతోంది.
 
వేలూరు సీఎంసీ, తిరుపతి స్విమ్స్ ఆస్పత్రులే దిక్కు..
జిల్లాలో ఎక్కువ ప్రాంతాల నుంచి తమిళనాడులోని వేలూరు సీఎంసీ, తిరుపతి స్విమ్స్‌లకు రెఫర్ కేసులు ఎక్కువగా వెళ్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలూరు, తిరుపతి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇంత దూరం ప్రయాణించే లోపు క్షతగాత్రులు బతికుండడం కష్టమే. గత మూడేళ్లలో తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీ ఆస్పత్రులకెళ్తూ మార్గ మధ్యంలో 25 మంది దాకా మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.
 
జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల బారిన పడిన వారికి ప్రథమ చికిత్స సకాలంలో అందడం లేదు. 108 అంబులెన్స్‌లు తగిన సంఖ్యలో లేకపోవడం, ఉన్నా నిరుపయోగంగా ఉండడం, ఘటనా స్థలం దూరం కావడంతో ఆలస్యంగా వెళ్లడం.. తదితర కారణాల వల్ల క్షతగాత్రుల పరిస్థితి అరణ్యరోదనగా మారుతోంది. వైద్యం అందక  కొందరు బాధితుల ప్రాణాలు రోడ్లపైనే గాల్లో కలసిపోతున్నాయి. ఈ సమస్యలకు తోడు జిల్లాలోని ఐదు జాతీయ రహదారులు వెళ్లే చాలా మండలాలకు అంబులెన్స్ సదుపాయం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
తిరుపతి: జిల్లాలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మూడేళ్లలో 60 కిపైగా మేజర్ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 140 మంది మృతి చెందగా, 270 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు.   సకాలంలో వైద్య చికిత్స పోవడం వల్ల చనిపోయిన వారే వీరిలో అధికంగా ఉండడం గమనార్హం. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చెన్నై-బెంగుళూరు జాతీయ రహదారిలో బంగారుపాళ్యం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని నంగిళి వరకు జాతీయ రహదారి, రేణిగుంట నుంచి నగరి దాకా, చిత్తూరు నుంచి తిరుపతి, ములకల చెరువు నుంచి కుప్పం వెళ్లే మార్గాల్లో జరుగుతున్నాయి.
 
రోడ్డు ప్రమాదాలు అధికంగా ఇక్కడే..

బంగారుపాళ్యం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ సరిహద్దులోని నంగిళి వరకు తిరుపతి నుంచి చెన్నై మార్గం, రేణిగుంట, పూతలపట్టు-తిరుపతి, మదనపల్లె-ములకలచెరువు, బాకారాపేట ఘాట్ తదితర ప్రాంతాల్లో కూడా అధికంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
 
చాలా వరకు మేజర్ రోడ్డు ప్రమాదాలే..
మూడేళ్ల క్రిత ం కేటిల్‌ఫామ్ వద్ద కంటైనర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. గతేడాది గండ్రాజుపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓల్వోబస్సు దగ్ధమవడంతో పదిమందికి పైగా కాలిబూడిదయ్యారు. భూతల బండ మలుపులో కారు అదుపు తప్పి  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అలాగే పత్తికొండ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. కేటిల్‌ఫామ్ వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. నాగమంగళం వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకుని నలుగురు మృతి చెందారు. గతేడాది రాష్ట్ర సరిహద్దులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందా రు. ఇక రేణిగుంట, పూతలపట్టు, నగిరి, నాగలాపురం, ములకలచెరువు, పీలేరు ప్రాంతాల్లోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ మూడేళ్లలో ఇవే మేజర్ సంఘటనలు, ఇక మైనర్ సంఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement