Driver Died In Hyderabad Hastinapuram Ambulance Accident, Check Updates Inside - Sakshi
Sakshi News home page

Hyderabad Ambulance Incident: హైదరాబాద్‌ హస్తినాపురంలో విషాదం.. ఆంబులెన్స్‌ పేలుడు.. డ్రైవర్‌ మృతి

Published Tue, Jul 25 2023 7:11 AM | Last Updated on Tue, Jul 25 2023 8:43 AM

Hyderabad Hastinapuram Amubalnce Accident Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది.  హస్తినాపురం వద్ద  ఓ ప్రైవేట్‌ ఆంబులెన్స్‌ ప్రమాదానికి గురికాగా.. ఆంబులెన్స్‌ మంటల్లో దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆంబులెన్స్‌ డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. 

మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఆంబులెన్స్‌.. బీఎన్‌రెడ్డి హస్తినాపురం వద్ద డివైడర్ ఢీకొని  బోల్తాపడింది. ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే.. తీవ్ర గాయల పాలైన అంబులెన్స్  డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఆ సమయంలో ఆంబులెన్స్‌ను తొలగించే ప్రయత్నం చేయగా.. అందులోని ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మలక్ పేట్ లోని  ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి  పేషెంట్స్ ను  ఇబ్రహీంపట్నంలో  దింపేసి వస్తుండగా  ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement