BN reddy
-
బస్సు చక్రాల కింద నలిగి బాలుడి మృతి
హైదరాబాద్: అప్పటిదాకా అక్క, అన్నయ్యతో సరదాగా ఆడుకుంటూ గడిపిన మూడున్నరేళ్ల బాలుడిని స్కూల్ బస్సు చిదిమేసిన హృదయ విదారక ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. చిరునవ్వులతో తమ వెంట ఉన్న చిన్నారి కళ్లెదుటే క్షణాల్లో అసువులు బాయడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. శుక్రవారం చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని బీఎన్‌రెడ్డినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న నీల మౌనికకు ఇద్దరు కుమారులు హేమంత్ (9), మూడున్నరేళ్ల ప్రణయ్‌తో పాటు కూతురు స్నేహ ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో మౌనిక రెండేళ్లుగా బీఎన్‌రెడ్డి నగర్‌లోని పుట్టింట్లో నివాసం ఉంటోంది. ఇళ్లల్లో పని చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. శుక్రవారం హేమంత్, స్నేహ స్కూల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు ప్రణయ్‌ను అమ్మమ్మ కనకమ్మ ఇంటి అరుగుపై కూర్చొబెట్టిన తల్లి మౌనిక.. హేమంత్, స్నేహలను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. అదే సమయంలో ప్రణయ్ అరుగు దిగి రోడ్డుపైకి వచ్చాడు. దీనిని గమనించకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో ప్రణయ్ ముందు చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. మృతుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడి మేనమామ వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హైదరాబాద్: ఆంబులెన్స్ పేలుడు.. డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. హస్తినాపురం వద్ద ఓ ప్రైవేట్ ఆంబులెన్స్ ప్రమాదానికి గురికాగా.. ఆంబులెన్స్ మంటల్లో దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆంబులెన్స్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆంబులెన్స్.. బీఎన్‌రెడ్డి హస్తినాపురం వద్ద డివైడర్ ఢీకొని బోల్తాపడింది. ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే.. తీవ్ర గాయల పాలైన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఆంబులెన్స్‌ను తొలగించే ప్రయత్నం చేయగా.. అందులోని ఆక్సిజన్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి పేషెంట్స్ ను ఇబ్రహీంపట్నంలో దింపేసి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
మలేసియాలో ఘనంగా భారత గణతంత్ర వేడుకలు
కౌలాలంపూర్: భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మలేసియాలోని భారత హైకమిషనర్ బిన్ రెడ్డి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలేసియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే మలేసియాలో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. వీసా సెంటర్, కాన్సులర్ సెంటర్లలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తుమన్నారు. దీనికి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా హాజరుకావొచ్చని వెల్లడించారు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ‘ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్’గా డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. (క్లిక్ చేయండి: కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన) -
తెలుగు సినిమా స్వర్ణయుగంలో మూలస్తంభం
మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళభైరవి, మాయాబజార్ మొదలైన సినిమాలను ప్రస్తావిస్తూ తెలుగు సినిమా స్వర్ణయుగం అని అంటూంటాం. ఈ ప్రయత్నాలు బీజప్రాయంగా మొదలైనపుడు తొలుత ఆ చరిత్రలో తారసపడే పేరు మూలా నారాయణస్వామి! కె.వి.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రగా వచ్చిన ‘భక్త పోతన’ అఖండ విజయం సాధించింది. అయితే, సరైన స్టూడియో సదుపాయాలు లేవని గుర్తించి ‘వాహిని స్టూడియో’కు నడుం కట్టారు మూలా నారాయణస్వామి. వాహిని స్టూడియోలో నిర్మించిన తొలి చిత్రం ‘గుణసుందరి కథ’. ఇది కూడా కె.వి.రెడ్డి దర్శకుడిగా విడుదలై గొప్ప విజయాన్ని పొందింది. మొదట కె.వి.రెడ్డిని దర్శకుడిని చేయాలంటే భాగస్వామి అయిన బి.ఎన్.రెడ్డి అభ్యంతరం చెప్పారు. నారాయణ స్వామి పట్టువదలకుండా లాభం వస్తే కంపెనీకి, నష్టం వస్తే తనకి అని ముందుకు సాగాడు. దర్శకుడిగా కె.వి.రెడ్డి ప్రవేశం ఎంత ఆసక్తిగా మొదలైందో, నారాయణ స్వామి ముగింపు అంతకు మించి ఉత్కంఠ కల్గిస్తుంది. కేవలం 38 సంవత్సరాలకే జీవితం చాలించిన మూలా తెలుగు సినిమా వైభవానికి మూలస్తంభం. తాడిపత్రికి చెందిన నారాయణస్వామికి చిన్నతనం నుండి కళాభిరుచి. చిన్న వయసులోనే తండ్రి కనుమూస్తే, ఆ వ్యాపారాలను ఎన్నో రెట్లు వృద్ధి చేశాడు. నూనె మిల్లులు, బట్టల మిల్లులు, సిరమిక్ పరిశ్రమ, సహకార బ్యాంకు, పాల సహకార సంఘం, మార్కెట్ యార్డులు, పళ్ళ క్యానింగ్ ఇలా చాలా వ్యాపారాలు ఆయనవి. ఇంకో విషయం గమనించాలి. ఆయన సంస్థలకు రాయలసీమ బ్యాంకు, రాయలసీమ టెక్స్టైల్స్, కడప సిరమిక్స్, కడప ఎలక్ట్రానిక్ కంపెనీ వంటి పేర్లుండేవి. తాడిపత్రిలో వాహిని టాకీస్, అనంతపురంలో రఘువీరా టాకీస్ మూలాగారివే. వీరికి బి.యన్.రెడ్డి, బి.నాగిరెడ్డి సోదరుల తండ్రి గారితో వ్యాపార భాగస్వామ్యం ఉండేది. వీరు కలసి బర్మాకు ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, చిత్తూరు నాగయ్య, లింగమూర్తి వంటి కళాభిరుచి కలిగినవారు నారాయణ స్వామి మిత్రులు. వీరందరూ కలిసి హెచ్.ఎం.రెడ్డి భాగస్వామ్యంతో ‘గృహలక్ష్మి’ రూపొందించారు. సినిమా విజయవంతమైంది. కానీ ఈ యువకులు వృద్ధుడైన హెచ్.ఎం.రెడ్డితో సర్దుకోలేక వాహినీ సంస్థను నెలకొల్పారు. వందేమాతరం, సుమంగళి, దేవత సినిమాలను నిర్మించి వాహిని సంస్థ చరిత్ర సృష్టించింది. ఇది 1938–1942 మధ్యకాలం. బాల్యమిత్రుడైన కేవీ రెడ్డిలో వ్యాపారి నారాయణస్వామి ఏమి చూశారోగానీ తెలుగు తెరకు ఒక గొప్ప దర్శకుడిని పరిచయం చేశారు. కేవీ రెడ్డి అప్పటికి ఆ సంస్థలో కేషియర్ మాత్రమే. ఏ సినిమాకూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేయలేదు. అందుకే మూలా దార్శనికుడు. ‘భక్త పోతన’ నిర్మించినపుడు న్యూటోన్ స్టూడియోలో ఇబ్బందులు గమనించి రెండున్నర లక్షల వ్యయంతో వాహినీ స్టూడియో ఏర్పాటయ్యింది. ఇందులో రెండు లక్షలు నారాయణ స్వామివి కాగా మిగతా యాభై వేలు బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి తదితరులవి. ఆ సంస్థకు నారాయణస్వామియే చైర్మన్. మూలాకు ‘ఆంధ్రా బిర్లా’ అనే పేరుండేది. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కస్తూర్బా ఫండ్‌కు ఆ రోజుల్లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. దీనిని స్వీకరించడానికి ముందు గాంధీ మహాత్ముడు స్వామిగారి పూర్వాపరాలు శోధించారని అంటారు. ఎంతోమంది పిల్లల చదువుకు విశేషంగా సాయం చేశారు. ఆయన తోడ్పాటుతో ఎదిగినవారు ఎందరో ఉన్నారు. వారిలో తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఒకరు. 1938–1949 మధ్యకాలంలో గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, దేవత, భక్త పోతన, పెద్ద మనుషులు, వద్దంటే డబ్బు, స్వర్గసీమ, యోగివేమన, గుణసుందరి కథ సినిమాలను వాహిని సంస్థ ద్వారా రూపొందించారు. భక్త పోతన – గుణసుందరి కథ మధ్య ఏడేళ్ల వ్యవధి ఉంది. స్టూడియో నిర్మాణం పూర్తి అవడం, దానికి కాస్తా ముందు ఇన్కమ్ టాక్స్ సమస్యల్లో నారాయణస్వామి ఇరుక్కోవడం సంభవించింది. ముప్ఫై లక్షల దాకా పెనాల్టీ పడింది. ఆస్తులు జప్తు అయ్యాయి. వాహినీ స్టూడియో కూడా చేతులు మారి విజయవాహిని అయ్యింది. నారాయణస్వామికి నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. కష్టాలు ముప్పిరిగొన్నాయి. ఆరోగ్యం క్షీణించింది. క్షయ పట్టుకుంది. మదనపల్లి శానిటోరియంలో 1950 ఆగస్టు 20న 38 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అప్పటికి పెద్ద కుమారుడు వెంకటరంగయ్యకు 11 సంవత్సరాలు. కుటుంబం ఆర్థిక చిక్కుల్లో పడింది. 1961లో దామోదరం సంజీవయ్య తోడ్పాటుతో బయటపడ్డారంటారు. ఏది ఏమైనా, తెలుగు సినిమా స్వర్ణయుగానికి మూల విరాట్టు అయిన మూలా నారాయణస్వామి పరిణామగతి ఆశ్చర్యకరం! – డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి -
పోరాట దిగ్గజం భీమిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండ లంలోని కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన రామిరెడ్డి చుక్కమ్మల మలి సంతానంగా భీమిరెడ్డి నర్సింహా రెడ్డి (బీఎన్) 15.3.1922న జన్మించారు. ఆకలికి అన్నంలేక సొమ్మసిల్లిన పాలేరును చూసి కలత చెందాడు. ఈ ఆకలికి మూలమెక్కడ అన్న ఆలోచనల్లోంచి ఆయన పోరాట ప్రస్తానం ప్రారం భమైంది. అది కాస్తా వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఆ తర్వాత సాయుధ దళాలకు సారథ్యం వహించే దిశగా సాగింది. బండెనుక బండిగట్టి పదహారు బండ్లుగట్టి ఏ బండ్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడ అంటూ కైకట్టి పాడుతూ దొరల తుపాకీ గుండుకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన బండి యాదగిరి బీఎన్ దళ సభ్యుడే. విసునూరు రామచంద్రారెడ్డి కిరాయి గుండాలను ప్రతిఘటించిన పాలకుర్తి వీరనారి చాకలి ఐలమ్మకు.. ఖబడ్దార్.. కల్లాంలకు అడుగుబెడితే చంపుత కొడు కుల్లారా అని తెంపునిచ్చిందీ.. అచ్చుకట్టె ఆరుకాలం కష్టపడిన కౌల్దారి ఐలమ్మ ఇంటికి బువ్వ గింజల బస్తాలు భుజానేసుకెల్లిందీ బీఎన్ గుత్తపదళమే. కొడకండ్ల కేంద్రంగా పేద ప్రజల ధన మాన ప్రాణా లతో చెలగాటమాడుతున్న రజాకార్ల క్యాంపును దయం రాజిరెడ్డి బూర్లు అంజయ్య బీఎన్ దళాలు మూడు వైపుల నుండి వచ్చి పదిహేను మంది కర్కోటకులను హతమార్చారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవుల పల్లి ప్రోత్సాహంతో వితంతువైన సరోజినిని వివా హమాడి తన ఆదర్శాన్ని చాటుకున్నారు బీఎన్. పోరాటం తొలి నాళ్లలో ఆయన తొలి సంతానం అడ వులలో అరకొర ఆహారంతో, వైద్య సదుపాయం లేక మరణించాడు. ఒక సందర్భంలో ఎడమచేతిలో ఏడాది నిండిన కొడుకు మరో చేతిలో మర తుపా కీతో ఎల్లంపేట గుట్టమీద దట్టమైన పొదలమాటున ఉన్న బీఎన్ దంపతులపై రజాకార్లు మారణాయు ధాలతో చుట్టుముట్టారు. ఎడమచేతిలో ఉన్న బాబును బంతిలా విసిరెయ్యగా ఎంకటయ్య అనే సహచర యోధుడు అందుకొని పరుగు తీశాడు. మరో చేతిలో మర తుపాకీతో రజాకార్ల చక్ర బంధాన్ని ఛేదించుకొని ప్రాణా లతో బయటపడ్డాడు బీఎన్. బీఎన్ రెండుసార్లు ఎమ్మె ల్యేగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యులుగా సేవలందించారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, రైతు సంఘం కేంద్ర రాష్ట్ర నాయకునిగా సేవలం దించారు. దళిత గిరిజన వెనుకబడిన తరగతుల వారు ఎల్లకాలం పల్లకీలు మోసే బోయీలు కాకూ డదంటూ వారు పాలకులుగా రాజ్యాధికారం పొందాలని సూర్యాపేటలో 1996లో లక్షలాది సమస్త కులాలను సమీకరించి సభ చేసి సామాజిక న్యాయం కోసం పరితపించిన నాయకుడు బీఎన్ 2008 ఏప్రిల్ 9న మరణించారు. (నేడు భీమిరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా) – మల్లు కపోతం రెడ్డి -
బీఎన్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం
బంజారాహిల్స్: ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాకుండా జయరాంతో సెటిల్మెంట్ చేసుకునేందుకు పలుమార్లు రాకేష్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మాజీ టీడీపీ నేత బీఎన్ రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎన్ రెడ్డి పేరుతో రాకేష్‌రెడ్డిపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. జనవరి 31న జయరాం జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని రాకేష్‌రెడ్డి నివాసంలో హత్యకు గురైన విషయం విదితమే. అంతకుముందు రెండు రోజులు బీఎన్ రెడ్డి అక్కడికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు ఉదయం కూడా బీఎన్ రెడ్డి ఆ ఇంటికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు అతడిని దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తన కార్యాలయంలో విచారించారు. ఇప్పటికే బీఎన్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. చార్జిషీట్లో బీఎన్ రెడ్డి పేరును చేర్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాకేష్‌రెడ్డితో సెటిల్మెంట్ చేసుకోవాల్సిందిగా జయరాంపై ఒత్తిడి తేవాలని హత్యకు కొద్ది రోజుల ముందు రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు బీఎన్ రెడ్డి నిందితుడు రాకేష్‌రెడ్డిని తీసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా బీఎన్ రెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. -
టీఎన్టీయూసీ అధ్యక్షుడి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, టీఎన్టీయూసీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనా మా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రాజీనామా పంపినట్లు తెలిపారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న తాను హైదరాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రచార కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, టీఎన్టీయూసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించా నన్నారు. 2009లో డీలిమిటేషన్‌తో ఖైరతాబాద్ 4 నియోజకవర్గాలుగా మారినా ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకా శం రాకపోయినా బాధపడలేదన్నారు. పొత్తులో భాగంగా 2018లో కాంగ్రెస్‌కు కేటాయించినప్పటికీ, పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానన్నారు. 2018లో రాష్ట్రంలో 13 స్థానాల్లో పోటీచేసేందుకు ఒప్పుకునే పరిస్థితికి దిగజారిన పార్టీ.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పోటీయే చేయని దుస్థితికి దిగజారడాన్ని తట్టుకోలేక రాజీనా మా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బీఎన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. -
తెలంగాణ సాయుధపోరుకు మలుపు బి.ఎన్.
తెలంగాణలో భూమి, భుక్తి, విముక్తి కోసం 1947–51 వరకు జరిగిన సాయుధపోరాటం మూడు వేల గ్రామాల్ని ప్రభావితం చేసింది. ఈ పోరాటానికి ముందుగా నిజాం రాష్ట్రంలో ఆర్యసమాజం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. వారి ఉద్యమమే క్రమంగా కమ్యూనిస్టుల పోరాటంగా మారింది. అదే చివరకు సాయుధపోరాటం అయ్యింది. ఆనాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన జనగామ పిర్కాలో విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం చేసింది. పండిన పంటను కల్లాల దగ్గర్నుంచి తీసుకుపోవడానికి విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు అడ్డుపడ్డారు. చాకలి ఐలమ్మ ప్రతిఘటించింది. ఇదే చరిత్రకు మలుపు. ఈ మలుపు దగ్గర్నుంచి ఒక సింహంలా దూసుకొచ్చిన యోధుడు విసునూరు రామ చంద్రారెడ్డి గూండాలను పారిపోయేటట్లు చేశాడు. ఆ వడ్ల గింజల బస్తాను భుజం మీద వేసుకుని బండ్ల పైకి ఎక్కించి చాకలి ఐలమ్మ ఇంటికి ఆ బువ్వగింజల్ని పంపించాడు. ఆ యోధుడే భీమిరెడ్డి నర్సింహారెడ్డి. అప్పటికే జనగామ పిర్కాలో ఆనాటి భూస్వాములకు వ్యతిరేకంగా సంఘాలు ఏర్పడ్డాయి. దేవరుప్పలలో తొలిసారిగా దేవులపల్లి వేంకటేశ్వరరావు నాయకత్వంలో గుతపలు తీసుకుని ఎదురుతిరిగారు. చరిత్రలో దాని పేరు గుతపల సంఘమైంది. ఐలమ్మ బువ్వగింజల పోరాటం నుంచి పిడికిలి బిగించిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి సాయుధపోరాటాన్ని విరమించేంత వరకు వెనుతిరిగి చూడకుండా పోరాడిన యోధుడు. గుతపల సంఘంతో పాటు గ్రామీణ ప్రాంతంలో రైతులను సమీకరించి వారికి అందుబాటులో ఉన్న వనరులని ఆయుధాలుగా మలిచి భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి భీమిరెడ్డి. కోటపాడు గ్రామంలో గడ్డివాములను తగులబెట్టి పొగబాంబులుగా మార్చి నిజాం పోలీసు, సైనికదళాలని మట్టు పెట్టిన ఘనుడు ఆయన. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సాయుధపోరాటానికి రూపకల్పన చేసిన మిలిటరీ వ్యూహకర్త. నాలుగేళ్లు కొనసాగిన సాయుధపోరాటంలో భీమిరెడ్డి ఏనాడు కూడా వెనకకు పోలేదు. చిత్రహింసలను అనుభవించాడు. అయినా ఎత్తిన తుపాకీ దించలేదు. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమిని భూస్వాములనుంచి లాక్కొని పేదలకు పంచటంలో కమ్యూనిస్టులు ప్రజలకు చేరువయ్యారు. ఈ పోరాటంలోనే శత్రువుపై పోరాడుతూ భీమిరెడ్డి తన చేతులో ఉన్న కొడుకును కూడా వదిలేసి వెళ్లిపోయాడు. బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవు కొడుకో నైజాం సర్కరోడా అని పాట కట్టిన బండి యాదగిరికి కొండంత అండగా నిలిచినవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. తన పోరాటమంతా గిరిజనులు, బహుజనుల చుట్టే తిరిగింది. ప్రధానంగా ఈ పోరాటమంతా భూసమస్య చుట్టూ తిరిగింది. కాబట్టే చదువురాని నిరక్షరాస్యులైన ఆ మూగజీవాలను మహాయోధులుగా మార్చి పోరా టం చేయించిన చరిత్ర తెలంగాణ సాయుధపోరాటానికే దక్కుతుంది. ఆ ఖ్యాతిలో భీమిరెడ్డి చరిత్ర చెరిగిపోనిది. భీమిరెడ్డి దళ నాయకుడిగా వందల సంఘటనల్లో పాల్గొన్నాడు. శత్రువుతో ముఖాముఖి యుద్ధాలకు తలపడ్డాడు. ఆనాటి సంఘం చెప్పిన మాటను జవదాట కుండా పనిచేశాడు. అందుకే భీమిరెడ్డిని తెలంగాణ క్యాస్ట్రో అంటారు. (నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నేడు బీఎన్ తొలి స్మారక ఉపన్యాసం) – ప్రొ‘‘ అడపా సత్యనారాయణ (రిటైర్డ్), ఉస్మానియా యూనివర్శిటీ -
దిల్ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారం
దుబాయ్: విజయా ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులు స్వర్గీయ బి.నాగిరెడ్డి స్మారకార్థం ప్రతియేటా నిర్వహించే ‘నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవం’ దుబాయ్‌లో ఘనంగా జరిగింది. గత ఆరేళ్లుగా ఈ అవార్డును తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమాకు అందజేస్తున్నారు. 2017 ఏడాదికిగాను ‘ఫిదా’ సినిమాని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సొలేట్ ఆడిటోరియంలో భారతీయ దౌత్యవేత్త సుమతీ వాసుదేవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఫిదా సినిమా నిర్మాత దిల్ రాజుకు నాగిరెడ్డి స్మారక పురస్కారంతో పాటు 1.5 లక్షల రూపాయల నగదు అందజేశారు. విదేశీ గడ్డపై ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నామని ఇకపై ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని విజయా అధినేతలు వెల్లడించారు. కాగా, పురస్కార గ్రహీత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇటువంటి పురస్కారం అందుకోవడం నా అదృష్టం, ఇంత గొప్ప అవార్డును అందుకోవడానికి ఏ దేశానికైనా వెళతానన్నారు. నాగిరెడ్డి కుమారులు వెంకటరామి రెడ్డి, కోడలు భారతి రెడ్డి ( విజయా ఆస్పత్రుల అధినేత్రి) పర్యవేక్షణలో.. గీతా రమేశ్, రమేశ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుధా పల్లెం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాగిరెడ్డి సినిమా పాటలు.. సంగీత దర్శకులు మాదవపెద్ది సురేశ్‌చంద్ర వాద్య, గాయక బృందం విజయా సినిమాల పాటలతో సభికులను ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో అబుదాబికి చెందిన ఆదిభట్ల కామేశ్వర శర్మ, సునీతా లక్ష్మీ నారాయణ, ఉమా పద్మనాభం, స్వప్నికా శ్రీనివాస్, విశాలా మధు తదితరులు పాల్గొన్నారు. -
బీఎన్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/నకిరేకల్: ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత, మిర్యాలగూడ మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి(86) కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు రమాదేవి, ఉమాదేవి, హేమాదేవి. కొడుకు చంద్రశేఖర్‌రెడ్డి రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎన్ రెడ్డి భార్య అలివేలమ్మ చాలా ఏళ్లక్రితమే చనిపోయారు. ఆయన మనుమడు సహస్రరెడ్డి అమెరికాలో చదువుకుంటున్నారు. తాత మరణవార్త తెలియగానే అక్కడ్నుంచి బయల్దేరారు. మంగళవారం హైదరాబాద్‌లో 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదీ ప్రస్థానం.. బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన నర్సింహారెడ్డి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 1931 జూన్ 21న బద్దం రామచంద్రారెడ్డి శాంతమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య నకిరేకల్‌లో చదివారు. నల్లగొండలో ఎస్ఎస్సీ, హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్, ఉస్మానియా వర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. అమెరికా కొలరాడో విశ్వ విద్యాలయంలో ఎంటెక్ చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓయూలో కొంతకాలం లెక్చరర్‌గా పని చేశారు. ఆయన వాస్తుశిల్ప నైపుణ్యం అబ్బురపరిచేది. పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా కాలనీలు, అపార్ట్మెంట్లు కట్టించారు. హౌజింగ్ బోర్డు 14 అంతస్తుల బిల్డింగ్తోపాటు జి.పుల్లారెడ్డి ఏడంతస్తుల భవనాన్ని డిజైన్ చేశారు. ఎన్టీఆర్ స్టూడియో కూడా ఆయనే డిజైన్ చేసిందే. బేగంపేట్ ఎయిర్‌పోర్టు వెనుక ప్రభుత్వం కట్టించిన బలహీన వర్గాల గృహ సముదాయానికి ఆయనే రూపకర్త. అప్పట్లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బీఎన్‌రెడ్డి ప్రతిభను ప్రశంసించారు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆయన్ను రాజకీయ రంగం వైపు నడిపించింది. 1989లో, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలిచారు. 1968లో విర్గో పేరుతో ఆర్కిటెక్ట్ సంస్థను స్థాపించారు. అనేక భవన సముదాయాల నిర్మాణాన్ని చేపట్టారు. ఆయన పేరిట బీఎన్‌రెడ్డి నగర్ వెలిసింది. ప్రస్తుతం ఆయన నివాసమున్న జూబ్లీహిల్స్‌లోని బీఎన్ఆర్ హిల్స్ భవనాలు ఆయన సృష్టే. 1979లో చైతన్య భారతి విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన ఆయన వాటికి మూడుసార్లు చైర్మన్‌గా పని చేశారు. గొప్ప రచయిత కూడా.. బీఎన్‌రెడ్డి అనేక సామాజిక అంశాలపై పుస్తకాలు రాశారు. ‘సామాన్యుడి సందేశం’, కవితా సంపుటి ‘బీఎన్ భాషితాలు’, ‘బీఎన్. భావతరంగిణి’వంటి కవితలు రాశారు. 1986లో వాస్తు శాస్త్ర అధ్యయనంతో పాటు పరిశోధనలు చేపట్టారు. 1992లో ప్రాక్టికల్ వాస్తు అనే ఆంగ్ల గ్రంథ రచనతో పాటు ముద్రణ కూడా చేపట్టారు.‘గ్లిమ్సెస్ ఆఫ్ వాస్తు’అనే గ్రంథంతోపాటు మరో 8 వాస్తుశాస్త్ర గ్రంథాలు రాశారు. వాస్తుశాస్త్రంలో ఆయన రచనలకు దేశ, విదేశాల్లో విశేష ప్రాచూర్యం లభించింది. చెన్నై అన్నామలై యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టర్ అందుకున్నారు. ఆయన రాసిన ‘పెళ్ళికాని పెళ్ళి’కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్‌గాంధీ పురస్కారం లభించాయి. 1994లో బీఎన్ సాహితీ పురస్కారం స్థాపించారు. కాంగ్రెస్ నేతల సంతాపం బీఎన్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సంతాపాన్ని ప్రకటించారు. -
మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు ఆత్మహత్య
హైదరాబాద్: వాస్తుశిల్పి, మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజరాహిల్స్ లోని తన ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రశేఖర రెడ్డి ఆత్మహత్యకు ఆర్థిక వ్యవహారాలే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
దర్శక దిగ్గజం బిఎన్ రెడ్డి