సాక్షి, హైదరాబాద్: టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనా మా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రాజీనామా పంపినట్లు తెలిపారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న తాను హైదరాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రచార కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించా నన్నారు. 2009లో డీలిమిటేషన్‌తో ఖైరతాబాద్ 4 నియోజకవర్గాలుగా మారినా ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకా శం రాకపోయినా బాధపడలేదన్నారు. పొత్తులో భాగంగా 2018లో కాంగ్రెస్‌కు కేటాయించినప్పటికీ, పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానన్నారు. 2018లో రాష్ట్రంలో 13 స్థానాల్లో పోటీచేసేందుకు ఒప్పుకునే పరిస్థితికి దిగజారిన పార్టీ.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పోటీయే చేయని దుస్థితికి దిగజారడాన్ని తట్టుకోలేక రాజీనా మా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బీఎన్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment