tntuc
-
అమలాపురంలో TNTUC నేతలకు ఝలక్ ఇచ్చిన అంగన్వాడీలు
-
టీఎన్టీయూసీ అధ్యక్షుడి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, టీఎన్టీయూసీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనా మా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రాజీనామా పంపినట్లు తెలిపారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న తాను హైదరాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రచార కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, టీఎన్టీయూసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించా నన్నారు. 2009లో డీలిమిటేషన్‌తో ఖైరతాబాద్ 4 నియోజకవర్గాలుగా మారినా ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకా శం రాకపోయినా బాధపడలేదన్నారు. పొత్తులో భాగంగా 2018లో కాంగ్రెస్‌కు కేటాయించినప్పటికీ, పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానన్నారు. 2018లో రాష్ట్రంలో 13 స్థానాల్లో పోటీచేసేందుకు ఒప్పుకునే పరిస్థితికి దిగజారిన పార్టీ.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పోటీయే చేయని దుస్థితికి దిగజారడాన్ని తట్టుకోలేక రాజీనా మా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బీఎన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. -
‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో సన్నిహిత సంబం ధాలున్నాయన్న వాటిపై ఆరా తీసేందు కు, ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయన్నదాన్ని తెలుసుకునేందుకు నగర టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్.రెడ్డిని ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్.రెడ్డిని విచారించిన పోలీసులు రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేంటి అన్న మూడు అంశాలపైనే విచారణ చేశారు. ఇరవై రోజుల కిందట బీఎన్.రెడ్డి తన స్నేహితుడు రాకేశ్‌రెడ్డిని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ రాంబాబుతో గంటపాటు మంతనాలు జరిపారు. రాంబాబు తనకు బాగా తెలుసునని ఏ పనై నా చేసిపెడతాడంటూ బీఎన్.రెడ్డి నమ్మించడం తో రాకేశ్‌రెడ్డి తన కారులోనే రాయదుర్గం పీఎస్‌కు అతనితో వెళ్లాడు. జయరాం సెటిల్మెంట్లో తనకు సహకరించాలని రాకేశ్‌రెడ్డి సీఐ రాంబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి విచారణ లో రాంబాబు ఇదే విషయాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్‌కు తెలియజేశారు. దీంతో బీఎన్.రెడ్డిని విచారణకు హాజరుకావాలని శుక్రవా రం రాత్రి ఫోన్ చేయగా ఆయన ఆదివారం విచారణకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తాను ఖైరతాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడు రాకేశ్‌రెడ్డి పరిచయం అయ్యాడని ఆయన కూడా టీడీపీ నేత కావడంతో పలుమార్లు మాట్లాడినట్లు, అంతకుమించి తమ మధ్య ఏమీలేదని బీఎన్.రెడ్డి పోలీసులకు తెలిపారు. మొత్తానికి ఈ కేసులో పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. -
మేడేను విజయవంతం చేయండి
వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించే మే డే కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నందిమల్ల రామస్వామి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూల్ రోడ్ సత్యనారాయణ రైస్‌మిల్ నుంచి భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బి.రాములు, పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, కౌన్సిలర్ నందిమల్ల శారద, రైస్‌మిల్ అధ్యక్షులు మన్యం, హమాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న, ఆటో యూనియన్ అధ్యక్షులు ఖలీల్, గంధం రాజు, మన్యం పాల్గొన్నారు. -
నేటి నుంచి మునిసిపల్ సమ్మె
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 16 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు దిగుతున్నామని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం ప్రకటించింది. కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని జేఏసీ నేతృత్వంలోని కార్మిక సంఘాలు మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నాయి. ప్రస్తుతం పురపాలికల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రతి నెలా రూ.8,300 వేతనం చెల్లిస్తున్నారు. జీవో నం.14 ప్రకారం కార్మికుల వేతనాలను కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా వరుసగా రూ.17.5 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలకు పెంచాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొంటూ 11న పురపాలక శాఖ డైరెక్టర్‌కు సమ్మె నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నామని ప్రకటించింది. స్తంభించనున్న సేవలు.. మునిసిపల్ సమ్మెతో రాష్ట్రంలోని పురపాలికల్లో కీలకమైన పారిశుధ్య సేవలు స్తంభించిపోనున్నాయి. నగరాలు, పట్టణాల్లో టన్నుల కొద్దీ చెత్త, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. పార్కులు, నీటి సరఫరా, వీధి దీపాలు, మలేరియా నివారణ విభాగాల్లోని సిబ్బందితోపాటు బిల్ కలెక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీసు సిబ్బంది కూడా సమ్మెబాట పట్టనున్నారు. దీంతో ఆయా విభాగాల్లో పౌర సేవలకు ఇక్కట్లు ఎదురుకానున్నాయి. అత్యంత దయనీయ పరిస్థితిలో పారిశుధ్య పనులు నిర్వహించే మునిసిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం శోచనీయమని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, టీఎన్‌టీయూసీల కార్మికుల సంఘాలతో ఏర్పడిన మునిసిపల్ కార్మిక సంఘాల జేఏసీ మండిపడింది. ‘దేవుళ్ల’ ఎదురుచూపు! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాల పెంపు డిమాండ్‌తో 2015 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి సామాన్య ప్రజలు తీవ్ర అవస్తలకు గురయ్యారు. సమ్మెకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెంచింది. సమ్మె విరమిస్తే మిగిలిన పురపాలికల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ప్రకటించడంతో కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. సఫాయివాలాలను దేవుళ్లతో పోల్చి వారి సేవలను ఆకాశానికెత్తారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. వేతనాలు పెంచినా చెల్లించాల్సింది పురపాలికలే కాబట్టి అవే నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ వాదనలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు పురపాలికల ఆదాయం అంతంత మాత్రమే ఉందని, వేతనాలు పెంచితే చెల్లించే స్తోమత పురపాలికలకు లేదని మేయర్లు, మునిసిపల్ చైర్పర్సన్లు తేల్చి చెప్పారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే మూడు నెలలకోసారి చెల్లిస్తున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో అలానే ఇతర పురపాలికల కార్మికుల విషయంలోనూ అలానే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. -
ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎస్ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఇప్పటికే ఏడాది ఆలస్యమవుతున్న ఎన్నికల కసరత్తులో అటు యూనియన్లు, ఇటు యాజమాన్యం తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న అన్ని యూనియన్ల ప్రతినిధులతో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. యాజమాన్యం, యూనియన్ ప్రతినిధుల నుంచి ఓటర్లు, ఎన్నికల ఏర్పాట్లు తదితర వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఈ నెల 20న మరోమారు సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ నెలాఖరున లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుండగా యూనియన్లు ఇప్పటి నుంచే ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్), ఐఎన్టీయూసీ(పులి గుర్తు), ఐఎన్టీయూసీ(త్రాచు గుర్తు), భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్), కార్మిక పరిషత్(టీఎన్టీయూసీ), యునెటైడ్ వర్కర్స్ యూనియన్లు ఈ సారి పోటీకి సిద్ధమవుతున్నాయి. ఏడాది ఆలస్యంగా ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. 2013 జనవరి నుంచి ఈయూ గుర్తింపు సంఘంగా కొనసాగుతోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాలతో కాలయాపన జరిగింది. మొత్తం 57,700 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. 2015 డిసెంబర్ 31 నాటికి ఆర్టీసీలో ఉద్యోగం చేపట్టి ఆరు నెలలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నారు. ఎన్నికలకు పలు అడ్డంకులు... ఆర్టీసీలో అంతర్గత సమస్యలు ప్రభావం చూపకుంటే గుర్తింపు సంఘం ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందని పలు యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. యూనియన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ అద్దె బస్సుల టెండర్లను ఈ నెల 5న యాజమాన్యం ఆమోదించనుంది. ఒప్పందం ప్రకారం కార్మికులకు గత ఏడాది డిసెంబర్ 23న ఇవ్వాల్సిన బకాయిలును యాజమాన్యం ఇంత వరకు చెల్లించలేదు. మరోవైపు సంక్రాంతికి ముందు జనవరి 8న పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంది. అద్దె బస్సులు, పలు సమస్యలపై ఈ నెల 4న ఈయూ అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహించనుంది. ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్‌ఎంయూలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలతో ముడిపడి ఉండటం గమనార్హం. -
ఎన్టీఆర్ భవన్లో మేడే వేడుకలు
సాక్షి, హైదరాబాద్: కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రస్తుత ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతంగా పెరుగుతోందని, వారిని పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ భవన్లో మేడే సందర్భంగా గురువారం టీఎన్టీయూసీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈవూరి మృతికి సంతాపం: మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. టీడీపీ బలోపేతానికి ఈవూరి సుబ్బారావు, సీతారావమ్మ దంపతులు కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి రామారావు మృతికి బాబు సంతాపం వ్యక్తం చేశారు.