వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించే మే డే కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నందిమల్ల రామస్వామి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కర్నూల్ రోడ్ సత్యనారాయణ రైస్‌మిల్ నుంచి భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బి.రాములు, పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్, కౌన్సిలర్ నందిమల్ల శారద, రైస్‌మిల్ అధ్యక్షులు మన్యం, హమాలీ సంఘం అధ్యక్షుడు లక్ష్మన్న, ఆటో యూనియన్ అధ్యక్షులు ఖలీల్, గంధం రాజు, మన్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment