వైఎస్సార్‌సీపీకి బొత్స రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ సృష్టి
సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు
నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన బొత్స
తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఓటమి భయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలంటూ మండిపాటు
విశాఖ సిటీ: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటమి ఖాయమని తేలిపోవడంతో పోలింగ్‌కు ముందు రోజు చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ సృష్టించారు. బొత్స లెటర్ హెడ్‌పైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాస్తున్నట్లుగా లేఖను తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. ఈ కుతంత్రంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రోజుకో కుట్ర..
ఓటమి ముంగిట నిలిచిన చంద్రబాబు రోజుకో కుట్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతి సంస్కరణ, నిర్ణయంలో లేని వివాదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. భూ యజమానులకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారు. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు. ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment