కౌలాలంపూర్: భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మలేసియాలోని భారత హైకమిషనర్ బిన్ రెడ్డి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలేసియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే మలేసియాలో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. వీసా సెంటర్, కాన్సులర్ సెంటర్లలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తుమన్నారు. దీనికి ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా హాజరుకావొచ్చని వెల్లడించారు.
ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ‘ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్’గా డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. (క్లిక్ చేయండి: కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన)
Comments
Please login to add a commentAdd a comment