India Republic Day
-
విమానాశ్రయాలలో భద్రత పెంపు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని చైన్నెతోపాటూ ఇతర నగరాలలో ఉన్న విమానాశ్రయాలలో భద్రతను ఐదు అంచెలకు పెంచారు. విమానాశ్రయాలు, పరిసరాలలో 30వ తేదీ వరకు పలు రకాల నిబంధనలతో ఆంక్షలు విధించారు. ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థిలలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లపై పోలీసుల ఽఅధికారులు దృష్టి పెట్టారు. అదే సమయంలో చైన్నెలోని అంతర్జాతీయ విమానాశ్రయం, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై విమానాశ్రయాలలనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.తూత్తుకుడి, సేలంలోని స్వదేశీ విమానాశ్రయాలను భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. విమానాశ్రయాలలో సాధారణంగా ఉన్న భద్రతతో పాటూ అదనంగా ఐదు అంచెల భద్రతను పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతిస్తున్నారు. అలాగే చైన్నె, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తూత్తుకుడి, తిరునల్వేలి, విల్లుపురం తదిత ర రైల్వే స్టేషన్లను నిఘాపెంచారు. విమానశ్రయం పరిసరాలలో కేంద్ర బలగాలు, వెలుపల రాష్ట్ర పోలీసులు భద్రతా విధులలో ఉన్నారు. సందర్శకులకు ఆంక్షలు విధించారు. విమానాశ్రయం రన్ వే మార్గం జీఎస్టీ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ఈ మార్గంలో ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. అలాగే, రైల్వే స్టేషన్ల వద్ద సైతం భద్రతను పెంచారు.రిహార్సల్స్..మెరీనా తీరంలో రిపబ్లిక్ డే వేడుకల కసరత్తులు మొదలయ్యాయి. కామరాజర్ సాలైలో సోమవారం నుంచి రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. త్రివిధ దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థులు రిహార్సల్స్ రూపంలో ఉదయాన్నే తమ ప్రదర్శనలు చేశారు. పోలీసులు, త్రివిధ దళాల కవాతులు అబ్బుర పరిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈసారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ రిహార్సల్స్ జరిగే సమయాలలో కామరాజర్ సాలై , పరిసరాలలో ఉదయాన్నే ట్రాఫిక్ మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
నారీ శక్తితో గణతంత్రం వచ్చే ఏడాది మహిళలతోనే రిపబ్లిక్ డే పరేడ్
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ అంటే మన దేశ త్రివిధ బలగాల శక్తిని ప్రపంచానికి చాటడమే. యుద్ధ శకటాలు, విమానాల విన్యాసాలు, కొత్త ఆయుధాల ప్రదర్శన ఇలా పరేడ్ అంటే కదనరంగంలో మన సత్తా ఎంతో ప్రదర్శించడమే. అలాంటి పరేడ్‌ను వచ్చే ఏడాది మహిళా శక్తితో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నింగి నేలా నీరు అంతా మాదే అంటూ నినదిస్తున్న మహిళల భాగస్వామ్యం ఇటీవల కాలంలో త్రివిధ బలగాల్లో పెరుగుతోంది. యుద్ధభూమిలోకి అడుగు పెట్టడానికి కూడా మహిళలు సై అంటున్నారు. కేంద్ర బలగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం 2024 జనవరి 26న కర్తవ్యపథ్‌లో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌ను కేవలం మహిళలతో నిర్వహించాలని రక్షణ శాఖ ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. దీనిపై ఫిబ్రవరిలో రక్షణ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో త్రివిధ బలగాల అధిపతులతో ఒక సమావేశం కూడా జరిగిందని ఆదివారం రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ బలగాల్లోని మహిళా అధికారులే రిపబ్లిక్ డే కవాతుని నడిపిస్తారని ఆ సమావేశం నిర్ణయించింది. ఈ విషయాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకి కూడా సమాచారం అందించారు. రక్షణ , హోం సంస్కృతి పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా దీనిని ఎలా అమలు చేయాలో చర్చిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డేలో నారీ శక్తి థీమ్‌ను ప్రధానంగా చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట, త్రిపుర రాష్ట్రాలు నారీశక్తి థీమ్‌తో శకటాలు రూపొందించాయి. ఇక వచ్చే ఏడాది అందరూ మహిళలతోనే పరేడ్ సాగనుంది. -
మలేసియాలో ఘనంగా భారత గణతంత్ర వేడుకలు
కౌలాలంపూర్: భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మలేసియాలోని భారత హైకమిషనర్ బిన్ రెడ్డి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలేసియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే మలేసియాలో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. వీసా సెంటర్, కాన్సులర్ సెంటర్లలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తుమన్నారు. దీనికి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా హాజరుకావొచ్చని వెల్లడించారు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ‘ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్’గా డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. (క్లిక్ చేయండి: కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన) -
భారత్ ఆహ్వానానికి ఒబామా అంగీకారం
న్యూఢిల్లీ: భారత్ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా హాజరుకానున్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఒబామాను ఆహ్వానించారు. ఇందుకు ఒబామా అంగీకరించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఒబామాను త గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినట్టు అంతకుముందు నరేంద్ర మోదీ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రధాని హోదాలో అమెరికా పర్యటించిన మోదీ... ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో వైట్ హౌస్ లో విందుకు హాజరయ్యారు. This Republic Day, we hope to have a friend over…invited President Obama to be the 1st US President to grace the occasion as Chief Guest. — Narendra Modi (@narendramodi) November 21, 2014 -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా!