hastinapuram
-
వైన్ షాప్ తొలగించాలని మహిళల ఆందోళన
-
హైదరాబాద్: ఆంబులెన్స్ పేలుడు.. డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. హస్తినాపురం వద్ద ఓ ప్రైవేట్ ఆంబులెన్స్ ప్రమాదానికి గురికాగా.. ఆంబులెన్స్ మంటల్లో దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆంబులెన్స్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మలక్‌పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆంబులెన్స్.. బీఎన్‌రెడ్డి హస్తినాపురం వద్ద డివైడర్ ఢీకొని బోల్తాపడింది. ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్‌ను బయటకు తీశారు. అయితే.. తీవ్ర గాయల పాలైన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఆంబులెన్స్‌ను తొలగించే ప్రయత్నం చేయగా.. అందులోని ఆక్సిజన్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి పేషెంట్స్ ను ఇబ్రహీంపట్నంలో దింపేసి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు
హస్తినాపురం: సెలూన్, స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాంగళ్య షాపింగ్‌మాల్‌కు ఎదురుగా ఉన్న యూనిసెక్స్ సెలూన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సెలూన్ స్పాపై గురువారం దాడి చేసి ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు, రూ.2,100ను స్వాధీనం చేసుకుని వారిని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేచుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!) -
Hyderabad: చిట్టీల పేరుతో అధిక వడ్డీ.. రెండు కోట్లతో ఉడాయించింది
సాక్షి, హస్తినాపురం: చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి రెండు కోట్ల రూపాయలతో ఓ మహిళ ఉడాయించింది. దీంతో బాధితులు ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. అనురాధ కాలనీకి చెందిన కోన విజయలక్ష్మి తన స్నేహితులు , బంధువుల దగ్గర దాదాపు రెండు కోట్లరూపాయల మేరకు వసూలు చేసింది. 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోవడంతో కంగారు చెందిన బాధితులు ఆదివారం విజయలక్ష్మీ ఇంటిముందు ధర్నాకు దిగారు. విజయలక్ష్మిని తీసుకొచ్చేంతవరకు తాము ఇక్కడే ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటామని బాధిత మహిళలు తెలిపారు. దాదాపు 45 మంది వద్ద డబ్బు తీసుకుందని ఈనెల 21న నారాయణరెడ్డి, క్రిష్ణారెడ్డి, వెంకటరెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: ఓయూ క్యాంపస్‌లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్ చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ -
ఎల్బీనగర్ లో టిఆర్ఎస్ -బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సాక్షి, హస్తినాపురం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పిల్లగుంట్ల తండాకు చెందిన కవిత, విజయ్ దంపతులు ఇంజాపూర్ గ్రామంలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 18న కవిత కరోనాతో మృతి చెందిందని చెప్పి ఆమె భర్త విజయ్ చెప్పాడని కవిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హుటాహుటినా గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారన్నారు. అంత్యక్రియలలో పాల్గొన్న కవిత కుటుంబ సభ్యులు కరోనా టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. తమ కూతురిని పథకం ప్రకారం హత్య చేసి కరోనాతో చనిపోయిందని నమ్మించి మోసం చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నల్గొండ జిల్లా పిఏపల్లి మండల తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన కవిత మృదేహాన్ని పోలీసులు వెలికి తీసి సోమవారం పంచనామా చేశారు. రిపోర్ట్ వస్తే కవిత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: రూ. 2 కోట్ల కోసం కిడ్నాప్.. కోవిడ్ శవంగా అంత్యక్రియలు -
బార్లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హస్తినాపురం: వ్యభిచారం నిర్వహిస్తున్న వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరు యువతులు, ఇద్దరు నిర్వాహకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మురళీమోహన్ సమాచారం మేరకు... వనస్థలిపురం సుష్మాసాయినగర్ కాలనీ విజయవాడ జాతీయ రహదారి పక్కనే వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రెస్టారెంట్‌పై ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. రెస్టారెంట్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న వి.అజయ్ (22), సెక్యూరిటీ గార్డు సుగమ బాగర్(35) ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తూ యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఇద్దరు ఆర్గనైజర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వారి నుంచి కొంత నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ -
సీసీటీవీ దృశ్యాలు:వనస్థలిపురం ఘోర రోడ్డు ప్రమాదం
-
హైదరాబాద్: తప్పతాగి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి ఢీ
-
వనస్థలిపురంలో కారు బీభత్సం, సీసీటీవీ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. గౌతమ్ అనే యువకుడు తన స్నేహితులు ఇద్దరితో కలిసి సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీం పట్నం వెళ్తున్నాడు. అప్పటికే అతడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ క్రమంలో హస్తినాపురంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు (నెంబర్: TS05FH2356)) డివైడర్ పై నుంచి మరో పక్కకి దూసుకెళ్లింది. గౌతమ్‌తో పాటు కారులో వెనకాల సీట్లో కూర్చున్న అతడి స్నేహితుడు సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో స్నేహితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇక యాక్సిడెంట్ చేసిన గౌతమ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం -
ఇల్లు అద్దెకు కావాలని వచ్చి.. దారుణం
హస్తినాపురం: ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన యువకుడు ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి పుస్తెలతాడును తెంచుకొని పరారయ్యాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గౌతమినగర్ కాలనీకి చెందిన అకినారపు ఉమాదేవి(30) ఇంట్లో ఒంటరిగా ఉండగా శనివారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడు(22) వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి కత్తితొ దాడిచేసి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని, ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. -
ఫుల్లుగా తాగేసి.. అంబులెన్స్‌ను ఢీకొట్టారు!
-
ఫుల్లుగా తాగేసి.. మితిమీరిన వేగంతో..
సాక్షి, హైదరాబాద్: తాగిన మైకంలో నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తూ అంబులెన్స్ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటన హస్తినపురం అమ్మ హాస్పిటల్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్, అజయ్, రాకేష్, శ్రీకాంత్ డిగ్రీ స్నేహితులు. మన్నెగూడలో ఓ పుట్టినరోజు వేడుకలో పాల్గొని కారులో తిరిగి వస్తున్నారు. వారు సరూర్ వెళ్లే క్రమంలో హస్తినపురం ఆస్పత్రి రోడ్డులో అతి వేగంగా వస్తూ రోడ్డు పక్కన నిలిచిఉన్న అంబులెన్స్ వాహనాన్ని ఢీకొట్టారు. యువకులు మద్యం మత్తులో ఉన్నారు. కారులో మద్యం బాటిళ్లు, చికెన్ లభించింది. అయితే, వారు సీట్ బెల్టు ధరించడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో యువకులు బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకులకు పరీక్షలు చేయగా.. కారు నడుపుతున్న వ్యక్తి జగదీశ్‌కు ఆల్కహాల్ రీడింగ్ 120 వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎల్బీనగర్ డీసీపీ యాదగిరి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
చిన్నారిని చిదిమేసిన క్రేన్
- తల్లి వెంట స్కూల్‌కు వెళ్తుండగా ప్రమాదం - బాలుడిది డిండి మండలం బోనబోయినపల్లి హస్తినాపురం : పాఠశాలకు వెళ్తున్న బాలుడ్ని క్రేన్ రూపంలో వచ్చిన మృత్యువు చిదిమేసింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా డిండి మండలం బోనబోయినపల్లి గ్రామానికి చెందిన బి.తిరుపతమ్మ, శ్రీను దంపతులు హస్తినాపురం ఓంకార్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరి కుమారుడు శివ(4) స్థానిక సెంట్రల్ గ్రామర్ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు. తిరుపతమ్మ శుక్రవారం ఉదయం కుమారుడు శివను పాఠశాలకు తీసుకెళ్లే క్రమంలో రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన క్రేన్ శివ ను ఢీకొట్టింది. క్రేన్ చక్రాల మధ్య నలిగి ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు తన చేయిపట్టుకొని, ముద్దు ముద్దు మాటలు చెప్తూ అడుగులు వేస్తున్న తన గారాల తనయుడు కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తిరుపతమ్మ గుండెలు బాదుకుంటూ రోదించింది. ఆ మాతృమూర్తిని ఊరుకోబెట్టడం ఎవరి తరం కాలేదు. ఉదయం 8 గంటలకు ప్రమాదం జరుగగా... దాదాపు 4 గంటల తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, అప్పటి వరకు నడిరోడ్డుపై రక్తపు మడుగులో పడివున్న పసివాడి మృతదేహాన్ని చూసి స్థానికులు, సాగర్ రహదారిపై వెళ్లే వాహనదారులు కంటతడి పెట్టారు. -
ముగ్గురు దొంగలు అరెస్ట్: భారీ నగదు స్వాధీనం
వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కడప నగర పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. చోరీల వద్ద నుంచి రూ. 7 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలతోపాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలపై పోలీసులు కేసు నమోదు చేసి, తమదైన శైలీలో దొంగలను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో వాహనదారుల కళ్లు కప్పి బైక్‌లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలోని ఓ ఇంటిలో దొంగలు బీభత్సం సృష్టించారు. 25 తులాల బంగారంతోపాటు కిలో వెండి, రూ. లక్ష నగదు అపహరించారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.