![Hastinapuram: Prostitution In bar, 2 Young Women And Managers Arrest - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/28/Prostitution.jpg1_.jpg.webp?itok=OSb5EmC6)
సాక్షి, హస్తినాపురం: వ్యభిచారం నిర్వహిస్తున్న వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరు యువతులు, ఇద్దరు నిర్వాహకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ మురళీమోహన్ సమాచారం మేరకు... వనస్థలిపురం సుష్మాసాయినగర్ కాలనీ విజయవాడ జాతీయ రహదారి పక్కనే వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రెస్టారెంట్‌పై ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు.
రెస్టారెంట్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న వి.అజయ్ (22), సెక్యూరిటీ గార్డు సుగమ బాగర్(35) ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తూ యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఇద్దరు ఆర్గనైజర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. వారి నుంచి కొంత నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment