![Police Raid On Prostitution House At Meerpet, Three Arrested - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/20/222.jpg.webp?itok=m6Pb8ABh)
సాక్షి, మీర్‌పేట: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్‌పేట లక్ష్మీనగర్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే పిల్లలమర్రి వేణు (33) ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బద్యానాయక్ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటిపై దాడి చేశాడు.
ఈ దాడిలో నిర్వాహకుడు వేణుతో పాటు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి (24), వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన విటుడు కొల్లా బలరాముడు (52)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వెయ్యి రూపాయల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఉపాధి పేరిట ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితులు
చదవండి: మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి లాగేందుకు యత్నం.. చివరికి
Comments
Please login to add a commentAdd a comment