మహిళతో ఒ‍ప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా | Police Raid Brothel In Vanasthalipuram Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: మహిళతో ఒ‍ప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా

Published Fri, Jul 29 2022 4:59 PM | Last Updated on Fri, Jul 29 2022 5:22 PM

Police Raid Brothel In Vanasthalipuram Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హస్తినాపురం(హైదరాబాద్‌): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శారదానగర్‌ కాలనీ ఫేజ్‌–3లో ఉండే వరదవాణి(60) తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది.
చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! 

తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది.  గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆ మహిళ వ్యభిచారం చేస్తుండగా,  పోలీసులు దాడి చేశారు.  మహిళతో పాటు భగవాన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement