
హస్తినాపురం: ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన యువకుడు ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి పుస్తెలతాడును తెంచుకొని పరారయ్యాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గౌతమినగర్ కాలనీకి చెందిన అకినారపు ఉమాదేవి(30) ఇంట్లో ఒంటరిగా ఉండగా శనివారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడు(22) వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి కత్తితొ దాడిచేసి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని, ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment