gold chain theft
-
దొరికిన బంగారు గొలుసు.. బాధితురాలికి ఇవ్వాలని ఠాణాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్: ఆటోలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి అప్పగించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఓ నగల వ్యాపారి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన షాయినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గోషామహల్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నల్లకుంటకు చెందిన కోర్టు ఉద్యోగిని మేఘన శుక్రవారం ర్యాపిడో ఆటోలో హైకోర్టుకు వెళ్లింది. కోర్టుకు వెళ్లిన తర్వాత మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అదే ఆటోను బుక్ చేసుకున్న వెండి నగల వ్యాపారి గోవింద్రామ్ సోని (70) బేగంబజార్ నుంచి కోఠీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈ క్రమంలో అతడికి ఆటోలో పడి ఉన్న బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆటో డ్రైవర్ నునావత్ తరుణ్‌ను వివరాలు అడగడంతో హైకోర్టు వద్ద ఓ మహిళను వదిలిపెట్టి వస్తున్నానని, సదరు గొలుసు ఆమెదే అయి ఉండవచ్చని చెప్పాడు. దీంతో గోవింద్రామ్ సోనీ నేరుగా అదే ఆటోలో షాయినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గొలుసును పోలీసులకు అప్పగించాడు. ఇంతలోనే బాధితురాలు మేఘన ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి గొలుసు విషయమై ఆరా తీసింది. సదరు ఆటో డ్రైవర్‌కు ఆమెకు విషయం చెప్పడంతో భర్తతో కలిసి పీఎస్‌కు వచి్చన బాధితురాలికి పోలీసుల సమక్షంలో గోవింద్రామ్ సోనీ బంగారు గొలుసును అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అతను కుప్పకూలి పోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోవింద్రామ్ సోనీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సహాయం చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచి్చన గోవింద్రామ్ సోనీ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని డీసీపీ విచారం వ్యక్తంచేశారు. -
పట్టపగలే కారంపొడి చల్లి..
చెళ్లకెర రూరల్ : నగరంలోని పావగడ రోడ్డులో ఉన్న దవనం టెక్స్టైల్స్ దుకాణంలో పట్టపగలే దుండగులు యజమానిపై కారంపొడి చల్లి బంగారు చైన్‌ను లాక్కెళిన ఘటన ఆదివారం జరిగింది. ఉదయం యజమాని గోవిందరాజు దుకాణంలో ఉండగా ముగ్గురు దుండగులు దుకాణంలోకి వచ్చారు. వచ్చి రాగానే గోవిందరాజు కళ్లల్లో కారంపొడి చల్లి అతని మెడలో ఉన్న 45 గ్రాముల బంగారు చైన్ లాక్కొని ఉడాయించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ పీటీబీ రాజన్న, సీఐ ఆర్ఎఫ్ దేశాయి, ఎస్ఐ సతీశ్ నాయక్ తదితరులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
షిర్డీ రైలులో చైన్ లాగి బ్యాగులతో పరుగు.. అప్రమత్తమైన ప్రయాణికులు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వెళ్తున్న సాయినగర్ షిర్డీ రైలులో దొంగతనానికి పాల్పడిన తొమ్మిది మంది యువతులను ప్రయాణికులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. రైలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నవీపేట్ స్టేషన్ వద్ద క్రాసింగ్ ఉండటంతో అక్కడ అగిపోయింది. దీంతో మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది యువతులు రైలులో ఎక్కారు. యువతులు ఎస్1 నుంచి ఎస్10 బోగీలలో అటుఇటూ తిరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. మొదట ఓ బోగీలో ప్రయాణికుడి బ్యాగ్ కనబడకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్రమత్తమైన ఆ కోచ్‌లోని మిగతా వారు తమ బ్యాగ్‌లను చెక్ చేసుకోగా మరో ఆరుగురికి చెందిన బ్యాగులు కూడా కనిపించలేదు. దీంతో బోగీలో కలకలం రేగింది. కొందరు ప్రయాణికులు బాసర వద్ద ట్రైన్ చైన్ లాగడంతో ఆగిపోయింది. ఈ క్రమంలో కొందరు యువతులు బ్యాగులతో పరుగెత్తడంతో ప్రయాణికులు పట్టుకున్నారు. బాసర పోలీసులకు సమాచారం అందించి, మొత్తం తొమ్మిది మందిని అప్పగించారు. ఆర్ఎస్ఎఫ్, బాసర పోలీసులు అక్కడి నుంచి యువతులను నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారిస్తున్న రైల్వే పోలీసులు రంగస్వామి అనే ప్రయాణికుడికి చెందిన బ్యాగ్‌తో పాటు ల్యాప్‌టాప్, కొంత నగ దు, ఓ మహిళ మెడలోని బంగారు చైన్ పోయినట్లు తెలిసింది. పావని, ధనుంజయ్, షేక్ నజీర్‌బాషా, లీలావతి, సుబ్బారాయుడు, శ్రీనివాస్ అనే ప్రయాణికుల బ్యాగ్‌లు పోయాయి. మూడు బ్యాగ్‌ల ను పోలీసులు రైల్వేపట్టాల పక్కన గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యా గులను యువతులు బాత్రూంలలో పె ట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకు న్న తొమ్మిది మందిని రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. యువతులు నాందేడ్‌లోని గురుద్వార్‌కు వెళ్లి అక్కడ నుంచి నిజామాబాద్ వచ్చినట్లు తెలిసింది. -
సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు.. ఇంటి బయట మహిళ.. బైక్‌పై వచ్చి ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు. ఇంటి బయట పనిచేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. హైదరాబాద్ శివారులో నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులు కోసం గాలింపు చేపట్టారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చదవండి: సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ.. -
మాయలేడి.. కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో వృద్ధురాలిని నమ్మించి..
కర్నూలు: నగర శివారులోని న్యూ పోస్టల్ కాలనీలో నివాసముంటున్న వృద్ధురాలు మద్దమ్మను(70) గుర్తు తెలియని మహిళ కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో మాయమాటలు చెప్పి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తస్కరించి మాయమైంది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 50 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ముఖానికి స్కార్ఫ్ ధరించి మద్దమ్మ ఇంటి వద్దకు వచ్చి తాను సచివాలయం వలంటీర్ అంటూ పరిచయం చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నావా అని ఆరా తీసి బూస్టర్ డోస్ వేయడం కోసం వచ్చానని నమ్మబలికింది. మంచంపై పడుకోబెట్టి తన బ్యాగులో ఉన్న బీపీ మిషన్, స్టెతస్కోప్‌తో పరీక్షించినట్లు నటించింది. చదవండి: ఆనందంగా గడిపి.. కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక.. తలను అటువైపు తిప్పుకోమని చెప్పి మెడలో ఉన్న మూడు తులాల చైన్‌ను కట్టర్‌తో కత్తిరించింది. వృద్ధురాలు గుర్తించి ఇదేమిటని ప్రశ్నించగా మళ్లీ చైన్ ఇస్తానంటూ ఆమె బ్యాగులో ఉన్న నకిలీ చైన్‌ను గొంతులో వేసి కదులకుండా పడుకో ఆఫీసర్‌ను పిలుచుకుని వస్తానంటూ అక్కడి నుంచి కనిపించకుండా మాయమైంది. వృద్ధురాలు కొద్దిసేపటికి తేరుకుని నకిలీ గొలుసు మెడలో వేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని సేకరించారు. రెండు నెలల క్రితం స్టాంటన్‌పురం, నరసింహారెడ్డి నగర్లో కూడా ఇదే తరహాలోనే మహిళ చోరీకి పాల్పడింది. సీసీ పుటేజీ ఆధారంగా పాత నేరస్తురాలిగా పోలీసులు నిర్దారణకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. -
చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. గొలుసివ్వకపోతే.. చంపేస్తాం!
కంబదూరు(అనంతపురం జిల్లా): చిన్నారి ప్రాణాలను పణంగా పెట్టి తల్లి మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. వివరాలు... కంబదూరు మండలం జెల్లిపల్లికి చెందిన సంజీవరెడ్డి, అమృత దంపతులకు ఏడాది వయసున్న కుమార్తె యశ్విత ఉంది. శనివారం ఉదయం చిన్నారికి స్నానం చేయించేందుకు ఇంటి బయటకు అమృత తీసుకు వచ్చింది. వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..? ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు వేసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడకు చేరుకున్నారు. అమృతతో మాటలు కలిపి ఈ దారి ఎక్కడకు పోతుందని అడిగారు. ఆమె అచ్చంపల్లికి వెళుతుందని తెలుపుతుండగానే.. చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. మెడలోని బంగారు గొలుసు ఇవ్వకపోతే పసిగుడ్డును చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తన మెడలోని 5 తులాల బంగారు మాంగల్యం గొలుసును ఆమె తీసివ్వగానే పాపను వదిలేసి ద్విచక్ర వాహనంపై శరవేగంగా దూసుకెళ్లారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
స్కూటీపై వచ్చి పుస్తెల తాడులాగిన దుండగులు.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, త్రిపురారం(నల్లగొండ): ఇద్దరు దుండగులు ఒంటరిగా ఉన్న మహిళ మెడలో పుస్తెలతాడును అపహరించారు. చేశారు. బాధితురాలి సమాచారం మేరకు గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన త్రిపురారం మండలం బొర్రాయిపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీ సులు, బాధితుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడ్ గ్రామంలో ఓ మహిళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండాన్ని దుండగులు గమనించారు. స్కూటీపై వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. అప్రమత్తమైన మహిళ సమీపంలో ఉన్న తన బంధువులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. దుండగులు అదేసమయంలో బొర్రాయిపాలెంలో గ్రామస్తులకు అనుమానంగా తారసపడ్డారు. దీంతో వారిని నీలదీయగా పారిపోబో యారు. వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. త్రిపురారం ఎస్ఐ రాంముర్తి సిబ్బందితో అక్కడికి చేరుకొని దుండగులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఘటన జరిగిన ప్రాంతం మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. -
ఇల్లు అద్దెకు కావాలని వచ్చి.. దారుణం
హస్తినాపురం: ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన యువకుడు ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి పుస్తెలతాడును తెంచుకొని పరారయ్యాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గౌతమినగర్ కాలనీకి చెందిన అకినారపు ఉమాదేవి(30) ఇంట్లో ఒంటరిగా ఉండగా శనివారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడు(22) వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి కత్తితొ దాడిచేసి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని, ఆమె చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కుని పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. -
గొంతుపై కత్తి పెట్టి.. బెదిరించి..
గూడూరు: ఓ దుండగుడు పట్టపగలు తలకు మాస్క్ వేసుకుని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. భర్త మెడపై కత్తి పెట్టాడు. అరిస్తే గొంతు కోసేస్తా.. మెడలో సరుడు తీసివ్వు అంటూ భార్యను బెదిరించి 5 సవర్ల బంగారు చైన్ దోచుకెళ్లాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని రాణీపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. రాణీపేట ప్రాంతంలోని మూడో వీధిలోని ఓ ఇంట్లో మేడపై వెంకటసుబ్బయ్య, దాక్షాయణమ్మ అనే వృద్ధ దంపతులుంటున్నారు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బయట బాల్కనీలో ఓ వ్యక్తి తలకు మాస్క్ వేసుకుని తిరుగుతుండడంతో వెంకటసుబ్బయ్య తలుపు తీశాడు. ‘ఎవరు కావాలి బాబూ’ అని అడుతుండగా అతను వెంకటసుబ్బయ్యను నెట్టుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాడు. వెంటనే తన వద్ద ఉన్న కత్తిని వెంకటసుబ్బయ్య మెడపై పెట్టాడు. దీంతో ఆయన ‘ఎవరయ్యా నువ్వు.. తమాషా పడుతున్నావా’ అని అడగ్గా.. దుండగడు కత్తితో మెడపై బలంగా నొక్కే ప్రయత్నం చేశాడు. ఇంతలో దాక్షాయణమ్మ బయటకు వచ్చింది. భర్త మెడపై కత్త చూసి అరిచేందుకు ప్రయత్నించగా, ఆ దొంగ ‘అరిస్తే నీ భర్త గొంతు కోసేస్తా. వెంటనే నీ మెడలోని సరుడివ్వు’ అని బెదిరించాడు. వెంకటసుబ్బయ్య మెడపై కత్తితో గట్టిగా నొక్కసాగాడు. దీంతో భయపడిపోయిన దాక్షాయణమ్మ తన మెడలోని 5 సవర్ల బంగారు సరుడును తీసి దొంగ చేతిలో పెట్టింది. వెంటనే అతను పరారయ్యాడు. బాధితులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ దశరథరామారావు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పురుషుడి వేషంలో చోరీకి వచ్చిన మహిళ
పొన్నలూరు: పశువుల మేత కోసుకుని ఇంటికి వస్తున్న మహిళ కళ్లల్లో కారం చల్లి ఆమె మెడలోని బంగారాన్ని చోరీకి యత్నించిన సంఘటన మండల కేంద్రం పొన్నలూరులో సోమవారం సాయంత్రం జరిగింది. బాధితరాలు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జెడ్ మేకపాడుకు చెందిన కాటూరి సత్యవతికి చౌటపాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ల కిందట వివాహమైంది. కొంత కాలం భర్త దగ్గర ఉన్నా కొన్ని రోజుల తర్వాత విభేదించి పొన్నలూరు చ్చి ఆద్దింట్లో ఉంటోంది. గ్రామంలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పాలడుగు సుబ్బులు అనే మహిళ పశువుల మేత కోసం సమీపంలోని పొలాల్లోకి వెళ్లింది. సుబ్బులు మేడలో ఉన్న బంగారు చైను, నల్లపూసల దండ ఉండటాన్ని సత్యవతి గమనించింది. సాధారణంగా వెళ్తే ఆమె గుర్తుపడుతుందని సత్యవతి ప్యాంటు, చొక్కా, టోపీ ధరించి ముఖంపై నల్ల రంగును పూసుకోని సుబ్బులు వెళ్లిన కొద్దిసేపటికి ఆమెను అనుసరించింది. సుబ్బులు మేత ఎత్తుకుని వస్తున్న క్రమంలో వెనుక వైపుగా వచ్చిన సత్యవతి ముందుగా కళ్లల్లో కారం చల్లి ఆమెను కింద పడేసి మెడలోని రెండు సవర్ల బంగారు నల్లపూసల దండ లాగింది. బాధితురాలు పెద్దగా కేకలు వేసి సత్యవతిని గట్టిగా పట్టుకుంది. ఇంతలో పక్క పొలంలో పనిచేస్తున్న గ్రామస్థుడు పరుగున వచ్చి సత్యవతిని పట్టుకున్నాడు. పక్కనే ఉన్న యువకులు కూడా వచ్చి సత్యవతిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇటీవల పార్థీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పుకార్లుతో పాటు గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరగడంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్టీమ్‌బాత్‌కు వెళ్లి వచ్చేలోగా గొలుసు మాయం
హైదరాబాద్ : కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ......బరువు తగ్గేందుకు ఫిట్నెస్ సెంట ర్కు వస్తే అక్కడి సిబ్బంది బంగారు గొలుసు చోరీ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ శ్రీనగర్‌కాలనీలో కలర్స్ ఫిట్నెస్ సెంటర్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఇందిరానగర్ నివాసి టి.కావ్య బరువు తగ్గే చికిత్స నిమిత్తం గతనెల 26న సదరు ఫిట్నెస్ సెంట ర్కు వెళ్లింది. చికిత్స అనంతరం స్టీమ్‌బాత్‌కు వెళ్తూ నాలుగు తులాల బంగారు గొలుసును బ్యాగ్‌లో ఉంచి టేబుల్‌పై పెట్టింది. పది నిమిషాల అనంతరం తిరిగి వచ్చి చూడగా బ్యాగ్‌లోని గొలుసు కనిపించలేదు. మీ గొలుసు పోవడానికి మేమే కారణం. సెటిల్మెంట్ చేసుకుందాం రండి అని ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకుడు పిలిచాడు. మరుసటి రోజు ఆమె వెళ్లగా... పోలీసు ఉన్నతాధికారులు నా కస్టమర్లు, నన్ను నువ్వు ఏమీ చెయ్యలేవు అని బెదిరించాడు. దీంతో ఆమె పంజగుట్ట క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు సదరు సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు తన బంధువులతో కలిసి మంగళవారం కలర్స్ ఫిట్నెస్ సెంటర్ ముందు ఆందోళన నిర్వహించింది.