
ఘటనా స్థలంలో విచారణ చేస్తున్న పోలీసులు
చెళ్లకెర రూరల్ : నగరంలోని పావగడ రోడ్డులో ఉన్న దవనం టెక్స్‌టైల్స్ దుకాణంలో పట్టపగలే దుండగులు యజమానిపై కారంపొడి చల్లి బంగారు చైన్‌ను లాక్కెళిన ఘటన ఆదివారం జరిగింది. ఉదయం యజమాని గోవిందరాజు దుకాణంలో ఉండగా ముగ్గురు దుండగులు దుకాణంలోకి వచ్చారు.
వచ్చి రాగానే గోవిందరాజు కళ్లల్లో కారంపొడి చల్లి అతని మెడలో ఉన్న 45 గ్రాముల బంగారు చైన్ లాక్కొని ఉడాయించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ పీటీబీ రాజన్న, సీఐ ఆర్‌ఎఫ్ దేశాయి, ఎస్‌ఐ సతీశ్ నాయక్ తదితరులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment