
కంబదూరు(అనంతపురం జిల్లా): చిన్నారి ప్రాణాలను పణంగా పెట్టి తల్లి మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. వివరాలు... కంబదూరు మండలం జెల్లిపల్లికి చెందిన సంజీవరెడ్డి, అమృత దంపతులకు ఏడాది వయసున్న కుమార్తె యశ్విత ఉంది. శనివారం ఉదయం చిన్నారికి స్నానం చేయించేందుకు ఇంటి బయటకు అమృత తీసుకు వచ్చింది.
వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..?
ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు వేసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడకు చేరుకున్నారు. అమృతతో మాటలు కలిపి ఈ దారి ఎక్కడకు పోతుందని అడిగారు. ఆమె అచ్చంపల్లికి వెళుతుందని తెలుపుతుండగానే.. చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. మెడలోని బంగారు గొలుసు ఇవ్వకపోతే పసిగుడ్డును చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తన మెడలోని 5 తులాల బంగారు మాంగల్యం గొలుసును ఆమె తీసివ్వగానే పాపను వదిలేసి ద్విచక్ర వాహనంపై శరవేగంగా దూసుకెళ్లారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment