రీల్స్‌ పిచ్చి.. బావి అంచున కూర్చొని పిల్లాడితో మహిళ వేషాలు | Video: Woman Dancing With Toddler Near Well's Edge Internet Enraged | Sakshi
Sakshi News home page

రీల్స్‌ పిచ్చి.. బావి అంచున కూర్చొని పిల్లాడితో మహిళ వేషాలు

Published Sat, Sep 21 2024 4:50 PM | Last Updated on Sat, Sep 21 2024 6:13 PM

Video: Woman Dancing With Toddler Near Well's Edge Internet Enraged

యువతతోపాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో రీల్స్‌పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చేసి సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావాలని వింత చేష్టలతో రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేసి ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు. తాజాగా ఓ మహిళ సైతం రీల్స్‌ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది.

బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్న మహిళ.. ఒక చేతితో పిల్లాడిని పట్టుకొని రీల్‌ చేసింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ కదలికల కోసం బాలుడిని నిర్లక్ష్యంగా పలుమార్లు చేతులు మార్చింది. బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అతడి శరీరం బావి పైన గాలిలో వేలాడుతూ ఉంది.

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. పిల్లవాడి రిస్క్‌ గురించి పట్టించుకోని ఆ మహిళ రీల్‌ పిచ్చిపై నెటిజన్లు మండిపడున్నారు. పిల్లవాడి గురించి పట్టించుకోని ఆమె రీల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్ వ్యామోహంలో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement