చిన్నారిని చిదిమేసిన క్రేన్ | The boy is going to school death came in form of crane | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన క్రేన్

Published Sat, Apr 18 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

క్రేన్‌చక్రాల మధ్య నలిగిపోయిన బాలుడు(ఇన్‌సెట్‌లో) మృతిచెందిన శివ

క్రేన్‌చక్రాల మధ్య నలిగిపోయిన బాలుడు(ఇన్‌సెట్‌లో) మృతిచెందిన శివ

- తల్లి వెంట స్కూల్‌కు వెళ్తుండగా ప్రమాదం
- బాలుడిది డిండి మండలం బోనబోయినపల్లి

హస్తినాపురం : పాఠశాలకు వెళ్తున్న బాలుడ్ని క్రేన్ రూపంలో వచ్చిన మృత్యువు చిదిమేసింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా డిండి మండలం బోనబోయినపల్లి గ్రామానికి చెందిన బి.తిరుపతమ్మ, శ్రీను దంపతులు హస్తినాపురం ఓంకార్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరి కుమారుడు శివ(4) స్థానిక సెంట్రల్ గ్రామర్ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు.

తిరుపతమ్మ శుక్రవారం ఉదయం కుమారుడు శివను పాఠశాలకు తీసుకెళ్లే క్రమంలో రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన క్రేన్ శివ ను ఢీకొట్టింది.  క్రేన్ చక్రాల మధ్య నలిగి ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు తన చేయిపట్టుకొని, ముద్దు ముద్దు మాటలు చెప్తూ అడుగులు వేస్తున్న తన గారాల తనయుడు కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తిరుపతమ్మ గుండెలు బాదుకుంటూ రోదించింది. ఆ మాతృమూర్తిని ఊరుకోబెట్టడం ఎవరి తరం కాలేదు. ఉదయం 8 గంటలకు ప్రమాదం జరుగగా... దాదాపు 4 గంటల తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, అప్పటి వరకు నడిరోడ్డుపై రక్తపు మడుగులో పడివున్న పసివాడి మృతదేహాన్ని చూసి స్థానికులు, సాగర్ రహదారిపై వెళ్లే వాహనదారులు కంటతడి పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement