ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన ఆరిఫ్ అతని ఫ్రెండ్ కొంగ మధ్యగల స్నేహబంధాన్ని స్థానికులు కథలు కథలుగా చెబుతుంటారు చాలామంది ఇటువంటి కథలను ఎక్కడా వినివుండరు. ఈ ఉదంతం ఎంతవరకూ చేరిందంటే యూపీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం ఆరిఫ్, ఆ కొంగను కలుసుకున్నారు. అనంతరం ఆయన ఆ కొంగను జూపార్కుకు తరలించారు. అయినా గ్రామంలోని వారెవరూ ఆ కొంగను మరచిపోలేరు. ఆ కొంగకు గ్రామంలోని వారంతా స్నేహితులే. ఆ కొంగ గ్రామంలోని వారందరితో కలసిమెలసి ఉండేది. గ్రామంలోని వారంతా ఆ కొంగ అంటే ఎంతో ప్రేమ చూపించేవారు.
ఆరిఫ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే ఆ కొంగ ప్రతీరోజూ ఉదయాన్నే తన అరుపులతో అందరినీ నిద్ర నుంచి లేపేది. అనంతరం స్థానికుల మధ్య కలివిడిగా తిరిగేది. కొంగను చూసినవారంతా దానికి ఫొటోలు తీసేవారు. కుద్‌రహా బ్లాక్ పరిధిలోని రోహరి గ్రామం.. కైద్‌హవా తాల్ సమీపంలో ఉంది. తాల్‌లో ఇసుకబట్టీలు ఉన్నాయి. ఉదయం కాగానే ఈ ప్రాంతం నుంచి ఒక కొంగవచ్చి గ్రామంలో కలివిడిగా తిరుగుతుంటుంది. ఊరి జనం దానిని చూడగానే స్నేహ పూర్వంగా ఉంటూ, దానికి ఏదో ఒక ఆహారం అందించేవారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతూ వస్తోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి సమీపంలోని ఇటుకబట్టీ దగ్లర కూలీలకు విచ్రితమైన రీతిలో రెండు గుడ్లు లభించాయి. వాటిని కూలీలు.. కొన్ని కొంగల దగ్గర విడిచిపెట్టారు. తరువాత ఆ గుడ్ల నుంచి కొంగ పిల్లలు బయటకు వచ్చాయి. కొద్ది రోజుల తరువాత ఒక కొంగ పిల్ల చనిపోయింది. మిగిలిన మరో కొంగను ఆ బట్టీలో పనిచేసే కూలీలు గ్రామానికి తీసుకువచ్చి, అక్కడ విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ కొంగ ఆ గ్రామంలో లేకపోయినా, స్థానికులు దానిని తలచుకోని రోజుంటూ ఉండదు. ఆరిఫ్ ఆ కొంగను ఎంతో ప్రేమగా సాకేవాడు.
ఇది కూడా చదవండి: నడక చైర్‌లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో!
Comments
Please login to add a commentAdd a comment