ప్రపంచంలోని పలు దేశాల్లో క్రూరమైన రాజుల పాలన సాగిందనే విషయం మనం చరిత్రలో చూసివుంటాం. వారు విధించే శిక్షలు వెన్నులో వణుకుపుట్టించేవని కూడా వినివుంటాం. అయితే అంతకన్నా అత్యంత క్రూరమైన యజమాని గురించి, అతను విధించిన హేయమైన శిక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగును క్రేన్‌కు బిగించి, అందరి ముందు దానికి శిక్ష విధించాడంటే.. అతను ఎంత క్రూరమైనవాడో ఇట్టే గ్రహించవచ్చు.
ఏనుగు ఏం తప్పు చేసిందని..
అత్యంత సాధు జంతువుగా పేరొందిన ఏనుగుకు శిక్ష విధించాడంటే అతని నిర్దయ ఏపాటితో ఇట్టే అర్థమవుతుంది. అది 1816, సెప్టెంబరు 13.. అమెరికాలో అత్యంత హేయంగా ఒక ఏనుగును క్రేన్‌కు వేలాడదీసి మరణశిక్ష విధించారు. ఆ ఏనుగు పేరు మేరీ. అది తన మావటివాడిని కాలితో తొక్కి చంపేసిందని దానికి ఇంత దారుణమైన శిక్ష విధించాడు.
చరిత్ర అందించిన సమాచారం ప్రకారం ఆ ఏనుగు ఆకలితో అల్లాడిపోతూ అదుపుతప్పింది. దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మావటివాడు దాని చెవిపై గట్టిగా కొట్టాడు. అంతే.. ఆ ఏనుగు కోపంతో.. ఒక్కసారిగా తన పాదంతో ఆ మావటివాడిని తొక్కి చంపేసింది. ఆ ఏనుగు ఒక సర్కస్‌లో పనిచేస్తుండేది. మావటివాడిని తొక్కి చంపేయడంతో ఆ ఏనుగుపై స్థానికులకు ఆగ్రహం కలిగింది.
క్రేన్‌కు వేలాడదీసి..
జనాగ్రహాన్ని చూసిన సర్కస్ యజమాని అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఏనుగుకు మరణశిక్ష విధించాలనుకున్నాడు. దానిని చంపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాడు. ఇందుకోసం 100 టన్నుల బరువు ఎత్తగల ఒక ప్రత్యేకమైన క్రేన్ తెప్పించాడు. ఏనుగు మెడను తాడుతో కట్టేందుకు ఒక ప్రత్యేకమైన తాడును కూడా తెప్పించాడు. క్రేన్ సాయంతో ఏనుగు మెడకు ఉరితాడు బిగించి, దానికి బహిరంగంగా జనసమూహం మధ్యలో మరణశిక్ష విధించాడు.
ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి..
Comments
Please login to add a commentAdd a comment