యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి.. | Another UP Mans Friendship With Crane Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..

Published Sun, Apr 16 2023 5:23 PM | Last Updated on Sun, Apr 16 2023 5:23 PM

Another UP Mans Friendship With Crane Goes Viral - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ రైతు ఆరిఫ్ ఖాన్ గుర్జార్  గాయపడిన కొంగను కాపాడినందుకు అతనిపైకేసు నమోదైన సంగతి తెలిసిందే.  రైతు ఆరిఫ్‌ ఆ కొంగను కాపాడటంతో అతనితోనే ఉండిపోవడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టింది. దీంతో అటవీ అధికారులు వన్యప్రాణి సంరక్షణ పేరుతో అతని నుంచి కొంగను వేరుచేసి సంరక్షణ కేంద్రానికి తరలించిన ఉదంతం మరువుక మునుపే అచ్చం అలాంటి కొంగ స్నేహమే యూపీలో మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ వ్యక్తికి మాత్రం కొంగతో స్నేహం చాలా యాదృచ్ఛికంగా జరిగింది.

ఈ మేరకు యూపీలోని మౌకీకి చెందిన రామ్‌సముజ్‌ యాదవ్‌ అనే వ్యక్తికి తన పొలంలో ఈ కొంగ కనిపించింది. దానికి అనుకోకుండా ఒకరోజు ఆహారం పెట్టడం జరిగింది. అలా రెండు సార్లు చేశాడు. అంతే ఆ కొంగ అతని వద్దకు పదేపదే రావడం జరిగింది. దీంతో ఆయన ఆ కొంగను మిగతా కొంగల గుంపులో వదిలేసినా, వేరు చేసేందుకు యత్నించినా అది మాత్రం ఆయన్ను వదిలిపెట్టలేదు. ఇలా ఏడాదిగా ఆ వక్తితో ఈ కొంగ స్నేహం చేస్తోంది.

రాజ్‌సముజ్‌ పిలుపు వినగానే వచ్చే ఈ కొంగ.. ఆయన ఎక్కడకు వెళ్తుంటే అది అక్కడకు వెళ్తోంది. వాస్తవానికి యూపీ రాష్ట్ర పక్షి అయినా ఈ కొంగను 1972 వన్యప్రాణి చట్టం కింద పెంచుకోవడం నేరం, పైగా ఇవి రెడ్‌లిస్ట్‌ పెట్‌ బర్డ్స్‌ జాబితాలో ఉండటంతో ఇవి పెంచడం చట్ట విరుద్ధం. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి చేరితే ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెట్టారు. 

(చదవండి: మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement