The boys death
-
తల్లి ఒడిలోనే.. మృత్యు ఒడిలోకి..
12 గంటల తర్వాత బాలుడి మృతి నిర్ధారణ పావగడ : అనంతపురం జిల్లా పుట్టపర్తి కి చెందిన ప్రశాంతి నిలయం అంబులెన్స్ డ్రైవర్ ఆంజనేయులు, మానసిక రోగి మంజుల దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు సంతానం. కూతురు ఇదివరకే చనిపోయింది. భర్త ఊళ్లో లేని సమయంలో మంజుల తన కుమారుడు సంపత్‌కుమార్ (2) ఉంగరాన్ని అమ్మి ఆ డబ్బుతో కుమారుడిని తీసుకుని స్వస్థలం కర్ణాటక రాష్ట్రం చింతామణికి మూడు రోజుల క్రితం బయల్దేరింది. బాగేపల్లి, చింతామణి, బెంగుళూరు ఇలా 12 గంటల పాటు కొడుకును గుడ్డలో చుట్టుకుని శనివారం రాత్రి పావగడకు చేరుకుంది. గుడ్డలో చుట్టుకున్న బాలుడిని తలచుకుంటూ ఏడుస్తూ కూర్చుండిపోయిన ఆమెను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడకు వచ్చి తల్లీ, కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుడ్డలో ఉన్న బాలుడిని పరీక్షించిన వైద్యుడు రంగేగౌడ 12 గంటల క్రితమే బాలుడు మృతి చెందాడని ధ్రువీకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుమకూరు ఆస్పత్రికి తరలించారు. అలాగే మానసిక రోగి మంజులకు వైద్య చికిత్స అందించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయాలు వెలుగులోకి... అయితే తల్లే బాలుడిని చంపిందా.. లేక ఊపిరాడక బాలుడే చనిపోయాడా అనే విషయాలు పోస్టుమార్టం నివేదికలో తెలుస్తాయని డీఎస్పీ కల్లేశప్ప తెలిపారు. పావగడకు ఆదివారం చేరుకున్న భర్త ఆంజనేయులు.. కుమారుడి మృతదేహం చూసి రోదించాడు. రెండేళ్ళ క్రితం కూతురు రంజిత్ కుమారిని కూడా మంజుల దుప్పటిలో చుట్టి చంపేసిందని, ఇప్పుడు కూడా ఈ పిల్లవాడిని తన భార్యే చంపేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్య పిచ్చి నయం చేయించడానికి నిమ్హాన్స్లో చికిత్స చేయించినా ప్రయోజనం లేక పోయిందని విలపించాడు. ఎస్ఐ మంజునాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
- నర్సింగ్‌హోం ఎదుట బంధువుల ఆందోళన - బాధితులకు పరిహారంతో వివాదానికి తెర మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణంలోని ఓ ప్రయివేట్ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో11 నెలల బాలుడు మృతి చెందాడు. మృతుని తలిదండ్రులు నర్శింగ్ హోం ఎదుట ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి పరిహారం అందజేయడంతో వివాదానికి తెరపడింది. ఈ సంఘటన సోమవారం వేకువజామున ఆర్టీసీ బస్టాండు సమీపం లోని ఓ చిన్నపిల్లల నర్శింగ్హోంలో జరిగింది. గుర్రంకొండ మండలం సంగసముద్రంకు చెందిన కలిపిల్లి మల్లి కార్జున అతని భార్య శివలక్ష్మిలు ఆదివారం తన పిల్లల సుప్రియ(6), లోకేష్ ఏడాది కుమారునితో బోయకొండకు మొక్కుబడి చెల్లించేందుకు వెళ్లారు. అమ్మవారికి మొక్కుబడి చెల్లించి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో బాలుడు లోకేష్‌కు వాంతులు, వీరేచనాలు కావడంతో జ్వరం వ చ్చి ంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండులోని ఓ నర్శింగ్ హోంకు చేరకుని చికిత్స చేయించారు. అనంతరం డాక్టర్ సలహామేరకు ఆస్పత్రిలోనే అడ్మిట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో బాలునికి అస్వస్థత అయింది. ఆ సమయంలో వైద్యసిబ్బంది, డాక్టరు అందుబాటులో లేకపోవడంతో బాలుడు చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమబిడ్డ చనిపోయాడని బందువులు ఆందోళనకు దిగి టుటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు పెద్ద మనుషులు కల్పించుకుని బాధితులలతో చర్చిలు జరిపి పరిహారం అందజేసి వివాదానికి తెరదించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
- బావిలో మునిగి బాలుడి మృతి - సూర్యాపేటలో ఘటన - మృతుడు హైదరాబాద్ వాసి - సూర్యాపేట మున్సిపాలిటీ ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామచంద్రాపురం కాలనీకి చెం దిన శాస్త్రీ చంద్రం-రజిత దంపతులు పిల్లలతో కలిసి తన స్నేహితుడు సుతారపు సోమనర్సయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 5వ తేదీన సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు వచ్చారు. 6వ తేదీన వివాహ వేడుకలో పాల్గొన్నారు. గురువారమే హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా బస్సులు నడవకపోవడంతో సూర్యాపేటలోనే ఆగిపోయారు. కాగా, శుక్రవారం ఉద యం చంద్రం కుమారుడు భానుప్రసాద్(14) తన స్నేహితులతో కలిసి ఇంది రమ్మ కాలనీలో గల బాపనబావి వద్దకు వెళ్లాడు. మిగతా స్నేహితులు ఈత కొ డుతుండడాన్ని చూసి భానుప్రసాద్ కూ డా బావిలోకి దిగాడు. అతడికి ఈత రా కపోవడంతో బావి నీటిలో మునిగి మృతిచెందాడు. భానుప్రసాద్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడు మృతిచెందాడన్న విషయం తెలుసుకుని తల్లిద్రండులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారిని చిదిమేసిన క్రేన్
- తల్లి వెంట స్కూల్‌కు వెళ్తుండగా ప్రమాదం - బాలుడిది డిండి మండలం బోనబోయినపల్లి హస్తినాపురం : పాఠశాలకు వెళ్తున్న బాలుడ్ని క్రేన్ రూపంలో వచ్చిన మృత్యువు చిదిమేసింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా డిండి మండలం బోనబోయినపల్లి గ్రామానికి చెందిన బి.తిరుపతమ్మ, శ్రీను దంపతులు హస్తినాపురం ఓంకార్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరి కుమారుడు శివ(4) స్థానిక సెంట్రల్ గ్రామర్ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు. తిరుపతమ్మ శుక్రవారం ఉదయం కుమారుడు శివను పాఠశాలకు తీసుకెళ్లే క్రమంలో రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన క్రేన్ శివ ను ఢీకొట్టింది. క్రేన్ చక్రాల మధ్య నలిగి ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు తన చేయిపట్టుకొని, ముద్దు ముద్దు మాటలు చెప్తూ అడుగులు వేస్తున్న తన గారాల తనయుడు కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తిరుపతమ్మ గుండెలు బాదుకుంటూ రోదించింది. ఆ మాతృమూర్తిని ఊరుకోబెట్టడం ఎవరి తరం కాలేదు. ఉదయం 8 గంటలకు ప్రమాదం జరుగగా... దాదాపు 4 గంటల తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, అప్పటి వరకు నడిరోడ్డుపై రక్తపు మడుగులో పడివున్న పసివాడి మృతదేహాన్ని చూసి స్థానికులు, సాగర్ రహదారిపై వెళ్లే వాహనదారులు కంటతడి పెట్టారు. -
ఆత్మ‘హత్య’?
చెట్టుకు ఉరేసుకొని బాలుడి మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు యాకుత్‌పురా: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతి చెందాడు. రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉండటం బట్టి.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం భవానీనగర్ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా రజానగర్ ప్రాంతానికి చెందిన మీర్జా మహ్మద్ బేగ్ కుమారుడు మీర్జా అహ్మద్ బేగ్ (14) ఈదిబజార్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన అహ్మద్ బేగ్ అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. గురువారం ఉదయం మహమ్మద్‌నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు అహ్మద్‌బేగ్ ఉరేసుకొని మృతి చెంది ఉండగా స్థానికులు భవానీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని చెట్టు పై నుంచి కిందికి దించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఒంటిపై ప్యాంట్ తొలగించబడి చొక్కా మాత్రమే ఉంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి బోరుమన్నారు. పోలీసులు మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మీర్జా మహ్మద్ బేగ్‌కు మృతుడు అహ్మద్ బేగ్‌తో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలుడు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఎవరితో గొడవ పడలేదని... ప్రతి రోజు మాదిరిగానే బయటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండటం, ఒంటిపై గాయాలు లేకపోవడం, ప్యాంట్ తొలగించబడటం వంటి కారణాల నేపథ్యంలో పోలీసులు అహ్మద్ బేగ్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్యా, ఆత్మహత్య అనేది తెలుస్తుందని ఎస్సై శ్రీశైలం తెలిపారు.