వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి
- నర్సింగ్‌హోం ఎదుట బంధువుల ఆందోళన
- బాధితులకు పరిహారంతో వివాదానికి తెర
మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణంలోని ఓ ప్రయివేట్ చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో11 నెలల బాలుడు మృతి చెందాడు. మృతుని తలిదండ్రులు నర్శింగ్ హోం ఎదుట ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి పరిహారం అందజేయడంతో వివాదానికి తెరపడింది. ఈ సంఘటన సోమవారం వేకువజామున ఆర్‌టీసీ బస్టాండు సమీపం లోని ఓ చిన్నపిల్లల నర్శింగ్‌హోంలో జరిగింది. గుర్రంకొండ మండలం సంగసముద్రంకు చెందిన కలిపిల్లి మల్లి కార్జున అతని భార్య శివలక్ష్మిలు ఆదివారం తన పిల్లల సుప్రియ(6), లోకేష్ ఏడాది కుమారునితో బోయకొండకు మొక్కుబడి చెల్లించేందుకు వెళ్లారు.
అమ్మవారికి మొక్కుబడి చెల్లించి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో బాలుడు లోకేష్‌కు వాంతులు, వీరేచనాలు కావడంతో జ్వరం వ చ్చి ంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండులోని ఓ నర్శింగ్ హోంకు చేరకుని చికిత్స చేయించారు. అనంతరం డాక్టర్ సలహామేరకు ఆస్పత్రిలోనే అడ్మిట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో బాలునికి అస్వస్థత అయింది. ఆ సమయంలో వైద్యసిబ్బంది, డాక్టరు అందుబాటులో లేకపోవడంతో బాలుడు చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమబిడ్డ చనిపోయాడని బందువులు ఆందోళనకు దిగి టుటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు పెద్ద మనుషులు కల్పించుకుని బాధితులలతో చర్చిలు జరిపి పరిహారం అందజేసి వివాదానికి తెరదించారు.