![9749 Road Accidents on Highways and ORRs in telangana Last Year](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/9/CAR-ACCIDENT.jpg.webp?itok=WLHKYwvp)
9,749 రాష్ట్రంలోని హైవేలు, ఓఆర్‌ఆర్‌పై గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలు
5,817 ప్రమాదాలకు ఓవర్ స్పీడ్‌తో వెళ్లడమే కారణం
సాక్షి, హైదరాబాద్: ‘స్పీడ్ థ్రిల్స్..బట్ కిల్స్..’(వేగం ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ చంపేస్తుంది) అని పోలీసులు చెబుతున్నా, రహదారులపై అక్కడక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నా.. కొందరు వాహనదారులు చెవికెక్కించుకోవడం లేదు. విశా లమైన రోడ్లపై యమస్పీడ్‌గా దూసుకెళుతున్నారు. అంతే వేగంగా ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలకు కారణాలు విశ్లేíÙస్తే.. మితిమీరిన వేగంతోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడవుతోంది.
రోడ్డు ప్ర మాదాలు నియంత్రించేందుకు, ప్రమాదాలకు మూలకారణాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం అధికారులు 2023లో రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాల గణాంకాలు విశ్లేíÙంచారు. రహదారులు, ఓఆర్‌ఆర్‌పై మొత్తం 9,749 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఇందులో 5,817 రోడ్డు ప్రమాదాలు వాహనదారుల మితిమీరిన వేగం కారణంగానే సంభవించినట్టు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో 120 రోడ్డు ప్రమాదా లు జరిగాయి. అత్యంత నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో 3,532 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలకు అసలు కారణాలు గుర్తించడం ద్వారా వాటిని నివారించేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
3,532 నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో యాక్సిడెంట్లు
⇒ 2023లో జరిగిన ప్రమాదాలను విశ్లేషించిన పోలీస్‌శాఖ రోడ్డు భద్రత విభాగం
⇒ ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టే యోచన
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/patika.jpg)
Comments
Please login to add a commentAdd a comment