
రాజన్న రహదారులకు మహర్దశ
జాతీయ రహదారులుగా గుర్తింపు
ఎంపీ వినోద్‌కుమార్ వెల్లడి
వేములవాడ : ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారుల అనుసంధానంలో వేములవాడ రాజన్నను చేర్చినట్లు ఎంపీ వినోద్‌కుమార్ ప్రకటించారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వై-జంక్షన్ లాగా వేములవాడ చుట్టూ ఉన్న రహదారులు జాతీయ హోదాకు మారనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా రోడ్ల నిర్వహణ సక్రమంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే జగిత్యాల, కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు, వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా సూర్యపేట వరకు, వేములవాడ నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు జాతీయ రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
దీంతో వేములవాడ రాజన్న భక్తులకు సులువుగా వేములవాడకు చేరుకునే మార్గాలు సుగమం అయ్యాయని అన్నారు. ఇంతేగాకుండా వేములవాడ రాజన్న క్షేత్రం అభివృద్ధి కోసం అథారిటీ కమిటి ఏర్పాటు చేశామని, త్వరలోనే అభివృద్ధి పనులకు మోక్షం లభిస్తోందన్నారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ నామాల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్, సెస్ డెరైక్టర్లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, కౌన్సిలర్లు కూరగాయల శ్రీనివాస్, నిమ్మశెట్టి విజయ్, కుమ్మరి శ్రీనివాస్, ముద్రకోల వెంకటేశ్, నాయకులు నామాల లక్ష్మిరాజం, రాపెల్లి శ్రీధర్, శ్రీనివాస్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.