'50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం'
న్యూఢిల్లీ: హైవేలు, షిప్పింగ్ రంగాల్లో సుమారు 50 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నామని వెల్లడించారు. హైవేస్ ఎక్విస్ మెంట్ సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే ఐదేళ్లలో రహదారుల కోసం రూ. 5 లక్షల కోట్లు, నౌకాయానం కోసం రూ. లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపడతామన్నారు. దీంతో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
భారత్, శ్రీలంక మధ్య సంధానం కోసం రూ. 22 వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయం చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.