shipping
-
షిప్పింగ్ కంపెనీలో విష వాయువు లీక్
విశాఖపట్నం, సాక్షి: శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్‌ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా.. దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్‌లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్‌ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్‌నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్‌కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్‌వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్‌వైకే షిప్‌లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్‌తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్‌ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్‌కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్‌సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్‌కు తిరిగి పంపించి టాటా లైన్‌ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్‌తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి. -
Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
భారీ సంఖ్యలో ఉపాధికి నెలవైన ఐటీ, టెక్నాలజీ కంపెనీలు కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా ఓటేలా ప్రోత్సహిస్తున్నాయి. ఓటేయడం పౌరుల బాధ్యత మాత్రమే కాదని, సామూహిక సంకల్ప శక్తికి సంకేతమని పేర్కొంటున్నాయి. భవిష్యత్ మార్గనిర్దేశకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన నాలుగు విడతల పోలింగ్‌లోనూ టెక్ కంపెనీల ప్రచారం చెప్పుకోదగ్గ రీతిలో పని చేసింది.ఫ్లిప్‌కార్ట్ ‘‘మీ ఓటును ధ్రువీకరించుకున్నారా?’’ అంటూ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ పోలింగ్ తేదీల్లో ‘ఎక్స్’ వేదికగా యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఈజ్ మై ట్రిప్ ‘‘రోడ్డెక్కండి. లోక్‌సభ ఎన్నికల వేళ మీ మూలాలకు (నియోజకవర్గాలకు) తిరిగి వెళ్లండి. చూడని ప్రదేశాలను అన్వేíÙంచండి’’ అంటూ ఆన్లైన్ ట్రావెల్ సేవల బుకింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ పిలుపునిచి్చంది. మొబిక్విక్ ‘‘డిజిటల్ ఆవిష్కరణల నుంచి దేశ భవిత దాకా అన్నీ కేవలం ఒక్క ట్యాప్‌తోనే’’ అంటూ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగ ప్రాధాన్యతను గుర్తు చేసింది. జొమాటో ‘‘ఎవరు నాయకత్వం వహించాలో ఓటుతో నిర్ణయించడం కంటే ఏం తినాలో నిర్ణయించుకోవడం అంత ముఖ్యమేమీ కాదు’’ అంటూ ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో కూడా ఎక్స్ ద్వారా తన కస్టమర్లకు ఓటు సందేశం ఇచి్చంది. ఓలా ‘‘మన తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మన తల్లిదండ్రులు రోటి, కపడా, మకాన్ కోసం పోరాటం చేశారు. మన కలలకు తగ్గట్టుగా దేశాన్ని నిర్మించడం మన తరం బాధ్యత’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఎక్స్ ద్వారా కోరారు. స్విగ్గీ ‘‘తర్వాత ఏం తినాలా అంటూ గంటల తరబడి సమయం వెచి్చంచేవారు తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సైతం అంతే సమయాన్ని కేటాయించాలి’’ అని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పిలుపునిచి్చంది. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసింది. ఓయో ‘‘సరైన ప్రభుత్వం కొలువుదీరేలా చూడండి. వెళ్లి ఓటు వేయండి’’ అని హోటల్ బుకింగ్ సేవల యాప్ ఓయో కోరింది. ర్యాపిడో క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారి కోసం ఉచిత రైడ్లు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వోట్నౌ కూపన్ వాడుకోవాలని సూచించింది. ‘‘ఓటేయడం మీ బాధ్యత. మిమ్మల్ని పోలింగ్ బూత్‌కు చేర్చడం మా బాధ్యత’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. నమ్మ యాత్రి ‘‘మీ దేశ తదుపరి గమ్యస్థానం కేవలం ఒక ప్రెస్ (క్లిక్) దూరంలోనే ఉంది’’ అంటూ క్యాబ్ సేవలను ఆఫర్ చేసే బెంగళూరు కంపెనీ నమ్మయాత్రి ఓటర్లకు ఇచి్చన సందేశానికి నగరంలో పోలింగ్ సందర్భంగా బాగా ఆదరణ లభించింది. ఇన్స్టాగ్రామ్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ సైతం ప్రయతి్నస్తోంది. పోలింగ్ రోజున ఇన్స్టాగ్రామ్ యాప్‌లో సందేశాల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సీపోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసి బ్యాగ్‌ల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్‌లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేపన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతోనే డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అడ్రస్ ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్ పేరుతో కంటైనర్ బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. లాసన్స్ బే కాలనీలో సంధ్యా అక్వా ఎక్స్ పోర్టు కార్యాలయం ఉంది. ఏ1గా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్‌ను చేర్చగా, నిందితులుగా మరి కొంతమందిని చేర్చే అవకాశం ఉంది. 18న ఈ-మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్‌పోల్ గుర్తించింది. సీబీఐకి ఇంటర్ పోల్ సమాచారంతో డ్రగ్ రాకెట్ ముఠా గట్టు రట్టయ్యింది. డ్రగ్ రాకెట్ ముఠాను పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్‌కి చెందిన ప్రతినిధుల పేర్లను సైతం సీబీఐ పేర్కొంది. -
ప్రాణం తీసిన టెస్లా కారు రివర్స్
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్‌కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్‌మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది. ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు. -
ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది. 12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. -
ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే..
ఎర్ర సముద్ర సంక్షోభం నేపథ్యంలో సరుకు రవాణా వ్యయాలపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఎగుమతిదార్ల అవసరాలను పర్యవేక్షించాలని ఆర్థిక శాఖల విభాగానికి (డీఎఫ్ఎస్) వాణిజ్య శాఖ సూచించింది. వారికి రుణలభ్యతపై దృష్టి పెట్టాలని పేర్కొంది. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ నేతృత్వంలో బుధవారం జరిగిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఎగుమతిదారుల సమస్యలను చర్చించారు. డీఎఫ్ఎస్, షిప్పింగ్, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. అరేబియా మహాసముద్రంలో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు రక్షణ శాఖ తెలిపిందని ఈ సందర్భంగా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే.. ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా వేరే మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుండటం వల్ల ఎగుమతిదారులకు వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అన్ని వివరాలను సేకరిస్తున్నామని, త్వరలోనే అంతర్–మంత్రిత్వ శాఖల గ్రూప్ మరోసారి సమావేశమవుతుందని అధికారి పేర్కొన్నారు. -
షిప్పింగ్ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు
ముంబై: దేశీ షిప్పింగ్ కంపెనీల ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 5–7 శాతం మధ్య క్షీణించొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) షిప్పింగ్ కంపెనీల ఆదాయం 35 శాతం వృద్ధిని చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 23–25 శాతం మధ్య తగ్గుతుందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్టర్ రేట్లు పెరగడం, కరోనా ఆంక్షల అనంతరం చైనా నుంచి పెరిగిన డిమాండ్ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధికి దారితీసినట్టు క్రిసిల్ తెలిపింది. వివిధ విభాగాల్లో పనిచేసే షిప్పింగ్ కంపెనీల నిర్వహణ మార్జిన్ వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. చార్టర్ రేట్లలో దిద్దుబాటు ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కంపెనీల సగటు నిర్వహణ మార్జిన్ 33–35 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా ముందున్న 25–30 శాతానికంటే ఎక్కువేనని గుర్తు చేసింది. మోస్తరు మూలధన వ్యయ ప్రణాళికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీల రుణ పరపతి ప్రస్తుతం మాదిరే మెరుగ్గా కొనసాగుతుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల డెడ్‌వెయిట్ టన్నేజీ సామర్థ్యంలో సగం వాటా కలిగిన ఐదు షిప్పింగ్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ వివరాలు అందించింది. తగ్గిన రేట్లు.. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలుగా దేశీ షిప్పింగ్ కంపెనీలు ఎక్కువగా ట్యాంకర్లను (70 శాతం) కలిగి ఉన్న విషయాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. ఆ తర్వాత బొగ్గు, ముడి ఇనుము, ధాన్యాల రవాణాకు 20 శాతం మేర సామర్థ్యం ఉండగా.. మిగిలిన 10 శాతం కంటెయినర్ షిప్‌లు, గ్యాస్ క్యారీయర్లు ఉన్నట్టు పేర్కొంది. చార్టర్ రేట్లు అంతర్జాతీయ డిమాండ్–సరఫరాకు అనుగుణంగా మారుతూ ఉంటాయని క్రిసిల్ తెలిపింది. ‘‘చమురు ట్యాంకర్ల చార్టర్ రేట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 50వేల డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–25 శాత మేర తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గడమే ఇందుకు కారణం’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ప్రస్తుత పరిస్థితే అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతుందని, వచ్చే ఏడాది చార్టర్ రేట్లు మరికొంత దిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కరోనా ముందు నాటి కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. చైనా, భారత్ నుంచి పెరిగే డిమాండ్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల చార్టర్ రేట్లకు మద్దతుగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు ట్యాంకర్ల సరఫరా పరిమితంగా ఉంటుందని, ఫలితమే చార్టర్ రేట్లు కరోనా ముందున్న నాటితో పోలిస్తే ఎగువ స్థాయిలోనే ఉండొచ్చని వవరించింది. డ్రై బల్క్ క్యారియర్ల చార్టర్ రేట్లు అదే స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ
G20 Summit: న్యూడిల్లీ భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించనున్నారు. ప్రపంచ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ప్రకటించే అవకాశం ఉందని వైట్ హౌస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జోన్ ఫైనర్ తెలిపారు.గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ భాగస్వామ్యంలో భాగంగా బిడెన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. G20 సమ్మిట్‌లో ప్రకటించబడే ప్రపంచ వాణిజ్యానికి సాధ్యమయ్యే గేమ్ ఛేంజర్‌గా దీన్ని అంచనావేస్తున్నారు. ఈ కారిడార్ మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, యూరప్ దేశాలను కలుపుతుంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యం, చివరికి యూరప్‌తో అనుసంధానించే షిప్పింగ్ కారిడార్ కోసం శనివారం ప్రణాళికలను రూపొందించాలని యోచిస్తున్నారు. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో కొత్త సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ భారీ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ డీల్ తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ కారిడార్ రైల్వేల నెట్వర్క్ ద్వారా మధ్యప్రాచ్యంలోని దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఓడరేవుల నుండి షిప్పింగ్ లేన్ల ద్వారా కూడా ఈ నెట్వర్క్ భారతదేశానికి అనుసంధానించబడుతుందని అంచనా. కాగా ఈ ఒప్పందంపై చర్చించేందుకు నాలుగు దేశాల ఉన్నత జాతీయ భద్రతా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL — Narendra Modi (@narendramodi) September 9, 2023 -
ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. వీటితో 113 ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. ఇందులో ఇప్పటివరకు 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖ పోర్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని, ఆధునికీకరణ, యాంత్రీకరణతో మెరుగు పరుస్తున్నామని వివరించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. -
విశాఖ తీరం..క్రూయిజ్ విహార కేంద్రం
అంతర్జాతీయ నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరుతోంది. అంతర్జాతీయ స్థాయి సముద్ర విహారానికి ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి మహా విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో నిర్మించిన ఈ సముద్ర విహార కేంద్రాన్ని క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ట్రయల్స్ నిర్వహించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.– సాక్షి, విశాఖపట్నం ఏపీ టూరిజంతో కలిసి... ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరగనుంది. ఇవీ విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతల్లో కొన్ని... 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు. క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు కాగా.. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు. స్థానికులకు ఉపాధి పెరుగుతుంది గరిష్టంగా 2,000 మంది టూరిస్టులకు సరిపడా సౌకర్యాలతో క్రూయిజ్ టెర్మినల్ భవనాన్ని సుందరంగా నిర్మించాం. ఈ టెర్మినల్ కేవలం పర్యాటకంగానే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. క్రూయిజ్ షిప్స్‌లో వచ్చే టూరిస్టులు స్థానిక దుకాణాల్లో షాపింగ్స్ చేయడం, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం... ఇలా ఎన్నో విధాలుగా మేలు కలగనుంది. సందర్శనీయ స్థలాల్లో పర్యటించడం వల్ల స్థానికంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించిన తర్వాత ట్రయల్ నిర్వహిస్తాం. ఇప్పటికే రెండు భారీ ఆపరేటర్ సంస్థలు పోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నాయి. వింటర్ సీజన్లో కొత్త టెర్మినల్ నుంచి సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.– డాక్టర్ అంగముత్తు,విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ -
79 కోట్ల టన్నుల కార్గో
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాన నౌకాశ్రయాల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 79.5 కోట్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. వాటాల విక్రయం ద్వారా రూ.3,700 కోట్లు సాధించాలన్న లక్ష్యాన్ని మించి రూ.5,000 కోట్ల విలువైన రవాణా లావాదేవీలు జరిగాయని మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ సెక్రటరీ సుధాన్‡్ష పంత్ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే సరుకు రవాణా గత ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం అధికంగా జరిగిందని తెలిపారు. పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి సర్వానంద సోనోవాల్ గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో ప్రధాన నౌకాశ్రయాల్లో దీనదయాల్ (కాండ్లా), ముంబై, మార్మగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, ఎన్నోర్ (కామరాజార్), ట్యూటికోరిన్, విశాఖపట్నం, పారదీప్, కోల్‌కత (హాల్దియాతో కలిపి), జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉన్నాయి. స్వల్పంగా పెరిగిన వాటా.. ప్రధానేతర పోర్టులతో పోలిస్తే చాలా ఏళ్ల తర్వాత మేజర్ పోర్టులు అధిక వార్షిక వృద్ధి రేటు నమోదు చేశాయని పంత్ తెలిపారు. ‘ప్రధానేతర పోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించబడతాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఓడరేవులను ప్రైవేట్ భాగస్వాములకు లీజుకు ఇచ్చాయి. సరుకు రవాణాలో నాన్–మేజర్ పోర్టులు 8.5–9 శాతం వృద్ధి చెందాయి. మొత్తం కార్గోలో ప్రధాన పోర్టుల వాటా 54 నుంచి 55 శాతానికి, నాన్–మేజర్ పోర్టుల వాటా 46 నుంచి 45 శాతానికి వచ్చి చేరింది. ప్రధాన పోర్టులకు 1 శాతం మార్పు కూడా చాలా ముఖ్యమైన విజయం. ఎందుకంటే చాలా సవాళ్లు ఉన్నప్పటికీ ఇవి తమ వాటాను పెంచుకున్నాయి. జలమార్గాల ద్వారా సరుకు రవాణా 16 శాతం ఎగసి 12.6 కోట్ల టన్నులకు చేరింది. ప్రధాన పోర్టులకు వచ్చిన నౌక పని ముగించుకుని వెళ్లేందుకు అయ్యే సమయం 3–4 గంటలు తగ్గింది’ అని వివరించారు. -
ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..!
తైవాన్ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్గ్రీన్ మెరైన్’ ఉద్యోగులకు కళ్లు చెదిరేలా భారీ బోనస్ అందిస్తోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాల జీతాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న 3,100 మంది ఉద్యోగులు బోనస్‌గా అందుకుంటున్నారని ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్సైట్ (news.com.au) నివేదించింది. ఇదీ చదవండి: సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్ సెక్యూరిటీ కీలక సర్వే అంతేకాకుండా ఆ కంపెనీలో ఈ సంవత్సరం వేతన పెరుగుదల కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2022లో 10 నుంచి 11 నెలల వేతనాలకు సమానంగా ఈ ఏడాది వేతనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అందుకున్న 50 నెలల బోనస్‌తో కలుపుకొంటే మొత్తంగా ఆ కంపెనీ ఉద్యోగులు అందుకుంటున్న బోనస్ దాదాపు ఐదు సంవత్సరాల జీతానికి సమానంగా ఉంటుంది. కాగా ప్రకటించిన బోనస్‌లు ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఉంటున్నాయి. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! ఈ ఎవర్గ్రీన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు (రూ.37,00,807) నుంచి 171,154 డాలర్లు (రూ.1,41,55,950) మధ్య ఉంటాయని ఆస్ట్రేలియన్ వెబ్సైట్ పేర్కొంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్గ్రీన్ 16.25 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం, పలు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే భారీ లాభాలకు కారణమని నివేదిక పేర్కొంది. -
ఫెడ్ఎక్స్: ఏకంగా ఆ ఉద్యోగులకే షాక్.10 శాతం ఔట్
న్యూఢిల్లీ: ప్రముఖ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడ్ఎక్స్ కార్పో కూడా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. అమెరికాలో ఇప్పటికే 12వేల మంది సాధారణ ఉద్యోగులను తొలగించిన సంస్థ ఇపుడికి మేనేజ్మెంట్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునేందుకు నిర్ణయంచింది. షిప్పింగ్ మందగమనం నేపథ్యంలో ఫెడెక్స్ కార్ప్ తన గ్లోబల్ మేనేజ్మెంట్ సిబ్బందిలో 10 శాతం కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఈమేరకు తమ సిబ్బందికి ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. అలాగే కంపెనీ ఆఫీసర్ , డైరెక్టర్ ర్యాంక్‌ల పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు , కొన్ని టీంలను కలిపివేస్తున్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజ్ సుబ్రమణ్యం వెల్లడించారు. సంస్థ అభివృద్ధి కోసం దురదృష్టవశాత్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేని పేర్కొన్నారు. డిసెంబరులో దాని ఇటీవలి ఆర్థిక ప్రకటన ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 550,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఎన్ఎంపీతో కేంద్రానికి రూ.33,422 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్తుల ద్వారా ఆదాయాల (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్– ఎన్ఎంపీ) అన్వేషణ పథకం కింద కేంద్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.33,422 కోట్లు ఒనగూడింది. ఇందులో రూ.17,000 కోట్లతో బొగ్గు మంత్రిత్వశాఖ ముందడుగులో ఉండగా, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మంత్రిత్వశాఖ తన ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను అధిగమించే స్థాయికి చేరుకుంది. అధికార వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో జరిగిన సమావేశంలో ఎన్ఎంపీ అమలు పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్ష అంశాలపై అందిన సమాచారం క్లుప్తంగా... ► 2021–22లో ఎన్ఎంపీ ద్వారా ప్రభుత్వ సమీకరణ లక్ష్యం రూ.88,000 కోట్లు. అయితే రూ. 1 లక్ష కోట్ల విలువైన లావాదేవీలను పూర్తి చేయడం ద్వారా లక్ష్యాన్ని అధిగమించింది. ► 2022–23లో లక్ష్యం రూ.1,62,422 కోట్లు. అయితే లక్ష్యాలను చేరకపోవచ్చన్నది ప్రభుత్వ తాజా అంచనా. లక్ష్యానికి రూ.38,243 కోట్ల దూరంలో ఉండవచ్చని భావిస్తున్నారు. రూ.1,24,179 కో ట్ల అసెట్ మోనిటైజేషన్ జరగవచ్చని భావిస్తోంది. ► బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, ఓడరేవులు–షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు అసెట్ మానిటైజేషన్ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది. రోడ్డు రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే వీలుంది. ► విద్యుత్, రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు అలాగే చమురు– గ్యాస్ మంత్రిత్వ శాఖ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ► రైల్వేల లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి ఒనగూరింది రూ.1,829 కోట్లు. ► విద్యుత్ మంత్రిత్వశాఖ విషయంలో లక్ష్యం రూ.15,000 కోట్లయితే, ఇప్పటికి లక్ష్యంలో రూ.2,000 కోట్లకు చేరుకోవడం జరిగింది. ► బొగ్గు మంత్రిత్వశాఖ లక్ష్యం రూ.30,000 కోట్లయితే, ఇప్పటికి రూ.17,000 కోట్ల విలువైన మానిటైజేషన్ జరిగింది. రోడ్డు, ట్రాన్స్‌పోర్స్, హైవేల శాఖ లక్ష్యం రూ.32,855 కోట్లయితే, ఇప్పటికి రూ.4,100 కోట్ల సమీకరణ జరిగింది. ► మోనిటేజేషన్ లక్ష్యాల సాధనకు ఆస్తులను గుర్తించవలసినదిగా వివిధ మంత్రిత్వశాఖలను ఆర్థికశాఖ కోరింది. ► వివిధ రంగాల్లో మౌలిక ఆస్తుల విలువలను గుర్తించడం, తద్వారా నాలుగేళ్ల కాలంలో ఈ ఆస్తుల ద్వారా రూ. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా 2021 ఆగస్టులో ఆర్థికమంత్రి సీతారామన్ ఎన్ఎంపీ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీతి ఆయోగ్ వివిధ మంత్రిత్వశాఖలతో నిరంతరం సంప్రతింపులు జరుపుతోంది. -
తొలి షిప్పింగ్ మహిళ
సుమతీ మొరార్జీ మహాత్మాగాంధీకి సన్నిహితురాలు. భారత స్వాతంత్య్రోద్యమంలో 1942–1946 మధ్య ఆయన వెంట ఉండి, ఆయన వెంట నడిచిన ముఖ్యులలో సుమతి ఒకరు. అప్పటి వార్తా పత్రికల్లో వచ్చే ఫొటోలలో గాంధీజీ పక్కన సుమతి తప్పనిసరిగా కనిపించేవారు. గాంధీజీ ఉద్యమ కార్యక్రమాల కాలపట్టిక ఆమె చేతుల్లో ఉండేది. వాటి నిర్వహణ కూడా. గాంధీ అనంతరం కూడా సుమతీ మొరార్జీ గాంధీ మార్గంలోనే పయనించారు. దేశ విభజన సమయంలో సింధీలను పాకిస్థాన్ నుంచి భారత్‌కు తెప్పించడంలో కీలకమైన పాత్రను పోషించారు. ఇప్పటివరకు ఇదంతా గాంధీ శకంలో సుమతి ఏమిటన్నది. ఆ తర్వాత కూడా స్వతంత్ర భారతాన్ని మలచడంలో ఆమె ప్రమేయం ఎంతో ఉంది. ‘ఇండియన్ షిప్పింగ్ ఫస్ట్ ఉమన్’ గా సుమతీ మొరార్జీ ప్రసిద్ధి. భారతదేశ నౌకల యజమానుల సంఘానికి (ఇండియన్ నేషనల్ స్టీమ్‌షిప్ ఓనర్స్ అసోసియేషన్. తర్వాత ఇది ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ అయింది) సారథిగా ఉన్న సుమతి ప్రపంచంలోనే అలాంటి ప్రతిష్టను పొందిన తొలి మహిళ. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత, ఆమె అందించిన పౌరసేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1971లో ఆమెకు పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. సుమతీ మొరార్జీ బొంబాయిలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. అప్పటి సంప్రదాయం ప్రకారం సుమతికి చిన్న వయసులోనే వివాహం అయింది. ఆమె భర్త మరొక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన శాంతికుమార్ నరోత్తమ్ మొరార్జీ. ఆమె మామగారు నరోత్తమ్ మొరార్జీ ప్రముఖ వ్యాపారవేత్త, ‘సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ’ వ్యవస్థాపకులు. భారతదేశపు అతిపెద్ద రవాణా నౌకల తయారీ, నిర్వహణల సంస్థ అది. సుమతి 14 ఏళ్ల వయసుకే ఆ కంపెనీ మేనేజింగ్ ఏజెన్సీలో భాగం అయ్యారు! 1923లో అలా ‘నౌక’లోకి అడుగుపెట్టిన అమ్మాయి 1946లో ఆ కంపెనీ స్టీరింగ్ సీట్లో కూర్చున్నారు. ఆనాటికి కంపెనీలో ఉన్న 6 వేల మంది సిబ్బందితో కలిసి, వారిలో ఒక ఉద్యోగిగా సంస్థను లాభాలతో నడిపారు. అంతకు ముందు వరకు ఆమె ఎక్కువ సమయాన్ని జాతీయోద్యమానికే కేటాయించారు. షిప్పింగ్ సంస్థ సారథిగా ఆమె అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ముంబైలోని జుహులో ఉన్న సుమతి విద్యా కేంద్ర పాఠశాల సుమతి స్థాపించినదే. ఆచార్య స్వామి ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) కు అన్నివిధాలా చేదోడుగా ఉన్నారు. తన 89 ఏళ్ల వయసులో 1998లో సుమతి కన్నుమూశారు. (చదవండి: గుజరాత్ అల్లర్లు) -
విషవాయువు లీక్.. 12 మంది మృతి, 199 మందికి అస్వస్థత
విషపూరిత వాయువు లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోర్డాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జోర్డాన్ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది. క్లోరిన్ గ్యాస్ ఉన్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు కిందిపడిపోవడంలో భారీ పేలుడు సంభవించింది. పసుపు రంగు క్లోరిన్ విష వాయువు ఆ ప్రాంతంలో విస్తరించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 199 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విష వాయువు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఓడరేవుకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాబా నగర ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. At least 10 people have died and more than 250 injured after a toxic gas leak at Aqaba Port in Jordan. pic.twitter.com/kjTDaPkelw — Suzanne (@suzanneb315) June 27, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం.. 42 మంది మృతి -
జపాన్ షిప్పింగ్ కంపెనీ సీఈవోతో సీఎం జగన్ భేటీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌లో జపాన్‌కి చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటోతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ షిప్పింగ్ కంపెనీల్లో ఒకటిగా మిట్సుయి ఉంది. ఏపీలో అభివృద్ధి చేస్తున్న పోర్టులు ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. స్విస్ పార్లమెంటు బృందం మరోవైపు స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందం వరల్డ్ ఎకామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా దావోస్‌కు చేరుకున్న సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో స్విస్ పార్లమెంటు బృందం చర్చలు జరిపింది. చదవండి: టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్ చర్చలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మారుస్తాం: మోదీ
అహ్మదాబాద్: నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్లో రో–పాక్స్ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇది 370 కి.మీ దూరాన్ని ఇది 90 కిలోమీటర్లకు (సముద్ర మార్గం) తగ్గిస్తుంది. ‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నామని చెప్పారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాల న్నారు. నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాల్లో క్లిష్టత తొలగిపోవడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని మోదీ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. పన్నుల వ్యవహారాలు మెరుగుపడేందుకు, మెరుగైన పన్ను, జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్‌ను షేర్ చేశారు. -
ఎగుమతులు, దిగుమతుల్లో సానుకూలత
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల ధోరణులు ఆశాజనకంగా ఉన్నాయని.. ముఖ్యంగా ఎగుమతులు ఈఏడాది ఏప్రిల్‌లో కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్థాయి నుంచి క్రమంగా గత ఏడాది స్థాయిలకు చేరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఈ వివరాలను వాణిజ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయంగా భారత వాణిజ్యానికి సంబంధించిన అంశాలను చర్చించేందుకు మంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా పథకం కింద రాయితీలకు రూ.2 కోట్ల పరిమితి విధించడం 98%ఎగుమతిదారులపై ప్రభావం చూపించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకం స్థానంలో ఆర్వోడీటీఈపీ అనే కొత్త పథకాన్నిఇప్పటికే ప్రకటించడం గమనార్హం. వరుసగా ఐదో నెల జూలైలోనూ ఎగుమతులు 10% క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్ షిప్పింగ్’ స్థానిక తయారీ టగ్ బోట్లనే వాడాలి ∙ ప్రధాన పోర్టులను కోరిన కేంద్రం స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రం అనుసరిస్తోంది. దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. సవరించిన ఆదేశాలను ప్రధాన పోర్టులు పాటించాల్సి ఉంటుందన్నారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది. భారత షిప్ బిల్డింగ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భారత్‌లో షిప్ బిల్డింగ్ కోసం కొన్ని దేశాలతో చర్చలు కూడా కొనసాగుతున్నాయని కేంద్ర షిప్పింగ్ శాఖా తన ప్రకటనలో తెలిపింది. -
కొత్త రెవులు కొంగత్త ఆశలు
-
అడ్రస్: అక్కడకు వచ్చి నన్ను పిలవండి !
జైపూర్ : ఆన్లైన్ డెలివరీ అందుబాటులోకి వచ్చాక ఉప్పు, పప్పు నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ అన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఈ విధానం ద్వారా మనకు కొంత సమయం ఆదా అవుతుందనే చెప్పాలి. అయితే ఏ వస్తువు ఆర్ఢర్ చేసినా అది మన వద్దకు చేరాలంటే ముందుగా డెలివరీ అడ్రస్ ఇవ్వడం సర్వ సాధారణం. అప్పుడే అది మన ముంగిట్లోకి వచ్చి వాలుతుంది. అప్పుడప్పుడు మనం చేసిన ఆర్డర్లకు బదులు కొన్నిసార్లు వేరే వస్తువులు డెలివరీ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాలు మచ్చుకు కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రముఖ అన్‌డౌన్ డెలివరీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువును ఆర్డర్ చేశారు. అయితే షిప్పింగ్ అడ్రస్‌ను మాత్రం వినూత్నంగా రాశాడు. (ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో..) రాజస్థాన్‌లోని కోటాలో డెలివరీ చేయాల్సిన ఈ ప్యాకిజీలో ‘444 చాత్ దేవాలయం. అక్కడికి వచ్చి నన్ను పిలవండి. నేను వస్తాను’. అని రాశాడు. దీనిని ట్విటర్ యూజర్ మంగేష్ అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్లో ఉన్న చిరునామా చూసిన నెటిజన్లు తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అనేకమంది నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ‘ఇండియా అంటే వేరే లెవల్, ఇది ఎంతో సరాదాగా ఉంది’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ కూడా స్పందించడం విశేషం. ప్యాకేజీపై ఉన్న అడ్రస్‌ను చూపిస్తూ. ‘ప్రతి ఇల్లు ఓ ఆలయమే.. ఇది సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది’ అనే క్యాప్షన్‌తో ట్విటర్లో పోస్టు చేసింది. (వైరల్: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు) Indian eCommerce is different. pic.twitter.com/EewQnPcU5p — Mangesh Panditrao (@mpanditr) July 7, 2020 Taking ‘Ghar ek mandir hai’ to a whole new level! pic.twitter.com/uuDoIYLyId — Flipkart (@Flipkart) July 9, 2020 -
ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ కాల్స్‌కు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్, షిప్పింగ్ కంపెనీలు ఇక నుంచి ఇన్–ఫ్లయిట్, మారిటైమ్ వాయిస్.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం అవి దేశీ టెలికం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్–ఫ్లయిట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటీ (ఐఎఫ్‌ఎంసీ) రూల్స్ 2018గా ఈ మార్గదర్శకాలను వ్యవహరించనున్నట్లు, అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు డిసెంబర్ 14న విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం భారత గగనతలంలో ఎగిరే విమానం కనీసం 3,000 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఐఎఫ్‌ఎంసీ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. వార్షికంగా రూ. 1 ఫీజుతో పదేళ్ల పాటు ఐఎఫ్‌ఎంసీ లైసెన్సులు జారీ అవుతాయి. అందించే సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి పర్మిట్ హోల్డరు.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. -
నేడు మానవ అకమ రవాణా వ్యతిరేక దినం
-
'50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం'
న్యూఢిల్లీ: హైవేలు, షిప్పింగ్ రంగాల్లో సుమారు 50 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నామని వెల్లడించారు. హైవేస్ ఎక్విస్ మెంట్ సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే ఐదేళ్లలో రహదారుల కోసం రూ. 5 లక్షల కోట్లు, నౌకాయానం కోసం రూ. లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపడతామన్నారు. దీంతో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య సంధానం కోసం రూ. 22 వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయం చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.