అమెరికాలో విషాదం
ఫార్‌మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్‌కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్‌కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్‌మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు.
900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది.
ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment