Reverse Car
-
ప్రాణం తీసిన టెస్లా కారు రివర్స్
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్‌కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్‌మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది. ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు. -
కంగారులో బ్రేకు, యాక్సలరేటర్, పెడల్‌ని కలిపి నొక్కాడు..ఇక అంతే !
వియన్నా: ఒక్కోసారి ఆందోళనగా లేదా గందరగోళంగా ఉన్నప్పుడు మనం చేసే పనులు ఎంత ప్రమాదకరంగా మారతాయో చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఆందోళనగా ఉన్నప్పుడూ కాసేపు నిధానంగా ఉండమని పెద్దులు చెబుతారు కాబోలు. కానీ ఆస్ట్రియాకు చెందిన ఒక వ్యక్తి ఇదే విధంగా గందరగోళంలో ఒక చెత్త పనిచేసి ఎంత పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నాడో చూడండి. (చదవండి: ఏవరు ఈమో నా పియానో వాయిస్తుంది ?) లంబోర్ఘి హురాకాన్ అనే కారు యజమాని సమీపంలోని సరస్సు వద్ద కారు రివర్స్ చేస్తూ పొరపాటున బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్‌ను ఒకేసారి నొక్కేశాడు. ఇంకేముంది కారుతో సహా ఆ యజమాని కూడా సరస్సులో పడిపోయాడు. కానీ అదృష్టవశాత్తు హురాకాన్ కారు నుంచి ఏదోరకంగా బయటపడి సరస్సు నుంచి ఈదుకుంటు వచ్చాడు. అయితే అతని కారు మాత్రం నీటిలో 50 అడుగుల లోతులో మునిగిపోయింది. ఈ మేరకు సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ హురాకాన్ లగ్జరీ కారుని బయటకు తీసింది. అంతేకాదు పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి విచారించడమే కాక ఆ కారు యజమానికి స్వల్ప గాయలవ్వడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న స్థానికుడోకరు ఆ కారు యజమాని బ్రేక్ ,యాక్సిలరేటర్ పెడల్లను మిక్స్ చేసి కారుని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించడం గమనార్హం. (చదవండి: వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం) -
ఖైదీభామల క్యాట్‌వాక్
కురచ దుస్తులు ధరించి వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ అందగత్తెలు నిజానికి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. కొలంబియా దేశంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణాచేస్తూ దొరికిపోయిన వీరంతా శుక్రవారం బొగోటా నగర జైలులో ఇలా అందాల పోటీల్లో పాల్గొన్నారు. ‘రివర్స్’ కారు! రేసులో యాక్సిడెంట్ అయి కారు బోల్తాపడలేదు. సరిగ్గా చూడండి.. కారే అలాగుంది. రీమోడలింగ్‌లో స్పెషలిస్టు అయిన అమెరికాకు చెందిన జెఫ్ బ్లోచ్ దీన్నిలా తయారుచేశాడు. ఆ మధ్య చిన్నపాటి సెస్నా విమానాన్ని రేస్కారులా మార్చేసిన జెఫ్.. తాజాగా అక్కడి ప్రఖ్యాత లెమన్ రేసులో పాల్గొనడం కోసం ఈ వినూత్న వాహనాన్ని రూపొందించాడు. కారు క్లీనింగ్ యమ కాస్టలీ! కారు కడిగించుకోవాలి.. టెఫ్లాన్ కోటింగ్ వేయించుకోవాలి... మహా అయితే ఎంతవుతుంది? రూ.2, 3 వేలకు మించి అవదు అంతేగా.. ఓసారి స్కాట్లాండ్లోని కిర్కకాల్డీలో ఉన్న ‘అల్టిమేట్ షైన్’ కంపెనీలో కారు క్లీనింగ్ చేయించుకుని చూడండి.. అక్కడి వాళ్లు మీ కారును కడగడంతోపాటు బ్యాంకులో ఉన్న మొత్తం సొమ్మునూ కడిగిపారేస్తారు. ఎందుకంటే.. వీరు రెండు కార్ల క్లీనింగ్‌కు ఏడాదికి రూ.90 లక్షలు చార్జి చేస్తారు! అలాగని.. ప్రతి నెలా క్లీన్ చేస్తారనుకునేరు.. ఏడాదికి మహా అయితే.. మూడు లేదా నాలుగుసార్లు కడుగుతారు అంతే..