వియన్నా: ఒక్కోసారి ఆందోళనగా లేదా గందరగోళంగా ఉన్నప్పుడు మనం చేసే పనులు ఎంత ప్రమాదకరంగా మారతాయో చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఆందోళనగా ఉన్నప్పుడూ కాసేపు నిధానంగా ఉండమని పెద్దులు చెబుతారు కాబోలు. కానీ ఆస్ట్రియాకు చెందిన ఒక వ్యక్తి ఇదే విధంగా గందరగోళంలో ఒక చెత్త పనిచేసి ఎంత పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నాడో చూడండి.
(చదవండి: ఏవరు ఈమో నా పియానో వాయిస్తుంది ?)
లంబోర్ఘి హురాకాన్ అనే కారు యజమాని సమీపంలోని సరస్సు వద్ద కారు రివర్స్ చేస్తూ పొరపాటున బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్‌ను ఒకేసారి నొక్కేశాడు. ఇంకేముంది కారుతో సహా ఆ యజమాని కూడా సరస్సులో పడిపోయాడు. కానీ అదృష్టవశాత్తు హురాకాన్ కారు నుంచి ఏదోరకంగా బయటపడి సరస్సు నుంచి ఈదుకుంటు వచ్చాడు. అయితే అతని కారు మాత్రం నీటిలో 50 అడుగుల లోతులో మునిగిపోయింది. ఈ మేరకు సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ హురాకాన్ లగ్జరీ కారుని బయటకు తీసింది.
అంతేకాదు పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి విచారించడమే కాక ఆ కారు యజమానికి స్వల్ప గాయలవ్వడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న స్థానికుడోకరు ఆ కారు యజమాని బ్రేక్ ,యాక్సిలరేటర్ పెడల్‌లను మిక్స్ చేసి కారుని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించడం గమనార్హం.
(చదవండి: వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం)
Comments
Please login to add a commentAdd a comment