లగ్జరీ కార్స్ మేకర్ లాంబోర్గినీపై రేమండ్స్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా మండిపడ్డారు. ముంబైలో లాంబోర్గినీ రివల్టో కారును టెస్ట్ డ్రైవ్‌కు తీసుకెళ్లగా నడిరోడ్డులో ఆగిపోయిందని, దీనిపై ఫిర్యాదు చేసినా లంబోర్గినీ ఇండియా, ఆసియా అధిపతులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"(లాంబోర్గినీ)ఇండియా హెడ్ శరద్ అగర్వాల్, ఆసియా హెడ్ ఫ్రాన్సిస్కో స్కార్డొని అహంకారాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. కస్టమర్ సమస్యలు ఏమిటో తెలుసుకునేందుకు కూడా ఎవరూ స్పందించలేదు" అని సింఘానియా లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. ఈ లగ్జరీ కారు డెలివరీ అయిన 15 రోజులకే సమస్యలు వచ్చినట్లు పేర్కొన్నారు.
విలాసవంతమైన జీవనం గడిపే గౌతమ్ సింఘానియా ప్రత్యేకమైన లగ్జరీ కార్స్ కలెక్షన్‌కు ప్రసిద్ధి చెందారు . ఫార్ములా వన్ రేసర్‌ను నడపడానికి ఆయనొకసారి ఫ్రాన్స్‌కు కూడా వెళ్లారు. సొగసైన ఫెరారీ 458 నుండి ఆడి క్యూ7, ఎల్‌పీ570 సూపర్‌లెగ్గేరా, నిస్సాన్ స్కైలైన్ జీటీ-ఆర్, లాంబోర్ఘిని గల్లార్డో వంటి ఖరీదైన కార్లెన్నో ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20,000 డిస్కౌంట్
అత్యంత ఖరీదైన లాంబోర్ఘిని రివల్టో కారు ప్రారంభ ధరే రూ.8.89 కోట్లు (ఎక్స్‌షోరూం). ఈ కారుపై గౌతమ్ సింఘానియా పెట్టిన పోస్టుకు యూజర్లు కూడా స్పందించారు. లాంబోర్ఘిని కస్టమర్లను విస్మరించడాన్ని తప్పుపడుతూ విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment