G20 Summit: న్యూడిల్లీ భారత్ మండపం వేదికగా జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించనున్నారు. ప్రపంచ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ప్రకటించే అవకాశం ఉందని వైట్ హౌస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జోన్ ఫైనర్ తెలిపారు.గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ భాగస్వామ్యంలో భాగంగా బిడెన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు.
G20 సమ్మిట్‌లో ప్రకటించబడే ప్రపంచ వాణిజ్యానికి సాధ్యమయ్యే గేమ్ ఛేంజర్‌గా దీన్ని అంచనావేస్తున్నారు. ఈ కారిడార్ మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా, యూరప్ దేశాలను కలుపుతుంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యం, చివరికి యూరప్‌తో అనుసంధానించే షిప్పింగ్ కారిడార్ కోసం శనివారం ప్రణాళికలను రూపొందించాలని యోచిస్తున్నారు. మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో కొత్త సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ భారీ ప్రాజెక్ట్ లక్ష్యం.
ఈ డీల్ తక్కువ ,మధ్య-ఆదాయ దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ కారిడార్ రైల్వేల నెట్‌వర్క్ ద్వారా మధ్యప్రాచ్యంలోని దేశాలను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఓడరేవుల నుండి షిప్పింగ్ లేన్ల ద్వారా కూడా ఈ నెట్‌వర్క్ భారతదేశానికి అనుసంధానించబడుతుందని అంచనా. కాగా ఈ ఒప్పందంపై చర్చించేందుకు నాలుగు దేశాల ఉన్నత జాతీయ భద్రతా అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమైన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది.
Been a productive morning at the G20 Summit in Delhi. pic.twitter.com/QKSBNjqKTL
— Narendra Modi (@narendramodi) September 9, 2023
Comments
Please login to add a commentAdd a comment