జీ 20 సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు.. స్పందించిన బైడెన్‌ | Joe Biden Disappointed Over Xi Jinping Absence To G20 Summit In Delhi - Sakshi
Sakshi News home page

జీ 20 సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు.. స్పందించిన బైడెన్‌

Published Mon, Sep 4 2023 10:23 AM | Last Updated on Mon, Sep 4 2023 11:34 AM

Joe Biden Disappointed Over Xi Jinping Absence To G20 summit Delhi - Sakshi

భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలు జరిగే దేశ రాజధానిలో భారత్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జీ 20 సభ్య దేశాల అధినేతలతోపాటు ఇతర దేశాల అగ్రనేతలు సైతం హాజరుకానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలను పకడ్బందీగా చేపట్టింది. 

ఈ సదస్సుకు తాను రాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే పేర్కొన్నారు. ఆయన తరపున రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ హాజరుకానున్నారు. అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సైతం గర్హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ మధ్య చైనాతో సరిహద్దు వివాదం తెరపైకి రావడంతో జిన్‌పింగ్ జిన్‌పింగ్ రాకపై సందిగ్ధం నెలకొంది. అంతేగాక ఆయన స్థానంలో చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ రావొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. డెలావేర్‌లోని రెహోబోత్‌ బీచ్‌లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. భారత్‌లో జరిగే జీ20 నేతల శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్‌ రావడం లేదనే వార్తలు విని కలత చెందినట్లు తెలిపారు. ‘ చైనా అధ్యక్షుడు సదస్సుకు రాకపోవడం  నిరాశకు గురి చేసింది. అయినా ఆయన్ను నేను త్వరలోనే చూడబోతున్నాను’ అని  పేర్కొన్నారు. 
చదవండి: కరోనాకు మించిన విపత్తు: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి?

అయితే బైడెన్‌ చైనా అధ్యక్షుడిని ఎక్కడ కలవబోతున్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ జిన్‌పింగ్‌ ఢిల్లీ రాకపోతే.. నవంబర్‌లో అమెరికా అతిథ్యం ఇస్తున్న శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే APEC సమావేశంలో వీరిరువురూ కలుసుకునే అవకాశం ఉంది. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సదస్సుకు రెండు రోజుల ముందే అంటే సెప్టెంబర్‌ 7నే భారత్‌కు రానున్నారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జీ20 సదస్సులో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, క్లీన్‌ ఎనర్జీ వంటి అంశాలతోపాటు ఉక్రెయిన్‌ సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలపై ఈ సందర్భంగా సభ్య దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు. అనంతరం బైడెన్‌.. వియత్నాం పర్యటకు వెళ్తారు

ఇక భారత్‌లో పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. తనకు మరికొంత సమన్వయం కావాలి. భారత్‌, వియత్నాం రెండూ యూఎస్‌తో చాలా సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారని, అది చాలా తమకు కూడా సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement